నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో మే 4 నుంచి 12 వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను జేఈవో వీరబ్ర హ్మం బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, శ్రీ వేదనారాయణ స్వామి బ్ర హ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. మే 4వ తేదీ ధ్వజారోహణంతో శ్రీ వేదనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. మే 8న గరుడసేవ, మే 11న రథోత్సవం, మే 12న ఉదయం చక్రస్నానం జరుగనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, ఇతర అధికారులు పాల్గొన్నారు.