1
ప్రధమ దేవుడు ఆ మహాగణపతి పండుగ, వినాయక చవితి ఉత్సవాలను ఉపకార్ ట్రస్టు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు సినీ హీరో కంచర్ల ఉపేంద్రబాబు ప్రకటించారు. బుధవారం విశాఖలోని 12వ వార్డు నెహ్రూనగర్ లో జనసేన యూత్, కంచర్ల యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక పందిరి రాట పూజలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మాట్లాడుతూ, వినాయకచవితి మహోత్సవాలను ట్రస్టు ఆధ్వర్యంలో ఎప్పుడూ చేపట్టినట్టుగా ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రధమదేవుడు వినాయకుడి దీవెనలు విశాఖవాసులతోపాటు రాష్ట్రప్రజలపై కూడా పుష్కలంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని అనుమతులు తీసుకొని, వినాయక పందిళ్లు ఏర్పాటు చేయాలని కంచర్ల యూత్ ప్రెసిడెంట్ ను సుధీర్ ను ఆదేశించారు. స్వామివారి ఉత్సవాలను ఘనంగా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లును కూడా చేయాలన్నారు.
సాంస్క్రుతిక కార్యక్రమాలకు కావాల్సిన అనుమతులు, విద్యుత్ అలంకరణలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నారు. వినాయక పందిళ్లు కొనసాగినన్ని రోజులు, దూప దీప నైవేద్యాలతోపాటు తీర్ధ ప్రసాదాలు కూడా భక్తులకు వితరణ చేసేందుకు వీలుగా అన్ని దగ్గరుండి చూసుకోవాలని సుధీర్ ని కోరారు. ఉపకార్ ట్రస్టు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రధమ దేవుని పండుగ ఉత్సవం పెద్ద సంబురంలా చేయడానికి యువకులు, ట్రస్టు సభ్యులు జనసేన యూత్ కూడా అధిక సంఖ్యలో రావాలని కోరారు. అంతకు ముందు పందిరి రాట కోసం ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. సినిమాహీరో ఉపేంద్రను చూడటానికి ఆ ప్రాంతానికి అధిక సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. అనంతరం హీరో ఉపేంద్రను యూత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కారక్రమంలో నెహ్రూ నగర్ అధ్యక్షులు పొట్టి అప్పారావు, వైస్ ప్రెసిడెంట్ బాషా, క్యాషియర్ ధన, క్యాషియర్ గడిపామురవి, జాయింట్ క్యాషియర్ నాగు, సభ్యులు రాజు, నాని, రాము, లౌలీ, వంశీ, శివ, మను, శ్రీకాంత్, నవీన్, వైజాగ్ శ్రీను, గొంప శ్రీను, పైరోడ్డు కుమార్, అమ్మ సౌండ్స్ చిన్న, దిలీప్, కళ్యాణ్, అధిక సంఖ్యలో వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.