1 ENS Live Breaking News

జర్నలిజం విభాగాధిపతికి డా.జాన్ క్రిష్టోఫర్ అభినందనలు

ఆంధ్రయూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన డా.సిఎం.వినయ్ కుమార్ ను ఏయూ మాజీ ఫిలాసఫి ఫ్యాకల్టీ, ఇతియోపియన్ సివిల్ సర్వీసెస్ యూనివర్శిటీ మాజీ ఆచార్యులు డా.జాన్ క్రిష్టోఫర్ కొమ్మలపూడి(మహర్షి), హైకోర్టు లాయర్ సైయ్యద్ షఫీలు అభినందనలు తెలియజేశారు. బుధవారం యూని వర్శిటీలోని తన చాంబర్ లో కలిసి పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సంద్భంగా డా,క్రిష్టోఫర్ మాట్లాడుతూ, ఏయూ జర్నలిజం విభాగం మరింగా అభివృద్ధి చెందడానికి ప్రొ.వినయ్ కుమార్ సేవలు ఎంతగానో ఉపయోగపడాలని, ఎక్కువ మంది ఈ విభాగంలో పరిశోధనలు పూర్తిచేయాలని ఆకాంక్షించారు. 

Visakhapatnam

2023-01-04 06:34:56

నవోదయ ప్రవేశాల్లో ప్రభుత్వం కొత్త నిబంధనలు

నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలో విద్యార్ధినీ, విద్యార్ధులు ఆరవ తరగతిలో చేరాలనుకుంటే  ఐదో తరగతిని స్థానిక జిల్లాలోనే చదివి ఉండాలి. దీనితో పాటు విద్యార్థి, విద్యార్థి తల్లిదండ్రుల శాశ్వత చిరునామా సైతం అదే జిల్లాలో ఉండాలి. అంతేకాకుండా విద్యార్థి వయస్సు గ్యాప్ కూడా గతంతో పోలిస్తే రెండు సంవత్సరాలు తగ్గించారు. ప్రభుత్వం కొత్త నిబంధనలు చేర్చడంతో ఇపుడు విద్యార్ధుల తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కొత్త నిబంధనల వలన చాలా మంది విద్యా్ర్ధులకు దరఖాస్తు సమయంలోచిక్కులు ఎదురవుతున్నాయి.

Delhi

2023-01-04 05:28:29

పీహెచ్డీ సీట్ల కేటాయింపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన

పీహెచ్డీ, ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఆర్ సెట్ లో సీట్ల కేటాయింపుకు సంబంధించి ఆంధ్రప్ర దేశ్  రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. PhD కోర్సుల్లోని మొత్తం సీట్లలో 50 శాతం ఏ-కేటగిరీలో, 50 శా తం బీ- కేటగిరీలో కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ జీవో జారీ చేసింది. గత ఏడాది నుండి  అన్ని యూనివర్సిటీలకు కలిపి ఉన్నత విద్యామండలి ద్వారా ఏపీఆర్ సెట్ ను నిర్వహించి, అందులో అర్హ  సాధించిన వారికే సీట్లు కేటాయిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయం వలన చాలా మందికి పీహెచ్డీలు సీట్లు, ఎంఫిల్ సీట్లు లభించనున్నాయి.

Tadepalli

2023-01-04 04:13:43

జర్నలిజం విభాగాధిపతికి అభినందనల వెల్లువ

ఆంధ్రయూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతిగా బాధ్యతలు చేపట్టిన డా.సిఎం.వినయ్ కుమార్ కు విద్యార్ధులు, అద్యాయకుల నుంచి అధిక సంఖ్యంలో అభినందన వెల్లువెత్తుతోంది. మంగళవారం యూనివర్శిటీలోని తన చాంబర్ లో సీనియర్‌ ప్రొఫెసర్‌ డివిఆర్‌ మూర్తి, బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ చల్లా రామకృష్ణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి.విజయలక్ష్మి, సాఫ్ట్‌ స్కిల్స్‌ ట్రైనర్‌ డాక్టర్‌ కృష్ణవీర్‌ అభిషేక్‌ లు వినయ్ కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సాలువా, కలిసి ఘనంగా సత్కరించారు. జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్లు పాల్గొన్నారు.

Andhra University

2023-01-03 12:05:10

ఏయూ జర్నలిజం విభాగాధిపతిగా డా..వినయ్ కుమార్

ఆంధ్రయూనివర్శిటీ జర్నలిజం విభాగాధిపతిగా డా.సి.ఎమ్.వినాయ్ కుమార్ నియమితులయ్యారు. సోమవా రం ఈమేరకు ఏ.యూ ఉపకులపతి ఆచార్య పివిజిడి.ప్రాసద్ రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమెుహన్ నుంచి ఉత్తర్వులు స్వీకరించారు. ఈ సందర్బంగా వినయ్ కుమార్ ని ఉపకులపతి ప్రత్యేకంగా అభినం దించా రు అనంతరం జర్నలిజం విభాగంలో విభాగాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు డా.డివిఆర్.మూర్తి  అసోసియేట్ ప్రొఫెసర్లు చల్లా రామకృష్ణ, లిల్లీగ్రేస్, విజయ లక్ష్మి , రీసెర్చ్ స్కాలర్ లు,  అభినందనలు తెలిపారు.

Visakhapatnam

2023-01-02 12:42:15

ఎస్వీ హైస్కూల్ విద్యార్థులకు ట్యాబుల పంపిణీ

టీటీడీ  ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులకు 
టీటీడీ  విద్యాశాఖాధికారి డా.భాస్కర్ రెడ్డి సోమవారం ట్యాబ్ లు పంపిణీ చేశారు. ఈ  కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం సంధ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డిఇవో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా, డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా అర్థమయ్యేలా 8వ తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ట్యాబులు పంపిణీ  చేస్తున్నట్లు చెప్పారు. బైజూస్ కంటెంట్ తో కూడిన ఈ ట్యాబ్ ఆఫ్ లైన్ లో కూడా పనిచేసే విధంగా రూపొందించినట్లు చెప్పారు . ట్యాబులను టీటీడీ  పరిధిలోని ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు కూడా పంపిణీ చేశామన్నారు. 

Tirupati

2022-12-26 13:22:28

పాలిటెక్నిక్ లో చేరేందుకు అవగాహన కల్పించాలి

ఏజెన్సీలోని  వివిధ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులు 10వ తరగతి పాస్ అయిన వెంటనే పాలిటెక్నిక్ లో జాయిన్ అయ్యేవిధంగా  విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర పాలిటెక్నిక్ టెక్నికల్ విద్య డైరెక్టర్, రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు.  మంగళవారం రంపచోడవరం ఐటిడిఎ సమావేశపు హాలులో  అన్ని మండలాలకు సంబంధించిన మండల విద్యాశాఖ అధికారులతో ఆమె 
సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతంలోని ప్రతి ఐటీడీఏ పరిధిలో  2014 సంవత్సరంలో పాలిటెక్నిక్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు.  మన దేశం అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా సాంకేతిక విద్య ఫై యువతి యువకులు సాంకేతిక విద్య కోర్సులు  తీసుకోవాలన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో కొన్ని కోర్సులు ఏర్పాటు చేయడానికి  ప్రభుత్వం గుర్తించిందన్నారు. 

విద్యార్థులు పదో తరగతి పాస్ అయిన వెంటనే  పోలిసెట్ అప్లై చేసే విధంగా  సంబంధిత ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఏజెన్సీలోని  ప్రతి పాఠశాలలో  8వ తరగతి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు  లెక్కలు. ఫిజిక్స్ విద్యపై  దృష్టి పెట్టి విధంగా  ఉపాధ్యాయుల బోధించాలని ఆమె అన్నారు.  గవర్నమెంట్ మోడల్ సాంకేతిక రెసిడెన్షియల్  పాలిటెక్నిక్ కాలేజీలు రాష్ట్రంలో 9 ఉన్నాయన్నారు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్  భోజన వసతి సౌకర్యం ఏర్పాటు ఇక్కడు వుంటుందన్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలో 22 కోర్సులు  ఏర్పాటు చేశామన్నారు.  అదేవిధంగా 18 మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. పాలిటెక్నిక్ విద్యపై  ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు  ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వడంతోపాటు రంపచోడవరం లోని  పాలిటెక్నిక్  కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేయుటకు  కృషి చేస్తామన్నారు.  

రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే మాట్లాడుతూ ఏజెన్సీలోని  అన్ని ప్రభుత్వ పాఠశాలలలో పదో తరగతి పాస్ అయిన విద్యార్థులందరికీ సాంకేతిక విద్యపై  ముందుగా ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు, ఏజెన్సీలోని చదువుకున్న  యువతి యువకులకు  ప్రైవేట్ సంస్థల్లో  ఉపాధి కల్పించే విధంగా మూడుసార్లు జాబు మేళాలు ఏర్పాటు చేసి.. ప్రైవేట్ సంస్థల్లో ఉపాది కల్పించాలన్నారు. 300 మంది యువతీ యువకులు  ఉపాధి అవకాశాలను  నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా  లబ్ధి పొందుతున్నారన్నారు, పాలిటెక్నిక్   విద్యార్థులకు జాయిన్  అయ్యేందుకు ఏమైనా సమస్యలు ఉన్నాడల  మ దృష్టికి తీసుకురావాలని  సంబంధిత అధికారులకు సూచించారు.   ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్య డిప్యూటీ డైరెక్టర్  డాక్టర్ రామకృష్ణ, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సి హె. శ్రీనివాసరావు.  పాలిటెక్నిక్ డెవలప్మెంట్ అధికారి మురళి అసిస్టెంట్ గిరిజన సంక్షేమ శాఖ  అధికారులు హాసిని. రామ తులసి.  మండల విద్యాశాఖ అధికారులు మల్లేశ్వరరావు. తాత అబ్బాయి దొర. ప్రధానోపాధ్యాయులు. సి ఆర్ టి లు తదితరులు పాల్గొన్నారు.

Rampachodavaram

2022-12-13 13:28:43

5వ తేదీ వరకు పరీక్ష ఫీజు గడువు పెంపు

2022-23 వ సంవత్సరానికి సంబంధించి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) ఫీజు గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి యస్.డి.వి.రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది 5 తేదీన జరుగనున్న పరీక్షల కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుని వివిధ కారణాల వలన పరీక్ష రుసుము చెల్లించని విద్యార్థులకు చివరి అవకాశంగా స్కూల్ లాగిన్ లోని ఎస్ బి ఐ కలెక్ట్ ట్యాబ్ ద్వారా ఈ నెల 5 తేదీలోగా పరీక్ష రుసుము చెల్లించవచ్చన్నారు. ఓ సి, బి సి విద్యార్థులకు రూ.100 లు, ఎస్ సి, ఎస్ టి విద్యార్థులకు రూ.50 లు పరీక్ష రుసుము చెల్లించాలన్నారు. దరఖాస్తు ఫీజు చెల్లించని విద్యార్థులకు హల్ టికెట్ లు జారీ చేయబడవని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Parvathipuram

2022-12-02 11:30:12

ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు..

పార్వతీపురం మన్యం జిల్లా లో ఏపీ సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్ సొసైటీ) ద్వారా టెన్త్, ఇంటర్మీడియెట్ లలో ప్రవేశాలకు ప్రభుత్వం గడువు పెంచినట్లు,  ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 25వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి డా.యస్.డి.వి.రమణ,  ఓపెన్ స్కూల్ జిల్లా కోఆర్డినేటర్ డి. సూరపునాయుడు తెలిపారు. 2022 ఆగస్టు 31 నాటికి 14 ఏళ్లు వయస్సు పూర్తయినవారు పదో తరగతిలో ప్రవేశాలకు అర్హులని, పది ఉత్తీర్ణులైనవారు ఇంటర్ లో ప్రవేశాలు పొందడానికి అర్హులని పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా రెండేళ్ల ఇంటర్మీడియెట్ కూడా ఏడాదిలోనే పూర్తిచేసుకునే సదవకాశం ఉందన్నారు. జిల్లాలోని వివిధ కారణాలతో మధ్యలో బడి మానేసినవారు, వ్యాపారులు, గృహిణులు, ఆయాలు, అంగన్ వాడి సిబ్బంది ఇలా ఎవరైనా ఓపెన్ స్కూల్ ను సద్వినియోగం చేసుకోవచ్చని వారు కోరారు. మరిన్ని వివరాలతోపాటు దరఖాస్తులను ఏపీఓపెన్ స్కూల్, ఏపీ.జీవోవి.ఇన్ వెబ్ పోర్టల్ లో పొందవచ్చని తెలిపారు.

Parvathipuram

2022-10-18 11:29:21

31లోగా ఎన్.ఎస్.పి పోర్టల్ లో నమోదుకావాలి

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్.ఎం.ఎం.ఎస్) కు ఎంపికైన విద్యార్ధులు ఈ నెల 31వ తేదీ లోగా ఎన్.ఎస్.పి పోర్టల్ లో నమోదు చేసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి డా.ఎస్.డి.వి.రమణ తెలిపారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఎన్.ఎం.ఎం.ఎస్ కు ఎంపికై ఇప్పటి వరకూ పోర్టల్ లో నమోదు చేయని విద్యార్ధులు 31వ తేదీ లోగా నమోదు చేయుటకు గడువు పెంచారని ఆయన చెప్పారు. ఎన్.ఎస్.పి పోర్టల్ లో నమోదు కాని విద్యార్థులకు ఉపకార వేతనాలు మంజూరు కాదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్ధులు, సంబందిత ప్రధానోపాధ్యాయులు గమనించి ఎన్.ఎస్.పి పోర్టల్ లో చేయాలని ఆయన కోరారు.

Parvathipuram

2022-10-18 09:59:28

మాజీ సైనికుల పిల్లల విద్యకు స్కాలర్ షిప్ లు

ప్రధాన మంత్రి ఉపాధి పథకం క్రింద మాజీ సైనికుల పిల్లలకు  2022-2023 విద్యాసంవత్సరంలో వివిధ వృతి విద్యా కోర్సులలో మొదటి సంవత్సరము చదువుచున్న క్రింద స్కాలర్ షిప్పు పొందుటకు కేంద్రీయ సైనిక బోర్డు(KENDHRIYA SAINIK BOARD) దరఖాస్తులు ఆహ్వానిస్తోందని జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారి జి.సత్యానందం ఒక ప్రకటనలో తెలియజేశారు.  MBBS, BDS, BAMS, BHMS,BSMS, BUMS, BNYS,, BVSC & (AH), B.pharma, PHARMA.D. Bsc Nursing, BSC BPT, BSC MLT, BOT, GNM, B.SC(OT&AT), B.SC (MICRO BIOLOGY), BBA, B.Tech, BE, B.Arch, BEA, BSC (Agriculture), BSC(Forestry), B.Sc(Horticulture) BF Sc, BMC, B.Sc (Computer Science), B.Sc (Media technology), BASLP, BFT, BCA, MCA, MBA, BBA, BBM, BPEd, BFSC. BFA, BSC Bio-Tech, BHMCT, B.SC (CA&BM), B.SC (HHA) BBM, BMS Bed, LLB, BMC, Hotel Management.

 కోర్సులకు మొదటి ఏడాది చేరిన విద్యార్ధులు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. పై కోర్సులలో రెండవ సంవత్సరము చదువుతున్న వారు అనర్హులని పేర్కొన్నారు. ఈ స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకొనుటకు ఇంటర్మీడియట్ పరీక్ష లలో కనీసము 60 % మార్కులు పొంది ఉండాలని తెలియజేశారు. ఈ పధకం క్రింది ఏడాదికి విద్యార్థికి రూ.30,000  చొప్పున మరియు విద్యార్థినికి 36,000 చొప్పున మంజూరు చేస్తారని పేర్కొన్నారు. నిర్ణీత దరకాస్తు ఫారమును ఆన్లైన్ WWW.RSB.GOV.IN ద్వారా మాత్రమే నింపి పంపించాలని సూచించారు. ఆ విధం గా పూర్తిచేసిన దరకాస్తు ఫారములను సంబంధిత ధృవపత్రముల తో జిల్లా సైనిక సంక్షేమశాఖ కార్యాలయము - విశాఖపట్నం అడ్రసులో అందజేయాలని కోరారు. దరఖాస్తులు స్వీకరించేందుకు ఆకరు తేది 30-11-2022గా నిర్ణయించినట్టు వివరించారు. మరిన్ని  వివరాలకు జిల్లా సైనికి సంక్షేమ కార్యాలయము విశాఖపట్నంలో సంప్రదించాలని సూచించారు.

2022-10-13 07:38:43

సిఎల్ఐఎస్సి కోర్సులకు ధరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు సంస్థల ద్వారా నిర్వహించనున్న 5నెలల కాలపరిమితితో కూడిన సర్టిఫికెట్ కోర్సు ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్(CLISc)కోర్సులో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ సంచాలకులు డా.ఎం.ఆర్.ప్రసన్నకుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.రాష్ట్రంలో గుర్తింపు పొందిన పిఎన్.స్కూల్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ విజయవాడ,రాయలసీమ ఇనిస్టిట్యూట్ లైబ్రరీ అండ్ ఇన్పర్మేషన్ సైన్స్,గాంధీనగర్,కడప, వావిలాల సంస్థ లైబ్రరీ సైన్స్,అరండల్ పేట, గుంటూరుల్లోని సంస్థల్లో ఒక్కొక్క సంస్థలో 40 తెలుగు మీడియం,40 ఆంగ్లమాద్యం సీట్లు కలిపి మొత్తం 120 తెలుగు మాద్యమం,120 ఆంగ్ల మాద్యం సీట్లు ఉన్నాయని ఆయన తెలిపారు.వచ్చే డిశంబరు 1వ తేదీ నుండి 2023 ఏప్రిల్ 30వ తేదీ వరకూ ఐదు నెలల కాలవ్యవధితో ఈసిఎల్ఐఎస్సి(CLISc) సర్టిఫికెట్ కోర్సును నిర్వహించడం జరుగుతుందని డా.ప్రసన్న కుమార్ తెలియజేశారు.
ఈశిక్షణా కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపే అభ్యర్ధులు విధిగా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలని లేదా యుజిసి గుర్తింపు కలిగిన ఏదైనా విద్యాసంస్థలో తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలని డా.ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు.అభ్యర్దులను వారు సాధించిన మార్కుల శాతం మెరిట్ ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.ఇంటర్మీడియెట్ ఒకేషనల్ కోర్సు చేసిన అభ్యర్ధులు ఈ CLISc సర్టిఫికెట్ శిక్షణా కోర్సులో చేరేందుకు అర్హులు కాదని స్పష్టం చేశారు.ఈకోర్సులో చేరే అభ్యర్ధులకు వారి కనీస విద్యార్హతైన ఇంటర్మీడియెట్ లో సాధించిన మార్కులకు అదనంగా డిగ్రీ ఉత్తీర్ణత సాధిస్తే 5మార్కులు,పిజి ఉత్తీర్ణులైతే 10 మార్కులు కలిపి ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
అదే విధంగా ఈకోర్సులో చేరే అభ్యర్ధులను రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేయడం జరుగుతుందని,అంతేగాక మహిళలకు 33/3 శాతం సీట్లు రిజర్వు చేయడం జరుగుతుందని రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ సంచాలకులు డా.ఎం.ఆర్.ప్రసన్న కుమార్ తెలియజేశారు.అంతేగాక ఈకోర్సులు నిర్వహించే మూడు సంస్థల్లోను తెలుగు,ఆంగ్ల మాద్యమాల్లో 10శాతం సీట్లను రాష్ట్ర పౌర గ్రంధాలయాల సంస్థ సంచాలకుల వారి పరిధిలోని జిల్లా గ్రంధాలయ సంస్థలు,ప్రభుత్వ లైబ్రరీల్లో పనిచేసే సిబ్బందికి రిజర్వు చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈసర్టిఫికెట్ శిక్షణా కోర్సులో చేరేందుకు గుర్తింపు పొందిన పై మూడు సంస్థల ప్రిన్సిపాళ్ల నుండి నవంబరు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకూ ధరఖాస్తులు పొందవచ్చని డా.ప్రసన్న కుమార్ తెలియజేశారు.పోస్టు ద్వారా అయితే సంబంధిత సంస్థ ప్రిన్సిపాల్ పేరిట 2రూ.లు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ తీసి 10X24 సైజు ఎన్వలప్ కవర్ పై 5రూ.ల స్టాంపు అతికించి పంపి పొంద వచ్చన్నారు.పూర్తి చేసిన ధరఖాస్తులను నవంబరు 18వ తేదీ సాయంత్రం 5గం.ల లోగా పైన పేర్కొన్న సంబంధిత సంస్థల ప్రిన్సిపాళ్ళకు అందేలా పంపాల్సి ఉంటుందని చెప్పారు. ఒకవేళ సకాలంలో ధరఖాస్తులు ఆయా సంస్థలకు అందకుంటే అందుకు ఆయా సంస్థల ప్రిన్సిపాళ్ళకు ఏవిధమైన సంబంధం ఉండదని రాష్ట్ర పౌర గ్రంధాలయాల శాఖ సంచాలకులు డా.ఎం.ఆర్.ప్రసన్న కుమార్ తెలియజేశారు.

గుంటూరు

2022-10-12 12:27:17

మెరిట్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానం

పార్వతీపురం మన్యం జిల్లాలో 2022-23 విద్యా సంవత్సరములో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు రాష్ట్రంలో 8వ తరగతి చదువుచున్న విద్యార్థుల నుండి దరఖాస్తులు ఆహ్వాస్తున్నట్లు  జిల్లా విద్యాశాఖాధికారి పి. బ్రహ్మాజీ రావు తెలిపారు. ఈ పరీక్ష రాయుటకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, మండల పరిషత్ ప్రాధమికోన్నత, ఆదర్శ పాఠశాలలలో 8వ తరగతి చదువుచున్న విద్యార్థులు అర్హులన్నారు. పరీక్ష రుసుము ఓ.సి, బి.సి విద్యార్థులకు రూ.100/-, యస్.సి, ఎస్.టి విద్యార్థులకు రూ.50/- అని తెలిపారు. విద్యార్థులు దరఖాస్తులను ఆన్ లైను లో  నుండి స్వీకరించబడును. ఆన్ లైను లో అక్టోబరు 31వ తేదీ లోగా పరీక్ష రుసుము చెల్లించ వచ్చని చెప్పారు. పరీక్ష రుసుమును స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా  చలాన ద్వారా మాత్రమే చెల్లించాలని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరముల కొరకు వెబ్ సైటు www.bse.ap.gov.in లో లేదా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి శుక్ర వారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు తెలిపారు.

Parvathipuram

2022-09-30 12:15:34

గిరిజనుల సౌంస్కృతి చాలా గొప్పది

గిరిజనుల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలూ  చాలా ప్రత్యేకమైనవని వాటిపై పరిశోధనలు జరిగి ఆ ఫలితాలు మానవాళికి ఉపయోగకరంగా చెయ్యాల్సిన భాద్యత ఎంతైనా ఉందని గిరిజన విశ్వవిద్యాలయం విసీ ఆచార్య తేజస్వి కట్టిమని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి,  గిరిజన సంఘాలు అనే అంశం పై 3 రోజుల జాతీయ అధ్యయన శిబిరం శుక్రవరం కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా విసీ మాట్లాడుతూ, గిరజన సంప్రయాలు, కళలు భాహ్యప్రపంచానికి తెలియాల్సిన అవసరం వుందన్నారు. గంగాధర్ మెహెర్ విశ్వవిద్యాలయం విసి ఆచార్య ఎన్. నాగరాజు మాట్లాడుతూ గిరిజన ప్రజా జీవితం వైరుధ్యమైనదని వారి ఆలోచనా సరళి ప్రకృతికి దగ్గరగా ఉండడమే కాకుండా వారిలో దాగివున్న నిగూఢమైన విజ్ఞానం ప్రస్తుత తరుణం లో మానవాళికి ఏంతో ఉపయోగపడుతుందన్నారు. 

సత్య విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ రావు మాట్లాడుతూ, గిరిజన విశ్వ విద్యాలయం లో నిరంతరం గిరిజనుల స్తితిగతులు, సంప్రదాయాలు మొదలైన అంశాలపై వివిధ వర్కుషాపులు, సెమినార్లు జరుగుతుండడం చూస్తుంటే గిరిజనులకు సంబంధించిన అన్ని విషయాలు విశ్వవ్యాప్తం అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అంతకు ముందు జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో సిటియు వైస్-ఛాన్సలర్ ఆచార్య తేజస్వి కట్టిమని తోపాటు సంబల్‌పూర్‌లోని గంగాధర్ మెహెతా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ నాగరాజు, సత్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీతమ్) డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, బెంగళూరులోని కర్నాటక సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ బివి వసంత్ కుమార్  జ్యోతి ప్రజ్వలన చేశారు. 

 పలువురు వక్తలు భారతీయ సంస్కృతి మరియు గిరిజన సంఘాలు అనే అంశానికి సంభందించిన వివిధ అంశాలను చర్చించారు. ఈ శిబిరంలో  కర్ణాటక సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్ బివి వసంత కుమార్, డాక్టర్ రాంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ నాగ హుబ్లీ, డాక్టర్ కవిత కూసుగాల్, డాక్టర్ గిరిజ.వి, డా.గాయత్రీ తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-09-30 11:41:54

దేశ ఆలయ శిల్పకళను సంర‌క్షించండి

దేశ సంస్కృతి సంప్ర‌దాయాల‌కు మూల‌స్తంభ‌మైన శిల్ప‌క‌ళ‌ను సంర‌క్షించి భవిష్యత్ త‌రాలకు అందించాల‌ని టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి విద్యార్థుల‌కు పిలుపునిచ్చారు. శ్రీ వేంకటేశ్వర సంప్ర‌దాయ శిల్ప శిక్ష‌ణా సంస్థలో నిర్వ‌హిస్తున్న వ‌ర్క్‌షాప్‌లో గురువారం ఈవో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, ఆలయ వాస్తు, చిత్రలేఖనం, శిల్పకళా విద్యార్థులు గొప్ప ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్నార‌ని ప్ర‌శంసించారు. విద్యార్థులు మ‌రింత నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుండి శిల్ప‌క‌ళలో ప్రావీణ్యం పొందిన స్థపతులు తమ జ్ఞానాన్ని పంచుకోవడానికి, ఆలయ శిల్పకళ నైపుణ్యాలను విద్యార్థుల‌కు అందించడానికి విచ్చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు.

        విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఉపయోగపడే వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేసిన టిటిడి జెఈవో శ్రీమతి సదా భార్గవిని ఈఓ అభినందించారు. ఈ రంగంలోని నిపుణులను తరచూ ఆహ్వానిస్తూ ఇలాంటి వర్క్‌షాప్‌లు నిర్వహించాలని సూచించారు. బ‌ర్డ్ ఆసుపత్రిలో రోగులకు శస్త్రచికిత్స చేసేందుకు ఆయా విభాగాల్లో నిపుణులైన ప్ర‌ముఖ‌ వైద్యుల‌ను ఆహ్వానిస్తున్నామ‌ని, ఇదేత‌ర‌హాలో ప్ర‌ముఖ స్థపతులు, కళాకారులను ఆహ్వానించి దేవాలయ నిర్మాణం, చిత్రలేఖనం, శిల్పకళలో విద్యార్థులకు మెళ‌కువ‌లు నేర్పించాల‌ని కోరారు.

             అనంతరం సంప్రదాయ చిత్రలేఖనంలో మెళకువలు, వివిధ శిల్ప శాస్త్రాలలో ప్రతిమా లక్షణం వివరణ, ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లోని ఆలయాల్లో శైవ, వైఖానస, శక్తి ఆగమాలలోని అంశాల‌పై ఉపన్యాసాలు చేసిన‌  శేషబ్రహ్మం, డాక్టర్ పి.నాగేశ్వరరావు,  సుందర రాజన్,  బ్రహ్మాచార్యులను ఈవో సత్కరించారు.

అంతకుముందు టిటిడి ఈవో స్టాళ్ల‌ను సందర్శించారు. అక్కడ అధ్యాపకులు, విద్యార్థులు రూపొందించిన రాతి, లోహం, సుధా, చెక్క విగ్రహాలు, వివిధ చిత్రలేఖనాలను తిల‌కించారు. క‌ళాశాల అధ్యాపకుడు  జి.సాగర్ డాట్ వర్క్ ఆర్ట్‌ను, సాంప్రదాయ కలంకారి కళలో ప్రావీణ్యం సంపాదించిన విద్యార్థి వెన్నెలను ప్రశంసించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి సిఇ  నాగేశ్వరరావు, డిఈవో  గోవిందరాజన్, ప్రిన్సిపాల్  వెంకట రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tirupati

2022-09-22 14:56:55