1 ENS Live Breaking News

మానవత్వం చాటుకున్న మంత్రి అమర్నాథ్

 రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో సహాయం కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు క్షతగాత్రులకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సహాయం అందించి వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.  బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన పినపోలు నాగేశ్వరరావు, అతని తమ్ముని కుమారుడు సంజయ్ ద్విచక్ర వాహనంపై శుక్రవారం మధ్యాహ్నం విశాఖ వైపు వస్తున్నారు.   మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న అల్యూమినియం రైలింగ్ ని ఢీకొని కింద పడటంతో  వీరిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నాగేశ్వరరావుకు తలతో సహా పలు చోట్ల గాయాలై తీవ్ర రక్తస్రావం అవుతోంది. అలాగేసుమారు 10 సంవత్సరాల వయసు ఉన్న సంజయ్ కూడా తీవ్ర రక్తస్రావంతో రోడ్డు మీద పడి ఉన్నాడు. ఇదే సమయంలో మంత్రి అమర్నాథ్ అనకాపల్లి నియోజకవర్గంలో  కార్యక్రమాలు ముగించుకుని విశాఖపట్నం వస్తున్న సమయంలో రోడ్డు పక్కన రక్తమోడుతూ కనిపించిన వీరిద్దరిని చూసి, వాహనం దిగి వెంటనే తన కాన్వాయ్ లో ఉన్న ఒక వాహనంలో క్షతగాత్రులను ఎక్కించి, పోలీసుల సహాయంతో వారిని లంకెలపాలెం సిహెచ్సికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స జరుగుతున్న నేపథ్యంలోనే మరో రెండు అంబులెన్స్లను కూడా ఆసుపత్రికి పంపించి క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం విశాఖ పంపించాలని వైద్యాధికారులను మంత్రి అమర్నాథ్ ఆదేశించారు. తీవ్ర గాయాలైన నాగేశ్వరరావు,  సంజయ్ ప్రస్తుతం విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంత్రి అమర్నాథ్ ప్రమాద స్థలికి చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించకపోయి ఉంటే వారి పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉండేది.

Anakapalle

2023-09-01 10:17:38

ఆపదలోని నిండు గర్భిణికి రక్తదానం..బ్లడ్ డోనర్ సురేష్

ఆ రక్తదాత, శంఖవరం గ్రామ సచివాలయ సర్వేయర్ వీర్ల సురేష్ ఎప్పుడు తన రక్తాన్ని దానం చేసినా ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికే చేస్తారు..అందునా ఈసారి నిండు గర్భిణికి ప్రాణాపాయ స్థితి అని కబురు తెలిసిన వెంటనే గురువారం అన్నవరం నుంచి కాకినాడ జిజిహెచ్ కి వెళ్లిమరీ రక్తాన్ని దానంచేసి వచ్చారు. ఇప్పటి వరకూ 20సార్లు తన రక్తాన్ని దానం చేసిన సురేష్ ఈసారి తన రక్తదానం జీవితంలో గుర్తుండిపోతుందని చెప్పాడు. తన తండ్రి వరహాలబాబు స్వర్గస్తులైన రోజు ఆపద సమయంలో ఉన్న గర్భిణికి రక్తం దానం చేసే అవకాశం వచ్చిందని అన్నాడు. ప్రతీ 3నెలలకు ఒకసారి తాను రక్తం దానం చేస్తున్నానని అన్నారు. మనం చేసే రక్తం దానం వలన ఎనిమిది మంది ఆరోగ్యాలను కాపాడటానికి అవకాశం వుంటుందని, అంతేకాకుండా శరీరంలోకి కొత్తరక్తం కూడా చేరుతుందన్నారు. ఈ క్రమంలో తాను ఇచ్చే రక్తదానంతో చాలామంది స్పూర్తి పొందుతుండటం కూడా తనకు అసలైన సంతృప్తిని  కలిగిస్తుందన్నని సురేష్ చెప్పారు.

Kakinada

2023-08-10 15:27:27

కన్నీటిబొట్టు నేలరాలింది.. ద్రవించిన నిండు హృదయం పాడేమోసింది..!

నిన్నమొన్నటి వరకూ కలిసి తిరిగిన వీడియో జర్నలిస్టు చిన్నా ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. ఏం జరిగిందో తెలుసుకునే లోపే ప్రాణం పోయింది. పోషణ మొత్తం అతనేకావడంతో పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం రోడ్డున పడి చేసినరోధన ప్రతీ ఒక్క జర్నలిస్టునూ కదిలించింది. చేయి చేయికలిపిన కలం కార్మికుల విషణ్ణ వదనాలమధ్య అంతిమయాత్రతో చిన్నాకు చివరి వీడ్కోలుపలికారు. కన్నీటిబొట్టు నేలరాలుతూనే ద్రవించిన హృదయంలో విజెఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు పాడేమోశాడు..ఇష్ట కాలంలోనే కాదు కష్టంలోనూ ముందుకొచ్చి రూ.50వేలు ఆర్ధిక సహాయం అందించి ఆ కుటుంబాన్నిఆదుకున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఏకష్టమొచ్చినా నేనున్నానని మరిచిపోవద్దంటూ కొండంత భరోసా ఇచ్చారు. గంట్ల సహాయంతో ముందుకొచ్చిన జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు వారికి తోచిన సహాయం చేసి చిన్నా కుటుంబానికి చేయూతనందించారు.

undefined

2023-03-09 04:00:42

ఆపద సమయంలో (మూర్తీ)వభించిన రక్తదానం..!

ఆపద సమయంలో ఒకరికి రక్తదానం చేయడమంటే నిజంగా ప్రాణదానం చేసినట్టుగానే వైద్యులు భావిస్తారు. విశాఖలో రామక్రిష్ణ అనే జర్నలిస్టు తల్లిగారికి అనారోగ్యం చేసి గీతం ఆసుపత్రిలో చేరారు. అత్యవసరంగా ఎ పాజిటివ్ రక్తం కావాల్సివచ్చింది.దీనితో జర్నలిస్టుల గ్రూపులో తనఅవసరాన్ని తెలియజేశాడు. ఆపద అంటే ఎవరికీ చెప్పిరా దు. విషయం తెలుసుకున్న ఆంధ్రప్రభ జర్నలిస్టుమూర్తి వెంటనే స్పందించి రక్తం దానం చేయడానికి ముందుకి వచ్చారు. అప్పటికప్పుడు నగరం నుంచి ఆసుపత్రికి వెళ్లా లంటే చాలా దూరం..మూర్తికి తన సహాయంగా కారులో తీసుకువెళ్లి సకాలంలో రక్తాన్నిదానం చేసేలా చేశారు మరో జర్నలిస్టు ఎమ్మెస్సార్ ప్రసాద్. వీరి తక్షణ సహాయం జర్నలిస్టు తల్లికి సకాలంలో రక్తం అందేలాచేసింది. ప్రార్ధించే పెదవుల కన్నా సహాయంచేసే చేతులు మిన్న అన్న మంచి మాటకు నేడు నిజమైంది.  రక్తం దానం చేసిన మూర్తికి జర్నలిస్టుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. 

Visakhapatnam

2023-02-11 16:31:59

యువతపై సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ ఎఫెక్ట్

ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ నిర్వహిస్తున్న పోలీసు ఉద్యోగాలకు ఉచిత కోచింగ్ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆలోచింపజేస్తున్నది. ప్రభుత్వం సుమారు ఆరువేలకు పైగా పోలీసుశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేస్తే.. ఆఉద్యోగాలకు సిద్ధమయ్యేవారికి జెడీ ఫౌండేషన్, మరియు మరో ప్రైవేటు కోచింగ్  సెంటర్ సహకారంతో నిర్వహించున్నన్న ఉచిత శిక్షణా కార్యక్రమం రాష్ట్రంలో వైరల్ అవుతుంది. రాష్ట్రప్రభుత్వం అదీనం ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం నిరుద్యోగల కోసం ఉచిత కోచింగ్ నిర్వహించలేదు. అలాంటి సమయంలో  సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ ఐపీఎస్ కూడా కావడంతో పోలీసు ఉద్యోగాలకు సిద్దమయ్యేవారికోసం ఉచితంగా వెయ్యిమందికి ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తానని ముందుకి వచ్చారు. ఎలాంటి మీడియా ప్రకటన లేకుండా కేవలం సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసిన వీడియో ప్రచారానికే వేల సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో స్క్రీనింగ్ సెంటర్లను 
ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్నారు. అందులో ఎంపిక అయిన వారికి పోలీసు ఉద్యోగాలకు ఉచితంగానే కోచింగ్ ఇవ్వనున్నారు.

ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు పడ్డ గండి
 సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ నిర్వహించ తలపెట్టిన ఉచిత కోచింగ్ కారణంగా రాష్ట్రంలో ప్రధానంగా పోలీస్ ఉద్యోగాలకే శిక్షణ ఇచ్చే కోచింగ్ సెంటర్లకు గండి పడే ప్రమాదం ప్రస్తుతం ఈ ప్రకటన వస్తున్న స్పందన ద్వారా కనిపిస్తున్నది. ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ రెండింటిలోనూ ఈ ఉచిత కోచింగ్ ఇస్తామని ప్రకటించడంతో ఆశావాదులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. అంతేకాదు ఈసమయంలో పలు ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో చేరుదామనుకుంటున్న వారికి, కోచింగ్ సెంటర్లకు ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం గండి కొట్టినట్టు అయ్యింది. అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రతిపక్షంలో ఉన్న రాజకీయపార్టీలు 
చేయలేని కార్యక్రమాన్ని ఒక సామాజిక భాద్యతలో చేపడుతున్న  లక్ష్మీనారాయణ పట్ల యువతలో మరింత గౌరవ భావం పెరుగుతున్నది. 

అనూహ్య స్పందన, నిరుపేదలే ఎక్కువ
ఏపీలో పోలీస్ ఉద్యోగాలకు పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్ పడటంతో అత్యధిక మంది నిరుపేదలు, నిరుద్యోగులు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో  సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో అందించే ఈ ఉచిత కోచింగ్ కూ పెద్ద సంఖ్యలో ఆదరణ లభిస్తున్నది. ఇప్పటికే సదరు సంస్థ విడుదల 
చేసిన యూట్యూబ్ ఛానల్ ను కూడా పోలీస్ ఉద్యోగాలకు పోటీపడుతున్న అభ్యర్ధులు, susbscribe చేసుకోవడంతోపాటు, ఎంట్రన్స్ టెస్టుకి కి దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం తరపున ఎలాంటి శిక్షణా కార్యక్రమం లేకపోవడం, బయట కోచింగ్ సెంటర్లలో పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండటంతో 
ప్రస్తుతం ప్రకటించిన జెడీ ఫౌండేషన్ ఉచిత పోలీసు పోటీ పరీక్షల ఉచిత శిక్షణ వెల్లువలా దరఖాస్తులు వస్తున్నాయి. చూడాలి రాష్ట్రవ్యాప్తం వెయ్యింది మందికి  నిర్వహించే ఈ కోచింగ్ కు ఎన్ని వేల మంది దరఖాస్తులు చేసుకొని, ఎంట్రన్సు పరీక్షలో పోటీ పడతారో..మరెంత మంది ఆ శిక్షణ ద్వారా ఉద్యోగాలు సాధిస్తారో..!

Visakhapatnam

2022-12-09 06:10:24

మానవత్వం చాటిన ఎమ్మెల్యే వాసుపల్లి..

సమాజంలో నాల్గవ స్థంబంగా వున్న మీడియా లేకపోతే బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరికీ ఏమీ తెలియదు. అలాంటి మీడియాకి, అందులో పనిచేసే జర్నలిస్టులకు కష్టం వస్తే పట్టించుకునే నాధులే కరువైపోయిన రోజులివి.. కానీ కష్టమంటే ఎల్లప్పుడూ ముందుండే విశాఖ దక్షిణ నియోజవకర్గం ఎమ్మెల్యే వాసుపల్లి పక్షవాతానికి గురైన జర్నలిస్టును ఆదుకోవడానికి ముందుకి వచ్చారు. విశాఖలో పలు శాటిలైట్ లోకల్ టీవీ ఛానల్స్ లో వీడియో జర్నలిస్టుగా పనిచేస్తూ పక్షవాతం వచ్చి ఇపుడుఇంటికే పరిమితం అయ్యాడు. ఈ విషయాన్ని విశాఖ స్మార్ట్ సిటీ వీడియో జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాద్ సహచన వీడియో జర్నలిస్టు పరిస్థితిని తెలియజేయడంతో..చలించి పోయిన ఎమ్మెల్యే స్వయంగా కె ఆర్ ఎమ్ కాలనీ లో  సీనియర్ వీడియో జర్నలిస్ట్ శివ ప్రసాద్ ఇంటికి  పరామర్శించి రూ.20వేలు ఆర్ధిక సహాయం చేశారు. అంతేకాకుండా ప్రభుత్వం తరపు నుంచి కూడా సహాయం అందేలా చూస్తామని ఆయనకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ, సమస్త సమాచారాన్ని ప్రజలకు కళ్లకు కట్టేలా టీవీ ఛానల్స్ చూపించే క్రమంలో వీడియో జర్నలిస్టులు పడే శ్రమ ఇంతా అంతా కాదన్నారు. మీడియాతో తనకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి అనుభవం ఉందన్న ఎమ్మెల్యే సహచర వీడియో జర్నలిస్టు కష్టాల్లో ఉండటాన్ని తన ద్రుష్టికి తీసుకు వచ్చిన యూనియన్ సభ్యులను కూడా ఎమ్మెల్యే వాసుపల్లి అభినందించారు. సీఎం వైఎస్. జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షపాతని.. జర్నలిస్ట్ సంక్షేమ కోసం నిత్యం పని చేస్తున్న ఎకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అని ఎమ్మెల్యే వాసుపల్లి కొనియాడారు.  విశాఖలో ఏ జర్నలిస్ట్ కైనా కష్టకాలంలో సహాయం అందించేందుకు ముందు ఉండే వాసుపల్లికి వీడియోజర్నలిస్టులంతా అభినందన తెలియేశారు.  ఈకార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2022-10-19 08:33:30

అలుపెరగని నిశ్వార్ధ సేవ@గంట్లశ్రీనుబాబు

ఉరుకుల పరుగుల జీవనం..క్షణం తీరిక దొరకని వైనం..అయినా ఆగదు  ఆయన నిరంతర సేవాయానం.. అది విపత్తు అయినా..సాధారణ కష్టమైనా.. మరేదైనా.. ఐదు రూపాయల సహాయం చేసి.. 50 రూపాయాల ప్రచారం పొందే ఈరోజుల్లో..నిశ్వార్ధంగా సేవలందిస్తూ.. నా అన్నవారికి ఆపన్న హస్తం అందించే వ్యక్తి గంట్ల శ్రీనుబాబు.. జర్నలిస్టుగా.. జర్నలిస్టు సంఘ జాతీయ నాయకుడిగా..సేవకుడిగా నిరంతరం ప్రజాసేవలోనే ఇమిడిపోతూ..ఎవరినైనా నా తమ్ముడూ, నా అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ వ్యక్తికోసం రాసే ఏ వార్తయినా తడుముకోకుండానే పదాల పదనిసలు పత్రికపై నాట్యం చేస్తాయి. పేరుకోసం చేసే సహాయం అంటే చాలా మంది దాతలు ముందుకొస్తారు..కానీ గంట్లశ్రీనుబాబు చేసే సహాయం తెలిస్తే..ఎలాంటి వారైనా  సహాయాన్ని తమ జీవితంతో ఒక భాగంగా చేసుకుంటారు. ఎవరైనా మ్రుతిచెందితే ప్రభుత్వం కూడా మట్టిఖర్చులు ఇవ్వడానికి వారం రోజులు సమయం తీసుకుంటుంది. కానీ ఈయన మాత్రం ముందుగా దహన సంస్కార కార్యక్రమాల్లో పాల్గొని ఆఖరి మజిలీ ర్యాలీ నిర్వహించి..ఆ కుటుంబానికి మట్టిఖర్చులు ఇచ్చి తన వంతు బాధ్యతను సేవగానే చేస్తారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు ఈయన చేసిన సేవా కార్యక్రమాలు ఈ వార్తలో చెప్పాలంటే పెన్నులో సిరా చుక్కలు ఇంకిపోవాల్సిందే. అలాంటి సేవా మూర్తి 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ పండుగ రోజున సేవామూర్తి అవార్డు తీసుకోవడం ఆయనకే కాదు.. యావత్ జర్నలిస్టులకే గర్వకారణంగా చెప్పాలి. ఆయనకి ఏ అవార్డు, ఏ కీర్తి లభిచించినా దానాని జర్నలిస్టుల కుటుంబాలకు అంకితం ఇచ్చే మంచి మనసున్న దాత శ్రీనుబాబు. ఎల్లప్పుడూ జర్నలిస్టుల సంక్షేమం, వారి అభివ్రుద్ధి.. నిరుపేదలకు సహాయం అందించాలనే మంచి ఆలోచనతో ముందుకి సాగే గంట్ల శ్రీనుబాబు రానున్న రోజుల్లో ఆయన సేవను మరింత మందికి విస్తరించాలని..మరెందరికో స్పూర్తిగా నిలివాలని..ఇంకెన్నో అవార్డులు స్వీకరించాలని మనమంతా కోరుకుందాం..!

Visakhapatnam

2022-08-15 12:26:49

దివ్యాంగులకు ఉచిత ఉపకరణాలు..

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సీఎస్ఆర్ కింద దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలను ఉచితంగా పంపిణీ చేయనుందని ఆర్టి ఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (అలిమ్కో) అధికారి జయచంద్ర తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన రాజమహేంద్రవరంలో ఓ ప్రకటన విడుదల చేశారు. మూడు చక్రాల సైకిళ్లు, రోలర్స్ , అందుల చేతికర్ర ఎలా కృత్రిమ అవయవాలు, డైసీ ప్లేయర్ వంటివి పొందేందుకు ఈనెల  29 వ తేదీ రాజామహేంద్రవరం రూరల్ ఎంపీడీవో కార్యాలయంలోనూ, 30 వ తేదీ కొవ్వూరు  ఎంపీడీవో కార్యాలయంలోనూ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ శిబిరాలు ఆయా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచి 3 గంటల వరకు పని చేస్తాయన్నారు. ఉచిత ఉపకరణాల కోసం పేర్ల నమోదుకు సదరం సర్టిఫికెట్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రెండు ఫొటోలు, ఫోన్ నంబర్ తీసుకొని రావాలని జయచంద్ర తెలిపారు. సమాచారం కోసం 040-27891463 ఫోన్ నంబరు ను సంప్రదించవచ్చన్నారు.

Rajamahendravaram

2022-07-28 10:52:07

భక్తులకు సేవలో హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ..

శరన్నవరాత్రి ఉత్సవాల తొమ్మిది రోజులు ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు వృద్ధులకు ఉచిత వేడి పాలను పంపిణీ చేస్తున్నామని హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి యాసర్ల కోటేశ్వర రావు తెలిపారు. రోజుకు 500 లీటర్లకు పైగా పాలను క్యూలైన్లలోని భక్తులకు అందిస్తున్నామన్నారు. 2016 సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాల నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులలో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులు, వృద్ధులకు ఉచితంగా వేడి పాలను అందిస్తున్నామని ఆయన తెలిపారు. లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా ట్రస్ట్ సొంత నిధులతో అందిస్తున్నామని దాతలు ఎవరైనా స్వచ్ఛందంగా పాలను సమకూరిస్తే తీసుకుంటామని ఆయన అన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు తమ ట్రస్టు ద్వారా అందించే ఉచిత వేడిపాలను తమ ట్రస్ట్ సభ్యులు అందిస్తున్నారని ఆయన అన్నారు. హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ స్థాపకులు చింతకాయల నాగ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ లో జాయింట్ సెక్రటరీ దుర్గాభవాని, సభ్యులు ఆర్ వెంకటేశ్వరరావు చక్రధర్ గంగాధర్ జయరామ్ భక్తులకు సేవలు అందిస్తున్నారని తెలిపారు.

Vijayawada

2021-10-09 11:01:57

అనాధకు సీమంతం చేసిన డాక్టర్‘అమ్మ’..

ఈరోజుల్లో వైద్యులంటే తినే సమయం గంట కేటాయిస్తే వేల రూపాయలు కోల్పోయి ప్రాక్టీసు పోతుందనే భావనతో ఆసుపత్రిలోనే గడుపుతున్నారు చాలా మంది వైద్యులు.. మరికొందరు కరోనాను బూచితో చేసే వైద్యానికి లేని ఖరీదు కడుతూ రెండు చేతులా సంపాదించడానికే సమయం వెచ్చిస్తారు..కానీ ఈ డాక్టరమ్మ మనసు నిజంగా బంగారం.. సమయం దొరికితే నా అనేవారు లేనివారికి తనవంతు సహాయం చేయాలనుకుంటారు.. విషయం తెలుసుకొని స్వయంగా వెళ్లి సాయం చేసి వస్తారు.. ఒక ప్రచారం.. మరో ఆర్బాటం.. అంతకు మించిన దేశాన్ని మొత్తం వీరే ఉద్దరించేస్తున్నట్టు చేసే హాడివిడీ.. ఏదో గొప్ప సంఘ సంస్కకర్తల్లా రూ.5 సహాయానికి రూ.500 బిల్డప్పులు ఏమీ ఉండవు.. కేవలం చేసిన సహాయాన్ని తలచుకోవడానికి.. ముందు ముందు మరిన్ని సహాయాలు చేయడానికి చేసిన సహాయానికి సంబంధించిన ఫోటోలతోనే ఆత్మ సంత్రప్తి పడతారు..  వాటిని ప్రేరణగా తీసుకొని మరిన్ని సహాయాలు చేస్తారు ఆమెపేరే డా..సుధ కొనకళ్ల.. పశ్చిమ గోదావరి జిల్లా సత్తుపల్లికి చెందిన ఈమె.. వ్రుత్తి రీత్యా ఆయుర్వేద వైద్యులు, మొక్కల ప్రేమికులు, అంతకంటే ముందు సమాజసేవకులు. తన సంపాదన మొత్తం కుటుంబానికే కాకుండా పేదలకు కొంత కేటాయించే  నిండు మనసున్న డాక్టరమ్మ.. ఇక విషయానికొస్తే ఇటీవల ఇదే గ్రామానికి చెందిన చిన్నమ్మకు 19ఏళ్లకే పెళ్లైంది.. కడు నిరుపేద.. ప్రస్తుతం 7నెలల గర్భిణి.. ఈ అమ్మాయి తల్లి చిన్నప్పుడే చనిపోయింది. దీనితో ఆయనకు అన్నీ భర్తే.. అతను కష్టపడితేనే వీరిద్దరికి(కడుపులో బిడ్దతో కలిపి ముగ్గురికి) కడుపునిండుతుంది. కనీసం గూడు కూడా లేని ఈమే విషయం డాక్టర్ సుధ తెలుసుకున్నారు. వెంటనే మూడు రకాల మిఠాయిలు, రెండు రకాల పళ్లు, ఒక జత బట్టలు, పసుపు, కుంకుమ, తీసుకెళ్లి ఆ నిరుపేదకు ఇచ్చారు. తల్లిలేని లేని లోటును, తనకి సీమంతం జరిగుంటుంటే బాగుణ్ణు అనే కోరికను మంచి మనసుతో తీర్చిన నిండైన హ్రుదయమున్న డాక్టరమ్మ.. వాస్తవానికి నిరుపేదల దగ్గరకి వెళ్లడానికి, అదీ కనీసం ఇల్లు కూడా సరిగా లేనివారి దగ్గరకు వెళ్లడానికి ఈ రోజుల్లో ఎవరూ సాహసించరు. అలాంటిది ఆ చిన్నమ్మ పరిస్థితి తెలుసుకొని ఎలాగైనా తనవంతు సహాయం చేయాలని నిశ్చయించుకొని మరీ స్వయంగా వెళ్లి సీమంతం చేసి వచ్చారు డాక్టర్(అమ్మ). ఎప్పుడూ ప్రచారాని దూరంగా వుంటూ తనవంతు ఉచిత వైద్యసేవలు చేస్తూ..అంతకంటే ఎక్కువగా పేదలకు తనవంతు సహాయం చేస్తూ మంచి దాతగా గుర్తింపు పొందారు డాక్టర్ సుధ కొనకళ్ల. మనం చేయాలనుకుంటే ఎవరీని సంప్రదించకుండానే సహాయం చేయాలి.. నేను ఎన్నో సహాయాలు చేశారు.. కానీ ఈరోజు తల్లిదండ్రులు లేని ఈ నిండు గర్భిణికి చేసిన సీమంతం నా జీవితంలో గుర్తుండి పోతుందని ఆనందం వ్యక్తం చేశారీమె..అయితే ఇవన్నీ ఆమె చెబితే తెలుసుకున్నవి కాదు..నిత్యం ఆమె ఫేస్ బుక్ పోస్టింగ్లు చూస్తూ.. ఆమె సేవలు  తెలుసుకుని ఈఎన్ఎస్ చీఫ్ రిపోర్టర్ బాలు అందించినదే ఈ మానవీయ కధనం.. దాతలంటే దారిచూపేవారు..దరి చేర్చుకునేవారు.. దాత్రుత్వం ప్రద్శించేవారు..వాటన్నంటికీ కేరాఫ్ అడ్రస్ డాక్టర్ సుధ కొనకళ్ల.. ఇలాంటి దాతలు మరింత మంది ముందుకొస్తే.. అంతకంటే మరింత మంది నిరుపేదలకు ఎన్నో సహాయాలు అందుతాయి.. ప్రార్ధించే పెదవుల కన్నా..సాయం చేసే చేతులు మిన్న..!

సత్తుపల్లి

2021-07-26 12:30:09

హేట్సాఫ్ కలెక్టర్ జి.మురళీధరరెడ్డి..

తూర్పుగోదావరి జిల్లాకి చాలా మంది ఐఏఎస్ అధికారులు జిల్లా కలెక్టర్లుగా వచ్చారు.. రెండేళ్లపాటు పనిచేసి తిరిగి పదోన్నతులు, బదిలీలపై తిరిగి వెళ్లారు.. కానీ జిల్లా కలెక్టర్ జి.మురళీధరరెడ్డి మాత్రం ఈ జిల్లాలో 86 మంది గ్రామ సచివాలయ పోలీసులకు ఉద్యోగాలు పోకుండా మానవతా ద్రుక్పదంతో ఆలోచించి వారి జీవితాల్లోనూ, కుటుంబాల్లోనూ వెలుగులు నింపారు.. నిజంగా తూర్పుగోదావరి జిల్లాలో పనిచేసి జిల్లా కలెక్టర్లలోనే కాదు రాష్ట్రంలోనే ఇదొక చరిత్ర అనే చెప్పాలి. అంత మంచిగా మానవతా ద్రుక్పదంతో ఆలోచించే కలెక్టర్లు ఇలాంటి రోజుల్లో ఉంటారా అంటారు మీకూ విషయం తెలిస్తే.. అంతే కాదు ఆయన చేసిన సహాయానికి, ఆ మహిళలందరికీ ఉద్యోగాలు రావడానికి ఇచ్చిన ఆదేశాలు తెలిస్తే హేట్సాఫ్ కూడా చెబుతారు. ఆ మంచి కార్యక్రమంలో  ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ మొబైల్ యాప్, www.enslive.net కూడా భాగమైన విషయాన్ని మీకు ఆయన జిల్లా నుంచి బదిలీ అవుతున్న సందర్భంగా జిల్లా వాసులకు, ఉద్యోగాలు పొందిన మహిళా పోలీసుల ఆనందాన్ని ఇక్కడ ప్రత్యేకంగా తెలియజేయబోతున్నాం. అది 2020 జనవరి 21 ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామసచివాలయ వ్యవస్థకు మహిళా పోలీసు ఉద్యోగులను ఎంపిక చేసే ప్రక్రియ. 3వ లిస్టు పెట్టి 86 మందికి మహిళలకు  కాల్ లెటర్లు, ఫోన్లు చేశారు కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది. వారంతా 22వ తేది  జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి వారి సర్టిఫికేట్ల వెరఫికేషన్ ప్రక్రియలో కూడా పాల్గొన్నారు. అక్కడ వారందరికీ నాన్ క్రీమీలేయర్ సర్టిఫికేట్లు లేవని చెబితే మళ్లీ వారి మండలాలకు వెళ్లి ఆగమేఘాలపై వెళ్లి ఆ సర్టిఫికేట్లను కూడా తెచ్చుకొని 23వ తేది సాయంత్రం 5 గంటలకు ఎన్నో ఇబ్బందులు పడి తెచ్చుకున్నారు. దానికి కారణం ఆ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఉద్యోగం రాదనేది జిల్లా ఎస్పీ కార్యాలయ అధికారుల చేసిన హెచ్చిరకే కారణం. దీనితో ఉద్యోగానికి కావాల్సిన అన్ని ద్రువీకరణలు తెచ్చుకున్నారు ఉద్యోగార్ధులంతా. రెండు రోజుల పాటు సరిగా తిండి తినక ఉద్యోగం వస్తుందనే ఆనందంతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ ఈ నియామక ప్రక్రియలో పాల్గొన్నారు. అందరికి ఆయా సచివాలయాలను కేటాయిస్తూ జాబితా కూడా సిద్దం చేసేశారు. 23వ తేదీన వారందరికీ నియామక ఉత్తర్వులు ఇవ్వాలి.. అందరూ భోజనాలు చేసి వస్తే నియామక పత్రాలు ఇస్తామని చెబితే.. ఒక్క మహిళ కూడా ఎస్పీ కార్యాలయం నుంచి బయటకు వెళ్లలేదు. తమకి ఉద్యోగాలు వచ్చాయని, నియామక పత్రాలతో ఆనందంగా ఇంటికి వెళదామని.. తమ వెంట వచ్చిన కుటుంబ సభ్యులతో కలిసి ఏ హోటల్లోనే భోజనం చేద్దామని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో..  సరిగ్గా సమయం 3 గంటలు అవుతున్న ప్రాంతంలో కార్యాలయం నుంచి ఒక సిఐ వచ్చి.. మీ అందరికీ బ్యాడ్ న్యూస్ మీకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు కేన్సిల్ అయ్యాయి.. మీరంతా ఇంటికి వెళ్లిపోవచ్చు అన్నారు. అంతే ఆ మాటలు విన్న మహిళలంతా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. చేతి వరకూ వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం ఒక్కసారిగా దూరమైతే పరిస్థితి ఎలా ఉంటుందో ఆ వేదన అనుభవించిన వారికే తెలుస్తుంది. పోలీసు అధికారులు ఉద్యోగాలు కేన్సిల్ అయిన విషయాన్ని ప్రకటించడంతో అక్కడ ఉద్యోగాలు వస్తాయనుకున్న వారంతా ఒకటే ఏడుపులు, ఆర్ధనాదాలు. వెంటనే వీరంతా తమనకు న్యాయం చేయాలంటూ పోలీసుల కోరితే.. అవేమీ పట్టించుకోని పోలీసు అధికారులు అప్పటి వరకూ ఎంతో మర్యాదగా చూసి అప్పటికప్పుడు వీరందరినీ బయటకు పంపి గేట్లు వేయాలని మరో అధికారి ఆదేశించారు.. అత్యధిక సంఖ్యలో మహిళా పోలీసులకు ఉద్యోగాలు కల్పిస్తున్న న్యూస్ ని కవర్ చేయడానికి రెండు రోజుల పాటు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చిన ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ చీఫ్ రిపోర్టర్ పి.బాలభాను(బాలు) వ్యవహారం మొత్తం గమనిస్తున్నారు. అయితే ఒక్కసారి పోలీసులు ఈ విధంగా ప్రకటించడంతో ఏదో జరుగుతుందని అక్కడ జరుగుతున్న తంతుని, తాజా సమాచారాన్ని ఎప్పటి కప్పుడు  తమ న్యూస్ ఏజెన్సీ ప్రధాన కార్యాయాలనికి  లైవ్ గా ఒక పక్కగా అందిస్తూనే.. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని కాకినాడతోపాటు, జిల్లాలోని అన్ని మీడియా సంస్థల రిపోర్టర్లకు విషయాన్ని, ఫోటోలను, వీడియోలను క్షణాల్లో చేరవేశారు. దానితో విషయం మొత్తం అన్ని టీవీ ఛానళ్లు, మొబైల్ న్యూస్ యాప్స్ లో క్షణాల్లో వైరల్ అయ్యింది. ఉద్యోగాల కోసం ఎస్పీ కార్యాలయంలో వున్న మహిళందరికీ ఆందోళన చేస్తున్నారని పోలీసులు బయటకు నెట్టేశారు. దీనితో వెంటనే  ఈఎన్ఎస్ చీఫ్ రిపోర్టర్ మహిళలందరికీ దైర్యం చెప్పి గ్రామసచివాలయ శాఖ పంచాయతీరాజ్ శాఖకు చెందినది కావడంతో వారిని జెడ్పీ సిఈఓ దగ్గరకు వెళితే న్యాయం జరుగుతుందని చెప్పారు. ఆ వెంటనే  అక్కడి నుంచి మహిళలంతా బైకులు, ఆటోల్లో జెడ్పీ సిఈఓ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కూడా వారికి చుక్కెదురైంది.. జాబ్స్ కేన్సిల్ అయితే తాము ఏమీ చేయలేమని అక్కడ అధికారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేతులెత్తేశారు.. అంతేకాకుండా ఈ విషయాన్ని ఒకేసారి 86 మంది మహిళలు వచ్చి చెప్పడంపై  కోపంతో ఊగిపోతూ ఇక్కడ కూడా సిబ్బందితో మహిళలందరికీ బయటకు పంపేశారు. అప్పటికే సమయం 5 అవుతుంది. కలెక్టర్ కార్యాలయంలో అధికారులంతా డ్యూటీ ముగించుకొని వెళ్లిపోయే సమయం. అది తలచుకుంటూ మహిళలందిరిలోనూ ఒక్కటే ఆందోళన.. అక్కడ జరిగిన అవమానాన్ని దిగమింగుతూ కంటతడి పెట్టుకుంటూ జెడ్పీ కార్యాలయం కిందికి దిగుతున్నారు.. మళ్లీ వారిని గమనించిన ఈఎన్ఎస్ ప్రతినిధి ఆ వెంటన ఇక్కడ మీకు పనిజరగదని మీరు నేరుగా జిల్లా కలెక్టర్ ద్రుష్టికి తీసుకెళితే ప్రయోజనం వుంటుందని చెప్పడంతో.. మళ్లీ అక్కడి నుంచి ఈ ఆశావాహులంతా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ఏడుపులు, పెడబొబ్బలు, ఆందోళన చేసుకుంటూ పరుగులు తీశారు.. అప్పటికే ఈఎన్ఎస్ లైవ్ యాప్ న్యూస్  ద్వారా విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకి తెలిసింది. ఆ వెంటనే కానినాడలో వున్న మీడియా మొత్తం కలెక్టరేట్ కి చేరుకుంది. అక్కడ ఆందోళనను బ్రేకింగ్ న్యూస్ ద్వారా అన్ని టీవీఛానళ్లలో ప్రసారం చేసింది.. పైగా కలెక్టరేట్ ఆవరణలోనే ఆందోళన జరుగుతుండటంతో విషయం తెలుసుకున్న కలెక్టర్ జి.మురళీధరరెడ్డి కొంత మందిని తన చాంబర్ లోకి పిలిపించుకున్నారు. జరిగిన విషయం మొత్తం వారి ద్వారా సావధానంగా  తెలుసుకున్నారు. అంతేకాదు జిల్లా పోలీస్ శాఖ చేసిన తప్పుని కూడా గుర్తించారు. ఈ నియమాకంలో ఉద్యోగాలు రాకపోతే సుమారు 45 మంది వయసు దాటిన మహిళలకు ఉద్యోగాలు రావు. మళ్లీ దగ్గర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా లేదు.. వారికి ఇక ఉద్యోగాలు రావు కారణం వారికి 43ఏళ్లు దాటిన వారే అధికంగా వున్నారు. దానితో అప్పటి కప్పుడే డిఎస్సీ చైర్మన్ హోదాలో వున్న జిల్లా కలెక్టర్  జి.మురళీధరరెడ్డి ముందు ఎంపిక చేసిన 86 మందికి ఉద్యోగాలు నియామక పత్రాలు ఇవ్వాలని జిల్లా ఎస్పీని ఫోనులో ఆదేశించారు. మార్కుల ఆధారంగా ఎంపిక చేయాలని, ఇంకా ఏమైనా పోస్టులు మిగిలితే తరువాత నోటిఫికేషన్ ద్వారా ఇవ్వాలని సూచించారు. కలెక్టర్ మహిళలందరి ఉద్యోగాల కోసం ఆలోచించిన తీరు, అటు మీడియాని కూడా ఎంతో ఆలోచింపజేసింది. కలెక్టర్ తీసుకున్న తక్షణ నిర్ణయంతో ఒకేసారి 86 మంది మహిళలకు గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులకు ఉద్యోగ నియామక పత్రాలు పొందడానికి మార్గం సుగమం అయ్యింది. అలాంటి నిర్ణయాలు తీసుకొని అంత మందికి ఒకేసారి ఉద్యోగాలు కల్పించడం తూర్పుగోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక చరిత్ర, సంచలనం. ఒక జిల్లాకి ముఖ్య అధికారిగా వున్న జిల్లా కలెక్టర్, అందులోనూ మానవతా ద్రుక్పదంగా ఆలోచిస్తే ఫలితాలు ఏవిధంగా ఉంటాయో కలెక్టర్ జి.మురళీధరరెడ్డి ప్రత్యక్షంగా చేసి చూపించారు. అలా ప్రభుత్వ ఉద్యోగాలకి తామంతా దూరమైపోతున్నామనుకున్న వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన ఉన్నత దూరద్రుష్టి కలిగిన అధికారి ఆయన. అనంతరం తిరిగి జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆశావాహులకు రాత్రి 9గంటలకు ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా పోలీసు కార్యాలయం అందజేసింది. జిల్లా కలెక్టర్ జి.మురళీధర రెడ్డి తమ జీవితాలను నిలబెట్టడంతో వారందరి ఆనందానికి హద్దులు లేవు. ఈ విషయం రాష్ట్రంలోనే చర్చనీయాంశమైంది.  అంతేకాదు ఎందరో ఐఏఎస్ అధికారులకు కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఒక మార్గదర్శకమైంది. ఈ ఆనందాన్ని ఉద్యోగాలు వచ్చిన వారంతా థాంక్యూ కలెక్టర్ జి.మురళీధరరెడ్డి సర్, తేంక్యూ సిఎం వైఎస్.జగన్ సార్ అంటూ భారీ కేక్ కట్ చేసి ఆ రాత్రి సమయంలోనే తమ ఆనందాన్ని ఈఎన్ఎస్ ప్రతినిధితో పంచుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చేసిన ఈ మంచి పనిలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్  మొబైల్ న్యూస్ యాప్, www.enslive.netచూపిన చొరవకు ఉద్యోగులంతా ధన్యవాదములు తెలియజేసినా..అవి కేవలం కలెక్టర్ మురళీధరరెడ్డి మాత్రమే దక్కాలంటూ చీఫ్ రిపోర్టర్ పి.బాలభాను(బాలు) అక్కడే మహిళా ఉద్యోగుల ముందే ప్రకటించారు. తరువాత అందరూ జనవరి 24వ తేదీన విధుల్లోకి చేరిపోయారు. ఈ విషయాన్ని ఆయా టీవీ ఛానళ్లలో న్యూస్ గా కవర్ చేసిన రిపోర్టర్లు కూడా కలెక్టర్ తీసుకున్న నిర్ణయం 86 మంది కుటుంబాల్లో వెలుగులు నింపిందని హర్షం వ్యక్తం చేశారు. అంతటి మంచి కార్యక్రమంలో ఈఎన్ఎస్ భాగస్వామ్యం అయ్యిందని సగర్వంగా ప్రకటిస్తున్నాం.. అంతటి మంచి ఐఏఎస్ అధికారి కలెక్టర్ జి.మురళీధరరెడ్డి ఇక్కడి నుంచి పదోన్నతిపై బదిలీపై వెళుతున్న సందర్భంగా ఆయనకు మహిళా పోలీసులతోపాటు ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ కూడా హ్రుదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇదంతా ఎందుకు ఇపుడు మీకు తెలియజేశామంటే.. ఐఏఎస్ అధికారులు ప్రజలకు మేలు చేస్తే ఈ స్థాయిలో చేయాలని ఒక చిన్న సందేశం ఇవ్వడానికి మాత్రమే. హేట్సాఫ్ కలెక్టర్ మురళీధరరెడ్డి గారు..!

Kakinada

2021-07-24 15:09:24

మదురాన్నం మహత్తరమైన సేవ..

రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి , గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు స్వచ్చందగా మదురాన్నం సోసైటీ  ద్వారా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి ప్రతిరోజు వస్తున్న  రోగుల సహాయకులకు రెండు పూటల ఉచితంగా  బోజనం అందించటం ఎంతో గొప్ప కార్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పెర్కొన్నారు. ఆదివారం గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి  ఆవరణలో   మధురాన్నం సోసైటీ ఆధ్వర్యంలో  రోగుల సహాయకుల కొరకు ఉచిత బోజనం సదుపాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తో కలసి పాల్గొన్నారు. భోజన సదుపాయం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, భోజనశాలను, వంటశాలను రిబ్బన్ కత్తిరించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. భోజనశాలలో, వంటశాలలో ఏర్పాట్లను మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వివరించారు. ఈ సంధర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు గుంటూరు జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి వస్తున్న రోగుల సహయకులు భోజనం కోసం పడుతున్న  ఇబ్బందులను స్వయంగా చూసి మధురాన్నం సోసైటీ ద్వారా పూర్తి ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారన్నారు.  ఏపీఎన్జీవో సంఘం వారు రోగుల సహాయకుల వసతి కోసం ఏర్పాటు చేసిన భవనంను ఉచిత భోజనం వంటి  ఒక మంచి సత్కార్యం కోసం అందించినందుకు అబినందిస్తున్నామన్నారు. తిరుమల తరహాలో ఆధునిక యంత్రపరికరాలతో ఇక్కడే భోజనంను తయారు చేసి పరిశుభ్ర వాతవరణంలో వేడివేడిగా ఇంటి తరహా భోజనంను రోగులకు అందించేలా భోజనశాలను తీర్చిదిద్దారన్నారు. మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు ఇక్కడే కాకుండా వారి సొంత జిల్లా పశ్చిమ గోదావరిలోను ఎక్కడ అవసరం ఉంటే అక్కడ అన్ని సేవలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం కోసం ఎక్కువ మంది పేదలు వస్తుంటారని వారి సహాయకులకు భోజనం సదుపాయం కల్పించేందుకు చారిటీలు,ట్రస్ట్లు ముందుకు రావాలన్నారు. ఆకలితో ఉన్న వచ్చిన వారికి అన్నం పెట్టడం భారతీయ సంప్రదాయంలో భాగం అన్నారు.  ఉచిత భోజన సదుపాయం ఏర్పాటుకు సహాకారం అందించిన వారికి, ఏపీఎన్జీవో సంఘం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 

ఏపీఎన్జీవో సంఘంకు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ రోగుల సహాయకుల వసతి కోసం జిల్లాలోని ఉద్యోగుల ఆర్ధిక సహాకారంతో రూ.40 లక్షలతో భవనంను నిర్మించటం జరిగిందన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు మంచి సంకల్పంతో రోగుల సహాయకులకు ఉచిత భోజనం అందిస్తున్నందున ఏపీఎన్జీవో సంఘం తరుపున హృదయపూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. ఉద్యోగులు పీఆర్సీలు, డీఏల కోసం కాకుండా సమాజ హితం కోసం కార్యక్రమాలు చేపడుతుందన్నారు.  
రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు రోగుల సహాయకులకు మధురాన్నం సోసైటీ ద్వారా  ఉచిత భోజనం సదుపాయం కల్పించినందుకు అబినందిస్తున్నామన్నారు. లాక్డౌన్ సమయంలో రోగులతో పాటు వచ్చిన సహాయకులకు కనీస ఆహారం అందటం లేదని స్వయంగా చూసిన మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు ఈ బృహత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఏపీఎన్జీవో సంఘం వారు రోగుల సహాయకుల విశ్రాంతి కోసం నిర్మించిన భవనంను ఉచిత బోజనం అందించేందుకు భోజనశాలగా ఏర్పాటు చేసి మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారన్నారు. ఇలాంటి మహత్కార్యాలను అన్ని చోట్ల ఏర్పాటుకు పెద్దలందరూ పూనుకోవాలన్నారు. 

జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధ రాజు మాట్లాడుతూ చారిత్రాత్మకమైన ప్రసిద్ధి చెందిన  గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి పశ్చిమ గోదావరి  నుంచి  నెల్లూరు వరకు ఐదు జిల్లాల నుంచి పేద రోగులు చికిత్స కోసం వస్తుంటారన్నారు. కరోనా సమయంలో పెద్ద ఎత్తున సూమారు 1600 మంది రోగులు ఇక్కడ చికిత్స పొందుతున్నారని, వారికి సహాయంగా వచ్చిన వారు భోజనం కోసం పడుతున్న ఇబ్బందులను గమనించినప్పుడు వచ్చిన ఆలోచనకు అనుగుణంగా మధురాన్నం సోసైటీ ద్వారా రోగుల సహాయకులకు ఉచిత భోజనం సదుపాయంకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఎపీఎన్జీవో సంఘం నిర్మించిన భవనంలో మధురాన్నం సోసైటీ ద్వారా ఉచిత భోజనసదుపాయం కల్పించటం జరిగిందన్నారు.  భోజనశాలలో ఒకేసారి 300 మంది కూర్చోని భోజనం చేసేలా, అన్ని రకాల కూరలు,  పెరుగుతో రోగుల సహాయకులకు  కడుపు నిండా భోజనం అందించటం జరుగుతుందన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ఉన్నంత వరకు మా సోసైటీ ద్వారా ఉచిత భోజన కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రోగుల సహాయకులతో పాటు ఆస్పత్రిలోని పారిశుద్ధ్య కార్మికులు, నాల్గవ తరగతి ఉద్యోగులకు ఉచితంగా  భోజనం అందిస్తామన్నారు. మంచి ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమంను ఎన్జీవో సంఘంతో పాటు అందరి భాగస్వామ్యంతో ముందుకు తీసుకువెళుతామన్నారు.

అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర గృహనిర్మాణశాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ భోజనశాలలో రోగుల సహాయకులకు ఉచిత భోజనం టోకేన్లు పంపిణీ చేసి, భోజనంను స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పిరెడ్డి, జంగా కృష్ణమూర్తి, శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా, మద్ధాళి గిరిధర్, కిలారి వెంకటరోశయ్య, నంబూరి శంకరరావు, మేరుగ నాగర్జున, బొల్లా బ్రహ్మనాయుడు, ఉండవల్లి శ్రీదేవి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నగరపాలక సంస్థ మేయరు కావటి శివనాగ మనోహర నాయుడు, అర్బన్ జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్,  సంయుక్త కలెక్టర్ (రెవెన్యూ, రైతుభరోసా) ఏఎస్దినేష్ కుమార్, ఏపీఎన్జీవో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షలు చంద్రశేఖరరెడ్డి, నూతనంగా ఎన్నికైన జనరల్ సెక్రటరీ కెవీ శివారెడ్డి, జిల్లా ఎపీఎన్జీవో అధ్యక్షులు రామిరెడ్డి, డీఎంహెచ్వో డా. యాస్మిన్, హౌసింగ్ పీడీ వేణుగోపాలరావు, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ప్రభావతి,  గుంటూరు ఆర్డీవో భాస్కరరెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, రాష్ట్ర కృష్ణ బలిజ, పూసల సంక్షేమ మరియు అభివృద్ది కార్పొరేషన్ చైర్ పర్సన్ కోలా భవానీ మణికంఠ, నగరపాలక సంస్థ డిప్యూటీ మేయరు వనమా బాల వజ్ర బాబు వైసీపీ నాయకులు మర్రిరాజశేఖర్, వెంకటరమణ, దేవినేని మల్లిఖార్జున రావు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Guntur

2021-07-04 14:27:51

మానవత్వం చాటుకున్న జిల్లా కలెక్టర్..

నిరక్షరాస్యత, అవగాహన లేమితో ప్రభుత్వ పథకాలు లబ్ధి పొందలేకపోతున్న కుటుంబం దీనావస్థ తెలుసుకొని  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్  మానవత్వంతో స్పందించి ఒక్క రోజులోనే సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవటంతో పాటు, ఉపాధి కల్పించి నిరు పేద కుటంబంలో వెలుగులు నింపారు. వివరాల్లోకి వెళితే జూన్ 25వ తేదీ ఆంధ్రజ్యోతి దినపత్రికలో గుంటూరు నగరంలోని ప్రధాన డ్రైన్లో దుర్భర పరిస్థితులలో ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించి జీవనోపాధి పొందుతున్నాడని ఒక వ్యక్తి ఫోటోను ప్రచురించారు. ఈ వార్తను చూసి చలించిన  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వెంటనే ఫోటోలోని వ్యక్తిని గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) కే శ్రీధర్  రెడ్డికి సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు సంబంధిత వ్యక్తి ఏ.టీ.అగ్రహారంలోని సుగాలి కాలనీ ఒకటో లైను లో  నివశిస్తున్న రౌతు నాగరాజుగా గుర్తించి, అతని కుటుంబ వివరాలు సేకరించారు. భార్య , ఆరుగురు పిల్లలతో అద్దె ఇంటిలో నివశిస్తున్న నాగరాజు నిరక్షరాస్యత, ఆజ్ఞానంతో ఇప్పటి వరకు ఆధార్ కార్డు కూడ నమోదు చేసుకోలేదని, అందువలన కనీసం బియ్యం కార్డు కూడ మంజూరు కాలేదని తెలిసింది. నాగరాజు దంపతులకు  సంబంధిత ప్రాంతంలోని 52వ వార్డు సచివాలయ అడ్మిన్ ఇతర సచివాలయ ఉద్యోగులు, వాలంటీరు  ఆధార్ కార్డు నమోదు చేయించి, బియ్యం కార్డుకు దరఖాస్తు చేశారు. బియ్యం కార్డు దరఖాస్తు చేసిన వెంటనే  కార్డు మంజూరు చేయించారు.  రౌతు నాగరాజు కు నగరపాలక సంస్థలో  కాంట్రాక్టు పద్దతిలో పారిశుద్ధ్య కార్మికునిగా ఉపాధి కల్పించారు. బియ్యం  కార్డు మంజూరు కావటంతో పేదలందరికీ ఇళ్ళ పథకం కు సచివాలయ ఉద్యోగులు దరఖాస్తు చేయించటం జరిగింది.

    గురువారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్  ( ఆసరా, సంక్షేమం) కే. శ్రీధర్ రెడ్డి తో కలసి  రౌతు నాగరాజు , భార్య రౌతు భవాని దంపతులకు బియ్యం కార్డును అందించారు. రౌతు నాగరాజు పిల్లలను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ప్రేమగా పలకరించి వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నాగరాజుకు సూచించారు. చిన్న పిల్లలను వెంటనే అంగన్ వాడీ కేంద్రంలో చేర్పించాలన్నారు.  నాగరాజు కుటుంబానికి మూడు రోజులలోనే ఆధార్ కార్డు నమోదు, బియ్యం కార్డు  మంజూరు చేసిన 52వ వార్డు సచివాలయం  అడ్మిన్ సెక్రటరీ రాధిక, ఇతర సచివాలయ ఉద్యోగులకు,  వాలంటీరుకు చాలా మంచి పని చేశారని జిల్లా  కలెక్టర్ వివేక్ యాదవ్ అభినందించారు. ఈ సందర్భంగా రౌతు నాగరాజు మాట్లాడుతూ ఇంటి ముంగింటకే వచ్చి సంక్షేమ పథకాలు అందించటంతో పాటు, ఉపాధి కల్పించినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. చదువు లేకపోవటం వలన అవగాహన లేక సంక్షేమ పథకాలకు దూరమవుతున్న మా లాంటి పేదలకు సచివాలయ, వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే వచ్చి సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్కు, సచివాలయ అధికారులకు జీవితాంతం ఋణపడి ఉంటామన్నారు.  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గారి నిశిత దృష్టికి, సున్నిత హృదయ స్పందన తోడవడంతో దుర్భర స్థితిలోని ఒక కుటుంబం  ప్రగతి ప్రయాణంలో నిలద్రోక్కుకుంటుందనే విషయంలో ఎలాంటి సందేహానికి తావు  లేదు. 

Guntur

2021-07-01 12:12:14

నిజమైన స్నేహానికి నిలువుట్టదం ఆమె..

అవును స్నేహమంటే టిప్పుటాపుగా కలిసి తిరుగుతూ జీవితాన్ని సరదాగా గడపటం కాదు..తన అనుకునే స్నేహితులు కష్టకాలంలో ఉంటే నేనున్నానని చేయూత నిచ్చి సాయమందించి దైర్యం చెప్పడమే నిజమైన స్నేహమంటే. నా జీవితంలో సగ భాగం నా భర్త..అలాంటి భర్తకు ప్రాణాలమీదకు వచ్చినపుడు నా స్నేహితురాలే నాకు అండగా నిలిచింది. నీకేం భయంలేదు బావగారు ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తారని దైర్యం చెప్పి..కొండంత అండగా నిలిచి నాకు ఎంతగానో దైర్యం చెప్పిన నా చెల్లి కోలా జయలక్ష్మి సేవను, సహాయాన్ని నేను ఎప్పుడూ మరిచిపోలేన చెబుతున్నారు బిసి సంఘం యువజన విభాగం మహిళా అధ్యక్షురాలు ధనుకోటి రమ. మంచివారి సేవలు, చేసిన మేలు పది మందికీ తెలిస్తేనే దానికి న్యాయంజరిగిందని భావించి నా జీవితంలో తను చేసిన మేలును ఈ విధంగా గుర్తుచేసుకుంటున్నానని మీడియాతో చెప్పారు రమ. ప్రార్ధించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మథర్ తెరిస్సా మాటలను ఆదర్శంగా తీసుకొని సేవచేస్తూ సహాయ మందించే జయ కోసం నా హ్రుదయంలో నుంచి వస్తున్న ఆనంద బాష్పాలనే  మాటలుగా చెబుతున్నాను అనుకోవచ్చు మీరు.. సరదాగా కలిసి తిరగడానికి, డబ్బులు ఖర్చుచేయడానికి ఈరోజుల్లో చాలా మందే ఉంటారు. కానీ ఆర్ధిక పరమైన సాయం చేయడానికి ఎవరూ ముందుకి రారు. మాట సహాయమే కాదు, చేతల్లో కూడా తాను తనకి చేసిన మేలు మాట్లల్లో చెప్పలేనిది అన్నారు. జనవరి 31 కోలా జయ పుట్టిన రోజు సందర్భంగా ఆమె చేసే సేవలను, సహాయాన్ని చెప్పడానికి నాకు మాటలు కూడా రావడం లేదని, నిజంగా అలాంటి చెల్లెలని తనకు ఆ సింహాద్రి అప్పన్నే ప్రసాదించారని ఆనందపరవసం చెందారు. తన భర్తకు సీరియస్ చేసిన సమయంలో తన ఇద్దరు పిల్లలను తన సొంతపిల్లలుగా చేరదీసి, రాత్రనక, పగలనక నాతో ఆసుపత్రుల వెంట తిరుగుతూ నాకు జయ అందించిన సహాయం మరువలేనిదని చెప్పారు రమ. చేయని సేవలకు గొప్పగా చెప్పుకునే ఈరోజుల్లో తన పుట్టిన రోజు సందర్భంగా నాజీవిత భాగస్వామి విషయంలో తాను చేసిన సహాయం నిజంగా ఆ దేవుడే ఆమెతో చేయించాడని నమ్ముతానని కన్నీటి పర్యంతం అయ్యారు. విశాఖజిల్లాలో బిసి సంఘం మహిళా యువజన విభాగం కార్యదర్శిగా తాను చేస్తున్నసేవలు ఆమెను ఎంతో ఎత్తుకి తీసుకెళ్లాయని, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనే మంచి మాటను జయ ఎప్పుడూ పాటిస్తారని చెప్పారు. ముఖ్యంగా ఆర్.క్రిష్ణయ్య మార్గదర్శకంలో ఆమె చేస్తున్న కార్యక్రమాలు యువజన విభాగానికే వన్నె తెస్తున్నాయన్నారు. ఒక్క తన విషయంలోనే కదాని ఎప్పుడు, ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా జయ ముందుంటి నడిపించే విధానం, తీరు యువజన విభాగానికే ఆదర్శంగా నిలుస్తాయని చెప్పుకొచ్చారు. అలాంటి మంచి మనిషి పుట్టిన రోజు సందర్భంగా ఆమె స్నేహానికి, తనకు ఇచ్చిన విలువను చెప్పాలనే ఇదాంతా చెప్పానని చెప్పారు రమ. నిజమే గోరంత చేసి కొండంత గొప్పలకి పోయే వారున్న ఈ రోజుల్లో, ఎలాంటి లాభాపేక్ష లేకుండా తనవంతుగా నిండైన సేవ, సహాయం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్న కోలా జయలక్ష్మి తన సేవలను మరింతగా విస్తరించాలని మనమూ కోరుకుందాం..!

Visakhapatnam

2021-01-30 22:14:37