1 ENS Live Breaking News

పోకో ఎఫ్5 సరికొత్త మొబైల్ సేల్స్ ఎప్పటి నుంచంటే..

చైనా మొబైల్ కంపెనీ POCO భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. భారత్ సెల్ మార్కెట్ ను యావత్తు తన చేతుల్లోకి తీసుకునే లక్ష్యంగా సరికొత్త ఫీచర్లతో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. POCO F5 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ సేల్స్‌ మే9 వ తేదీ నుంచి సేల్స్‌ ప్రారంభంకానుంది. కాగా ఈ ఫోన్ ఫీచర్లు అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి లాంచ్ చేయడానికి పోకో ఇప్పటికే కర్టన్ రైజర్ ప్రమోషన్ ప్రారంభించింది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 7+ జెన్‌ 2 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8,12 GB RAMతో పాటు 256 స్టోరేజ్‌ వేరియంట్‌లో లాంచ్‌ చేశారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ బేస్‌ ధర రూ. 29,000 గా ఉంది. ఇంచు మించుగా ఐఫోన్ తరహా లుక్ లోనే దీనిని దించడం విశేషం. ప్రస్తుతం సెల్ ఫోన్ మార్కెట్ ప్రతీ ఏడాదీ పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లు, అంతకంటె ఎక్కువ స్టోరేజీ ఇవ్వడం ద్వారా మొబైల్ ప్రేమికులను ఆకట్టుకోవాలని పోకో దీనిని లాంచ్ చేసింది.

Mumbai

2023-04-27 07:21:25

డిజిటల్ లావాదేవీల్లో ఫోన్ పే దే అగ్రస్థానం

భారత్ లో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకి అమాంతంగా పెరిగిపోతున్నాయి.  ఇన్‌స్టాంట్‌ రియల్‌ టైమ్‌ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) లావాదేవీలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. యూపీఐ పేమెంట్‌ యాప్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా 2023 జనవరిలో ఏకంగా రూ.12,98,726.62 కోట్లు చేతులు మారాయంటే ఆశ్చర్యం వేయకమానదు. గత నెలలో మొత్తం 803 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2023 జనవరిలో రూ.6,51,108 కోట్ల లావాదేవీలను నమోదు చేసింది. గూగుల్‌ పే రూ.4,43,725 కోట్లు, పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ యాప్‌ రూ.1,39,673 కోట్లతో ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి. క్రెడ్‌ రూ.19,106 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.17,088 కోట్లు, యస్‌ బ్యాంక్‌ రూ.12,116 కోట్లు, భీమ్‌ రూ.8,164 కోట్లు, అమెజాన్‌ పే రూ.5,797 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.3,324.8 కోట్లు, కొటక్‌ మహీంద్రా రూ.2,612 కోట్లు, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.2,222 కోట్లు లావాదేవీలు నమోదు చేయడం విశేషం.

Delhi

2023-02-18 11:02:21

మార్కెట్ లోకి వచ్చిన బజాజ్ ఎలక్ట్రికల్ స్కూటర్

ఒకప్పుడు స్కూటర్ అంటే బజాజ్ చేతక్ పేరే అందరూ చెప్పారు. ఆ బ్రాండ్ నే దృష్టిలో ఉంచుకొని బజాజ్ ఆటో కంపెనీ 'చేతక్' పేరుతో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ను మార్కెట్‌ లోకి తీసుకొచ్చింది. ఈ స్కూటర్ మొత్తం స్టీల్ బాడీ ప్యానెల్స్‌ తో తయారుచేశారు. యాప్‌ ద్వారా ఈ స్కూటర్‌ తో మనం కనెక్ట్ అవ్వొచ్చు. దీనికి బైక్ బెల్ట్ కాకుండా స్టీల్ గేర్ డైరెక్ట్ డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌ ను అమర్చారు. ఏపీలో ఈస్కూటర్ ఆన్ రోడ్ ధర రూ.1.6 లక్షలు కాగా.. తెలంగాణలో రూ.1.56 లక్షలుగా ఉంది. ఈ స్కూటర్ లో ఐపీ67 వాటర్ ప్రొటెక్షన్ ఉంది. యాప్ ద్వారా చార్జింగ్ స్టేటస్, బ్యాటరీ స్టేటస్, ఫైండ్ వెహికల్, నోటిఫికేషన్స్ వంటి వాటిని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవచ్చు. ఒక్కసారి చార్జింగ్ పెడితే 90 కి.మీ పైగా ఈ స్కూటర్ పై ప్రయాణం చేయవచ్చు. కేవలం 4 గంటల్లోనే బైక్ బ్యాటరీ ఫుల్ అయ్యే వెసులుబాటు కూడా ఉంది. బ్యాటరీపై మూడేళ్లు లేదా 50,000 కి.మీ వరకు వారంటీ ఇచ్చారు. ప్రస్తుతం వున్న ఎలక్ట్రికల్ స్కూటర్లకు భిన్నంగా దీనిని కంపెనీ వినియోగదారుల ముందుకి తీసుకు వచ్చింది..!

Hyderabad

2023-02-06 09:01:22

కొద్దిగా కోలుకుంటున్న స్టాక్ మార్కెట్..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుస నష్టాల నుంచి కాస్త కొద్దిగా కోలుకున్నాయి. మార్కెట్‌ ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 169 పాయింట్ల లాభంతో 59,500 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయి 17,648 వద్ద స్థిరపడ్డాయి. మధ్యాహ్నం 2.02 సమయంలో నిఫ్టీ 17,450 వద్దకు చేరింది. డేటా పాట్రన్స్‌, AGI గ్రీన్‌పాక్‌, ఇండస్‌ టవర్స్‌, ఇంటెలెక్ట్‌ డిజైన్‌ షేర్ల విలువ అత్యధికంగా పెరిగింది. దీనితో మదుపరులకు కాస్త ఊరట నిచ్చింది. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిస్తున్నాయి. ముఖ్యంగా అదాని కంపెనీ షేర్లు భారీగా పడిపోవడం వంటి సంఘటనలు జరిగాయి. కాగా ఈరోజు స్టాక్ మార్కెట్ కాస్త కోలుకుంది.

Delhi

2023-01-30 12:43:56

దేశీయ మార్కెట్ లోకి BMW X1 కొత్తకారు

ప్రముఖ లగ్జరీ కార్ల దిగ్గజం BMW దేశీయ మార్కెట్లోకి మరో  కొత్త కారును ముందుకి తీసుకువచ్చింది. BMW X1 పేరుతో ఈ కారును కంపెనీ లాంచ్ చేసింది. ఈకారు పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. 1.5 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ లతో అందుబాటులో ఉంది. ఈకారు ధర పెట్రోల్ వెర్షన్ రూ.45.90 లక్షలు కాగా, డీజిల్ వెర్షన్ రూ.47.90 లక్షలు. ఈ కారు బుకింగ్స్ కూడా కంపెనీ ప్రారంభించింది. సరికొత్తమోడల్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ కార్ల ప్రియులకు అనుగుణంగా ఈ కొత్త మోడల్ అందుబాటులోకి వచ్చింది. మంచి రంగులు కూడా అందుబాటులో ఉన్నాయి.

Mumbai

2023-01-29 09:00:06

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్ బం, గారం ధరలు మరోసారి భారీగా తగ్గిన విషయాన్ని ప్రకటించింది. 24 కేరట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.660 తగ్గగా, 22 కేరట్ల 10 గ్రాము బంగారం రూ.600 తగ్గింది. ప్రస్తుతం బంగారం ధర రూ.52.500, రూ.57,270గా ట్రేడ్ అవుతుంది. ఇక వెండి కేజి దగ్గర రూ.400 తగ్గి రూ.74,600గా ఉంది  తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇవే ధరలు అందుబాటులో ఉన్నాయి. కాగా గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు ప్రతీ మూడు రోజులకు ఒకసారి పెరుగుతూ వచ్చినా ఈరోజు అకస్మాత్తుగా రేట్లు తగ్గడంతో పసిడి ప్రేమికులు కొనుగోళ్లు చేపడుతున్నారు.

Mumbai

2023-01-27 14:00:57

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బులియన్ మార్కెట్ బంగారం ధరలు మరోసారి పెరిగిన విషయాన్ని ప్రకటించింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.380, ఆర్నమెంట్ బంగారం  రూ.350 పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,700గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,490గా ఉంది. మరోవైపు వెండి ధర కిలోకి రూ.700 తగ్గి రూ.74,000కు చేరింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇవే ధరలు అందుబాటులో ఉండనున్నాయి. కాగా గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు ప్రతీ మూడు రోజులకు ఒకసారి పెరుగుతూ వస్తుండటం మదుపరులపై ప్రభావం చూపిస్తున్నది.

Maharashtra

2023-01-25 02:56:23

ఇక భారత్ లోనూ ఆమెజాన్ ఎయిర్ సేవలు షురూ..

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లోనూ ఎయిర్‌ సేవలను ప్రారంభించింది. తమ వినియోగదారుల కోసం వస్తువులను త్వరగా డెలివరీ చేయడానికి 
గానూ కార్గో విమానాలను వినియోగించుకోనుంది. సత్వరమే సరుకును చేరవేయడం ద్వారా వినియోగదారుడికి కావాల్సిన వస్తువు సత్వరమే చేరుతుందని 
యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు  హైదరాబాద్‌లో జరిగిన  కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ సమక్షంలో అమెజాన్‌ ఈ సేవలను ప్రారంభించింది. డెలివరీ కోసం 
క్విక్‌జెట్‌ సంస్థతో అమెజాన్‌ జట్టుకట్టింది. భారత్‌లో ఓ ఇ-కామర్స్‌ సంస్థ థర్డ్‌ పార్టీ విమానసేవలను వినియోగించుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ-కామర్స్ 
మార్కెటింగ్ అధికంగా జరుగుతుండటంతో వినియోగదారులకు మెరుగైన ఫలితాలను, వస్తువులను చేరవేయడానికి అమెజాన్ మరో అడుగు ముందుకి వేసింది..

Hyderabad

2023-01-23 10:34:19

బుకింగ్స్ లో దుమ్ములేపుతున్న మారుతీ జిమ్నీ..

ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి నుంచి సరికొత్త వాహనం వాహన ప్రేమికుల ముందుకి వచ్చింది. ‘జిమ్నీ’ పేరుతో వస్తున్న ఈ సరికొత్త వాహనం చూడగానే ఆకర్షించేలా ఉంది. దీనిని డిసెంబర్ లో నిర్వహించిన ఆటో ఎక్స్ పోలో దీన్ని లాంఛ్ చేశారు. ఈ వాహనానికి ఇటీవల బుకింగ్స్ ప్రారంభం కాగా 9 రోజుల్లోనే 9 వేల బుకింగ్స్ నమోదయ్యి రికార్డు సృష్టించింది. 5 డోర్లతో, ఆకట్టుకునే రూపంతో ఉన్న జిమ్నీలో అనేక ఫీచర్లు పొందుపరిచారు. కాగా, డిమాండ్ దృష్ట్యా అడ్వాన్స్ పేమెంట్ మొత్తాన్ని రూ.11 వేల నుంచి రూ.25 వేలకు పెంచారు. అయినప్పటికీ జిమ్నీని సొంతం చేసుకునేందుకు ఎగబడి మరీ బుకింగ్ లు చేసుకుంటున్నారు. దీనితో తక్కువ సమయంలో ఎక్కు క్రేజ్ సంపాదించుకున్న కార్ గా జిమ్నీ వార్తల్లో నిలుస్తున్నది.

Maharashtra

2023-01-23 07:51:15

కొత్త బ్రాండ్ల ఆటో ఎక్స్ పోను వినియోగించుకోండి

విశాఖ సాగర తీరాన ఆటో ఎక్స్ పో ఘనంగా ప్రారంభమైంది. శనివారం విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ కె.రామ్మోహన రావు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి లు సంయుక్తంగా ఈ ఎక్స్ పో ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోర్ట్ చైర్మన్ రామ్మోహనరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది సంవత్సరాంతపు సేల్స్ లో భాగంగా ప్రత్యేక ఆఫర్లతో కొనుగోలుదారులకు డిస్కౌంట్ ఆఫర్ లు ఇస్తూ ఆటోమొబైల్ రంగంలో అన్ని బ్రాండ్ల కార్లు బైకులు కంపెనీలు ముందుకు రావడం కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సుమారు 20 కంపెనీలు తమ తమ కొత్త ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచి అమ్మకాలు జరుపుతుండడం వాహన కొనుగోలుదారులకు మంచి అవకాశం అని అన్నారు. అనంతరం నగర మేయర్  గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ ముంబై, ఢిల్లీ, బెంగళూరు ,చెన్నై ,కలకత్తా వంటి మహానగరాల్లో జరిగే ఈ ఆటో ఎక్స్ పో లు విశాఖలో కూడా జరగడం అభినందనీయం అన్నారు.

 రేస్ ఎంటర్టైన్మెంట్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ గడిచిన 10 ఏళ్లుగా ఈ తరహా ఈవెంట్లను నిర్వహిస్తున్నారని చెప్పారు. శని, ఆదివారాల్లో సాగర్ తీరానికి వచ్చే వేలాదిమంది ప్రజలు ఈ ఎక్స్ పో సందర్శించడం ద్వారా మంచి మంచి ఆఫర్లను సొంతం చేసుకోవచ్చన్నారు. తమ సొంత కారు కలను నెరవేర్చుకునేందుకు వీలుగా ఒకే చోట బ్రాండ్లు కార్లను లేటెస్ట్ మోడల్స్ ఇందులో ఉంచడం ఎంతో ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో నెరెడ్ కో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నగేష్ ,ఎపి టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కే. విజయ్ మోహన్,సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు,వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ,రేస్ ఎంటర్టైన్మెంట్స్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్ ఆయా ఆటోమొబైల్ కంపెనీల డీలర్లు, సీఈవోలు, జిఎంలు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-12-17 12:42:16

ఎంఎస్ఎంఈలు ప్రారంభిస్తే ప్రోత్సకాలు

సూక్ష్మ పరిశ్రమల స్థాపనతో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు.  బుధవారం అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సాహానికి ఏర్పాటుచేసిన జిల్లా పర్యవేక్షణ, అమలు కమిటీ (Dist. Monitoring and implementation committee) ఆధ్వర్యంలో  "ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్" శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు చేపట్టిన చర్యలలో భాగంగా ఏపీఎం, రిసోర్స్ పర్సన్స్ కు అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. స్వయం ఉపాధి కై చిన్న పరిశ్రమలు స్థాపించాలనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువత, నిరుద్యోగ యువతీ యువకులు గ్రామీణ హస్తకళాకారులు, మహిళా శక్తి సంఘాలు, రైతు ఉత్పత్తి దారుల సంఘ సభ్యుల లో అర్హులైన వారిని గుర్తించాలన్నారు. 

వారికి ప్రభుత్వ పరంగా అందించే తోడ్పాటును  రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రుణ సౌకర్యం సబ్సిడీలు గురించి తెలియజేయాలన్నారు. కార్యక్రమ కన్వీనరు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగిన అభ్యర్థుల ఎంపిక క్రమపద్ధతిలో సరళీకృతం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి.ఆర్.డి. ఎ.  పి.డి. లక్ష్మీపతి, మెప్మా పి.డి. సరోజిని, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ, జిలా ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకర్ రావు స్కిల్ డెవలప్మెంట్ అధికారి చాముండేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహక అభివృద్ధి సంస్థ (మెపడా) అధికారులు తదితరులు పాల్గొన్నారు.

2022-10-12 16:09:00

వాట్సప్ లో కొత్త అప్డేట్ చూస్తే కేకే..

వాట్సప్ లో ఇకపై పదుల సంఖ్యలో గ్రూపులు ఏర్పాటు చేసుకోవాల్సిన పనిలేదు. వాట్సప్ కొత్తగా గ్రూపు సభ్యుల సంఖ్యను 512 నుంచి ఏకంగా 1024 మందికి పెంచుతూ అప్డేట్ చేసింది. ఇప్పటి వరకూ వివిధ వర్గాలు వారికి కావాల్సిన వారికోసం కొత్తకొత్త గ్రూపులను ఏర్పాటు చేసుకునేవారు. వాట్సప్ కొత్తగా ఏర్పాటు చేసిన గ్రూపుతో ఒకే గ్రూపులో అత్యధిక మందిని చేర్చుకొని వారి కార్యకలాపాలను చక్కబెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ గ్రూపులు ప్రభుత్వశాఖల అధికారులు, మీడియాకి, యూనివర్శిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు కళాలల యాజమాన్యాలకు చక్కగా ఉపయోగపడనున్నాయి. కాగా టెలీగ్రామ్ లో మాత్రం అత్యధికం లక్షల్లోనే నెంబర్లు యాడ్ చేసుకునే అవకాశం ఉంది. 5జీబీ హెచ్డీ వీడియోలను కూడా షేర్ చేసుకునే వీలుంది. టెలీగ్రామ్ తో పోటీపడుతూ, ఇపుడు వాట్సప్ కూడా అతి తక్కువ సమయంలోనే  కొత్త కొత్త అప్డేట్స్ ఇవ్వడం విశేషం.

2022-10-10 08:42:27

2వేల హెక్టార్లలో బిందుసేద్యం లక్ష్యం..

కాకినాడ జిల్లాలో 2022-23 సంవత్సరానికి 2వేల హెక్టార్ల విస్తీర్ణంలో బిందు, తుంపర సేద్య వసతుల విస్తరణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్థేశించిందని డిస్ట్రిక్ట్ మైక్రో ఇరిగేన్ అధికారిణి కె.స్వాతి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ సేద్య పథకం క్రింద అర్హులైన రైతులకు బిందు, తుంపర సేద్య పరికరాలను రాయితీ అందిస్తామని, ఈ సదుపాయాలను పొందగోరే రైతులు, సమీప రైతు భరోసా కేంద్రాలలో తమ ఆధార్ కార్డు, భూమి యాజమాన్య పత్రం నకళ్లతో విలేజి హార్టికల్చర్/అగ్రికల్చర్/సెరికల్చర్ అసిస్టెంట్ ను సంప్రతించి ఎపియంఐపి యాప్ లో నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు. బిందు సేద్య పరికరాలను 5 ఎకరాల లోపు పొలం కలిగిన రైతులకు 90 శాతం రాయితీ పైన, 5 నుండి 12.50 ఎకరాలు కలిగిన రైతులకు 50 శాతం రాయితీ పై అందించనున్నామని పేర్కొన్నారు.

 తుంపర సేద్య పరికరాలను రాయితీపై పొందేందుకు ఒక ఎకరం పైన పొలం ఉన్న రైతులు అర్హులని,  ఒక ఎకరం నుండి 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు 55 శాతం రాయితీ పైన, 5 ఎకరాలకు పైబడిన రైతులకు 45 శాతం రాయితీ పైన తుంపర సేద్య పరికరాలను అందిస్తామని తెలిపారు.  తక్కవ ఖర్చుతో నాణ్యమైన హెచ్చు దిగుబడులను అందించే బిందు, తుంపర సేద్య పరికరాలను రాయితీ పై పొందే పధకాన్ని  కాకినాడ జిల్లాలో అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Kakinada

2022-09-01 16:48:13

ఆన్‌లైన్‌లో శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల టికెట్లు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 8 నుండి 10వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న ప‌విత్రోత్స‌ వాల్లో భ‌క్తులు  పాల్గొనేందుకు వీలుగా ఆగ‌స్టు 1న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో టికెట్ల‌ను విడుద‌ల చేయ‌నుంది. మొత్తం 600 టికెట్ల‌ను ఆన్‌లైన్ ద్వారా జారీ చేస్తారు. రూ.2500/- చెల్లించి భ‌క్తులు టికెట్ బుక్ చేసుకోవ‌చ్చు. టికెట్లు పొందిన భ‌క్తులు ప‌విత్రోత్స‌వాలు జ‌రిగే మూడు రోజులు స్న‌ప‌న‌తిరుమంజ‌నంలో, చివ‌రిరోజు పూర్ణాహుతిలో పాల్గొన‌వ‌చ్చు. ప‌విత్రోత్స‌వాల్లో పాల్గొనే భ‌క్తులు సంప్ర‌దాయ వ‌స్త్రధార‌ణ‌లో ఉద‌యం 7 గంట‌ల‌కు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 వ‌ద్దకు చేరుకోవాలి. టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజిన‌ల్ ఫొటో గుర్తింపు కార్డు చూపాలి. మ‌రిన్ని వివ‌రాల‌కు www.tirumala.org లేదా www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించ‌గ‌ల‌రు.

Tirumala

2022-07-30 06:34:29

7కొండ‌ల‌కు సూచిక‌గా7అగరబత్తి బ్రాండ్లు..

టిటిడి ఆల‌యాల్లో ఉప‌యోగించిన పుష్పాల‌తో ప‌రిమ‌ళ‌భ‌రిత అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి భ‌క్తుల‌కు విక్ర‌యానికి అందుబాటులోకి తీసుకొచ్చే ప్ర‌క్రియ తుది ద‌శ‌కు చేరుకుంది. శ్రీ‌వారి ఏడు కొండ‌ల‌కు సూచిక‌గా ఏడు బ్రాండ్ల‌తో సెప్టెంబ‌రు 13వ తేదీ నుంచి అగ‌ర‌బ‌త్తుల విక్ర‌యాల‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. టిటిడి ఆల‌యాల్లో పూజ‌లు, అలంక‌ర‌ణ‌ల‌కు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. ప‌ర్వ‌దినాలు, ఉత్స‌వాల స‌మ‌యంలో పుష్పాల వినియోగం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ర‌కంగా ఉప‌యోగించిన పుష్పాల‌న్నీ మ‌రుస‌టిరోజు ఉద‌యం తొల‌గిస్తారు. స్వామి సేవ‌కు ఉప‌యోగించిన పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉప‌యోగించే విష‌యంపై టిటిడి యాజ‌మాన్యం ఆలోచ‌న చేసింది. ఈ క్ర‌మంలో బెంగ‌ళూరు కేంద్రంగా కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ టిటిడి ఆల‌యాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాల‌ను అందిస్తే లాభం లేకుండా అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసి అందిస్తామ‌ని ముందుకొచ్చింది. ఈ మేర‌కు ఆ సంస్థ‌తో టిటిడి అవ‌గాహ‌న కుదుర్చుకుని ఎస్వీ గోశాల‌లో అగ‌ర‌బ‌త్తుల త‌యారీకి అవ‌స‌ర‌మైన స్థ‌లం కేటాయించింది. ద‌ర్శ‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ సొంత ఖ‌ర్చుతో యంత్రాలు, సిబ్బందిని నియ‌మించుకుని కొన్ని రోజులుగా ప్ర‌యోగాత్మ‌కంగా అగ‌ర‌బ‌త్తుల ఉత్ప‌త్తిని ప్రారంభించింది.

అగ‌ర‌బ‌త్తుల త‌యారీ ఇలా..

            టిటిడి స్థానికాల‌యాల్లో వినియోగించిన పుష్పాల‌ను ఉద్యాన‌వ‌న విభాగం సిబ్బంది ఎస్వీ గోశాల‌లోని అగ‌ర‌బ‌త్తుల త‌యారీ కేంద్రానికి త‌ర‌లిస్తారు. ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ పొందిన సిబ్బంది వీటిని ర‌కాల వారీగా పుష్పాల‌ను వేరు చేస్తారు. అనంత‌రం వాటిని డ్రైయింగ్ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పిండిగా మారుస్తారు. ఆ త‌రువాత పిండికి నీరు క‌లిపి కొన్ని ప‌దార్థాల‌తో మిక్సింగ్ చేస్తారు. ఈ మిశ్ర‌మాన్ని మ‌రో యంత్రంలో వేసి అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేస్తారు. వీటిని ప్ర‌త్యేక యంత్రంలో 15 నుంచి 16 గంట‌ల పాటు ఆర‌బెట్టిన త‌రువాత మ‌రో యంత్రంలో ఉంచి సువాస‌న వెదజ‌ల్లే ద్రావ‌కంలో ముంచుతారు. చివ‌ర‌గా వీటిని మ‌రోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్ చేస్తారు. మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 ల‌క్ష‌ల అగ‌ర‌బ‌త్తులు త‌యారుచేసేలా ఏర్పాట్లు చేశారు. 

విడుద‌ల చేయ‌నున్న బ్రాండ్‌లు ఇవి.. 1)అభ‌య‌హ‌స్త 2)తంద‌నాన 3)దివ్య‌పాద 4) ఆకృష్టి 5)సృష్టి 6)తుష్టి 7) దృష్టి..

Tirumala

2021-09-07 12:43:01