మాంసాహార ప్రియులకు చికెన్ ధమ్ బిర్యానీ పేరు చెప్పినా..దాని వాసన కమ్మగా తగిలినా నోటిలో లాలా జలం ఇట్టే ఊరిపోతుంది.. కానీ చికెన్ ధమ్ బిర్యానీ అంటే అంతా రెస్టారెంట్ లో మాత్రమే బాగుంటుందని చాలామంది భావిస్తారు. కానీ అది తప్పు..ఈఎన్ఎస్ లైవ్ యాప్, మరియు న్యూస్ వెబ్ సైట్ లో చూపిన విధంగా పక్కా కొలతలతో చేస్తే మీరూ రెస్టారెంట్ ను మించిన టేస్టుతో ఇంట్లోనే చికెన్ ధమ్ బిర్యానీ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఆస్వాదిస్తూ..ఆనందం పొందవచ్చు. అలా ఇంట్లోనే మనం కూడా చికెన్ ధమ్ బిర్యానీ చేసుకోవాలంటే మేము చెప్పే ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించి కరెక్టుగా ప్రిపేర్ చేస్తే గుమ గుమలాడే చికెన్ ధమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం. ఇక ఈ చికెన్ ధమ్ బిర్యానీ చేసే విధానం ఒక్క తెలుసుకొని మీరూ ట్రైచేయండి.. ఇక్కడ అరకేజీ బియ్యం, కేజీ చికెన్ తో ధమ్ బిర్యానీకి సరిపడే విధంగా తయారీ విధానం ఈఎన్ఎస్ లైవ్ పాఠకుల కోసం తెలియజేస్తున్నాం. మీరు ఒక్కసారి ట్రై చేసి, మీకు చికెన్ ధమ్ బిర్యానీ ఎలా కుదిరింతో ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో కామెంట్ బాక్సు లో రాయండి. అన్నట్టు మీరు మాత్రం ఈ రెసిపీ ఒకటికి రెండు సార్లు చదువుకొని, ఆపై అన్ని రకాల దినుసులు రడీ చేసుకున్న తరువాత స్టెప్ బై స్టెప్ చేస్తే రెస్టారెంట్ స్టైల్ దమ్ బిర్యాని రెడీ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే చేసేయండి..
చికెన్ ధమ్ బిర్యానీకి కావాల్సిన పదార్ధాలు..
అరకేజి క్వాలిటీ బాసుమతి బియ్యం, కేజి చికెన్, 200 గ్రాముల పెరుగు, 150 గ్రాముల ఉల్లిపాయల బ్రౌన్ ఆనియన్స్, ఒక ఏడు లవంగాలు, ఏడు యాలకులు, రెండు ఇంచిల పొడవున్న మూడు దాల్చిన చెక్క ముక్కలు, 4 మరాటీమొగ్గలు, 5 అనాసపువ్వులు, 5 చెంచాల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చెంచా సాహీ జీరీ, ముప్పావు చెంచా జీలకర్రపొడి, రెండు చెంచాల గరం మసాలాపొడి, రెండు చెంచాల బిర్యానీ మసాలా పొడి, ఒక చెంచా కారం, అర చెంచా పసుపు, తగినంత ఉప్పు, రెండు కప్పులు కొత్తీమీర తరుగు, రెండు కప్పులు పుదీనా తరుగు, రెండు పెద్ద మిరపాయ్ చీలికలు, మీకు ఇష్టం ఉండి వేసుకుంటే కొద్దిగా జీడిపప్పు, ఆరు బిర్యానీ ఆకులు, రెండు చెంచాల మంచినూనె,150 గ్రాముల నెయ్యి అంటే సుమారుగా ఆరు పెద్ద స్పూన్లు నిండా రావాలి. ఒక అరచెక్క నిమ్మకాయ్, మీకు చిన్న ఘాటు కూడా కావాలనుకుంటే..ఒక ఆరు మిరియాలను బరకగా దంచి వేసుకోవచ్చు..
బిర్యానీ తయారు చేసే విధానం..
ముందుగా కేజీ బాసుమతి బియ్యాన్ని ఒక గిన్నెలో బాగా శుభ్రం చేసుకొని ఒక గంటపాటు నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. తరువాత ముందుగా తెచ్చిపెట్టుకున్న చికెన్ ఒకటికి రెండు సార్లు బాగా కడిగి ఒక గంటల పాటు ఉప్పునీటిలో బాగా నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వలన చికెన్ మంచి టేస్ట్ గా, మెత్తగా, ఎంతో చక్కగా ఉడుకుతుందని గుర్తుంచుకోండి. ఆ తరువాత చికెన్ ని ఉప్పునీరు నుంచి వేరుచేసి పెరుగు, ఒక చెంచా ఉప్పు, చెంచా కారం, కొద్దిగా సాహీ జీరా, ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా, రెండు చెంచాల నెయ్యి, అర చెంచా పసుపు, ఒక చెంచా మసాలా పొడి, ఒక చెంచా బిర్యానీ మసాలా పొడి, ఒక చెంచా జీలకర్రపొడి, రెండు చెంచాల ప్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా చికెన్ ముక్కలకు పట్టించాలి. దానిని ఒక గంటపాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం ద్వారా మేరినేట్ అయ్యి మనం కలిపిన మసాలా దినుసులన్నీ చికెన్ కి బాగా పట్టి ముక్క ఎంతో సాఫ్ట్ గా అవుతుంది. బిర్యానీ ముద్దతో ఎంతో కమ్మగా, రుచిలా మెత్తగా తినడానికి ఎంతో బాగుంటుంది. తరువాత స్టవ్ పై బిర్యానీ ఒక గిన్నె పెట్టుకొని దానికి అడుగున ఒక చెంచా నెయ్యిరాయాలి. మరో స్టవ్ వ్ పై వేడినీరు మరిగించాలి..అందులో ఒక చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద, కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు, పచ్చిమిర్చిచీలికలు, కొద్దిగా సాహీజీరా, బిర్యానీ రా మసాలాలు అన్నీ అలాగే వేసుకోవాలి. నీరు బాగా కెర్లిన తరువాత నానబెట్టుకున్న బియ్యాన్ని ఎసరులో వేసి హైఫ్లేమ్ మీద ఉడికించాలి..బియ్యం 75 ఉడికించుకోవాలి అంటే అన్నం పలుకి పట్టుకుని చూస్తే మధ్యలో ఇంకా ఉడకాలి అన్నట్టుగా ఉండాలి. ఈ లోగా రెండో వైపు పెట్టుకున్న బిర్యానీ గిన్నెలో ఫ్రిజ్ లో పెట్టుకున్న చికెన్ తెచ్చి గిన్నె మొత్తం సర్దుకోవాలి. తరువాతదానిపై ఉడికి బియ్యాన్ని సమానంగా సర్దుకుంటూ లేయర్లు , లేయర్లుగా వేస్తుకోవాలి. మధ్య మధ్యలో కొత్తిమీర, పుదీనా, మసాలా పొడిపొడి చల్లుకొని, రెండు మూడు స్పూన్ల నెయ్యిని కూడా వేస్తుకోవాలి. చివరిగా మైదాపిండిని బిర్యానీ గిన్నెకు అంచుకు అంటించి దానిపై మూత పెట్టు కోవాలి. దానిపై చిన్న బరువుకూడా పెట్టుకోవాలి. తరువాత హై ఫ్లేమ్ పై 8 నిమిషాలు, తరువాత లో ఫ్లేమ్ పై 7 నిమిషాలు ఉడికించుకోవాలి. అడుగు మాడిపోతుందనే అనుమానం వున్నవారు మనం అట్లు వేసుకునే అట్లడాను పెట్టి దానిపై బిర్యానీని ఉడికించుకుంటే అడుగు పట్టకుండా వుంటుంది. అలా చేసిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరో 15 నిమిషాలు బిర్యానీపై గిన్నె మూత తీయకుండా అలాగే ఉంచేసుకోవాలి. దీని ద్వారా ధమ్.. రైస్, అటు చికెన్ కు పెర్ ఫెక్ట్ గా పడుతుంది. పైన పేర్కొన్నట్టు చేస్తే..రెస్టారెంట్ స్టైల్ టేస్టీ టేస్టీ చికెన్ ధమ్ బిర్యానీ వచ్చితీరుతుందంటే నమ్మండి. తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని అందులోకి రైతా కలుపుకుని తింటే ఆహా అదరహో అనాల్సిందే. ఇక వంటింట్లోకి వెళ్లి ఒక్కసారి ఈ చికెన్ ధమ్ బిర్యానీ రెసిపీని ట్రైచేయండి..ఇలాంటి మరిన్ని టేస్టీ టేస్టీ రెసీపీల కోసం ఈఎన్ఎస్ లైవ్ యాప్ ని గుగూల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవడం మాత్రం మరిచిపోకండి..!