1 ENS Live Breaking News

పోలీసు ఉద్యోగాల పేరుతో బురిడీ.. విశాఖలో వెలుగులోకి

విశాఖలో ఓ జంట పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.కోట్లు వసూలు చేశారు. గత కొంతకాలంగా ప్రియురాలు, మరికొందరితో కలిసి రాష్ట్ర పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగాలు ఇప్పిస్తామని యువకులకు ఆశ చూపించాడు హనుమంతు రమేష్‌ అనే వ్యక్తి. అతని మాటలు నమ్మిన బాధితులు డబ్బులు చెల్లించారు. కట్.. చేస్తే.. విశాఖలో ఘరానా మోసం బయటపడింది. పోలీస్ ఎస్సై డ్రెస్‌ వేసుకుని.. జనాలకు మస్కా కొడుతూ ప్రేమజంట మోసాలకు పాల్పడింది. పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను బురిడీ కొట్టించింది ఈ జంట.. అమ్మో ఏకంగా రూ.3 కోట్ల వరకు వసూళ్లు చేసింది. ఆపై వీళ్ల అసలు రంగు బయటపడడంతో బాధితులు.. ఈ కిలాడీ జంటపై కేసు పెట్టగా.. టాస్క్‌ఫోర్స్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నకిలీ ఎస్ఐ హనుమంతు రమేష్ , అతడి ప్రియురాలు యువకులకు ఆశ చూపించారు. వారి మాటలు నమ్మి కొందరు నిరుద్యోగులు మధ్యవర్తుల ద్వారా డబ్బులు ఇచ్చారు. ఈ కిలాడీ జంట ఎస్సై గెటప్‌లో హల్‌చల్ చేయడంతో వారంతా.. ఈ కపుల్ నిజమైన పోలీసులని నమ్మేశారు. ఆ తర్వాత వారి అసలు రంగు బయటపడడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన విశాఖ పోలీసులు.. ఆధారాలు సేకరించగా నిందితులు హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. పోలీసు కమిషనర్‌ సూచనలతో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు హైదరాబాద్‌ వెళ్లి హనుమంతు రమేష్, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. పోలీసుల విచారణలో రమేష్‌ కేవలం ఉద్యోగాల పేరుతో మోసాలే కాకుండా.. బొమ్మ తుపాకీ పెట్టుకొని పలువురిని బెదిరించి వసూళ్లకు కూడా పాల్పడినట్టు విచారణలో తేలింది. మరింత సమాచారం కోసం ఇద్దరినీ రహాస్యంగా ఉంచి విచారిస్తున్నారు పోలీసులు. కాగా హనుమంతు రమేష్‌కు ఇప్పటికే పెళ్లై.. ఇద్దరు భార్యలు (అక్కచెల్లెళ్లు) ఉండగా.. ఇప్పుడు మరో ప్రియురాలితో సహజీనవం చేస్తున్నట్లు తెలిసింది. ఆమెను కూడా తన మోసాలకు పావుగా వాడుకుని.. చాలామందికి శఠగోపం పెట్టాడు.

vizag

2024-03-09 00:45:58

నా కొడుకు మృతికి కోడలే కారణం.. పోలీసులకు ఫిర్యాదు

నా కొడుకు మృతికి మా కోడలే కారణమని ఒక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కశింకోట  మండలం బయ్యారం ఎస్సీ కాలనీకి చెందిన బరుకు గోవింద( 43) శుక్రవారం రాత్రి అనుమానస్పథ స్థితిలో చనిపోయాడు. ఉదయం అతడు చనిపోయినట్టు తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమా చారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు డిఎస్పి సుబ్బరాజు, కసింకోట  సిఐ వినోద్ బాబు సంఘటనా స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. క్లూస్ టీం ,డాగ్స్ స్క్వాడ్ ను రప్పించి ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుండి వివరాలు సేకరించారు. తన కొడుకు మరణం సహజమైనది కాదని, అతని మృతికి తన కోడలు శివాలక్ష్మి కారణమని వెంకయమ్మ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృత దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. సిఐ వినోద్ బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు మృతుడి భార్య శివలక్ష్మిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Kasimkota

2024-01-13 14:56:38

800 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం..ఎస్ఐ రమేష్

నాటు సారా తయారీ అమ్మకాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని పాయకరావుపేట ఎస్ఐ రమేష్ హెచ్చరించారు. సోమవారం దుర్గానగర్ కాలనీ, దారకొండవద్ద నాటుసారా బట్టీలపై దాడులు చేసి 800 లీటర్ల బెల్లం పులుపుని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ, ప్రభుత్వం నిషేధించిన నాటుసా రాను ఎవరు తయారు చేసినా చర్యతప్పవన్నారు. సదరు బట్టీలకు సంబంధించిన వారెవరూ లేకపోవడంతో కొందరు సమాచారం అందించిన వారి సమక్షంలో బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ దాడులకు సంబంధించి అందిన సమాచారం ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మండలంలో ఎవరైనా అక్రమంగా నాటు సారా అమ్మకాలు,తయారీకి పాల్పడితే గ్రామస్తులు గానీ,మహిళలు గానీ పోలీసులకు సమాచారం అందించవచ్చునన్నారు. 

Payakaraopeta

2024-01-08 14:19:17

అదుపు తప్పి డివైడర్ పైకి వచ్చేసిన లోడ్ లారీ

లారీ అదుపుతప్పి డివైడర్ ఎక్కిన ఘటన అచ్యుతాపురం జంక్షన్ లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ రిజిస్ట్రేషన్ కి చెందిన జిజె03బివై8522లాకీ  గాజువాక నుండి ఎలమంచిలి వైపు వెళ్తుండగా.. ఒక్కసారి అదుపు తప్పి డివైడర్ ఎక్కేసింది. అయితే డ్రైవర్ నిద్ర మత్తులో లారీని నడపడం వలనే డివైడర్ వైపు వచ్చిం వెళ్లిందని స్థానికులు అంటున్నారు. కాగా డీవైడర్‌ మొదలయ్యే ప్రదేశంలో  సూచికలు లేకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ జంక్షన్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఘటనలో ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు, లారీ నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లారి డ్రైవర్, క్లీనర్ లను ప్రశ్నించారు.

Atchutapuram

2023-08-09 14:52:09

ఆ సచివాలయ మహిళా పోలీసులు మహా కిలాడీలు..!

ఆ గ్రామ సచివాలయ మహిళా పోలీసులు మామూలోళ్ల కాదు..భర్తలతో కలిసున్నా విడాకులు తీసుకున్నట్టు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సంపాదించారు..అదీ వారు పనిచేసే సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో..డిజిటల్ అసిస్టెంట్ ఏమైనా తక్కువ తిన్నాడా అంటే..పెళ్లికాకుండానే పెళైనట్టు మేరేజి సర్టిఫికేట్ తయారు చేసేసుకున్నాడు. టెక్నాలజీని వినియోగించి పథకం వేశారు గానీ పోలీసులు పట్టి కటకటాల వెనక్కి నెట్టారు. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది. ఆ కిలేడీ మహిళా పోలీసులు..ఘరానా డిజిటిల్ అసిస్టెంట్ ల నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం వివరాలు ఒక్కసారి తెలుసుకుంటే... ప్రభుత్వ పథకాలను అక్రమంగా పొందడానికి నకిలీ ధ్రువపత్రాలను తయారు చేయడంతో ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్‌ను అనకాపల్లి జిల్లాలో పోలీసులు అరెస్టు చేశారు. అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్‌ కాలనీ సచివాలయంలో పనిచేస్తున్న డిజిటల్‌ సహాయకుడు సుధీర్‌ అవివాహితుడైనా డిజిటల్‌ కీ ఉపయోగించి నకిలీ వివాహ పత్రం సృష్టించుకున్నాడు. ఇదే సచివాలయంలో ఉన్న మహిళా పోలీసులు బురుగుబెల్లి రాజేశ్వరి, పైలా వెంకటలక్ష్మి భర్తలతో కలిసి ఉంటున్నా విడాకులు తీసుకున్నట్లు తప్పుడు పత్రాలు తయారుచేసుకున్నారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఈ ముగ్గురు సచివాలయ ఉద్యోగులు, వారికి సహకరించిన వాలంటీర్‌ చొక్కాకుల నానాజీలపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వారికి స్టేషన్‌ బెయిల్‌ మంజూరయిందని.. విచారణ కొనసాగుతోందని తెలిపారు. కాగా ఈవిషయం తెలియడంతో జిల్లాలోని సహచర మహిళా పోలీసులంతా ఉలిక్కి పడ్డారు. ప్రభుత్వ పథకాల కోసం ప్రభుత్వ ఉద్యోగులైన వీరు ఇలాంటి వ్యవహారం నడిపారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఒకరి వల్ల మొత్తం డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ వ్యవహారం అనకాపల్లి జిల్లాతోపాటు, రాష్ట్రంలోనూ హాట్ టాపిక్ అయ్యింది..!

Anakapalle

2023-08-09 04:45:34

విజెఎఫ్ కాలంచెల్లిన కమిటీపై ఆ సెక్షన్లే ఎందుకు వేశారంటే..!

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) కాలంచెల్లిన కమిటీపై విశాఖలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోలీసులు వేసిన సెక్షన్లు భారతీయ శిక్షాస్మృతి(IPC 420, 406 r/w, 34 ) జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున ఆధ్వర్యంలో జరిగిన ప్రాధమిక ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా వేసినట్టు చాలా స్పష్టంగా కనపిస్తుంది. జిల్లా అధికారులు  చేపట్టిన విచారణలోనే చాలా అంశాలు వెలుగు చూడటం, కొన్ని విరాళాలు, చెల్లింపులకు సంబంధించి రిసిప్ట్ లు కనిపించకుండా చేయడం, ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టుకి, విజెఎఫ్ బైలాకి వ్యతిరేకంగా వ్యవహరించడం తదితర అంశాలన్నీ విచారణలో అధికారికంగా బయటపడ్డాయి. అంతేకాకుండా నార్లవెంకటేశ్వర భవన్ లోని గతంలో ఇండస్ ఇండ్ బ్యాంక్ ద్వారా వచ్చిన అద్దెలు, ప్రెస్ మీట్ల ద్వారా వచ్చిన ఆదాయాలు, అప్పటి అగ్రిమెంట్లు, ప్రస్తుతం వున్న బ్యాకరీకి గ్రౌండ్ ఫ్లోర్, మరియు ఫస్ట్ ఫ్లోర్ అద్దెకి ఇచ్చిన సమయంలోనూ, భవనంపై ప్రకటనల ప్రదర్శన కోసం వేసిన డిస్ప్లే బోర్డుల విషయంలో కుదుర్చుకున్న అగ్రిమెంట్లు దాచిపెట్టడం.. ఆదాయానికి మంచి ఖర్చులు అత్యధికంగా చూపించడం ఫైవ్ మెన్ కమిటీలో ఒకరైన జిల్లా ఆడిటర్ లెక్కలు వేసి ఆధారాలతో సహా నిరూపించారు దానిని జిల్లా కలెక్టర్ కి సైతం నివేధించారు. ఇంకా బయటకు తేలని లెక్కలు చాలానే ఉన్నాయని కూడా ప్రకటించారు.

అన్నింటి కంటే ముఖ్యంగా విజెఎఫ్ పై కోర్టుకేసులు వేసిన విషయం కావాలనే సర్వసభ్య సమావేశం పెట్టి సభ్యులకు తెలియజేయకుండానే.. అదే సభ్యుల ఆమోదం లేకుండా నేరుగా కాలం చెల్లిన కమిటీ సంతకాలతో విజెఎఫ్ కి వచ్చిన ఆదాయంలో సుమారు రూ.90వేలకు పైగా మొత్తాన్ని ఫీజు రూపంలో చెల్లించింది. దానిని ఆడిట్ రూపంలో లెక్కలు వేయించడాన్ని జిల్లా రిజిస్ట్రార్ నివేదిక ద్వారా ఆడిటర్ గుర్తించారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టులోని చాప్టర్ 4 ప్రకారం ఏదైనా సొసైటీపైగానీ, అప్పటికి నడుస్తున్న కార్యవర్గంపై గానీ ఏదైనా పోలీసు కేసు, కోర్టు కేసులు నమోదు అయితే ఆ విషయాన్ని సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ్యుల ఆమోదంతో కేసును న్యాయస్థానంలో ఎదుర్కోవడానికి ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల అనుమతి పొందాలి. లేదంటే సదరు కోర్టు కేసులను సొంత ఖర్చులు భరించి ఎదుర్కోవాల్సి వుంటుంది. కానీ కాలం చెల్లిన కార్యవర్గం తనకు నచ్చినట్టుగా విజెఎఫ్ ఆదాయాన్ని..సభ్యులకు తెలియజేయకుండానే కోర్టుకేసు వాధించినందుకు పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుచేసింది. విశేషం ఏంటంటే సదరు 2 కోర్టు కేసుల్లోనూ విజెఎఫ్ నుంచిగానీ, కేసు వేసిన వారుగానీ కోర్టుకి హాజరు కానందున డిఫాల్ట్ డిస్మిస్ కింద కేసును న్యాయమూర్తి కొట్టేశారు. కనీసం ఆ విషయాన్ని కూడా అనధికార కార్యవర్గం సభ్యులకు తెలియజేయలేదు. పైగా కోర్టు తీర్పుని వక్రీకరించి..కేసు విజెఎఫ్ కి అనుకూలాంగా వచ్చిందని ప్రచారం చేశారు. దానిని కూడా జిల్లా కలెక్టర్ నియమించిన త్రీమెన్ కమిటీ, ఆరువాత వేసిన ఫైవ్ మెన్ కమిటీని సేవ్ విజెఎఫ్ సభ్యులు కోర్టు తీర్పు లిఖితపూర్వక ఆధారాలతో సహా సమర్పించారు.

2012 కార్యవర్గమే 2015వరకూ పరిపాలించింది. ఆఖరు సమయంలో సర్వసభ్య సమావేశం పెట్టి లెక్కలు కోశాధికారి చెప్పే సమయంలో సభ్యులందరూ కాలం చెల్లిన కమిటీ చెప్పిన బూటకపు లెక్కలను తిప్పికొట్టారు. అదేవిధంగా కోర్టులో సభ్యత్వాల విషయంలో కేసు నమోదుకాగా..అప్పటి నుంచి 2023 వరకూ అనధికారికంగానే కమిటీగా కొనసాగుతూ వచ్చేసింది. అంతేకాకుండా 2015 నుంచి 2020 వరకూ ప్రతీ ఏడాది సర్వసభ్య సమావేశం పెట్టినట్టుగా తప్పుడు నివేదికలు చూపి విజెఎఫ్ సొసైటీని ఆన్ లైన్ లో రెవిన్యువల్ చేస్తూ వచ్చేసింది. అయితే ఈమధ్యకాలంలో విజెఎఫ్ ఆదాయ వ్యయాలపై ఇన్కకం టాక్స్ రిటర్న్స్ వేసి, ఈఫైలింగ్ చేసిన తరువాత ఆడిట్ రిపోర్టు వేయించాల్సి వుంది. కానీ ఈకాలంలో ఒక్క 2018-19 కాలానికి మాత్రమే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి మిగిలిన ఏళ్లకు మాత్రం కేవలం ఆడిట్ రిపోర్టులు మాత్రమే చూపించింది ఆదాయ వ్యవయాలకు ఎక్కడా పొంతనలేకుండా. ఆధారాలన్నీ నేరుగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళితే సొసైటీ రిజిస్ట్రేషన్ రెవిన్యువల్ కాదని గమనించిన ఈ కాలంచెల్లిన కమిటీ ఆన్ లైన్ లోనే 2020వరకూ రెవిన్యువల్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ విషయాన్ని గమనించిన జిల్లా రిజిస్ట్రార్ 2020 తరువాత విజెఎఫ్ సొసైటీని రెవెన్యువల్ చేయడానికి నిరాకరించారు. నాటి నుంచి నేటి వరకూ విజెఎఫ్ సొసైటీ రెవిన్యువల్ కాకుండా అలాగే ఉండిపోయింది. ఈ విషయాన్ని ఫైవ్ మెన్ కమిటీ విచారణలో జిల్లా రిజిస్ట్రార్ కూడా కమిటీని విజెఎఫ్ సొసైటీ సర్వసభ్య సమావేశం పెట్టినట్టు చూపించిన కాలంచెల్లిన కార్యవర్గం మాత్రమే సంతకాలు చేసి ఇచ్చిన వాటిని ఆధారాలుగా చూపించారు. 

వీటన్నింటినీ పరిశీలించిన ఫైవ్ మెన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు కోర్టుకి నివేదించిన పాత విజెఎఫ్ సభ్యుల కంటే అధనంగా..అనధికార కార్యవర్గం సభ్యులను చేర్చిన విషయం, ప్రతీఏడాది జిల్లారిజిస్ట్రార్ కి సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ లన్నీ తప్పుల తడకలుగా ఉండటాన్ని సాంకేతికంగా నిరూపించడానికే గుర్తించారు. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా కొన్నింటిని మాత్రమే విజెఎఫ్ కాలం చెల్లిన కమిటీపై ఫిర్యాదు చేసిన జర్నలిస్టులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం పెట్టి మరీచెప్పారు. ఆసమయంలో జర్నలిస్టుల విజెఎఫ్ అనధికార కార్యవర్గం చేసిన తప్పులను, అక్రమాలను, మోసాలను నేరుగా కలెక్టర్ ఆధారాలతో సహా జిల్లాఆడిటర్ ద్వారా బయటపెట్టారు. ఆ రిపోర్టును నేరుగా విజెఎఫ్  నోటిసు బోర్డులో కూడా ప్రదర్శనకు ఉంచారు. ఇంకా లక్షలాది రూపాయిలకు సంబంధించిన ఆదాయాలు, ఖర్చులు, రిసిప్ట్ లు మాయం కావడాన్ని కూడా జిల్లా అధికారులు గుర్తించిన విషయాలతో మళ్లీ జర్నలిస్టులు విశాఖ నగర పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేయడంతో గట్టి సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనితో ఖర్చులు చూపించిన కోశాధికారి, కార్యక్రమాలు నిర్వహణ చూసి చేయించిన కార్యదర్శి, యావత్ కమిటీకే అధ్యక్షుడిగా ఉన్నవారంతా ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పత్తాలేకుండా పోయారు. ఇక పోలీసులు విజెఎఫ్ కాలం చెల్లిన కమిటీపై వేసిన సెక్షన్లు రుజువైతే కనీసం ఏడేళ్లు జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశాలున్న కేసులను ఫైల్ చేశారు.

ఐపిసీ సెక్షన్ 34 ప్రకారం, కమిటీ అందరూ కలిసి ఉమ్మడిగా(విజెఎఫ్ కాలం చెల్లిన అనధికార కమిటీ)ఉద్దేశపూర్వకంగా నేరం చేయడం, ఖర్చులను, లెక్కలను, ఆధారాలు లేకుండా ఆమోదం చేయడం. అంటే ఎన్నికలు లేకుండా, సర్వసభ్య సమావేశాలు జరగకుండా, సభ్యుల ఆమోదం లేకుండా కేవలం సదరు సభ్యులే అన్నీ సొంతంగా నిర్ణయాలు చేసేసి అమలు చేయడం. సెక్షన్ 406 r/w ప్రకారం కాలం చెల్లిన కమిటీ విజెఎఫ్ సభ్యులను నమ్మించి మోసం చేయడం (కిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్) అంటే పెట్టని సర్వసభ్య సమావేశాలు పెట్టినట్టు చూపించడం, సభ్యులకు తెలియని లెక్కలు చూపించడం.. సభ్యుల ఆదమోదం లేకుండా కార్యక్రమాలు, వాటి ఖర్చులను సొంతంగా విజెఎఫ్ నిధుల నుంచే చెల్లించడం, అదాయం కంటే ఖర్చులు అత్యధికంగా చూపించడం తదితరాలు ఉన్నాయి. ఇక సెక్షన్ 420 ప్రకారం మోసం చేయడం, విలువైన సెక్యూరిటీలో మొత్తం లేదా ఏదైనా భాగాన్ని తయారు చేయడం(ఉదా హరణకు నార్ల వెంకటేశ్వర భవన్ లోని ఆదాయంరాని అనధికా కార్యక్రమాలకు విజెఎఫ్ నిధుల నుంచే కరెంటు బిల్లులు చెల్లించడం), మార్చడం లేదా నాశనం చేయడం వంటి విషయాలు గుర్తించడం.  ఈసెక్షన్ లతో కేసు ఆధారాలతో రుజువైతే నిందితులకు ఏడేళ్లుకు పైగా  జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. మాట్లాడితే భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రెస్ క్లబ్ అంటూ ప్రచారం చేసిన ఈ అనధికార కార్యవర్గం ఆదాయాలను, విరాళాలను ఇష్టరీతిన ఖర్చుచేయడం, వాటిని సభ్యులకు తెలియజేయకపోవడం, సభ్యుల ఆదమోదం లేకుండా చేయడమే ఈ సెక్షన్ల నమోదుకు కారణం అవుతోంది. విజెఎఫ్ కాలం చెల్లిన కమిటీపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు అయ్యిందిగానీ ఇప్పటి వరకూ విశాఖ నగర పోలీసులు మాత్రం అరెస్టులు చూపించలేదు..!

Visakhapatnam

2023-07-24 17:26:01

విశాఖలో గంజాయి పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

విశాఖలోని ఫోర్త్ టౌన్ పరిధిలోని టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా రవాణా అవుతున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయితోపాటు నకిలీ మావోయిస్టుని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఏజెన్సీ ప్రాంతం నుంచి విశాఖకు గంజాయి తరలిస్తున్నట్టుగా ముందస్తు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా వలపన్ని గంజాయి రవాణా చేస్తున్నవారిని పట్టుకున్నారు. ఒక కారు, బైక్, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Visakhapatnam

2023-07-05 06:11:02

విశాఖలో కిడ్నాప్ సుఖాంతం..పోలీసుల అదుపులో నిందితులు

విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎంవివి సత్యన్నారాయణ, ఆయన భార్య, ప్రముఖ ఆడిటర్ మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ జివిలు కిడ్నాప్ కావడం..నిందితులను పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే పట్టుకోవడం రెండూ జరిగిపోయాయి. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడుతోపాటు ప్రముఖ ఆడిటర్ జివిని ఉదయం హేమంత్ అనే మరో నలుగురితో కలిసి కిడ్నాప్ చేశాడు. దీనితో ఎంపి ఫిర్యాదు మేరకు నగర సిపి డా.త్రివిక్రమ వర్మ నగరం నలుచెరగుల 17 బ్రుందాలతో గాలింపు చేపట్టారు. వెంటనే కిడ్నాప్ అయిన వారిని విడిపించి సురక్షితంగా ఇంటికి చేర్చారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో దుండగులు ఉన్నారు. ఒక పార్లమెంటు సభ్యుని కుటుంబ సభ్యులను విశాఖ మహానగరంలో కిడ్నాప్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. అయితే విషయం కాస్త గోప్యంగానే ఉంచారు పోలీసులు..విషయం తెలుసుకున్న మీడియా హడావిడి చేయడంతో అప్పటికే నిందితులను పట్టుకున్న పోలీసులు కథ సుఖాంతం అయినట్టు ప్రకటించారు.

Visakhapatnam

2023-06-15 07:29:05

విశాఖ ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ జివి కిడ్నాప్

విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎంవివి సత్యన్నారాయణ, ఆయన భార్య, ప్రముఖ ఆడిటర్ మాజీ స్మార్ట్ సిటీ చైర్మన్ జివిలు కిడ్నాప్ కావడం విశాఖ మహానగరంలో కలకలం స్రుష్టించింది. విషయాన్ని సీరియస్ గా తీసుకున్న నగర పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. కాగా విశాఖలోని రెండు మూడు చోట్ల ఎంపీ ఎంవివి ఆకాశ నిర్మాణాలు చేపడుతున్నారు. ఆ ప్రాజెక్టులు లక్షల కోట్ల వ్యవయంతో నిర్మిస్తున్నారు. అదేకారణంగా భావించి కిడ్నాప్ జరిగి ఉండవచ్చునని చెబుతున్నారు. అదేసమయంలో ఎంపి భార్య, కొడుకుతో పాటు స్మార్ట్ సిటి చైర్మన్ జివిలు కూడా కిడ్నాప్ కావడంపైనా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఇటీవలే ఎంపి కుమారుడికి వివాహం జరిగింది. విశాఖ మహానగరంలో ఎంవిపిలో నడిరోడ్డుపై కొద్దిరోజుల 2హత్యలు జరిగాయి. ఇపుడు ఏకంగా పార్లమెంటు సభ్యుడి కుటుంబాన్నే కిడ్నాప్ చేయడ.. గత గొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్నట్టు అంర్ రాష్ట్ర సుపారీ పార్టీ నగరంలోకి దిగాయా అనే అనుమానాలు బలపడుతున్నాయి.

Visakhapatnam

2023-06-15 07:16:05

రౌతులపూడిలో ఏసిబికి చిక్కిన అవినీతి ఎంఈఓ

రౌతులపూడిలో అవినీతి చేప ఏసిబికి చిక్కింది. ఎంఈఓగా పనిచేస్తున్న ఎస్.వి.నాయుడు. రౌతులపూడిలోని స్వర్ణ భారతి స్కూల్ రికగ్నైజేషన్, రెన్యువల్ కోసం రూ.10వేలు డిమాండ్ చేశాడు. దీనితో నిర్వహకులు రూ.7,500కు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో పధకం ప్రకారం స్కూల్ కరస్పాండెంట్ ఈరోజు ఎంఈఓకి డబ్బు లు ఇస్తుండగా రాజమండ్రి అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హేండెడ్ గా పట్టుకున్నారు. ఎంఈఓ వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకొని కేసునమోదు చేశారు. విష యం బయటకు తెలియడంతో కాకినాడ జిల్లా విద్యాశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

Rowthulapudi

2023-06-08 14:03:16

రైలు నుంచి జారిపడ్డ ప్రయాణీకులు -ఇద్దరి పరిస్థితి విషమం

అనకాపల్లి రైల్వే స్టేషన్లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుండగా ముగ్గురు ప్యాసింజర్లు జారిపడి తీవ్ర గాయాలపాలయ్యారు. ట్రైన్ నుంచి జారిపడిన వారిలో అనకాపల్లి మండ లం మూలపేట గ్రామానికి చెందిన అల్లం శంకర్, చోడవరానికి చెందిన జనపరెడ్డి దాక్షాయిని, అనకాపల్లికి చెందిన కరణం అన్నపూర్ణ ఉన్నారు. వీరిలో అల్లం శంకర్, దాక్షా యినిల పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విశాఖలోని ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మరో ప్రయాణికురాలు అనకాపల్లికి చెందిన కరణం అన్నపూర్ణ స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అనకాపల్లి నుంచి తాడేపల్లిగూడెం వెళ్లేందుకు ఆరుగురు స్టేషన్ కు వచ్చారు. ఖాళీగా ఉన్న బోగీల కోసం వెతుకుతుండగా రైలు నెమ్మదిగా కదిలింది. ఆ వెంటనే ముగ్గురు రైలెక్కారు. మరో ముగ్గురూ ఎక్కేలోగా రైలు స్పీడందుకోవడంతో ఒకరి వెనుక ఒకరు చొప్పున ముగ్గురూ పడిపోయారు. రైలెక్కిన ఆ ముగ్గురూ కూడా తర్వాత స్టేషన్లో రైలు దిగి వెనక్కి వచ్చినట్టు తెలిసింది. తీవ్ర గాయాల పాలైన ఇద్దరూ విశాఖ లోని కేజీహెచ్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసును ప్రభుత్వ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Anakapalle

2023-06-07 14:04:01

శంఖవరంలో 2600 కేజిల పిడిఎస్ బియ్యం పట్టివేత

ఏపి ప్రభుత్వ ప్రజా పంపిణీ సంస్థ, చౌక ధరల దుకాణాల లబ్దిదారుల నుంచి బియ్యాన్ని కొని అక్రమంగా మారు వ్యాపారం చేస్తోన్న నుంచి పాఠంశెట్టి కృష్ణ నుంచి  రూ.1,09,000 విలువచేసే 2,600 కేజీల బియ్యాన్ని కాకినాడ జిల్లా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారం ప్రకారం విజిలెన్స్ సిఐ.రమేష్, తాహసిల్దార్ విజయకుమార్ బృందం ఈ తనిఖీలను నిర్వహించింది. శంఖవరంలోని కుమ్మరివీధిలోని ఇంటి నెం.7-195 లో 50 కేజీల చొప్పున మెత్తం 52 బస్తాల బియ్యాన్ని  అక్రమంగా నిల్వఉంచినట్టు అధికారులు గుర్తించారు. ఇతను గొంధి కొత్తపల్లి, గౌరంపేట, కొత్తపల్లి తదితర గ్రామాల లబ్దిదారుల నుంచి కేజీ బియ్యాన్ని రూ.18లకు కొనుగోలుచేసి, వాటిని తిరిగి శంఖవరం మండలం మండపం, రౌతులపూడి మండలం పల్లపు చామవరం గ్రామాల్లోని ఇటుకల బట్టీ కార్మికులకు రూ.21 లకు విక్రయిస్తున్నాడు. మారుబేరం అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు నిందితుడు కృష్ణ స్వీయ వాంగ్మూలంలో అంగీకరించాడు. అతను, అతని సహకారులపై 420 ఐపిసి సెక్షన్ 7(1) ఈ.సీ.చట్టం 1955 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేసి మొత్తం బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈదాడుల్లో శంఖవరం ఎమ్ఎస్ఓ ఇస్మాయిల్,  సచివాలయం1 వీఆర్వో టి.సీతారామ్, మహిళా పోలీస్ జిఎన్ఎస్ శిరీష, సచివాలయం2 వీఆర్వో వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Sankhavaram

2023-06-07 04:25:27

విజెఎఫ్ కాలం చెల్లిన కార్యవర్గంపై ఫైమెన్ కమిటీ విచారణ

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్)పై విశాఖజిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున నియమించిన ఫైన్ మెన్ కమిటీ విచారణ ప్రారంభం అయ్యింది.  ఈ కమిటీలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిఐజీ, జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్, డిస్ట్రిట్ ఆడిట్ ఆఫీసర్, ఆర్డీఓ, ఈస్ట్ డివిజన్ ఏసిపిలు ఫిర్యాదులను పరిశీలించారు. తొలుత గురువారం ఆర్డీఓ కార్యాలయంలో తొలి సమావేశం అయిన అధికా రుల బృందం శుక్రవారం సభ్యులు సమర్పించిన ఆధారాలను  క్షుణ్ణంగా పరిశీలించారు. విజెఎఫ్ బైలా ఏం చెబుతుంది.. సర్వసభ్య సమావేశం పెట్టకుండా ఒకే కమిటీ 8ఏళ్లపాటు కమిటీగా కొనసాగవచ్చా.. ఈఫైలింగ్ లేని ఆడిరిపోర్టులు, చేపట్టకుండా చేసినట్టు చూపిన సర్వసభ్య సమావేశాలు.. సొసైటీ నిబంధనల ప్రకారం నేటికూ సభ్యుల ఆమోదం లేకుండా చేసిన సొసైటీ రెవిన్యువల్, విజెఎఫ్ పై నమోదైన 2 కోర్టు కేసుల విషయాన్ని త్రిసభ్య కమిటీకి, సభ్యుల దృష్టికి తీసుకు రాకపోవడంపై విచారించారు. దానికి తోడు సీనియర్ జర్నలిస్టు బంటయ్య ఆధ్వ ర్యంలో 288 పేజిల ఆధారాలను కమిటికి అందించారు.

Visakhapatnam

2023-05-26 14:00:13

అన్నవరం స్టేషన్ ఎస్ఐ శోభన్ కుమార్ సస్పెండ్..!

కాకినాడజిల్లా అన్నవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి.శోభన్ కుమార్ ను జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్  సస్పెండ్ చేశారు. ఈయన సస్పెండ్ వెనుక అవినీతి వ్యవహరాలు, అధిక ఫిర్యాదులే కారణంగా తెలుస్తుంది. అన్నవరం స్టేషన్ లో ఎస్ఐగా ఆయన 2022 ఫిబ్రవరి 25న విధుల్లోకి చేరారు. సరిగ్గా 15నెలలు తిరిగేలోపే సస్పెండ్ కి గురయ్యారు. ఎస్ఐ సస్పెన్షన్ ను జిల్లా ఎస్పీ దృవీకరించారు. ఈయనపై వచ్చిన ఫిర్యాదులపై ఏలూరు రేంజి డిఐజి శాఖాపరమైన విచారణ చేపట్టిన అనంతరం మే18న సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. ముఖ్యంగా అన్నవరం స్టేషన్ పరిధిలోని సెటిల్ మెంట్లు, గుట్కా మాఫియాతో చేతులు కలిపి భారీ ఎత్తున అమ్మకాలకు ప్రోత్సహిస్తున్నారనే ఫిర్యాదులు అత్యధికంగా వెళ్లినట్టు తెలుస్తుంది. కాగా స్టేషన్ పరిధిలో ని పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. తమ ఫిర్యాదులు పట్టించుకోవడం లేదని, పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారని బహిరంగంగానే ఎమ్మెల్యే లు, మం త్రులు, ఎంపీల వద్ద తమగోడును వెళ్లబోస్తూ వచ్చారు. గత కొద్ది రోజులుగా వస్తున్న ఫిర్యాదులపై సత్వరమే స్పందించిన జిల్లా పోలీసు యంత్రాంగం విచారణ చేపట్టడం అనతి కాలంలోనే సస్పెండ్ చేయడం రెండూ జరిగిపోయాయి. అన్నవరం ఎస్ఐ సస్పెన్షన్ తో కాకినాడ జిల్లాలోని అవినీతి పోలీసుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Annavaram

2023-05-19 13:58:21

భారీ చోరీ.. 3రోజుల్లో రికవరీ.. శెభాష్ అన్నవరం పోలీస్..!

అర్దరాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో తాళాలు పగులగొట్టి, లోపలి ప్రవేశించి, బీరువాలో ఉన్న సుమారు రూ. 22.44లక్షలు విలువచేసే బంగారు, వెండి ఆభరణాల తోపాటు దొంగిలించిన రూ. 50 వేలునగదును  2 రోజుల్లోనే ఛేదించిన అన్నవరం పోలీసులను పెద్దాపురం ఎస్డీపీఓ కె.లతాకుమారి అభినందించారు. ఈమేరకు అన్నవరం పోలీస్ స్టేషన్ లో ఆమె మీడియాకి చోరీ, రికవరీ వివరాలు వెళ్లడించారు.  కాకినాడ జిల్లా  అన్నవరంలోని శ్రీ సత్యదేవ జూనియర్ కళాశాల వెనుక గోగుల వీరభద్రరావు అద్దెకు ఉంటున్న ఇంటికి 12వ తేదీన తాళాలు వేసి, ఆ ఇంటిలో ఎవరూలేని అర్ధరాత్రి సమయంలో ఇనుప కట్టరుతో ఇంటి తాళాల్ని పగులగొట్టి, బీరువాలోని సుమారు రూ. 21.29 లక్షలు విలువ చేసే 33.8 కాసుల బంగారు ఆభరణాలు, రూ. 1.15లక్షలు విలువ చేసే 1.5 కేజీల వెండి వస్తువులు, రూ. 50వేలు నగదును అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పీనారిపాలెం గ్రామానికి చెందిన చిటికెల నాగేశ్వరరావు (32) దొంగిలించాడన్నారు. బాధితుడు గోగుల వీరభద్రరావు ఫిర్యాదు మేరకు 116/2023 యు/ఎస్ 457, 380 గా అన్నవరం పోలీసులు కేసు నమోదుచేశారని పేర్కొన్నారు. అనంతరం తన ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్తిపాడు సీఐ. కె.కిషోర్ బాబు ఆధ్వర్యంలో అన్నవరం ఎస్సై పి.శోభన్ కుమార్, ఏలేశ్వరం ఎస్సై జి.సతీష్ , ప్రత్తిపాడు ఎస్సై ఎం.పవన్ కుమార్, మిగతా పోలీసు సిబ్బంది 3బృందాలుగా ఏర్పడి చాకచక్యంగా 2రోజుల్లోను దొంగను గుర్తించారని చెప్పారు. అతడిని అదుపులోకి తీసుకుని చోరీమొత్తం, నేరానికి ఉపయోగించిన కట్టర్, తెలుపు రంగు మారుతి స్విఫ్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరస్తుడు చెందిన చిటికల నాగేశ్వరరావును కోర్టులో హాజరు పరిచామన్నారు. పెద్దచోరీని 3 రోజుల్లోనే చాకచక్యగా చేధించిన పోలీసు సిబ్బందిని ఎస్డీపీఓ అభినందించారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


ఇంటర్ నెట్ జూదానికి అలవాటు పడి దొంగతనాలు..
తాళాలు వేసి ఉన్న ఇళ్లకు కన్నం వేసి దొంగతనాలే లక్ష్యంగా చేసుకొని నేరాలకు పాల్పడుచున్న నర్సీపట్నం మండలం పీనారిపాలెం గ్రామానికి చెందిన చిటికల నాగేశ్వ రరావు (32 ) గతంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజరుగా 2015 చేరాడు. అప్పటి నుండి ఇతను ఆలమూరు మండలం నర్సిపూడి, కిర్లంపూడి  మండలం సోమవరం గ్రామంలో గ్రామీణ బ్యాంకులో పని చేసాడు. అనంతరం గొల్లప్రోలు గ్రామంలో గ్రామీణ బ్యాంకులో పనిచేస్తూ సుమారు ఒక సంవత్సరం పాటు అన్నవ రంలో శ్రీసత్య దేవా జూనియర్ కాలేజీ వెనుక న్యూ కాలనీలో కుటుంబంతో కాపురం ఉన్నాడు.  ఏలేశ్వరం, నిడమర్రు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుల్లో పనిచేస్తూ అంత ర్జాల జూదం పందాలకు అలవాటు పడి అక్రమార్జనకు బ్యాంకు లాకర్లలోని  బంగారాన్ని దొంగిలించి అమ్ముకొన్న కేసులో అవకతవకలకు పాల్పడినందున నిడమర్రు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఉద్యోగం నుండి సస్పెండ్ అయ్యాడు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ పందాలకు డబ్బు కోసం దొంగతనాలు చేసేవాడు. ఇదే క్రమంలో గతంలో ఏలేశ్వరం గ్రామంలో ఏటీఎం చోరీకి పాల్పడి రూ. 2.34 లక్షలు చోరీ చేసాడు. ఈ కేసులో ఏలేశ్వరం పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ఆపై జైలు నుండి బెయిలుపై విడుదల అయ్యాడు. అనంతరం అన్నవరంలో దొంగతనానికి పాల్పడి పోలీసులకు దొరికి పోయాడు.

Annavaram

2023-05-15 03:56:07