1 ENS Live Breaking News

జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం కార్యక్రమం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారంనాడు నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. తిరుమంజనం కార్యక్రమం అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆలయ అర్చకులు ఆగమోక్తంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది  పాల్గొంటారు.

Tirumala

2022-07-07 08:59:53

ధరణిలో తప్పుల కుప్పలు కొండంత

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ఇపుడు వివాదస్ప దంగా మారుతుందా? తెలంగాణాలోని అన్ని మునిసిపాలిటీలలోని భూమి రికార్డులను గురించి తెలిపే వెబ్ సైట్ ధరణి పోర్టల్ ఇపుడు పలు వివాదాలకు కారణమవుతుందా? మరోవైపు కొనుగోళ్లు, అమ్మాకాలు, యజమనుల వివరాలు, భూమి విస్తీర్ణం  తదితర అంశాలను తెలిపే వివారాల్లో, పలు లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించడంతో భూనిర్వాసితుల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ధరణి పోర్టల్లో తెలెత్తుతున్న తప్పుల తడకపై కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో కి వెళ్లి, ఏకరువు పెట్టాలని నిర్ణయించింది. దాంతో స్పందించిన సీఎం కేసీఆర్, ధరణి సమస్యలపై ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్హహించారు. ఈ నెల 15 నుంచి రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు వెళ్లి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ధరణి పోర్టల్ అనేది ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్‌మెంట్ పోర్టల్ గా టీఎస్ ప్రభుత్వం రూపొందించింది.  ధరణి మా భూమి అనేది తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ గా మనకు తెలిసిందే.  రాష్ట్రంలోని నివాసితులకు అన్ని మునిసిపాలిటీలలోని భూమి రికార్డుల గురించి సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ధరణి పోర్టల్‌ తన సేవలను అందిస్తుంది. దాంతో పాటు అదనంగా, రాష్ట్ర నివాసితులకు ఆదాయంతోపాటు, రిజిస్ట్రేషన్ సౌకర్యాలను అందించే ప్రక్రియలో భాగంగానే ఈ వెబ్ సైట్ రూపొందించబడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యాప్ లో తప్పుల తడకగా కనిపిస్తున్న అనేక వివరాలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది.  ధరణి పోర్టల్ వెబ్ సైట్ రూపోందించడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షించదగిన విషయమే అయినా, ఈ వెబ్ సైట్ నిర్వహణలో మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం పప్పులో కాలేసిందనే చెప్పాలి. 

తెలంగాణ పౌరులకు భూమి రికార్డులను సులభంగా యాక్సెస్ చేయడం, రిజిస్ట్రేషన్ సేవలు ఆన్‌లైన్‌లో అందించడం, భూమి రికార్డులు, సర్వే, మ్యాప్, పాఠ్య రికార్డుల నమీకరణ, పరిష్కార కార్యకలాపాల నిర్వహణ, ఆస్తి నమోదు తర్వాత మ్యుటేషన్ స్యయం చాలకం తదితర అంశాలపైనా స్పష్టమైన వివరాల కోసం ఈ వెబ్ సైట్ రూపొందించడిన విషయం తెలిసిందే.

వెబ్ సైట్ నిర్వహణలో లోపాలు, స్పష్టమైన వివారాలు పొందుపరచక పోవడం  తోపాటు కోనుగోలు దారుడు, అమ్మకం దారుకి మధ్య ఉన్న వివరాలు ఇందులో పొందుపరచకపోవడం గమనార్హం. దాంతో భూ నిర్వాసితుల్లో గందరగోళ పరీస్థితుల ఏర్పడతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరోవైపు భూమిపై హక్కు అనే విషయంలో కొనుగోలు దారుడి పేరు చేర్చకుండా, అమ్మకం దారుని పేరు మాత్రమే కొనసాగిస్తున్నట్లు అధికారుల పరిశీలనల్లో వెల్లడైంది. కొన్ని ప్రాంతాల్లో నమోదైన భూ విస్తీర్ణం కంటే ఎక్కువ విస్తీర్ణం చూపిస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో సర్వేనెంబర్లు స్పష్టంగా ఉన్నప్పటికీ, వాటికి సంబంధించిన భూమి మాత్రం కనిపించడంలేదు. మరోవైపు భూమి ఉన్నా, ..  విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. భూ వివాదాలపై కోర్టుల్లో ఉండటం, కోర్టు తీర్పులో సర్వే నంబర్ ని భూమి మొత్తానికి వర్తించే సాంకేతిక పరమైన ఇబ్బందులను అధికారులు గుర్తించారు. మొత్తం మీద ధరణితో తలెత్తుతున్న సమస్యలతోపాటు, ఆయా ప్రాంతాల్లోని రైతుల భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా 100 బందాలను ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. మూడు రోజులకో మండలం చోప్పున, జాయింట్ కలెక్టర్, డీఆర్ వో, ఆర్డీవోల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో, ధరణి పోర్టల్ ఏ మేరకు సేవలను అందిస్తుందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు కాంగ్రెస్ నేతలు. కాగా మండలాల్లో నిర్వహించే ఈ సదస్సుకు స్థానిక ఎమ్మెల్యే కూడా అధ్యక్షత వహిస్తారని తెలుస్తుంది.

Hyderabad

2022-07-06 08:59:38

ఏపీలో సచివలయ ఉద్యోగులకు మొండి చేయి

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయానికి చెందిన ఒక లక్షా 21వేల మంది ఉద్యోగులు ప్రభుత్వ తేగా వైఖరితో  9నెలల పేస్కేలుతోపాటు ఒక డిఏని, నూతన పీఆర్సీలోని ఉపయోగాలను సైతం కోల్పోవాల్సి వచ్చింది. అక్టోబరు 2021 అక్టోబరు 2నాటికి సచివాలయ ఉద్యోగులకు 2ఏళ్లు సర్వీసు ప్రొబేషన్ పూర్తయ్యింది. అపుడు ఉద్యోగుల సర్వీసుని క్రమబద్దీకరించి ఉంటే ఉద్యోగులు పేస్కేలుతోపాటు.. ఆరునెలల సమయం దాటిన తరువాత డీఏ కూడా పొందేవారు. అలా కాకుండా ప్రొబేషన్ పీరియడ్ ని డిపార్ట్ మెంటల్ టెస్టుల పేరుతో 9 నెలలు పొడిగించడంతో ఉద్యోగులు పేస్కేలతోపాటు డీఏ కూడా కోల్పోయారు. తీరా ఇపుడు ఆగస్టు 2 నుంచి కొత్త పేస్కేలు జీతాలు అందుకుంటున్నప్పటికీ ఇతరశాఖల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సచివాలయ ఉద్యోగులకు పూర్తి పీఆర్సీతో కూడిన పేస్కేలును ప్రభుత్వం అమలు చేయలేదు. సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ లో ఇచ్చినట్టుగా అక్టోబర్ 2 నాటికి ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ అయి ఉంటే అందరు ఉద్యోగులు మాదిరిగానే సచివాలయ ఉద్యోగులు కూడా పూర్తిస్థాయి పీఆర్సీ, దాని ఉపయోగాలు పొందేవారు. కానీ ఇపుడు పెంచిన ఫిట్ మెంట్ తప్పా ఉద్యోగులకు మరేమీ కలవడం లేదు. దీనితో ఒక్కో ఉద్యోగి పెరిగిన పీఆర్సీలో సుమారు 7వేల రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇపుడు వీరికి ఐఆర్(ఇంటీరియమ్ రిలీఫ్), పాత డీఏలు కూడా వర్తింపజేయడం లేదు.  తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనదునే ఇతర ప్రభుత్వశాఖ ఉద్యోగులకు వర్తింపజేసినట్టుగా పీఆర్సీని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అమలు చేయడం లేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకి  పీఆర్సీతో కూడిన పేస్కేలు అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం పాత పేస్కేలు ఎంత మొత్తం, ప్రస్తుత పేస్కేలుకి పీఆర్సీలోని ఏ మొత్తాన్ని కలిపితే పంచాయతీ గ్రేడ్-5 కార్యదర్శిలకు రూ.23120, ఇతర 18శాఖల ఉద్యోగులకు రూ.22460 వచ్చిందో సరిగ్గాలెక్కవేసి చెప్పలేదు. సాధారణంగా పీఆర్సీ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ముందుగా ఐఆర్(ఇంటీరియ్ రిలీఫ్) ప్రకటించిన తరువాత ప్రభుత్వ నిర్ణయంపై కొంతమొత్తం ఫిట్ మెంట్ తో పీఆర్సీని ఆయా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమలు చేస్తాయి. ఎప్పటి నుంచైతే అమలు చేస్తున్నాయో ఆ మొత్తాలకు చెందిన ఎరియర్స్ ను కూడా ఉద్యోగులకు అందిజేస్తుంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రం వాటికి భిన్నంగా జరుగుతోంది. రెగ్యులర్ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినట్టుగా(ఫిట్ మెంట్ పేస్కేలు+డీఏ+హెచ్ఆర్ఏ) వాటిపై వచ్చే ఎరియర్సును సచివాలయ ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సి వుంటుంది. కానీ ప్రభుత్వం ఒక్క ఫిట్ మెంట్, డీఏ, హెచ్ఆర్ఏ మాత్రమే పాత పేస్కేలుపై పెంచి ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు ఇస్తున్నట్టు చెబుతోందట. అంటే ఇక్కడ సచివాలయ ఉద్యోగులు ఐఆర్ తోపాటు, పీఆర్సీపై వచ్చే ఎరియర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన డీఏలను కూడా కోల్పోయారన్నమాట. సర్వీసు ప్రొబేషన్ గడువు పెంచేయడంతో వీటికి ముందు 9 నెలలుగా రావాల్సిన పేస్కేలు కూడా కోల్పోయారు సచివాలయ ఉద్యోగులు. ప్రభుత్వం జారీ చేసిన జీఓనెంబరు-5 ద్వారా లెక్కలు వేసిన ఆర్ధిక వేత్తలు ఈ విషయాన్ని తేటతెల్లం చేశారు.

సచివాలయ ఉద్యోగులపై సవతి తల్లిప్రేమ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి..దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానకపుత్రికగా ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. మీడియా ద్వారా కూడా అంతకంటే ఎక్కువగానే ప్రచారం కల్పించారు. ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి..ఆ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులపై సవతి తల్లిప్రేమ చూపిస్తూ..ఆదిలోనే వారికి రావాల్సిన ఉపయోగాలను హరించిన విధానాన్ని ఇపుడు ప్రతీ ఒక్కరూ తప్పు పడుతున్నారు. సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన దగ్గర నుంచి రెండేళ్ల పాటు ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించారు. అలా సేవలు అందించడానికి రెండవ శనివారాలు, ఆదివారాలు.. ఆఖరికి పండుగ సెలవుల్లో కూడా సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా విధులు నిర్వహించి ప్రజలకు సేవలు అందించారు. ఇలా పనిచేసిన క్రమంలో వేలాది మంది సచివాలయ ఉద్యోగులు కరోనా భారిన పడ్డారు. పదుల సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు కరోనా మహమ్మారికి బలయ్యారు కూడా. ఇంతగా పనిచేసిన సచివాలయ ఉద్యోగులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా కాకుండా వీరిని ప్రత్యేక ఉద్యోగులుగా గుర్తిస్తూ..వారికి రావాల్సిన అన్ని ఉపయోగాల్లోనూ కోత పెట్టేసింది. అంతేకాకుండా సచివాలయ ఉద్యోగులు ఏ తరగతికి చెందినవారో నేటికీ ప్రకటించకపోవడం విశేష. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కీలకం. కరోనాలాంటి విపత్కర సమయంలో సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఎంతోప్రాణ నష్టం సంభవించి ఉండేది. కానీ అంతలా పనిచేసిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మాత్రం చాలా దారుణంగా వ్యవహరించి ప్రొబేషన్ సమయంలో అదనంగా 9నెలలు అదే రూ.15వేలకే పనిచేయించింది. అప్పుడు అలా పనిచేయించినా.. కనీసం తరువాతనైనా పీఆర్సీ వర్తింపచేస్తే తాము లాసైన ఉపయోగాలు పొందవచ్చనుకుంటే..పీఆర్సీ అమలు చేసే విషయంలో అన్నీ కోతలు పెట్టింది ప్రభుత్వం. దీనితో ప్రభుత్వ తీరుతో అటు ప్రతిపక్షాలు, ఇటు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన అందుకునే పేస్కేలు చేతికి వస్తే తప్పా, ఒక్కో సచివాలయ ఉద్యోగికి పీఆర్సీ ఉపయోగాల్లో ఎంత మేరకు రంధ్రం పడిందీ తెలిసే పరిస్థితి లేదు. ఎన్నో ఆశలతో ప్రభుత్వ ఉద్యోగం అనే ఒకే ఒక్క ఆశతో లక్షలు జీతం వచ్చే ప్రైవేటు ఉద్యోగాలను విడిచి పెట్టి.. విధుల్లోకి చేరిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఈ విధంగా కోలుకోలేని జెల్లకాయ కొట్టడంపై ఇపుడు ఉద్యోగులంతా ఆలోచనలో పడ్డారనే ప్రచారం జరుగుతుంది. చూడాలి ముందు ముందు ఇంకెన్ని ప్రభుత్వ ఉపయోగాలు, సదుపాయాలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో రంధ్రానికి గురవుతాయో..!

Hyderabad

2022-07-05 13:40:59

ప్రధాని నరేంధ్ర మోదీ ప్రకటనపై హర్షం

భరతమాత ముద్దు బిడ్డ, మన్యంలో మహోదయం స్రుష్టించిన విప్లవయోధుడు అల్లూరి సీతారామరాజు నడయాడి సంచరించిన ప్రదేశాలను అభివ్రుద్ధి చేస్తామని భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడంపై అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా నాటి నుంచి నేటి వరకూ కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు మారినా ఏ ఒక్క ప్రధాని అల్లూరి కోసం ఇంత పెద్ద స్థాయిలో ప్రకటన చేయలేదన్నారు. మొట్టమొదటి సారిగా ఏన్డీఏ ప్రభుత్వంలోని ప్రధానమంత్రి అల్లూరి సంచరించన ప్రదేశాలను అభివ్రుద్ధి చేయాలని ప్రకటన చేయడం ఆ మహానుభావునికి నిజమైన గుర్తింపు నిచ్చినట్టు అయ్యిందన్నారు. భారత దేశ చరిత్రలో బ్రిటీషు సేనలపై అల్లూరి చేసిన వీరోచిత పోరాటం చిరస్మరణీయంగా నిలిచిపోతుందన్నారు. అంతటి మహానుభావుడు నడయాడిన ప్రదేశాలకు ఆయన జన్మంచిన 125 సంవత్సరాలకు కేంద్రప్రభుత్వం గుర్తింపు తీసుకువస్తామని చెప్పడం ప్రతీ తెలుగువాడు గర్వించదగ్గ విషయమన్నారు. లంబసింగి వద్ద అల్లూరి మ్యూజియంతోపాటు,చింతపల్లి పోలీస్ స్టేషన్ లను అభివ్రుద్ధి చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం కూడా ఒక చరిత్రగా నిలిచిపోతుందన్నారు. ప్రధాని చేసిన ప్రకటనను అమలు చేస్తూ తక్షణమే పనులు ప్రారంభించేలా చేయాలని కోరుతున్నట్టు ప్రకటించారు. అల్లూరి జన్మించిన ప్రదేశం, చదవుకున్న ప్రాంతం, కీలక పోరాలు, తిరుగుబాటు చేసిన క్రిష్ణదేవిపేట ప్రాంతాలను సెంట్రల్ టూరిజం ప్రాజెక్టుగా అభివ్రుద్ధి చేయడం ద్వారా భావితరాలకు అల్లూరి చరిత్ర, ఆ మహానుభావుడు సంచరించన ప్రదేశాలు గుర్తుండి పోయాయని అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Visakhapatnam

2022-07-05 10:45:25

తెలుగుజాతి గౌరవం భారతదేశ పౌరుషం..

తెలుగుజాతికి, భారతదేశానికి కూడా గొప్ప స్ఫూర్తి ప్రదాత అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో పాటు భీమవరం మహాసభలో పాల్గొన్న సీఎం అల్లూరి కీర్తిని ఏకబిగిన కొనియాడారు. అడవిబిడ్డలకు ఆరాధ్యదైవుడు. ఆయన వ్యక్తిత్వానికి, ఆయన గొప్పతనానికి, ఆయన త్యాగానికి ఈ రోజు గొప్పగా నివాళులు అర్పిస్తున్నాం. అల్లూరి సీతారామరాజు గారి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే... ఆయన నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు మనందరి ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా పాడేరుకి అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టామని గుర్తు చేశారు.  భీమవరంలో ఏ రకంగా విగ్రహావిష్కరణ జరుగుతుందో ఆ జిల్లాలో కూడా ఆ మహానుభావుడి కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోంది. తన మరణాన్ని, తాను జీవించిన జీవితాన్ని కూడా తరతరాలకు సందేశమిచ్చేలా బతికి చిన్న వయసులోనే తన ప్రాణాలను త్యాగం చేసిన ఆ  మహామనిషిని తెలుగుజాతి ఎప్పటికీ మర్చిపోదన్నారు. దేశం కోసం అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనం. ఎప్పటికీ కూడా ఆ మహావీరుడు చరితార్ధుడు. అతని త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిల్చిపోతుంది. అమర్‌ రహే అల్లూరి సీతారామరాజు, అల్లూరి సీతారామరాజు జైహింద్‌ అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ తన ప్రసంగంలో దేశభక్తిని చాటుకున్నారు. 

Bhimavaram

2022-07-04 15:09:47

ఎస్వీ సంస్కృత కళాశాలలో ప్రవేశాలు

తిరుమల తిరుపతి దేవస్థానానికి  చెందిన సికింద్రాబాద్ ఎస్వీ వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు రెండేళ్ల ప్రి డిగ్రీ కోర్సులో చేరేందుకు అర్హులు. సంస్కృతం ద్వితీయ భాషగా ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు బిఏ(ఓఎల్) డిగ్రీ కోర్సులో చేరేందుకు అర్హులు. విద్యార్థులకు ఉచితంగా బస, భోజన సౌకర్యం కల్పించడం జరుగుతుంది. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలు రాసేందుకు అర్హులు. జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ లోపు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థులు తమ దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా: శ్రీ వెంకటేశ్వర వేదాంతవర్ధిని సంస్కృత కళాశాల, 170- ఓల్డ్ ఎయిర్ పోర్ట్ రోడ్డు, బోయిన్ పల్లి, సికింద్రాబాద్-500011. మరిన్ని వివరాల కోసం 040 - 27750032, 9248813578, 990897 0007, 9441645995 నంబర్లను సంప్రదించగలరు.

Secunderabad

2022-07-04 14:48:25

12ర‌కాల గోఆధారిత వ్యవసాయ ఉత్ప‌త్తుల సేక‌ర‌ణ‌

తిరుమ‌ల శ్రీ‌వారికి నైవేద్యం, ఇత‌ర ప్ర‌సాదాలు త‌యారుచేసేందుకు వీలుగా  గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో మ‌లి విడ‌త‌లో 12 ర‌కాల ఉత్ప‌త్తులు సేక‌రించేందుకు రాష్ట్ర రైతు సాధికార సంస్థ‌, మార్క్‌ఫెడ్‌ల‌తో ఒప్పందం చేసుకున్నామ‌ని టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహంలో శ‌నివారం రాష్ట్ర రైతు సాధికార సంస్థ‌, మార్క్‌ఫెడ్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ 2021, అక్టోబ‌రు 11న రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారి స‌మ‌క్షంలో రాష్ట్ర రైతు సాధికార సంస్థ‌తో ఎంఓయు చేసుకున్న‌ట్టు తెలిపారు. ఈ మేర‌కు తొలివిడ‌త‌లో 500 మెట్రిక్ ట‌న్నుల శ‌న‌గ‌లు కొనుగోలు చేశామ‌న్నారు. మ‌లి విడ‌త‌లో ప్ర‌స్తుతం బియ్యం, శ‌న‌గ‌లు, బెల్లం, కందిప‌ప్పు, పెస‌లు, ప‌సుపు, వేరుశ‌న‌గ‌, మిరియాలు, ధ‌నియాలు, ఆవాలు, చింత‌పండు, ఉద్దిప‌ప్పు సేక‌రించాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. వీటిని ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల నుండి రాష్ట్ర రైతు సాధికార సంస్థ కొనుగోలు చేస్తుంద‌ని, ఈ సంస్థ నుండి మార్క్‌ఫెడ్ కొనుగోలుచేసి త‌గిన విధంగా మార్పుచేసి టిటిడికి అందిస్తుంద‌న్నారు. ఈ వ్య‌వ‌స్థ‌లో మ‌ధ్య‌వ‌ర్తుల ప్ర‌మేయం ఉండ‌ద‌ని చెప్పారు.

             టిటిడి ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ కార్య‌క్ర‌మం మొద‌లుపెట్టింద‌ని,  ప్ర‌జ‌లు కూడా ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను ఆద‌రించాల‌ని కోరారు. ర‌సాయ‌న ఎరువులు, పురుగుమందులు లేని పంట ఉత్ప‌త్తుల‌ను స్వీక‌రించ‌డం ద్వారా ఆరోగ్య‌క‌రంగా ఉంటామ‌ని, ఈ మేర‌కు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు పెట్టే ఖ‌ర్చు త‌గ్గుతుంద‌ని చెప్పారు. టిటిడి కోసం రైతు సాధికార‌ సంస్థ ఎంపిక చేసిన రైతులు భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పంట‌లు పండించాల‌ని, ఎలాంటి ప‌రిస్థితుల్లోనూ ర‌సాయ‌న ఎరువులు వినియోగించ‌వ‌ద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. టిటిడి స్ఫూర్తితో రాష్ట్రంలోని ఇత‌ర ఆల‌యాలు కూడా ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో అన్న‌ప్ర‌సాదాలు త‌యారుచేసేందుకు ముందుకొస్తున్నాయ‌ని తెలిపారు. క్ర‌మక్ర‌మంగా హోట‌ళ్లు, ఇత‌ర సంస్థ‌లు ప్ర‌కృతి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌ను వినియోగించాల‌ని, గో ఆధారిత ప్ర‌కృతి వ్య‌వ‌సాయానికి పూర్వ వైభ‌వం తీసుకురావాల‌ని కోరారు.

             రాష్ట్ర రైతు సాధికార సంస్థ వైస్ ఛైర్మ‌న్  విజ‌య‌కుమార్ మాట్లాడుతూ రైతు సాధికార సంస్థ‌, మార్క్‌ఫెడ్ క‌లిసి గో ఆధారిత వ్య‌వ‌సాయం ద్వారా పండించిన శ‌న‌గ‌పప్పును టిటిడికి స‌ర‌ఫ‌రా చేసిన‌ట్టు తెలిపారు. మొద‌టి ద‌శ‌లో 1300 మెట్రిక్ ట‌న్నుల శ‌న‌గ‌ల‌ను రైతుల నుండి సేక‌రించి ర‌సాయ‌న అవ‌శేషాల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగిందన్నారు. మ‌లి ద‌శ‌లో 12 ర‌కాల వంట‌స‌రుకుల‌ను సేక‌రించేందుకు ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌ ఎంపిక జ‌రుగుతోంద‌ని, ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ర‌సాయ‌నాలు వాడ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుని పంట‌లు పండిస్తార‌ని తెలిపారు. గ‌తేడాది టిటిడి గోశాల నుండి 1800 ఆవులు, ఎద్దుల‌ను ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతుల‌కు అందించిన‌ట్టు చెప్పారు. ఈ ఏడాది రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న గోశాల‌ల వ‌ద్ద మిగులుగా ఉన్న ఆవుల‌ను, ఎద్దుల‌ను రైతుల‌కు అందించేందుకు టిటిడి చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు.

              రాష్ట్ర వ్య‌వ‌సాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ మ‌ధుసూద‌న‌రెడ్డి మాట్లాడుతూ శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం వ‌చ్చే భ‌క్తుల‌కు ర‌సాయ‌న ర‌హిత వంట స‌రుకుల‌తో త‌యారుచేసిన ప్ర‌సాదాలు అందించాల‌ని టిటిడి నిర్ణ‌యించ‌డం ముదావ‌హ‌మ‌న్నారు. ఇందులో భాగంగా మొద‌ట‌గా ల‌డ్డూ త‌యారీకి వినియోగించే శ‌న‌గ‌ల‌ను ప్ర‌యోగాత్మ‌కంగా సేకరించిందన్నారు. ఈసారి రాష్ట్ర రైతు సాధికార సంస్థ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులు పండించిన 12 ర‌కాల వంట స‌రుకుల‌ను మార్క్‌ఫెడ్ ద్వారా సేక‌రించి టిటిడికి అంద‌జేస్తామ‌న్నారు.

              మార్క్‌ఫెడ్ ఎండి శ్రీ ప్ర‌ద్యుమ్న మాట్లాడుతూ ప్ర‌కృతి వ్య‌వ‌సాయం ద్వారా పండించిన 1276 మెట్రిక్ ట‌న్నుల శ‌న‌గ‌లు ఇవ్వాల‌ని టిటిడి కోర‌గా 500 మెట్రిక్ ట‌న్నులు సేక‌రించి అందించామ‌న్నారు. క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర కంటే 10 శాతం ఎక్కువగా చెల్లించ‌డం ద్వారా అటు రైతుల‌కు లాభ‌దాయ‌కంగా ఉంటుంద‌ని, ఇటు టిటిడికి నాణ్య‌మైన, ఆరోగ్య‌క‌ర‌మైన‌ వంట స‌రుకులు అందుతాయ‌ని తెలిపారు. ప్ర‌కృతి వ్య‌వ‌సాయ రైతులకు 7 నుండి 10 రోజుల్లోపు మార్క్‌ఫెడ్ సొమ్ము చెల్లిస్తుంద‌ని, ఆ త‌రువాత టిటిడి నుండి మార్క్‌ఫెడ్ రీయింబ‌ర్స్‌మెంట్ తీసుకుంటోంద‌ని చెప్పారు. శ్రీ‌వారి ఆశీస్సుల‌తో ఈ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తామ‌న్నారు.    ఈ స‌మావేశంలో టిటిడి జెఈవో వీర‌బ్ర‌హ్మం, ఎఫ్ఏసిఏవో  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2  జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, గోశాల సంచాల‌కులు డాక్ట‌ర్ హ‌ర‌నాథ‌రెడ్డి, మార్కెటింగ్ జిఎం సుబ్ర‌హ్మ‌ణ్యం, ఎస్వీ వెట‌ర్న‌రీ వ‌ర్సిటీ ప్రొఫెస‌ర్‌ వెంక‌ట‌నాయుడు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-07-02 11:09:20

9నెలల పేస్కేలు, 1డీఏ, పీఆర్సీకీ రంధ్రం

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయానికి చెందిన ఒక లక్షా 21వేల మంది ఉద్యోగులు ప్రభుత్వ తేగా వైఖరితో  9నెలల పేస్కేలుతోపాటు ఒక డిఏని, నూతన పీఆర్సీలోని ఉపయోగాలను సైతం కోల్పోవాల్సి వచ్చింది. అక్టోబరు 2021 అక్టోబరు 2నాటికి సచివాలయ ఉద్యోగులకు 2ఏళ్లు సర్వీసు ప్రొబేషన్ పూర్తయ్యింది. అపుడు ఉద్యోగుల సర్వీసుని క్రమబద్దీకరించి ఉంటే ఉద్యోగులు పేస్కేలుతోపాటు.. ఆరునెలల సమయం దాటిన తరువాత డీఏ కూడా పొందేవారు. అలా కాకుండా ప్రొబేషన్ పీరియడ్ ని డిపార్ట్ మెంటల్ టెస్టుల పేరుతో 9 నెలలు పొడిగించడంతో ఉద్యోగులు పేస్కేలతోపాటు డీఏ కూడా కోల్పోయారు. తీరా ఇపుడు ఆగస్టు 2 నుంచి కొత్త పేస్కేలు జీతాలు అందుకుంటున్నప్పటికీ ఇతరశాఖల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సచివాలయ ఉద్యోగులకు పూర్తి పీఆర్సీతో కూడిన పేస్కేలును ప్రభుత్వం అమలు చేయలేదు. సచివాలయ ఉద్యోగుల నోటిఫికేషన్ లో ఇచ్చినట్టుగా అక్టోబర్ 2 నాటికి ఉద్యోగుల సర్వీసు రెగ్యులర్ అయి ఉంటే అందరు ఉద్యోగులు మాదిరిగానే సచివాలయ ఉద్యోగులు కూడా పూర్తిస్థాయి పీఆర్సీ, దాని ఉపయోగాలు పొందేవారు. కానీ ఇపుడు పెంచిన ఫిట్ మెంట్ తప్పా ఉద్యోగులకు మరేమీ కలవడం లేదు. దీనితో ఒక్కో ఉద్యోగి పెరిగిన పీఆర్సీలో సుమారు 7వేల రూపాయలు కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇపుడు వీరికి ఐఆర్(ఇంటీరియమ్ రిలీఫ్), పాత డీఏలు కూడా వర్తింపజేయడం లేదు.  తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనదునే ఇతర ప్రభుత్వశాఖ ఉద్యోగులకు వర్తింపజేసినట్టుగా పీఆర్సీని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అమలు చేయడం లేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకి  పీఆర్సీతో కూడిన పేస్కేలు అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం పాత పేస్కేలు ఎంత మొత్తం, ప్రస్తుత పేస్కేలుకి పీఆర్సీలోని ఏ మొత్తాన్ని కలిపితే పంచాయతీ గ్రేడ్-5 కార్యదర్శిలకు రూ.23120, ఇతర 18శాఖల ఉద్యోగులకు రూ.22460 వచ్చిందో సరిగ్గాలెక్కవేసి చెప్పలేదు. సాధారణంగా పీఆర్సీ అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ముందుగా ఐఆర్(ఇంటీరియ్ రిలీఫ్) ప్రకటించిన తరువాత ప్రభుత్వ నిర్ణయంపై కొంతమొత్తం ఫిట్ మెంట్ తో పీఆర్సీని ఆయా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమలు చేస్తాయి. ఎప్పటి నుంచైతే అమలు చేస్తున్నాయో ఆ మొత్తాలకు చెందిన ఎరియర్స్ ను కూడా ఉద్యోగులకు అందిజేస్తుంది. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాత్రం వాటికి భిన్నంగా జరుగుతోంది. రెగ్యులర్ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినట్టుగా(ఫిట్ మెంట్ పేస్కేలు+డీఏ+హెచ్ఆర్ఏ) వాటిపై వచ్చే ఎరియర్సును సచివాలయ ఉద్యోగులకు కూడా ఇవ్వాల్సి వుంటుంది. కానీ ప్రభుత్వం ఒక్క ఫిట్ మెంట్, డీఏ, హెచ్ఆర్ఏ మాత్రమే పాత పేస్కేలుపై పెంచి ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు ఇస్తున్నట్టు చెబుతోందట. అంటే ఇక్కడ సచివాలయ ఉద్యోగులు ఐఆర్ తోపాటు, పీఆర్సీపై వచ్చే ఎరియర్స్, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన డీఏలను కూడా కోల్పోయారన్నమాట. సర్వీసు ప్రొబేషన్ గడువు పెంచేయడంతో వీటికి ముందు 9 నెలలుగా రావాల్సిన పేస్కేలు కూడా కోల్పోయారు సచివాలయ ఉద్యోగులు. ప్రభుత్వం జారీ చేసిన జీఓనెంబరు-5 ద్వారా లెక్కలు వేసిన ఆర్ధిక వేత్తలు ఈ విషయాన్ని తేటతెల్లం చేశారు.

సచివాలయ ఉద్యోగులపై సవతి తల్లిప్రేమ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసి..దానిని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానకపుత్రికగా ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. మీడియా ద్వారా కూడా అంతకంటే ఎక్కువగానే ప్రచారం కల్పించారు. ఒక మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి..ఆ వ్యవస్థలో పనిచేసే ఉద్యోగులపై సవతి తల్లిప్రేమ చూపిస్తూ..ఆదిలోనే వారికి రావాల్సిన ఉపయోగాలను హరించిన విధానాన్ని ఇపుడు ప్రతీ ఒక్కరూ తప్పు పడుతున్నారు. సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన దగ్గర నుంచి రెండేళ్ల పాటు ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించారు. అలా సేవలు అందించడానికి రెండవ శనివారాలు, ఆదివారాలు.. ఆఖరికి పండుగ సెలవుల్లో కూడా సచివాలయ ఉద్యోగులు ప్రత్యేకంగా విధులు నిర్వహించి ప్రజలకు సేవలు అందించారు. ఇలా పనిచేసిన క్రమంలో వేలాది మంది సచివాలయ ఉద్యోగులు కరోనా భారిన పడ్డారు. పదుల సంఖ్యలో సచివాలయ ఉద్యోగులు కరోనా మహమ్మారికి బలయ్యారు కూడా. ఇంతగా పనిచేసిన సచివాలయ ఉద్యోగులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా కాకుండా వీరిని ప్రత్యేక ఉద్యోగులుగా గుర్తిస్తూ..వారికి రావాల్సిన అన్ని ఉపయోగాల్లోనూ కోత పెట్టేసింది. అంతేకాకుండా సచివాలయ ఉద్యోగులు ఏ తరగతికి చెందినవారో నేటికీ ప్రకటించకపోవడం విశేష. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కీలకం. కరోనాలాంటి విపత్కర సమయంలో సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఎంతోప్రాణ నష్టం సంభవించి ఉండేది. కానీ అంతలా పనిచేసిన ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మాత్రం చాలా దారుణంగా వ్యవహరించి ప్రొబేషన్ సమయంలో అదనంగా 9నెలలు అదే రూ.15వేలకే పనిచేయించింది. అప్పుడు అలా పనిచేయించినా.. కనీసం తరువాతనైనా పీఆర్సీ వర్తింపచేస్తే తాము లాసైన ఉపయోగాలు పొందవచ్చనుకుంటే..పీఆర్సీ అమలు చేసే విషయంలో అన్నీ కోతలు పెట్టింది ప్రభుత్వం. దీనితో ప్రభుత్వ తీరుతో అటు ప్రతిపక్షాలు, ఇటు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 1వ తేదీన అందుకునే పేస్కేలు చేతికి వస్తే తప్పా, ఒక్కో సచివాలయ ఉద్యోగికి పీఆర్సీ ఉపయోగాల్లో ఎంత మేరకు రంధ్రం పడిందీ తెలిసే పరిస్థితి లేదు. ఎన్నో ఆశలతో ప్రభుత్వ ఉద్యోగం అనే ఒకే ఒక్క ఆశతో లక్షలు జీతం వచ్చే ప్రైవేటు ఉద్యోగాలను విడిచి పెట్టి.. విధుల్లోకి చేరిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఈ విధంగా కోలుకోలేని జెల్లకాయ కొట్టడంపై ఇపుడు ఉద్యోగులంతా ఆలోచనలో పడ్డారనే ప్రచారం జరుగుతుంది. చూడాలి ముందు ముందు ఇంకెన్ని ప్రభుత్వ ఉపయోగాలు, సదుపాయాలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో రంధ్రానికి గురవుతాయో..!



Tadepalli

2022-07-02 10:01:27

27 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో సెప్టెంబ‌రు 27 నుంచి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు ఈసారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయ‌ని, మాడ వీధుల్లో వాహ‌నసేవ‌లు నిర్వ‌హించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని టిటిడి ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్ల‌పై జెఈవోలు  స‌దా భార్గ‌వి,  వీర‌బ్ర‌హ్మం, సివిఎస్‌వో  న‌ర‌సింహ కిషోర్‌తో క‌లిసి శుక్ర‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో అన్ని విభాగాల అధికారుల‌తో ప్రాథ‌మిక స‌మీక్ష నిర్వ‌హించారు.ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం చేసుకుని బ్ర‌హ్మోత్స‌వాల‌ను వైభ‌వంగా నిర్వ‌హిస్తామ‌న్నారు. సెప్టెంబ‌రు 27న సాయంత్రం 5.45 నుండి 6.15 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో ధ్వ‌జారోహ‌ణం జ‌రుగ‌నుంద‌ని, ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని వివ‌రించారు. ఇందుకోసం రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాస్తామ‌న్నారు. అక్టోబ‌రు 1న గరుడ వాహనం, అక్టోబ‌రు 2న స్వర్ణరథం, అక్టోబ‌రు 4న రథోత్సవం, అక్టోబ‌రు 5న‌ చక్రస్నానం జ‌రుగుతాయ‌ని తెలియ‌జేశారు.

            క‌రోనా కార‌ణంగా గ‌తంలో రెండు ప‌ర్యాయాలు వాహ‌న‌సేవ‌లు ఏకాంతంగా నిర్వ‌హించామ‌ని, ఈసారి మాడ వీధుల్లో వాహ‌న‌సేవ‌ల ఊరేగింపు ఉంటుంద‌ని చెప్పారు. ఈసారి పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు విచ్చేసే అవ‌కాశ‌ముంద‌ని, ఇందుక‌నుగుణంగా ప‌టిష్టంగా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌ని తెలిపారు. బ్ర‌హ్మోత్స‌వాల రోజుల్లో వృద్ధులు, విక‌లాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రుల‌కు ప్ర‌త్యేక ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేశామ‌న్నారు. ఈసారి గ‌రుడ‌సేవ పెర‌టాసి మాసంలో మూడో శ‌నివారం రోజున జ‌రుగ‌నుంద‌ని, భ‌క్తులు విశేషంగా విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డ‌తామ‌ని వివ‌రించారు. సామాన్య భ‌క్తుల‌కు ఎక్కువ ద‌ర్శ‌న‌ స‌మ‌యం క‌ల్పించేందుకు బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు చేశామ‌ని, ఫ్రొటోకాల్ విఐపిల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నాలు మంజ‌రు చేస్తామ‌ని తెలిపారు.

           తిరుమ‌ల‌లో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని, అలిపిరి, శ్రీ‌వారిమెట్టు న‌డ‌క‌మార్గాల్లోనూ ప‌రిశుభ్రంగా ఉంచుతామ‌ని ఈవో తెలిపారు. వైద్య విభాగం ఆధ్వ‌ర్యంలో అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో ప్ర‌థ‌మ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు ఏర్పాటు చేస్తామ‌న్నారు. రుయా, స్విమ్స్ ఆసుప‌త్రుల నుంచి స్పెష‌లిస్టు డాక్ట‌ర్ల‌ను ర‌ప్పించి వైద్య సేవ‌లు అందిస్తామ‌ని తెలిపారు. పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. త‌గిన‌న్ని ఆర్టిసి బ‌స్సులు ఏర్పాటుచేస్తామ‌ని, గ‌రుడ‌సేవ నాడు భ‌క్తులు ద్విచ‌క్ర వాహ‌నాల‌ను తిరుప‌తిలోనే పార్క్ చేసి బ‌స్సుల్లో తిరుమ‌ల‌కు చేరుకోవాలని కోరారు. గ‌రుడ సేవ జ‌రిగే రోజుతోపాటు ఆ ముందు రోజు, త‌రువాతి రోజు ఆన్లైన్‌లో గ‌దుల కేటాయింపు ఉండ‌ద‌ని, మిగిలిన రోజుల‌కు సంబంధించి 50 శాతం ఆన్లైన్లో కేటాయిస్తామ‌ని, మిగిలిన‌వి క‌రంట్ బుకింగ్‌లో భ‌క్తుల‌కు కేటాయిస్తామ‌ని చెప్పారు.

           భ‌క్తులంద‌రికీ అన్న‌ప్ర‌సాదాలు అందిస్తామ‌ని, మాడ వీధుల్లోని గ్యాల‌రీల్లో ఫుడ్ కౌంట‌ర్లు ఏర్పాటుచేసి తాగునీరు, మ‌జ్జిగ పంపిణీ చేస్తామ‌ని తెలిపారు. తిరుమ‌ల‌లో ప్లాస్టిక్ నిషేధం అమ‌ల్లో ఉన్నందున భ‌క్తుల త‌మ‌తోపాటు గాజు లేదా రాగి లేదా స్టీల్ బాటిళ్లు వెంట తెచ్చుకోవాల‌ని కోరారు. హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ఆధ్వ‌ర్యంలో ఆక‌ట్టుకునేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తామ‌న్నారు. ఇంజినీరింగ్ ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. తిరుమ‌ల‌లోని భ‌వ‌నాలు, చెట్ల‌పై విద్యుత్ అలంక‌ర‌ణ‌లు చేప‌డ‌తామ‌న్నారు. గ‌రుడ సేవ నాడు భ‌క్తులు ఎత్తైన భ‌వ‌నాలు ఎక్క‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు. వాహ‌న‌సేవ‌ల‌ను ఎస్వీబీసీ ద్వారా ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు త‌గినంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానిస్తామ‌ని చెప్పారు.

Tirumala

2022-07-01 16:14:28

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం..

Ens Live Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. Ens Live Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole sealers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers, real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Tadepalli

2022-07-01 13:56:28

ఏపీసచివాలయ ఉద్యోగులకు ఝలక్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది. హైదరాబాదు నుంచి రాజధానిని తరలించిన తరువాత స్టేట్ కేపిటల్ ఉద్యోగులందరికీ ప్రభుత్వం వసతి కల్పించింది. తాజా ఆ వసతిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు కేవలం ఒక్కరోజు మాత్రమే వారికి సమయం ఇచ్చి ఉన్న ఫలంగా ఉంటున్న ప్లాట్లు ఖాళీ చేసి ఇవ్వాలంటూ సాధారణ పరిపాలన శాఖ ద్వారా ఆదేశాలు జారీ చేయడంతో ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం లోని శాఖాధిపతుల కార్యాలయాల్లోని ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.  కల్పిస్తున్న ఉచిత గృహవసతి సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడంతో ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలోకి పడ్డారు రాష్ట్ర సచివాలయ ఉద్యోగులంతా. రేపటిలోగా ప్రస్తుతం ఉద్యోగులు ఉంటున్న ప్లాట్లను ఖాళీ చేసి ఇవ్వాలనే నిబందనపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. అంతేకాకుండా ఉంటున్న ప్లాట్లకు ఏమైనా నష్టం జరిగితే సంబంధిత ఉద్యోగులదే బాధ్యతని అని కూడా జారీచేసిన ఉత్తర్వులలో పేర్కొనడం విశేషం. కాగా , హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2017 నుంచి ఉచిత వసతి కల్పిస్తూ వచ్చింది. నేటితో ఆ ఉచిత వసతి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడేసింది.

Tadepalli

2022-06-29 15:47:34

ఏపీ హైకోర్టులో పరీక్షలేకుండా ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ లోని అమరావతిలో ఉన్న స్టేట్‌ హైకోర్టు కోర్టు మాస్టర్, పర్సనల్‌ సెక్రెటరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీల సంఖ్య 10, విద్యార్హతలు పోస్టులను బట్టి ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌/లా స్పెషలైజేషన్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్పీడ్‌ టైపింగ్‌, కంప్యూటర్‌ స్కిల్స్‌ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి విషయానికి వస్తే వయసు జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. ఇక పే స్కేల్‌: నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఎంపిక విధానం చూసుకుంటే టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌లో అడ్రస్‌: రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌), ఏపీ హైకోర్ట్‌, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా- 522237 అనే అడ్రసుకి దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు రూ.1000 కాగా ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు: రూ.500 గా నిర్ణయించారు. దరఖాస్తుకు చివరితేదీ: జులై 25, 2022 గా పేర్కొన్నారు.

Amaravati

2022-06-29 07:29:28

ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు

శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2022-23 విద్యాసంవత్సరానికి గాను డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు (సంప్రదాయ కళంకారి కళ)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.  కళాశాలలో జూలై 11 నుండి 30వ తేదీ వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 30వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది.  డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందిన వారికి లక్ష రూపాయల చొప్పున బ్యాంకులో డిపాజిట్‌ చేసి ఉత్తీర్ణత సాధించిన అనంతరం నిబంధనలకు లోబడి చెల్లిస్తారు. కోర్సులు, విద్యార్హతలు, ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ, కళాశాల కార్యాలయాన్ని 0877-2264637 నంబరులో పనివేళల్లో  సంప్రదించగలరు.

Tirumala

2022-06-29 06:59:42

8వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు..

ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో డిజిటల్‌ స్క్రీన్ల ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం విద్యాశాఖలో నాడు-నేడు, డిజిజల్‌ లెర్నింగ్‌పై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బైజూస్‌తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్‌ అందించడంపై సీఎం చర్చించారు. అలాగే సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడంపై  సమీక్షించారు.  ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ ఇస్తామని, ఆ ట్యాబ్‌లో బైజూస్‌ కంటెంట్‌ను లోడ్‌ చేయాలని తెలిపారు. దీనికి తగినట్టుగా ట్యాబ్‌ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలన్నారు. ఇవి నిర్దారించాక ట్యాబ్‌ల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టాలని పేర్కొన్నారు. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్‌ సంబంధిత విద్యార్థి తర్వాత చదివే తరగతులకు కూడా అంటే 9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలని తెలిపారు. అందుకే నిర్వహణ కూడా అత్యంత ముఖ్యమని, ఏదైనా సమస్య వస్తే వెంటనే దాన్ని రిపేరు చేసే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అన్నారు. నిర్దేశిత సమయంలోగా ట్యాబ్‌లు పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచి కంపెనీలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు.
సీఎం వైయ‌స్ జ‌గ‌న్​ ఇంకా ఏమన్నారంటే ...

తరగతి గదిలో డిజిటల్‌ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించండి. విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు పెట్టేందుకు ప్రతిపాదిస్తు ఉన్నామన్న అధికారులు. ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. తరగతి గదిలో డిజిటల్‌ స్క్రీన్, బ్లాక్‌ బోర్డులు... వీటి అమరిక ఎలా ఉండాలన్న దానిపై కూడా ఆలోచన చేయాలి. బోధనకు ఎప్పుడు, దేన్ని ఉపయోగించు కున్నా.. అందుకు అనుగుణంగా వీటి అమరిక ఉండాలి. ఇప్పటికే డిజిటల్‌ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించాలి. వీటి వల్ల సైన్స్, మాథ్స్‌ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా చక్కగా అర్థం అవుతాయి. వీటి వల్ల టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుంది. స్క్రీన్‌ మీద కంటెంట్‌ను హైలెట్‌ చేసుకునేలా, ఎనలార్జ్‌ చేసుకునేలా ఏర్పాటు ఉంటే బాగుంటుంది. డిజిటల్‌ స్క్రీన్లు, ప్యానెళ్ల ఆస్తుల భద్రతపైనా దృష్టి పెట్టాలి. దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. ఈ సమీక్షకు సీఎస్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, సర్వ శిక్షా అభయాన్‌ ఎస్‌పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరు అయ్యారు.

Tadepalli

2022-06-28 16:01:40

ఏపీలో పులుల సంఖ్య 55 నుంచి 65 మాత్రమే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పులుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వుతోపాటు ఏజెన్సీ, శేషాచలం అన్ని ప్రాంతాలో కలిపి 55 నుండి 65 వరకూ పులుల సంఖ్య ఉండొచ్చని అంచనా వేశారు. కాలి గుర్తులు, కెమెరా రికార్డుల ఆధారంగా ప్రభుత్వం ఈ అంచనాకు వచ్చింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్ట్‌ ఉంది. ఇది కాకుండా పాపికొండల ప్రాంతంలోనూ పులల సంచారం ఉంది. ఒడిస్సా మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘర్‌ ప్రాంతాల నుండీ మన రాష్ట్రంలో అటవీ ప్రాంతానికి పులుల రాకపోకలు సాగిస్తున్నాయి. మహారాష్ట్రలో మాల్గార్‌ రిజర్వు నుండి నిత్యం మన రిజర్వులోకి రాకపోకలు సాగిస్తుంటాయి. ఒడిస్సాలోని సిమ్లిపాల్‌ రిజర్వు నుండి పులులు వస్తుంటాయి. రాష్ట్రంలో సుమారు 3500 చదరపు కిలోమీటర్ల పరిధిలో పులుల సంచారం ఉన్నట్లు అంచనా. ప్రతి పులి తన టెరిటోరిల్‌(సరిహద్దులు) 100 చదరపు కిలోమీటర్లుగా నిర్ణయించారు. అంటే సుమారు 2500 ఎకరాలు సరాసరిగా ఉంటుంది. ప్రతి ఏటా పులుల సంఖ్యపై జాతీయస్థాయిలో సర్వే నిర్వహిస్తారు. గతంలో నిర్వహించిన సర్వేలో అత్యధికంగా మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో 590 వరకూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 55 నుండి 65 మధ్య ఉండొచ్చని లెక్కగట్టారు. ప్రసుత్త కాకినాడ పరిధిలో తిరుగుతున్న పులి కూడా మన రాష్ట్రానికి సంబంధించింది కాదని, ఇటీవల లభించిన వీడియో, పంజా గుర్తుల ఆధారంగా అది ఇతర రాష్ట్రం నుండి వచ్చి ఉండచ్చని చెబుతున్నారు. ఒడిస్సా అటవీ ప్రాంతం నుండి వచ్చిందని, వచ్చే క్రమంలో దారితప్పి రావడం, అదే సమయంలో పశు మాంసానికి అలవాటు పడటంతో పూర్తిస్థాయిలో టెరిటరీ ఏర్పాటు చేసుకోలేదని, దీనివల్ల కొంత గందరగోళానికి గురవుతోందని తేల్చారు. అయితే అది తిరిగి వెళ్లే క్రమంలో ప్రస్తుతం తుని పరిసర ప్రాంతాల్లో ఉండొచ్చని తేల్చారు. రాకపోకలు సాగించే దారిలేకపోవడం వెనుక ప్రకృతి సహజమైన వనరులు ధ్వంసం కావడం కూడా కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. అడవి జంతువులు నిరంతరం తిరిగే మార్గంలో అడ్డంకులు ఎదురైనప్పుడు మాత్రమే అవి దారితప్పుతాయని, లేనిపక్షంలో అంత తొందరగా వాటి సరిహద్దులు దాటి రావని చెబుతున్నారు. జూన్‌, జులై నెలల్లో పులుల సంఖ్యను ప్రకటించే సమయం కావడం ఇదే సమయంలో రాష్ట్రంలో పులి దారితప్పి ప్రయాణిస్తుండటంతో రాష్ట్రంలో పులుల సంఖ్య, వాటి కదలికలపైనా ఆసక్తి ఏర్పడింది. తుని పరిసరాల్లో ఉన్న పులి యుక్త వయస్సువల్ల తోడు కోసం దారితప్పిందని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని, ప్రకృతి సిద్ధమైన అనేక కారణాలు ఇందులో ఉన్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. నిజంగా తోడు కోసమైతే పులి ఇంతదూరం ప్రయాణం చేయదని, కేవలం దారితప్పడం వల్లే కొంత గందరగోళానికి గురైందని చెబుతున్నారు. త్వరలోనే జాడను గుర్తిస్తామని స్పష్టం చేస్తున్నారు.

Tadepalli

2022-06-28 05:34:17