1 ENS Live Breaking News

ఆ 17యూనివర్శిటీల్లో ఏం జరుగుతుంది..

ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల్లో ఉన్న 17 యూనివర్శిటీల్లో ఏం జరుగుతుందో నేటికీ విద్యార్ధులకు సరైన సమాచారం లేదు..సరైన మీడియా ద్వారా చేరడం లేదు.. అన్ని యూనివర్శిటీలకు వెబ్ సైట్లు వున్న సమాచారాన్ని పూర్తిస్థాయిలో అందులో ఏర్పాటు చేకపోవడం ఉన్నత విద్యాశాఖ తప్పుల్లో ప్రధానంగా కనిపిస్తుంది. లక్షల రూపాయలు ఖర్చుచేసి మీడియాలో ప్రకటనలు ఇవ్వడానికి ప్రభుత్వం మొగ్గు చూపిస్తుంది తప్పితే అదే మొత్తంతో పీఆర్వోల(మీడియా సెల్) ను యూనివర్శిటీల్లో ఏర్పాటు చేసి సమాచారం సకాలంలో మీడియా ద్వారా అందించే ఏర్పాటు చేయడానికి మొత్రం అటు ప్రభుత్వం, ఇటు వైస్ చాన్సలర్లు తెగ నొప్పులు పడిపోతున్నారు. కేవలం ఒకటి రెండు యూనివర్శిటీల్లో మాత్రం జర్నలిజం విభాగ అధిపతులు మీడియా ద్వారా ప్రెస్ రిలీజ్ లు ఇస్తే తప్పా విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు యూనివర్శిటీల సమాచారం తెలియని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ప్రభుత్వ యూనివర్శిటీల్లో పీఆర్వో విభాగాలుండాలి. గత ప్రభుత్వాలు చేసిన తప్పులే ప్రస్తుత ప్రభుత్వం కూడా చేయడంతో ఏపీని 17 యూనివర్శిటీల్లో పీఆర్వో పోస్టులు భర్తీకాకుండా మిగిలిపోయాయి. యూనివర్శిటీ వైస్ చాన్సలర్స్ కి వున్న అధికారాలతో ఔట్ సోర్సింగ్ లేదా, కాంట్రాక్టు విధానంలో పీఆర్వోలను నియమించుకునే అవకాశం వున్నప్పటికీ ఆ కీలకమై పోస్టులను భర్తీచేయకుండా వదిలేశారు. దీనితో యూనివర్శిటీల్లో ఏం జరుగుతుందో(విద్య, వసతులు, కోర్సులు, పరీక్షలు, ఫలితాలు) విద్యార్ధులకు తల్లిదండ్రులకు తెలియకుండా పోతుంది. ఈ విషయంలో ఉన్నతవిద్యా శాఖ అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించినా ఫలితం లేకుండా పోతుంది. ఇటు యూనివర్శిటీ విసిల నియామకాలు కూడా ప్రభుత్వంలోని రాజకీయనాయకులతో ముడిపడి వుండటంతో తమ పోస్టుల నియమాకాల కోసమే చూస్తున్నారు తప్పితే యూనివర్శిటీలో ఏం జరుగుతుందో విద్యార్ధులకు తెలియజేయడంలో వైస్ చాన్సలర్లు కూడా తీవ్రస్థాయిలో విఫలం చెందుతున్నారు. ఒకటిరెండు యూనివర్శిటీల్లో మాత్రం వీసిలు ప్రైవేటుగా పీఆర్వోలను ఏర్పాటు చేసి అడపా దడపా మీడియాకి సమాచారం అందిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి పోస్టుల అనుమతి, జీతాల విడుదలకు ఇబ్బందులు అనుమతులు ఇవ్వకపోవడంతో ఇటు విసీలు కూడా తమ సీటు కదలకుండా ఉండేందుకు ఆరాటపడుతున్నారు తప్పితే ఈ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దైర్యం మాత్రం చేయడంలేదు. ఇదిలా వుంటే ప్రైవేటు యూనివర్శిటీలు మాత్రం విద్యార్ధులకోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి యూనివర్శిటీల్లో జరిగే సమస్త సమాచారాన్ని న్యూస్ ఛానళ్లు, పత్రికలు, లోకల్ కేబుల్ టీవీలు, మొబైల్ న్యూస్ యాప్ లకు ప్రత్యేకంగా అందించే ఏర్పాట్లు చేసుకొని విద్యావ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా మలచుకుంటున్నారు. ఈ విషయాన్ని విసిలు సైతం ఉన్నత విద్యాశాఖ ద్రుష్టికి తీసుకెళ్లి తమ తమ యూనివర్శిటీల్లో మీడియా సెల్ ఏర్పాటుకి మాత్రం దైర్యం చేయలేకపోతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే అద్యాపకులు లేని ప్రభుత్వ యూనివర్శిటీల్లో చేరేందుకు విద్యార్ధులు మొగ్గు చూపడం లేదు. రేపు యూనివర్శిటీ సమాచారం తెలియజేసే ఏర్పాటు చేయకపోతే ఉన్న ఆ విద్యార్ధులకు కూడా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎదురవుతుంది.

Tadepalle

2021-06-21 02:30:55

Tadepalle

2021-06-20 16:16:33

2021-06-20 14:38:08

అదనపు పనిగంటల..ఆపై బెదిరింపులు..

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి తప్పా ప్రభుత్వం మిగిలిన అన్ని శాఖల సిబ్బందికి, అధికారులకు కరోనా సమయంలోనూ కార్యాలయ సమయాల్లో పనిగంటలు తగ్గించింది. కానీ సచివాలయ సిబ్బంది మాత్రం సాధారణ సమయం కంటే అధనపు సమయంతో పాటు సెలవురోజులైన ఆదివారాలు, రెండవ శనివారాలు కూడా విధులు నిర్వహించారు. ఆ సమయంలో అత్యధికంగా రెండు టీకాలు తీసుకున్నా కరోనా వైరస్ భారిన పడి అధిక సంఖ్యలో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కరోనా వైరస్ సోకకుండా ప్రజలకు టీకాలు వేయించే విషయంలో బెదిరిపులు భరిస్తూ అధికారులు ఇచ్చిన టార్గెట్లు కూడా వీరే పూర్తిచేస్తూ వస్తున్నారు. కష్టం సచివాలయ ఉద్యోగులదైతే జిల్లా కలెక్టర్ల వద్ద తామే తెగ కష్టపడిపోయి టార్గెట్లు రీచ్ అయినట్టు కలరిస్తున్నారు మండల అధికారులు. ఈ తరుణంలో సిబ్బంది అధనంగా పనిచేసిన సమయం, ఆదివారాల్లో విధులు నిర్వహించిన అదనపు సమయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా అనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. పైగా కరోనా టీకాలు వేసే ప్రాంతాల వద్ద సచివాలయ సిబ్బందికి శానిటైజర్లు గానీ, మాస్కులు గానీ, హేండ్ గ్లౌజులు కాని ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదు. ఈ కారణంగానే తాము వైరస్ బారిన పడి ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారంలో మూడు రోజులు టీకా వేసే సమయంలో ఉద్యోగులంతా ఉదయం 8గంటలకే టీకా కేంద్రాలకు చేరుకొని సాయంత్రం ఆరు దాటేవరకూ విధులు నిర్వహించాల్సి వస్తుంది. ఇంతలా ప్రజల కోసం సర్వీసు చేస్తున్నా అధికారులు గుర్తించకపోగా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. టీకా వేయించుకోవడానికి ప్రజలు ముందుకి రాకపోతే దానికి తామెలా బాధ్యత వహిస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ మీరేం చేస్తారో తెలీదు ఎప్పుడు ఎన్ని టీకాలు ఇచ్చినా ఆ లక్ష్యం పూర్తిచేసే బాధ్యత మీదేననే భారం సచివాలయ ఉద్యోగులపై వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అటు గ్రామాల్లో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు ఉన్నా వారు సమయానికి వచ్చి టీకా వేసి వెళ్లిపోతున్నారు తప్పితే ప్రజలను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే భారం సచివాలయ ఉద్యోగులపైనే పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేమంటే మీరు ఇంకా ప్రొభిషన్ పీరియడ్ లోనే ఉన్నారని, ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోకపోతే మీ ఉద్యోగాలు మధ్యలో తీసేసినా తీసేస్తారని కొన్ని మండలాల్లో అధికారులు బెదిరింపులకు దిగడం కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. ప్రభుత్వం ప్రజల ప్రాణాల కోసం కష్టపడుతున్న సమయంలో తాము అధనంగా చేస్తున్న పనిగంటలు, పడుతున్న శ్రమను గుర్తించాలని సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కరోనా వేక్సిన్ వేసే సమయంలో వైద్య ఆరోగ్యశాఖ నుంచి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయాలి తప్పితే భారం మొత్తం మాపై వేస్తే తాము ఎలా విధులు నిర్వహించగలని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖలకు మూడు నెలల పాటు పనిగంటలు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నా తమకు మాత్రం అమలు చేయలేదన్నారు. అలాంటి సమయంలో విధులు నిర్వహించినా ఇపుడు భారం బెదిరింపులు, అధనపు పనిగంటల ఉద్యోగం చేయాల్సి వస్తుందని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో సచివాలయ ఉద్యోగుల ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేక వచ్చే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Tadepalle

2021-06-20 02:37:14

సామాన్యులకు చేరువగా శ్రీవారి సేవలు..

శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంలో రెండేళ్లుగా అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌ని టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి అధ్య‌క్షులు వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశంతో సామాన్య భ‌క్తుల‌కు మెరుగైన సేవ‌లు అందించ‌డంతోపాటు, కాశ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు పెద్ద ఎత్తున హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించామ‌న్నారు. రెండేళ్లుగా స్వామిసేవ, భ‌క్తుల సేవ చేసుకోవ‌డానికి అదృష్టం క‌ల్పించిన శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి, ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి ధ‌న్య‌వాదాలు తెలిపిన‌ట్టు చెప్పారు. టిటిడి వ‌ద్ద నిల్వ ఉన్న ర‌ద్ద‌యిన నోట్ల మార్పిడి అంశం భ‌క్తుల మ‌నోభావాల‌తో ముడిప‌డి ఉంద‌ని,  ఈ నోట్ల మార్పిడికి అనుమ‌తించాల‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను తాను 4సార్లు వ్య‌క్తిగ‌తంగా క‌లిసి విజ్ఞ‌ప్తి చేశానన్నారు. రిజ‌ర్వు బ్యాంకును కూడా అనేక సార్లు సంప్ర‌దించామ‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంపై నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం శ‌నివారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాల‌తోపాటు రెండేళ్ల‌లో త‌మ ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తీసుకున్న నిర్ణ‌యాలు, అమ‌లుచేసిన కార్య‌క్ర‌మాల‌ను చైర్మన్ ప‌లువురు బోర్డు స‌భ్యులు, ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డితో క‌లిసి మీడియాకు వివ‌రించారు. 

- ముఖ్య‌మంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కు సామాన్య భ‌క్తుల‌కు త్వ‌రిత‌గ‌తిన ద‌ర్శ‌నం క‌ల్పించ‌డానికి ఎల్‌1, ఎల్‌2 ద‌ర్శ‌నాలు ర‌ద్దు.

- తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడ‌డంలో భాగంగా ప్లాస్టిక్ బాటిళ్ల నిషేధం. ఏడాదిగా సంపూర్ణంగా అమ‌లు.

- ప్ర‌పంచ ప్ర‌జ‌లను కోవిడ్ బారి నుంచి కాపాడాల‌ని శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామివారిని ప్రార్థిస్తూ గ‌త 15 నెల‌లుగా అనేక ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాం. వీటిలో కొన్ని నేటికీ కొన‌సాగుతున్నాయి. శ్రీ‌వారి ఆశీస్సులతో త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లంతా క‌రోనా మీద విజ‌యం సాధిస్తారు.

- రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి ప్రాంతాల్లో శ్రీ‌వాణి ట్ర‌స్టు నిధుల‌తో నిర్మించ‌ద‌ల‌చిన 500 ఆల‌యాలను క‌రోనా కార‌ణంగా నిర్మించ‌లేక‌పోయాం. రాబోయే ఏడాదిలో ఈ ఆల‌యాల నిర్మాణం పూర్తి చేసేలా తీర్మానం.

- హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగంగా జ‌మ్మూలో ఇటీవ‌ల భూమిపూజ చేసిన శ్రీ‌వారి ఆల‌య నిర్మాణాన్ని 18 నెల‌ల్లో పూర్తి చేసి ఉత్త‌ర భార‌త‌దేశంలో గొప్ప ఆల‌యంగా త‌యారుచేసేందుకు నిర్ణ‌యం.

- వార‌ణాశి, ముంబ‌యిలో ఏడాదిలో శ్రీ‌వారి ఆల‌యాల నిర్మాణానికి చ‌ర్య‌లు.

- గుడికో గోమాత కార్య‌క్ర‌మంలో భాగంగా తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఢిల్లీ రాష్ట్రాల్లో 100 ఆల‌యాల‌కు గోమాత‌ల‌ను అందించాం. మ‌రో 40 ఆల‌యాల‌కు కూడా అందిస్తాం. దీనివ‌ల్ల ప్ర‌జ‌లు గోసేవ చేసుకునే అవ‌కాశం క‌ల్పించిన‌ట్ట‌వుతుంది.

- తిరుమ‌ల‌లోని శ్రీ వ‌రాహ‌స్వామివారి ఆల‌యం వాకిలి, వాకిలిచ‌ట్రం, గ‌ర్భ‌గృహ ప్ర‌వేశద్వారాల‌కు వెండి తొడుగులు అమ‌ర్చేందుకు నిర్ణ‌యం.

- గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం కార్య‌క్ర‌మం కింద గ‌త 45 రోజులుగా స‌హ‌జ ఆధారిత పంట‌ల‌తో స్వామివారికి త‌యారు చేస్తున్న నైవేద్యాల కార్య‌క్ర‌మాన్ని శాశ్వ‌తంగా అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల‌తో పాటు త‌మిళ‌నాడులో ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ ద్వారా రైతుల‌ను సంసిద్ధం చేసి వారి పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు క‌ల్పిస్తాం.

- మూడు నెల‌ల్లోపు ఎస్వీబీసీ క‌న్న‌డ‌, హిందీ ఛాన‌ళ్ల ప్ర‌సారాలు ప్రారంభించాల‌ని నిర్ణ‌యం.

- దేశ‌వ్యాప్తంగా అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో దేవాల‌యాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా నిధులు అందిస్తాం.

- తిరుప‌తి, తిరుచానూరులో నివ‌సిస్తున్న అర్హ‌త గ‌ల హెచ్‌డిపిపి పెన్ష‌న‌ర్ల‌కు(ప‌ర్య‌వేక్ష‌క మ‌రియు నాన్‌-ప‌ర్య‌వేక్ష‌క‌) ఇత‌ర తితిదే పెన్ష‌న‌ర్ల త‌ర‌హాలోనే పుణ్య‌క్షేత్ర భార‌బృతి భ‌త్యం రూ.500/- నుండి రూ.700/-కు పెంచేందుకు ఆమోదం.

- టిటిడిలో తాత్కాలిక ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌ను రెగ్యుల‌రైజ్ చేయ‌డానికి ఇదివ‌ర‌కే క‌మిటీని నియ‌మించాం. ఈ క‌మిటీ విధి విధానాల‌తో మూడు నెల‌ల్లో క‌మిటీ నివేదిక అందిస్తుంది. ముఖ్య‌మంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో భాగంగా దీన్ని అమ‌లుచేస్తాం.

-  తిరుమ‌లలో ఉన్న అన‌ధికారిక దుకాణాలు, త‌ట్ట‌లను వారం రోజుల్లో తొల‌గిస్తాం. దుకాణ‌దారులు టిటిడి అనుమ‌తించిన వ్యాపారాలు మాత్ర‌మే చేసేలా చ‌ర్య‌లు.

- త్వ‌ర‌లో ముఖ్య‌మంత్రితో  స్విమ్స్‌, బ‌ర్డ్ ఆస్ప‌త్రుల అభివృద్ధి ప‌నుల‌తో పాటు చిన్న‌పిల్ల‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రి శంకుస్థాప‌న‌, తిరుమ‌ల‌లో కొత్త‌గా నిర్మించిన బూందీ పోటు ప్రారంభోత్స‌వం.

- రాష్ట్రంలో కొత్త‌గా 13 క‌ల్యాణ‌మండ‌పాల నిర్మాణానికి ఆమోదం.

- తిరుమ‌ల‌లోని హ‌నుమంతుని జ‌న్మ‌స్థ‌లాన్ని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యం. ఈ అంశంపై ఇక మీద‌ట ఎలాంటి వివాదాల‌కు తావు ఇవ్వ‌రాద‌ని తీర్మానం.

- తిరుప‌తిలో ట్రాఫిక్ స‌మ‌స్య శాశ్వ‌త ప‌రిష్కారం కోసం ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి విజ్ఞ‌ప్తి మేర‌కు ప్ర‌స్తుతం ఆగిన చోట నుండి అలిపిరి వ‌ర‌కు గ‌రుడ వార‌ధి నిర్మాణానికి ఆమోదం. టిటిడి నిధుల‌తో ఈ వార‌ధి నిర్మాణానికి త్వ‌ర‌లో టెండ‌ర్లు పిలవాల‌ని నిర్ణ‌యం.

- కోవిడ్ ప‌రిస్థితుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించి, త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ శ్రీ‌వారి ద‌ర్శ‌న టికెట్ల సంఖ్య పెంచాల‌ని నిర్ణ‌యం.

- తిరుమ‌లను గ్రీన్‌హిల్స్‌గా ప్ర‌క‌టించినందున‌ ఉచిత బ‌స్సుల స్థానంలో  త్వ‌ర‌లో విద్యుత్ బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యం. ఆర్టిసి కూడా ఇందుకోసం 100 విద్యుత్ బ‌స్సులు కొనుగోలుకు ముఖ్య‌మంత్రి శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అనుమ‌తించారు. తిరుప‌తి - తిరుమ‌ల మ‌ధ్య న‌డిచే ప్ర‌యివేటు ట్యాక్సీల య‌జ‌మానులు టిటిడిని సంప్ర‌దిస్తే బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించి విద్యుత్ వాహ‌నాలు కొనుగోలు చేయించాల‌ని నిర్ణ‌యం.

Tirumala

2021-06-19 12:50:02

ఏపీలో ఇంటర్ విద్యకు మహర్ధశ..

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ విద్యకు చాలా ఏళ్ల తరువాత మహర్ధశ పట్టబోతుంది.. ఇప్పటివరకూ విద్యార్ధులకు నాణ్యమైన విద్యకోసం క్రుషిచేసిన అధికారులు బోర్డుకి లేకుండా పోయారు. దీనితో ఇంటర్ విద్య రాష్ట్రంలో అంతంత మాత్రంగానే సాగింది. ఏపీలోని ఇంటర్ విద్య దేశానికే ఆదర్శం కావాలన్నా, ప్రైవేటు విద్యకు ధీటుగా ప్రభుత్వ కాలేజీల్లో అందాలన్నా ఈ బోర్డులోని ఉన్నతాధికారులు కీలకంగా వ్యవహరిస్తే తప్పా అదిజరగదు. దానికోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం డేరింగ్ అండ్ డేషింగ్  సీనియర్ ఐఏఎస్ అధికారి డా.పోలాభాస్కర్ ను రంగంలోకి దించింది. ఈయన ఇంటర్ బోర్డుకి కమిషనర్, డైరెక్టర్ టెక్నకల్ ఎడ్యుకేషన్ గా చేరిన వెంటనే బోర్డు ద్వారా శాస్వత అభివ్రుద్ధికి, ప్రక్షాలనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా రీజియన్ కేంద్రాలు, వాటి కింద వున్న ఇంటర్ కాలేజీలు, సదుపాయాలు, విద్యావ్యవస్థ, ఆన్ లైన్ విద్య, ఇలా అన్ని విషయాలపై ఒకేసారి ద్రుష్టి కేంద్రీకరించారు. దీనితో ఇంటర్ బోర్డులో ఎన్నడూ రానంతగా చురుకుదనం, కొత్త కొత్త విధానాలు అమలవుతున్నాయి. కరోనా సమయంలో ఇంటర్ విద్యార్ధులు నాణ్యమైన విద్యకు దూరమయ్యారు. మళ్లీ విద్యార్ధులకు ఆ స్థాయిలో విద్య అందించాలంటే ఇంటర్ బోర్డులో కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్పా విద్యార్ధుల భవిష్యత్తుకి బాటలు వేయలేమని ప్రభుత్వం భావించి ఆ దిశగా తన దైన స్టైల్ లో కార్యాచరణ తో ద్రుష్టిని కేంద్రీకరించారు.  ఈ ఉన్నతాధికారి విధుల్లోకి చేరుతూనే కరోనా సమయంలో ఆన్ లైన్ విద్య విద్యార్ధులకు సక్రమంగా జరగడం లేదనే విషయాన్ని పసిగట్టారు. వెంటనే రీజనల్ కార్యాలయాల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోవడంతోపాటు సదుపాయాలు, సిబ్బందికొరత, భవనాలు, విద్యావిధానం ఇలా అన్ని అంశాలను గాడిలోపెట్టడానికి కార్యాచరణ రూపొందించారు. ఇంటర్ బోర్టు కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వచ్చే ఫలితాలు ఎలావుంటాయో ఈయన జిల్లా కలెక్టర్ గా చేసిన జిల్లాల్లో ఇప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధుల నెమరు వేస్తూనే వుంటారు. 
ఇంటర్ బోర్డుకి కమిషనర్ పోలాభాస్కర్ పుణ్యమాని విద్యార్ధుల విద్యావిధానం, నాణ్యమైన విద్య, కళాశాలల్లో మరింతగా అభివ్రుద్ధి చెందుతాయని అన్ని వర్గాల్లో ఆశలు చిగురించాయి..!

Tadepalle

2021-06-19 02:17:01

రూ.267.08 కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్లు..

కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశముందన్న నిపుణులు సూచనలను దృష్టిలో పెట్టుకుని 12,187 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు కొనుగోలు చేసినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకూ  4,175 కాన్సంట్రేటర్లు.. ఇప్పటికే వచ్చాయని, మిగిలిన 8 వేలు ఈ నెలాఖరుకు రాష్ట్రానికి రానున్నాయన్నారు. ఈ నెల 24వ తేదీన 10 వేల డి టైప్‌ సిలెండర్లు రానున్నాయన్నారు. 50 బెడ్లు, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ సదుపాయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రూ.267.08 కోట్లతో వ్యయంతో ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ బెడ్లు, డీజీ సెట్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 28 లోకేషన్లలో ఆక్సిజన్ ప్లాంట్లు(పీఎస్ఏ)  కేంద్రం మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 113 లోకేషన్లలో ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయనుందన్నారు. 113 పీఎస్ఏ ప్లాంట్ల కోసం ఇప్పటికే టెండర్లు ఖరారు చేశామని, ఇందుకోసం 111.65 కోట్లు వ్యయమవుతోందని తెలిపారు. ఈ ప్లాంట్లు ఆగస్టు నెలాఖరుకు అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో గుర్తించిన మూడు లోకేషన్లలో లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. 100 పడకలు పైనున్న 39 ఆసుపత్రుల్లో అదనంగా 10 కిలో లీటర్ల ఆక్సిజన్‌ ట్యాంకులను కూడా లిక్విడ్ ఆక్సిజన్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. నెలన్నర రోజుల్లో ఈ స్టోరేజ్ అందుబాటులోకి రావాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. రూ. 49.31 కోట్లతో అన్ని జిల్లాల్లో 6,151 అదనపు ఆక్సిజన్ బెడ్లను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారన్నారు. డీజీ సెట్లకు రూ.36 కోట్లు, ట్రాన్స్ ఫార్మర్లకు రూ.58 కోట్లు వ్యయం కానున్నాయన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ బెడ్లు, డీజీ సెట్లు, ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటుకు రూ.267.08 కోట్లతో వ్యయంతో చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Tadepalle

2021-06-18 14:58:36

ధాన్యం కోసం రూ.1637 కోట్లు చెల్లింపు..

రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు ద్వారా రైతుల నుండి రబీ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకూ రూ. 1637కోట్లు రాష్ట్ర పౌరసరఫరాల సంస్ధ ద్వారా చెల్లించామని  పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీసియో కార్యదర్శి, ఆశాఖ కమీషనర్ కోన శశిధర్ వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం అమరావతి సచివాలయ  ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రతి ధాన్యం కొనుగోలు సీజన్ కు ముందు కేంద్ర ప్రభుత్వం నుండి ముందస్తుగా నిధులు విడుదల అవుతుంటాయని కాని ఈసారి నిధులు విడుదలలో జాప్యం జరిగిందని పేర్కొన్నారు.అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1637 కోట్ల రూ.లను పౌరసరఫరాల సంస్థ తీసుకుని రైతులకు చెల్లించడమైందని తెలిపారు.కేంద్రం నుండి 3వేల 299కోట్ల రూ.లు విడుదల కావాల్సి ఉండగా వాటిలో ఈనెల 21వ తేదీన మొదటి త్రైమాసికానికి సంబంధించి 1200 కోట్ల రూ.లను విడుదల చేయనున్నట్టు కేంద్రం నుండి సమాచారం అందిందని శశిధర్ పేర్కొన్నారు.కేంద్ర నిధులు వచ్చేలోగా ధాన్యం అమ్మిన రైతులు ఇబ్బందులు పడకూడదని ముఖ్యమంత్రి  మరో 500కోట్ల రూ.లను విడుదల చేయగా గత రెండు రోజుల్లో 300కోట్ల రూ.లను రైతులకు చెల్లించగా శనివారం నుండి రోజుకు 200కోట్ల రూ.లను చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ధాన్యం అమ్మి 21 రోజులు దాటినా సొమ్మి చెల్లించాల్సిన బకాయిలు 1619కోట్ల రూ.లు ఉన్నాయని వాటిని ఈనెల 21న కేంద్రం నుండి నిధులు రాగానే చెల్లించడం జరుగుతుందని స్పష్టం చేశారు.గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు 996కోట్ల రూ.లను కూడా రైతులకు చెల్లించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోందని కోన శశిధర్ పేర్కొన్నారు. కాగా గత యేడాది రబీలో 6వేల 331కోట్ల రూ.లతో 34లక్షల 73వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈయేడాది సుమారు 8వేల కోట్లతో 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటికే 28లక్షల 35వేల 447 మెట్రిక్ టన్నులు కొన్నామని చెప్పారు.కరోనా,తుఫాను,ఆకాల వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని అధికమించి రైతుల నుండి రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ఇఓ సెక్రటరీ శశిధర్ పేర్కొన్నారు.మెట్ట ప్రాంతాల నుండి తడిసిన ధాన్యాన్ని కూడా కొంటున్నామని,అంతేగాక అనంతపురం,కడప వంటి రాయలసీమ జిల్లాల నుండి కూడా ధాన్యాన్ని కొంటున్నామని చెప్పారు.అనంతపురం జిల్లా నుండి 16వేల 247 మెట్రిక్ టన్నులు,కడప జిల్లా నుండి 11వేల మెట్రిక్ టన్నులు కొన్నామని చెప్పారు.  రైతులెవ్వరూ దళారులు,మిల్లర్లకు తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని రైతు భరోసా కేంద్రాలల్లోనే విక్రయించుకోవాలని ఆయన విజ్ణప్తి చేశారు. ఈసమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్యకుమారి పాల్గొన్నారు.

Tadepalle

2021-06-18 14:13:20

ఇ-క్రాప్ బుకింగ్ తో దళారులకు చెక్..

ఇ-క్రాప్ బుకింగ్,ప్రీఆడిట్ విధానంతో పంట పండించిన నిజమైన రైతులను గుర్తించాకే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి సొమ్ము జమ చేయనున్నామని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీసియో కార్యదర్శి, ఆశాఖ కమీషనర్ కోన శశిధర్ చెప్పారు. ఈమేరకు శుక్రవారం అమరావతి సచివాలయ  ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఇ-క్రాప్ బుకింగ్ విధానం వెబ్ ల్యాండ్ కే పరిమితమై ఉండేదని కాని నేడు ఫ్రీ ఆడిట్ విధానాన్ని కూడా తీసుకురావడంతో ధాన్యం అమ్మింది రైతా,కౌలు రైతా లేక మిల్లరా లేక దళారా అనేది వారి బ్యాంకు ఖాతా,ఆధార్ వంటి పూర్తి వివరాలను పరిశీలించి రైతేనని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వారి ఖాతాలకు సొమ్ము జమచేయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.గతంలో రైతు పేరిట దళారులు,ఇతర రాష్ట్రాలకు చెందిన వారి బ్యాంకు ఖాతాలను ఇచ్చి సొమ్ము పొందే ప్రయత్నం జరిగేదని ఫ్రీ ఆడిట్ విధానంతో అలాంటి వాటిని పూర్తిగా నివారించగలుగుతున్నామని శశిధర్ స్పష్టం చేశారు.ఈసమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఎండి సూర్యకుమారి పాల్గొన్నారు.

Tadepalle

2021-06-18 13:37:01

సచివాలయ నిర్వీర్యానికి భారీ కుట్ర..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సీనియర్ ఐఏఎస్ లు విచక్షణా రహితంగా జారీచేసిన జీఓల కారణంగా దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొదించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే భారీ కుట్ర తెరవెనుక జరుగుతోందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. జిఓ-2 ను జారీచేయడం దానిపై కొందరు హైకోర్టుకి వెళ్లడం..అక్కడ కోర్టు పంచాయతీలు ఉండగా..సచివాలయాలెందుకు అని తీవ్రంగా ప్రశ్నించడం చూస్తేంటే కావాలనే సచివాలయ వ్యవస్థను కోర్టుకీడ్చి దానిపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అవగత మవుతుంది. ప్రభుత్వం జారీ చేసిన జీఓనెంబరు 2 కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న 150003 గ్రామ, వార్డు సచివాలయాల్లోని కార్యదర్శిలు కేవలం ఇంటర్మీడియట్ అర్హతతో డిడిఓలుగా వీఆర్వోల వద్ద డిగ్రీలు, పీజీలు చదువుకున్న గ్రామ కార్యదర్శిలు పనిచేయడానికి సిద్దంగా లేరనే విషయం బహిర్గతమైపోయి ఆందోళనలు చేస్తున్నారు. అందులోనూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీఓలు 110, 149కి విరుద్ధంగా వచ్చిన ఈ జీఓ నెంబరు2ని అడ్డం పెట్టుకొని పంచాయతీల్లోని సర్పంచ్ లను, పంచాయతీ కార్యదర్శిలను రెచ్చగొట్టి వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చి గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత తీసుకు రవాలని చూస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శిలు సామాజిక మాద్యమాల్లో తమ నిరశనను తెలియజేయడం,  ఎంపీడీఓలకు, డీపీఓలకు తమ అధికారాలపై క్లారిటీ ఇవ్వాలని అర్జీలు చేయడం ముమ్మరం చేస్తున్నారు. 

ఇదే విషయమై గుంటూరు జిల్లాకి చెందిన ఒక సర్పంచి హైకోర్టును ఆశ్రయించడం...అక్కడ ప్రభుత్వానికి, గ్రామసచివాలయ వ్యవస్థకు వ్యతిరేకంగా హైకోర్టు వ్యాఖ్యానించడం చూస్తుంటే.. కేవలం ఒక్క జీఓనెంబరు 2ని అడ్డం పెట్టుకొని, సచివాలయ కార్యదర్శిల నిరసనను సాకుగా చూపి భారీ కుట్రకు తెరతీశారని  విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి జిఓ నెంబరు-2 రద్దుకోరుతూ, తమ అధికారాలు లాగేసుకోవద్దని మాత్రమే బాధితులు కోర్టుకి వెళ్లినా దానిని తమకు అనుకూలంగా మార్చుకుని ఆంధ్రప్రదేశ్ లో ఎంతో ప్రజాధారణ పొందిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగుల ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావడం కోసం తెరవెనుక జరుగుతున్న కుట్రపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జీఓ నెంబరు-2,  73వ రాజ్యాంగ సవరణకు, పంచాయతీరాజ్ చట్టానికి విరుద్దంగా ఉందని కేవలం దానిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తే ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగుల్లో నిరసన మంట పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే..ప్రజలు కూడా ప్రభుత్వ చర్యలపై విమర్శలు చేస్తారనే కోణంలోనే వ్యూహ రచన చేస్తున్నారని తెలుస్తోంది. 

చాలా కాలం తరువాత పంచాయతీ సర్పంచ్ లకు అధికారాలు వచ్చినా అవి అతి తక్కువ అర్హత వున్న వీఆర్వోలకి పంచాయతీలపై డిడిఓగా పెత్తనం ఇవ్వడం ద్వారా డిగ్రీ చదివిన ఉద్యోగులు, చాలాచోట్ల ఎక్కువ చదువు చదువు చదువుకున్న సర్పంచ్ ల మనోభావాలు దెబ్బతింటున్నాయనే కోణంలోనూ వ్యతిరేక ప్రచారం జరుగుతున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వంలోని ఐఏఎస్ లు గ్రామ స్థాయిలో వీర్వోలను, మండల స్థాయిలో తహశీల్దార్ లను, డివిజన్ స్థాయిలో ఆర్డీఓలను, జిల్లా స్థాయిలో కలెక్టర్లను బాస్ లను చేయడం ద్వారా ఒక ప్రత్యేక రెవిన్యూ వ్యస్థను తయారు చేయాలనే ఉద్దశ్యంతో ఆలోచిస్తే.. అది మొదటికే ముసలాన్ని తెచ్చిపెట్టింది. ప్రభుత్వ పరిపాలకు సౌలభ్యంగా వుంటుందనుకున్న జీఓ నెంబరు 2 ఇపుడు ప్రభుత్వమే హైకోర్టులో తమ సంజాయిషీ చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చింది. అలాగని ప్రభుత్వంలోని ఐఏఎస్ లు కూడా గతంలో జారీచేసిన జీఓ నెంబరు 110, 149 జీఓలను అమలు చేయకపోవడం, తమకు అధికారాలు కట్టబెట్టకపోవడాన్ని రాష్ట్రవ్యాప్తంగా వున్న పంచాయతీ కార్యదర్శిలు వ్యతిరేకిస్తున్నారు. 

ప్రభుత్వం ఇచ్చిన జీఓలను ప్రభుత్వమే అమలు చేయకుండా వాటికి వ్యతిరేకంగా మళ్లీ కొత్తగా జీఓలు ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శిల నిరసన, వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక వర్గం ఇదే అదునుగా చేసుకొని సచివాలయ వ్యవస్థపై కుట్రచేస్తే అటు ప్రభుత్వ నిర్ణయాలపై తప్పుచూపి, పంచాయతీ కార్యదర్శిల నుంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నట్టుగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా జీఓనెంబరు 2పై హైకోర్టులో వచ్చిన తీర్పు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ పంచాయతీ కార్యదర్శిలు, సచివాలయ కార్యదర్శిలు కార్యాచరణ ఉండబోతుందనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏం జరుగుతుందనేది హై కోర్టు తీర్పుని బట్టి ఆధారపడి వుంటుంది. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా జీఓ నెంబరు2 పై కీలక నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా  పంచాయతీ కార్యదర్శిల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలే మెండుగా వున్నాయి..!

Tadepalli

2021-06-18 01:44:02

ఎన్ఈపీ విజయవంతం అందరి బాధ్యత..

రాష్ట్రంలో అమలు చేయనున్న జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉపాధ్యాయులపైనా ఉందని రాష్ట్ర ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సచివాలయంలో జాతీయ విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం చేయాలన్నది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. ఎన్నికలకు ముందే ఢిల్లీలో పర్యటించి, అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేశామన్నారు. కనీస మౌలిక సదుపాయాలు, క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు లేని ప్రైవేటు పాఠశాలలో అప్పో సప్పో చేసి తమ పిల్లలను తల్లిదండ్రులు చేర్చుతున్నారన్నారు. ఇవన్నీ గమనించే... జాతీయ విద్యా విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా విద్యా వ్యవస్థలో సంస్కరణలకు సీఎం జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుడుతున్నారన్నారు. దీర్ఘకాలిక విజన్ తో సీఎం ముందుకు సాగుతున్నారన్నారు. జాతీయ విద్యా విధానం అమలులో ఉపాధ్యాయుల అభిప్రాయాల మేరకే నిర్ణయం తీసుకుంటామని, రాష్ట్ర ఏకపక్షంగా వ్యవహరించదని తెలిపారు. ఏ చిన్న సమస్య వచ్చినా ఉపాధ్యాయుల తనను సంప్రందించొచ్చునన్నారు. జాతీయ విద్యా విధానంపై తీసుకునే నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ సంఘాలకు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేష్ కు సూచించారు.


ఎన్ఈపీని స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాలు.. 
అంతకుముందు అన్ని సంఘాల ఉపాధ్యాయ సంఘాల నేతల అభిప్రాయాలను మంత్రి ఆదిమూలపు సురేష్ తెలుసుకున్నారు. అన్ని సంఘాల నేతలూ జాతీయ విద్యా విధానాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నాడు – నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక పథకాలతో పాటు రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరదృష్టిని కొనియాడారు. జాతీయ విద్యా విధానం అమలులో ఎదురయ్యే సమస్యలను మంత్రి, విద్యాశాఖాధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఉపాధ్యాయుల సమస్యలపై వినతలను మంత్రి, ప్రభుత్వ సలహాదారుకు అందజేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా డైరెక్టర్ చినవీరభద్రుడు, ఇతర విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. 

Tadepalle

2021-06-17 15:46:10

ఒక్క ఉపాధ్యాయ పోస్టు రద్దు కాదు..

రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020(ఎన్ఈపీ) అమలులో భాగంగా జాతీయ విద్యా విధానంలో అపోహాలను నమ్మొద్డని, ఏ ఒక్క పాఠశాల మూతపడదని, ఏ ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా రద్దు కాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి జాతీయ విద్యా విధానం 2020 అమలు చేయనున్నామని, ఈ విప్లవాత్మక సంస్కరణలను విజయవంతం చేసే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. కొవిడ్ తో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. పాఠశాలలకు క్రీడా మైదానాలు లేనిచోట్ల భూములు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సచివాలయంలో జాతీయ విద్యా విధానంపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయ సేకరణ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ, మేనమామగా పిల్లలకు తానిచ్చే ఆస్తి చదువేనంటూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టాలని సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారన్నారు. నాడు-నేడు, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ఈ పథకాలన్నీ దేశానికే మార్గదర్శకంగా నిలిచాయన్నారు. నాణ్యమైన విద్య, నాణ్యమైన బోధన, నాణ్యమైన మౌలిక సదుపాయల కల్పనకు జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా 5+3+3+4 విద్యా విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు.  పూర్వ ప్రాథమిక విద్యతో పాటు ఒకటి రెండు తరగతులు ప్రాథమిక విద్యలో, 3,4,5 తరగతులతో పాటు ఇంటర్మీడియట్ ను ఉన్నత విద్యలో చేర్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. దీనిపై ఉపాధ్యా సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. జాతీయ విద్యా విధానంపై ఎటువంటి అపోహలు నమ్మొద్దని కోరారు. ఏ ఒక్క పాఠశాల మూతపడదని, ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా రద్దు కాబోదని భరోసా ఇచ్చారు. ఏ అనుమానం ఉన్నా పరిష్కరిస్తామన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించానికి సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కృషికి ఉపాధ్యాయులంతా సహకరించాలని కోరారు. నాడు – నేడు పనుల్లో భాగంగా క్రీడా మైదానాలు లేని పాఠశాలలు గుర్తించి భూములు కొనుగోలు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. విద్యార్థుల్లో క్రీడల ప్రోత్సాహాకానికి స్పోర్ట్సు కిట్ అందజేయనున్నామన్నారు. మూడో విడత జగనన్న విద్యా కానుకలో అందజేసే ఈ కిట్ ద్వారా స్పోర్ట్సు షూస్, డ్రెస్ ఇవ్వనున్నామన్నారు. కొవిడ్ కారణంగా ఉపాధ్యాయులు మృతి చెందడం బాధాకరమని, వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. 

Tadepalle

2021-06-17 15:43:27

sc,bc కుటుంబాలకు రాయితీ రుణాలు..

క‌రోనా వైరస్ కారణంగా కుటుంబంలో పెద్ద దిక్కు కోల్పోయిన బీసీ, ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కుటుంబాలకు  ప్ర‌భుత్వం రూ.5 ల‌క్ష‌ల రుణ స‌దుపాయం క‌ల్పిస్తూ నిర్ణ‌యం తీసుకుంద‌ని ఎస్సీకార్పోరేషన్ ఎండి అండ్ విసి నవ్య ఒక  ప్ర‌ట‌న‌లో తెలియజేశారు. ఈ మేర‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బాధితుల‌ను గుర్తించి చ‌ర్య‌లు తీసుకోవాలని అన్ని జిల్లాల ఎస్సీకార్పోరేషన్ ఈడీలకు వర్తమానం పంపారు.  క్షేత్ర స్థాయిలో ఎవ‌రైనా ఎస్సీ, బిసి సామాజిక వ‌ర్గానికి చెందిన ఇంటి పెద్ద మ‌ర‌ణించి.. జీవ‌నాధారం కోల్పోయిన కుటుంబాలు ఉంటే గుర్తించాలని మున్సిపాలిటీల‌ు, మండ‌లాల‌ అధికారుల‌ను ఆదేశించినట్టు పేర్కొన్ారు. ప్ర‌భుత్వం నేష‌న‌ల్ షెడ్యూల్డ్ ఫైనాన్స్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పోరేష‌న్ (ఎన్‌.ఎస్‌.ఎఫ్‌.డి.సి.) ద్వారా అందించే ఈ రుణంలో రూ.1 ల‌క్ష వ‌ర‌కు రాయితీ ఉంటుంద‌ని, మిగిలిన రూ.4 ల‌క్ష‌ల‌ను వాయిదాల్లో ల‌బ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీ లోపు బాధిత కుటుంబ స‌భ్యులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించారు. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకొనే అవ‌కాశం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆమె స్ప‌ష్టం చేశారు. బాధిత కుటుంబ స‌భ్యుల‌కు త‌గిన స‌హాయ స‌హాకారాలు అందించాల‌ని ఎస్సీకార్పోరేషన్ ఎండి అండ్ విసి నవ్య ఆ ప్రకటనలో కోరారు.

అర్హ‌తలు.. ఇత‌ర ప్ర‌క్రియ‌ ఈ విధంగా ఉండాలి..

@కోవిడ్ కారణంగా కుటుంభ పెద్ద మరణించి ఉండాలి

@వయస్సు 18 నుండి 60 సంవత్సరాలు ఉండాలి

@యస్సీ, బీసీ సామాజిక వర్గం అయి ఉండాలి

@వార్షిక ఆదారం 3లక్షలు మించరాదు

@తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి

@అర్హతగల దృవీకరణ పత్రాలతో మీ మండల పరిషత్ అభివృద్ధి అదికారి/మన్సిపల్ కమీషనర్ ను కలవండి.

తాడేపల్లి

2021-06-17 02:56:26

సచివాలయానికే మచ్చ తెచ్చిన జీఓ..

భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రభుత్వం విడుదల చేసిన జీఓనెంబరు 2 మాయని మచ్చలా ఏర్పడి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున పంచాయతీ కార్యదర్శిల నిరసనకు కారణమైంది. ప్రభుత్వం విడుదల చేసి జిఓ నెంబరు 110, 149లను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ఇపుడు వాటికి విరుద్ధంగా జీఓనెంబరు2 విడుదల చేయడం వలన రాష్ట్రవ్యాప్తంగా వున్న 15003 సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శిలు ప్రభుత్వంపై గుర్రుగా మారడానికి ప్రధాన కారణమైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు సచివాలయ వ్యవస్థను మెచ్చుకొని వారి రాష్ట్రాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని భావించిన తరుణంతో జీఓ నెంబరు-2,  73వ రాజ్యాంగ సవరణకు, పంచాయతీరాజ్ చట్టానికి విరుద్దంగా ఉందని.. ఆంధ్రప్రదేశ్ హై కోర్టు అసలు సచివాలయ వ్యవస్థే దండగ అని వ్యాఖ్యానించేలా చేసిందంటే ఇంతకంటే చెడ్డపేరు మరొకటి లేదనే వాదన తీవ్రస్థాయిలో వ్యక్తమవుతోంది.. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయిలో రెవిన్యూ వ్యవస్థను కీలకం చేయాలని భావించి గ్రామ, వార్డు సచివాలయాల్లో డిడిఓలుగా వీఆర్వోలను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓ 2  వలన ఇపుడు కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఎదురైంది. ఈ జీఓ విడుదల సమయంలోనే డిగ్రీ చదివి కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చిన సచివాలయ ఉద్యోగులు ఇంటర్ మాత్రమే పాసైన వీఆర్వోల వద్ద పనిచేయడం ఇబ్బందిగా ఫీలవుతున్నారనే విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారి మొబైల్ యాప్ ఈఎన్ఎస్ లైవ్ ద్వారా తెలియజేసింది. అదే విషయాన్ని ఇపుడు రాష్ట్ర హైకోర్టు కూడా ఈ జీఓ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చర్చనీయాంశం అయ్యింది. ఆది నుంచి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో జరుగుతున్న అభివ్రుద్ధిని, లోపాలను ప్రజల ముందుంచే ఈఎన్ఎస్ చెప్పినట్టుగా అన్ని జరుగుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులోనూ మొన్నటి వరకూ గ్రామస్థాయిలో పదవ తరగతి, ఇంటర్ విద్యార్హతతో వీఆర్ఏ లుగా వున్న వారిని ఖాళీలును భర్తీ చేయడానికి ప్రభుత్వం వారికి ప్రమోషన్లు కల్పించి వీఆర్వోలను చేసింది. ఆపై వెంటనే జీఓ 2 ఇవ్వడంతో డిడిఓగా వీఆర్వోలు మారిపోయారు..దీనితో అప్పటి వరకూ పంచాయతీలను పరిపాలిస్తున్న కార్యదర్శిలు, సర్పంచ్ ల మనోభావాలు ఒక్కసారిగా దెబ్బతిన్నాయి. దీనితో గుంటూరు జిల్లాకి చెందిన సర్పంచ్ క్రిష్ణమోహన్ హైకోర్టులో వాజ్యం వేయడంతో వాదనలు విన్న హైకోర్టు అసలు పంచాయతీలు ఉండగా ఇక సచివాలయాలు ఎందుకున్న అని ప్రశ్నించడం, కార్యదర్శిలు హక్కులు, అధికారాలు లాగేస్తారని అని ప్రభుత్వ జీపీని ప్రశ్నించడం..అది కాస్తా పతాక శీర్షిక మీడియాలో రావడంతో సచివాలయ వ్యవస్థ ఆదిలోనే కనుమరుగ వుతుందనే భయాన్ని కూడా కలుగ జేసింది.  అటు గతంలో నుంచి పంచాయతీ కార్యదర్శిలుగా ఉన్నవారు కూడా తమ ఆందోళనలు పెద్ద ఎత్తున చేపట్టడంతో...ప్రభుత్వం మొన్నటికి మొన్న ఉద్యోగుల జీతాల పేరుతో రెండు నెలలు డిడిఓలుగా పంచాయతీ కార్యదర్శిలే ఉంటారు..అదీ కూడా ఉద్యోగుల జీతాలకు సమస్యలు వాటిల్ల కూడదని ఓ మెట్టు దిగి జీఓ2 కి ప్రత్యామ్నాయ ఉత్తర్వులు జారీచేసింది. ఆపై ఇపుడు కోర్డులో జీఓ2పై వాదనలు జరగడం, ప్రభుత్వం నుంచి కోర్టుకి సరైన వివరణ లేకపోవడంతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసిన ఏడాదిన్నరకే పురిటి కష్టాలు మొదలైనట్టు అయ్యింది. వాస్తవానికి ఒక ప్రభుత్వ శాఖలో ఏదైనా జీఓ జారీచేసే సమయంలో ఆటుపోట్లను, రాజ్యాంగ సవరణలను, గతంలో ఇచ్చిన జీఓల అమలను అన్నింటినీ బేరీజు వేసుకొని కొత్త జీఓలు జారీ చేస్తారు. అలాకాకుండా పంచాయతీలకు, గ్రామసచివాలయాలకు డిడిఓలుగా వీఆర్వోలను చేస్తూ వచ్చిన ఈ జిఓ విషయంలో పెద్ద రచ్చే జరిగి చివరకి ప్రభుత్వంపై సచివాలయ ఉద్యోగులు కోపం పెంచుకునేలా చేశాయి. సచివాలయ వ్యవస్థపై ఆదిలోనే మచ్చపడేలా చేశాయి. ఈ క్రమంలో కోర్టులో పెండింగ్ లో వున్న తీర్పు ఏ విధంగా వస్తుందనేది ఆశక్తి కరంగా మారింది..!

Tadepalli

2021-06-17 02:10:49

గ్రూప్-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే..

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై  స్టే విధించింది.. ఇంటర్వ్యూను నాలుగు వారాలపాటు నిర్వహించకూడదని న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్‌ విధానంలో వాల్యుయేషన్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్‌ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉండగా హైకోర్టు తీర్పుతో వాయిదా పడింది. నాలుగు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఏపీ ప‌బ్లిక్ క‌మిష‌న్‌ను ఆదేశించింది.  కాగా గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం పరీక్షలు జరగలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్‌ వాల్యూయేషన్‌ గురించి చివరి దశలో చెప్పారన్నారు. అయితే నిబంధనల ప్రకారమే గ్రూప్‌-1 పరీక్షలు జరిగాయని, వాల్యూయేషన్‌ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున వ్యాయవాది వాదనలు హైకోర్టుకు తెలిపారు. ఇక ఇరు వాదనలు విన్న హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Tadepalle

2021-06-16 15:16:43