1 ENS Live Breaking News

నిరుద్యోగులూ జాబ్ ఫెయిర్ ను సద్వినియోగం చేసుకోండి

నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించేందుకు జెడిఫౌండేషన్, నిపున హ్యూమన్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్టు మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ తెలియజేశారు. బుధవారం డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పత్రికా సమావేశంలో జాబ్ ఫెయిర్ వివరాలను తెలియ జేశారు. డిసెంబర్ 2న మధురవాడ క్రికెట్ స్టేడియం వెనుక ఉన్న సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో  సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద సమాజంలో ఉన్న పెద్ద వాళ్ల మీద ప్రతి ఒక్కరి మీద ఉందన్న ఆయన కష్టపడి పెంచి పోషించిన తల్లిదండ్రులకు ప్రతి యువత ఉద్యోగం చేసి కుటుంబానికి చేయూతనివ్వాలని సూచించారు. యువత తమ కళ్ల మీద తాము నిలబడి  సమాజంలో మంచి విషయాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ కన్వీనర్ ప్రియాంక దండి, కృష్ణ మోహన్, నిశ్చల్, నాగరాజు, సాంకేతిక కాలేజీ ప్రతినిధి కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-11-29 06:43:25

ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళాకు విశేష స్పందన

ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళాకు విశేష స్పందన లభించింది.  రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటిఐ లో సోమవారం నిర్వహించిన అప్రెంటిస్ మేళాకు కాకినాడ, డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల నుండి సుమారు 143 మంది విద్యార్ధులు హాజరుకాగా, 118 మంది విద్యార్ధులు ప్రొవిషనల్ గా సెలెక్ట్ అయ్యారని ఐటిఐ ప్రిన్సిపాల్ జివి.రమణారావు తెలియజేశారు. ఈ మేళాకు జిల్లాలో గల 10 కంపెనీలు అనగా హార్లిక్స్ ఫ్యాక్టరీ, టాగూర్ ల్యాబోలేటెరీస్ ప్రైవేట్ లిమిటెడ్, డైరీ ఎక్విప్మెంట్స్, పరమేశ్వరి బయోటెక్స్, మారుతి మోటార్స్,  ఏపిఈపిడిసిఎల్ కంపెనీల నుండి ప్రతినిదులు హాజరు అయ్యి అప్రెంటిస్ శిక్షణ కొరకు అభ్యర్ధులను ఎంపిక చేసుకున్నారని వివరించారు. ఈ మేళా లో  బి. సత్యనారాయణ అప్రెంటిస్ అడ్వసర్, పెంకె. శ్రీనివాస రావు అప్రెంటిస్ అడ్వసర్ మరియు ఐటిఐ సిబ్బంది పాల్గొన్నారు.

Rajamahendravaram

2023-02-13 14:13:00

250 ఉద్యోగాలకు సెంట్రల్ బ్యాంకు నోటిఫికేషన్

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 250 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు కనీస విద్యార్హత డిగ్రీ కాగా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 11వ తేదీ లోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. మరిన్ని వివరాలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండి అధికారిక వెబ్ సైట్ www.centralbankofindia.co.in లో సందర్శించుకోవచ్చునని బ్యాంకు నిర్వాహకులు కోరుతున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Delhi

2023-02-03 02:13:51

మెడిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టులకు వాక్‌-ఇన్ ఇంటర్వ్యూ

శ్రీ ప‌ద్మావ‌తి  హృదయాలయం (చిన్న‌పిల్ల‌ల గుండె చికిత్సల ) ఆసుప‌త్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన డ్యూటీ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ (OC-01, SC -01) సేవలందించేందుకు ఎంబిబిఎస్‌ విద్యార్హత గల అభ్యర్థులకు ఫిబ్రవరి 7వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. తిరుపతిలోని బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో గ‌ల‌ శ్రీ ప‌ద్మావ‌తి చిన్న‌పిల్ల‌ల హృద‌యాల‌యంలో  ఉద‌యం 10 గంట‌ల‌కు వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ జ‌రుగ‌నుంది. ఆసక్తి గల అభ్యర్థులు త‌మ విద్యార్హతలు, అనుభ‌వానికి సంబంధించిన ధ్రువ‌ప‌త్రాల‌ ఒరిజినల్ , జిరాక్స్ ‌ కాపీలతో హాజరు  కావాలి. వివరాలకు www.tirumala.org చూడగలరు.

Tirupati

2023-01-30 12:18:56

కోల్ ఇండియాలో 135మైనింగ్ సర్వేయర్ పోస్టులు

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వ శాఖకు చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో 135 మైనింగ్ సర్దార్, సర్వేయర్ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ని విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో కూడా జాబ్స్ కూడా ఉన్నాయి. అభ్యర్థులు ఫిబ్రవరి 10, 2023లోపు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఉద్యోగ ప్రకటన, ఖాళీలు, విద్యార్హతలు తదితర పూర్తి వివరాలకు http://www.westerncoal.in వెబ్‌సైట్‌ సంప్రదించాల్సి వుంటుంది.

Delhi

2023-01-28 15:04:09

ఇండియా పోస్ట్ లో భారీసంఖ్యలో ఉద్యోగ ప్రకటన

ఇండియా పోస్ట్ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ  నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40889 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 2,480, తెలంగాణలో 1,266 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 16 వరకు indiapostgdsonline.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. చాలా సంవత్సరాల తరువాత పోస్టాఫీసు సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించే కార్యక్రమంలో ఈ పోస్టులను భర్తీచేయనున్నారు.

Delhi

2023-01-27 15:25:52

బెంగళూరు NIVEDIలో రూ.70వేలతో ఉద్యోగాలు

బెంగళూరులోని NIVEDI సంస్థలో 12 సీనియర్‌ రీసెర్చ్‌ఫెలో, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్ పోస్టుల ఖాళీలను ప్రకటించింది. ఇంటర్/డిగ్రీ/పీజీ చేసిన వారు అర్హులు. వయసు 18-45 ఏళ్ల మధ్యలో ఉండాలి. స్క్రీనింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు  ఫిబ్రవరి 13, 2023 తుది గడువు ఇచ్చారు.  అభ్యర్దులు ఉద్యోగాలకు ఎంపికైతే రూ.70 వేల జీతం అందుతుంది. పూర్తి వివరాలకు https://nivedi.res.in/employment.php వెబ్‌సైట్‌ సందర్శించాలని సంస్థ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో కోరింది.

Bengaluru

2023-01-27 04:27:27

APPSC గ్రూప్-2 పోటీ పరీక్షలకు కీర్తి ప్రత్యేక శిక్షణ

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలకు విశేషంగా శిక్షణ ఇవ్వగల ప్రత్యేక ఫాకల్టీతో గ్రూప్-2 ప్రత్యేక బ్యాచ్ లను ప్రారంభింస్తున్నట్టు కీర్తి ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ పవన్ తెలియజేశారు. ఈ మేరకు గురువా రం కాకినాడ కీర్తి పోటీపరీక్షల శిక్షణా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంతోనే అత్యు త్తమ ఫ్యాకల్టీతో కాన్సెప్ట్ ఓరియెంటేడ్ శిక్షణ విద్యార్ధులకు అందించడం తమ ఇనిస్టిట్యూట్ ప్రత్యేకతగా చెప్పా రు. అభ్యర్ధులకు అర్ధమయ్యే రీతిలో శిక్షణ ఇచ్చి గ్రూప్-2 పరీక్షలు సిద్ధం చేయడానికి కొత్తగా బ్యాచ్ లను మొదలు పెట్టినట్టు పేర్కొన్నారు. వివరాలకు 9032228708లో సంప్రదించాలన్నారు.

Kakinada

2023-01-06 17:09:48

ENS న్యూస్ ఏజెన్సీకి జిల్లా రిపోర్టర్లు కావలెను

భారతదేశపు తొలి తెలుగు డిజిటల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ Ens LIve, న్యూస్ వెబ్ సైట్ www.enslive.netలో పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల నుంచి రిపోర్టర్లు, కెమెరా మేన్ లు, జిల్లా యాడ్ మేనేజర్లు కావలెను. స్థానికంగా ఉంటూ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో మంచి నెట్వర్క్ కలిగి, కనీసం డిగ్రీ చదువుకొని, మొబైల్ లో తెలుగు చక్కగా న్యూస్ ఫార్మాట్ రూపంలో వార్తలు కంపోజింగ్, కదలకుండా వీడియోలు తీయడం వచ్చి ఉండాలి. గతంలో ఏదైనా మీడియా సంస్థల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడును, ఆకర్షణీయమైన జీతం, ప్రెస్ అక్రిడిటేషన్ సౌకర్యం కల్పించబడును. వివరాలకు  చీఫ్ రిపోర్టర్ ఈఎన్ఎస్ బాలు,  ఫోన్ నెంబర్లు 9490280270, 9390280270.

Visakhapatnam

2023-01-06 03:08:14

సచివాలయ ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయశాఖలోని మిగులు ఉద్యోగాల భర్తీకి సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత కొద్ది రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 సచివాలయాల్లోని ఖాళీల వివరాలను అధికారులు సేకరించారు. రెండు నోటిఫికేషన్ల ద్వారా సుమారు 1.22 వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీచేయగా, మరికొన్ని ఉద్యోగాలను కారుణ్య నియామకాల చేపట్టారు. ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేయనున్నారు. సీఎం ఉద్యోగాలకు పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో సంక్రాంతి నాటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయని ఉన్నతాధికారి ఒకరు ఈఎన్ఎస్ కి తెలియజేశారు.

Tadepalli

2023-01-04 16:21:48

గ్రామ సచివాలయ ఉద్యోగ నోటిఫికేషన్ కి లైన్ క్లియర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లోని మిగులు ఉద్యోగాలను భర్తీచేసేందుకు మార్గం సుగమం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వున్న 26 జిల్లాల్లోనూ గ్రామ, వార్డు సచివాలయా ల్లోని ఖాళీలను సేకరించి జాబితాను సిద్ధం చేశారు. వాటిని ఫైనాన్స్ క్లియరెన్స్ కి పంపి సంక్రాంతి నాటికి ఉద్యోగ నోటిఫికేషన్ తీసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. దానికోసం ప్రభుత్వశాఖల వారీగా ఖాళీలు, రిజర్వేషన్లు,పరీక్షా కేంద్రాలు, నోటిఫికేషన్ తేదీ, ముగింపు తేది తదితర అంశాలకు సంధించి ఇప్పటికే ప్రక్రియమొత్తం పూర్తయ్యింది. త్వరలోనే పంచాయతీరాజ్ శాఖలో భాగంగా వున్న గ్రామవార్డు సచివాలయశాఖ నుంచి మిగులు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుంది. ఇటీవలే కారుణ్య నియామకాల క్రింద రాష్ట్రవ్యాప్తంగా చాలాఖాళీలను భర్తీచేశారు. అలా భర్తీచేయగా మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి సచివాలయశాఖలో అన్నీ ఖాళీలను పూర్తిస్థాయిలో భర్తీచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుంది.

Tadepalli

2022-12-29 11:57:48

5 రోజులు కోర్టు ఉద్యోగులకు కంప్యూటర్ పరీక్ష

కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామనే నకిలీ ప్రచారాలను, అభ్యర్ధులు నమ్మవద్దని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి గుత్తాల గోపి సూచించారు. ఈ మేరకు విశాఖలో  మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఏపీలోని జిల్లా కోర్టులలో ఉద్యోగ ఖాళీల భర్తీ నిమిత్తం జరుగుతున్న ప్రక్రియ లో భాగంగా అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత 
పరీక్షను డిసెంబర్ 21, 22, 23, 29 మరియు జనవరి 2వ తేదీలలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్టెనో గ్రాఫర్ గ్రేడ్ -3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ , ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఉమ్మడి పరీక్షను 21-12-2022, 22-12-2022, 23-12-2022, 29- 12-2022, 09-01-2023 న, కాపీయిస్ట్ ఎగ్జామిన ర్, రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ కొరకు . ఉమ్మడి పరీక్ష ను 26-12-2022న, డ్రైవర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు భర్తీ కి. ఉమ్మడి పరీక్ష ను 26 -12-2022, 27-12-2022, 28-12-2022, 29-12-2022 న తేదీలలో జరుగుతాయి. హాల్ టిక్కెట్లను 16-12-2022 నుండి హైకోర్టు వెబ్ సైట్ hc.ap.nic.in డిస్ట్రిక్ట్ కోర్టు వెబ్ సైట్ districts.ecourts.gov.in/andhrapradesh లో నుంచి తీసుకోని పరీక్ష తేదీ సమయం తెలుసుకోవాలన్నారు. హెల్ప్ డెస్క్ ల్యాండ్ లైన్ Number: 0863-2372752  అక్రమార్కులకు సంబంధించిన ఫిర్యాదులు చేయవచ్చునన్నారు. అభ్యర్ధుల పరీక్షలన్నీ పరీక్షలు ఆన్ లైన్  
పద్దతి లో జరుగుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Visakhapatnam

2022-12-07 13:13:13

visakhapatnam

2022-11-08 02:15:34

ఉద్యోగుల భర్తీ రోస్టర్ విధానంలో ఎలా జరుగుతుందంటే

ప్రభుత్వం ఏ ఉద్యోగానికి సంబంధించైనా నోటిఫికేషన్ ఇచ్చినపుడు రోస్టర్ విధానంలో భర్తీ చేస్తుంది. ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే అన్ని పోస్టులను ఖచ్చితంగా ప్రభుత్వ విధి విధానాలను అనుసరించి భర్తీచేయాల్సి వుంటుంది. ఒక నోటిఫికేషన్ లో ఒక రోస్టర్ సంఖ్యతో భర్తీజరిగినపుడు, మిగిలిన రోస్టర్ ను అమలు చేస్తూ ఉద్యోగాల భర్తీ చేయాలి. 1నుంచి 100 పోస్టుల భర్తీ రోస్టర్‌.. కాగా 1 నుంచి 100 పోస్టుల భర్తీకి అనుసరించే రోస్టర్‌ విధానం కింది విధంగా ఉంటుంది. ఎన్ని పోస్టులుంటే అన్ని పోస్టుల వారీగా రోస్టర్‌ను అనుసరిస్తారు. శాఖల వారీగా రోస్టర్‌ ఎక్కడ ఆగిపోతే తదుపరి రిక్రూట్‌మెంట్‌ సమయంలో అక్కడి నుంచే కొత్త రోస్టర్‌ ప్రారంభమవుతుంది.

 ఏ ప్రభుత్వశాఖలోనైనా జిల్లా అధికారులు సరిగ్గా ఈ విధానంలోనే తమ చేతివాటం ప్రదర్శిస్తుంటారు. అదే సమయంలో అన్ని ప్రభుత్వశాఖలకు చైర్మన్ అయిన జిల్లా కలెక్టర్లను సైతం బురిడీ కొట్టిస్తుంటారు. వాస్తవానికి ఉద్యోగాల భర్తీ సమయంలో జిల్లా కలెక్టర్ నుంచి ఆయా ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల వరకూ నోటిఫికేషన్ వచ్చినపుడు, వాటిని భర్తీచేసే సమయంలో ముందు నోటిఫికేషన్ కి సంబంధించి రోస్టర్ ఎంత వరకూ భర్తీచేశారు..ప్రస్తుతం ఎన్నిపోస్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.. ఇచ్చిన నోటిఫికేషన్ కు ఏ రోస్టర్ నుంచి భర్తీచేస్తున్నారనే విషయాన్ని జిల్లాశాల అధికారులు చెప్పాల్సి వుంటుంది. రోస్టర్ పద్దతిని ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు అనుసరించి ఈ క్రింది విధంగా భర్తీచేస్తారు.

1వ పోస్టు:ఓసీ (మహిళ), 2వ పోస్టు: ఎస్సీ (మహిళ), 3వ పోస్టు: ఓసీ, 4వ పోస్టు: బీసీ -ఏ (మహిళ), 5వ పోస్టు: ఓసీ, 6వ పోస్టు: విజువల్లీ హ్యాండిక్యాప్డ్‌(మహిళ), 7వ పోస్టు:ఎస్సీ,  8వ పోస్టు: ఎస్టీ (మహిళ), 9వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌, 10వ పోస్టు: బీసీ -బీ (మహిళ), 11వ పోస్టు: ఓసీ, 12వ పోస్టు: ఓసీ (మహిళ), 13వ పోస్టు: ఎక్స్‌సర్వీస్‌మెన్‌ /ఓసీ, 14వ పోస్టు: బీసీ -సీ, 15వ పోస్టు: ఓసీ, 16వ పోస్టు: ఎస్సీ, 17వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌ (మహిళ), 18వ పోస్టు: బీసీ -డీ (మహిళ), 19వ పోస్టు: బీసీ -ఈ (మహిళ), 20వ పోస్టు: బీసీ (ఏ), 21వ పోస్టు: ఓసీ, 22వ పోస్టు: ఎస్సీ (మహిళ), 23వ పోస్టు: ఓసీ (మహిళ), 24వ పోస్టు: బీసీ (బీ), 25వ పోస్టు: ఎస్టీ, 26వ పోస్టు: ఓసీ, 27వ పోస్టు: ఎస్సీ, 28వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌, 29వ పోస్టు: బీసీ -ఏ, 30వ పోస్టు: ఓసీ (మహిళ), 31వ పోస్టు: హియరింగ్‌ హ్యాండిక్యాప్డ్‌, 32వ పోస్టు: ఓసీ, 33వ పోస్టు: ఎస్టీ, 34వ పోస్టు: ఓసీ (మహిళ), 35వ పోస్టు: బీసీ (బీ), 36వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌, 37వ పోస్టు: ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ /ఓసీ, 38వ పోస్టు: ఓసీ (మహిళ), 39వ పోస్టు: బీసీ -డీ, 40వ పోస్టు: ఓసీ, 41వ పోస్టు: ఎస్సీ,

42వ పోస్టు: ఓసీ, 43వ పోస్టు: బీసీ -డీ, 44వ పోస్టు: బీసీ -ఈ, 45వ పోస్టు: బీసీ – ఏ(మహిళ), 46వ పోస్టు: ఓసీ, 47వ పోస్టు: ఎస్సీ (మహిళ), 48వ పోస్టు: స్పోర్ట్స్‌, 49వ పోస్టు: బీసీ -బీ (మహిళ), 50వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌ (మహిళ), 51వ పోస్టు: ఓసీ, 52వ పోస్టు: ఎస్సీ, 53వ పోస్టు: ఓసీ, 54వ పోస్టు: బీసీ – ఏ, 55వ పోస్టు: ఓసీ (మహిళ), 56వ పోస్టు: ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్‌, 57వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌, 58వ పోస్టు: ఎస్టీ (మహిళ), 59వ పోస్టు: ఓసీ (మహిళ), 60వ పోస్టు: బీసీ -బీ, 61వ పోస్టు: ఓసీ, 62వ పోస్టు: ఎస్సీ, 63వ పోస్టు: ఓసీ, 64వ పోస్టు: బీసీ -డీ (మహిళ), 65వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌ (మహిళ), 66వ పోస్టు: ఎస్సీ (మహిళ), 67వ పోస్టు: ఓసీ, 68వ పోస్టు: బీసీ -డీ, 69వ పోస్టు: బీసీ -ఈ, 70వ పోస్టు: బీసీ -ఏ, 71వ పోస్టు: ఓసీ (మహిళ), 72వ పోస్టు: ఎస్సీ, 73వ పోస్టు: ఓసీ, 74వ పోస్టు: బీసీ -బీ, 75వ పోస్టు: ఎస్టీ, 76వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌, 77వ పోస్టు: ఎస్సీ, 78వ పోస్టు: ఓసీ (మహిళ)

79వ పోస్టు: బీసీ – ఏ, 80వ పోస్టు: ఓసీ, 81వ పోస్టు: బీసీ -బీ (మహిళ), 82వ పోస్టు: మెంటల్లీ హ్యాండిక్యాప్డ్‌, 83వ పోస్టు: ఎస్టీ, 84వ పోస్టు: ఓసీ (మహిళ), 85వ పోస్టు: బీసీ -బీ, 86వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌, 87వ పోస్టు: ఎస్సీ (మహిళ), 88వ పోస్టు: ఓసీ, 89వ పోస్టు: బీసీ – డీ, 90వ పోస్టు: ఓసీ (మహిళ), 91వ పోస్టు: ఎస్సీ, 92వ పోస్టు: ఓసీ, 93వ పోస్టు: బీసీ -డీ, 94వ పోస్టు: బీసీ -ఈ, 95వ పోస్టు: బీసీ -బీ, 96వ పోస్టు: ఓసీ (మహిళ), 97వ పోస్టు: ఎస్సీ, 98వ పోస్టు: స్పోర్ట్స్‌, 99వ పోస్టు: బీసీ -బీ (మహిళ), 100వ పోస్టు: ఈడబ్ల్యూఎస్‌, 

ఆర్టీఐతో వివరాలు కోరితే మొత్తం సమర్పించాల్సిందే..
ఏ ప్రభుత్వశాఖలోనైనా రెగ్యులర్, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాల భర్తీచేపట్టినపుడు అక్రమాలు చోటుచేసుకున్నాయని తెలిస్తే ఎవరైనా ముందు ఏ రోస్టర్ విధానంలో భర్తీచేశారు. ముందు ఉద్యోగ నోటిఫికేషన్ లో ఎన్ని ఉద్యోగాలు ఏ రోస్టర్ లో భర్తీచేశారు..మిగిలిన రోస్టర్ ఎక్కడ ఆగిపోయింది.. ప్రస్తుత నోటిఫికేషన్ లో ఏ రోస్టర్ నుంచి మళ్లీ ఉద్యోగాల భర్తీచేపడుతున్నారు. ఎన్నది దరఖాస్తులు వచ్చాయి.. మెరిట్ ను, వయస్సును ఏ ప్రాతిపదిక తీసుకున్నారు, తదితర అంశాలను సమాచార హక్కుచట్టం ద్వారా వివరాలు సేకరిస్తే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లో జరిగిన అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చే అవకాశాలుంటాయి. చాలా మందికి ఈ సాంకేతిక కారణాలు తెలియక అవినీతి జరిగిందని చెబుతారు గానీ..ఎక్కడ జరిగింది..ఏ రోస్టర్ లో అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శించారనే విషయాన్ని మాత్రం గుర్తుపట్టలేరు. అలా ఎవరు ఏవిధంగా చేతివాటం ప్రదర్శించారో ఈ రోస్టర్ విధానాన్ని, మెరిట్ లిస్టు ఆధారంగా వివరాలు సేకరిస్తే బండారం మొత్తం బయట పడుతుంది.

Tadepalli

2022-10-20 03:39:01