1 ENS Live Breaking News

ఏపీలో జగనన్న విద్యుత్ కోతల పథకం అమలు

ఆంధ్రప్రదేశ్ లో ఇక పరిశ్రమలకు కూడా కష్టకాలం వచ్చేసింది. విద్యుత్‌ సరఫరాలో బారి కోతలు విధిస్తూ పరిశ్రమలకు వినియోగ గడువు నిర్ణయించడంతో పాటు వారానికో రోజు పవర్‌ హాలిడే ప్రకటించి పరిశ్రమల నడ్డి విరుస్తోందని మాజీ మంత్రి, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై మండి పడ్డారు. ఏపీలో పరిశ్రమలపై నాలుగున్నారేళ్లగా పిడుగులు పడుతూనే ఉన్నాయి. పరిశ్రమలు అంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి డబ్బులు కట్టే సంస్థలుగానే చూస్తున్నారు కానీ…అవి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని…వాటిని కాపాడుకుందామనే ఆలోచన ఎప్పుడూ చేయలేదని ఆరోపించారు. కరెంట్ చార్జీలను ఇష్టం వచ్చినట్లుగా పెంచడంతో ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు దాదాపుగా మూతబడ్డాయి. ఇప్పుడు ఇతర పరిశ్రమలకూ కరెంట్ కోతలతో అదే పరిస్థితిని తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఏప్రిల్‌, మే నెలల్లో పవర్‌ హాలిడే ప్రకటిస్తారు. కానీ సెప్టెంబరు తొలివారంలోనే ఈ విధానాన్ని అమలు చేయడం వైఎస్సార్సీపీ ప్రభుత్వ చేతకాని అసమర్థ పాలనకు ఇది ఒక మచ్చుతునక అని ట్వీట్ చేశారు.

వైఎస్సార్సీపీ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై వేల కోట్ల భారం వేశారని.. రైతులకు పంట చేతికి వచ్చే సమయానికి విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నది కనిపిస్తున్నదా అని ప్రశ్నించారు. రైతులకు కనీసం ఇస్తానన్న 9 గంటల కరెంటు కూడా సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రాష్ట్ర విభజన తరువాత 22 మిలియన్ యూనిట్లు లోటు ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తన అనుభవంతో సర్ ప్లస్ చేసి ప్రతి ఇంటికి 24 గంటలు, పరిశ్రమలకు 24/7 కరెంటు అందించిన ఘనత గుర్తుచేసుకోవాలన్నారు. 
 9529 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం నుంచి 19,080 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు.

మీరు అధికారంలోకి రాకముందు సర్ ప్లస్ లో ఉన్న రాష్ట్ర విద్యుత్ ఇప్పుడు ఎందుకు అస్తవ్యస్తంగా మారిందో.. 2019 నుంచి విద్యుత్తు రంగంలో చోటు చేసుకున్న పరిణామాలపై అర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ఇంధన సంస్థలు తీసుకున్న రుణాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, స్మార్ట్‌ మీటర్ల కోసం చేసిన అప్పుల వివరాలను శ్వేతపత్రాన్ని విడుదల చేసి ప్రజలకు వివరించే ధైర్యం మీకు ఉందా జగన్మోహన్ రెడ్డి గారు..అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ అసమర్ధ పాలన వలన ఒక్క విద్యుత్ వ్యవస్థనే కాకుండా రాష్ర్టాన్ని అన్ని విభాగాల్లో భ్రష్టు పట్టించారని మీరు తగిన మూల్యం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బై జగన్...  బై బై జగన్.. అంటూ ట్వీట్ చేశారు.


Visakhapatnam

2023-09-04 11:05:08

నాడు భీమిలీ టు వైజాగ్ ఈస్ట్.. నేడు అక్కరమాని దారెటు..!

వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు నుంచి అక్కరమాని విజయనిర్మల పార్టీకి విధేయురాలిగా పనిచేస్తూ వచ్చారు. ఎక్కువ కాలం భీమిలి నియోజకవర్గం నుంచే తన సేవా కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి విశేషంగా కృషిచేశారు. షడన్ గా అక్కడ సీటు అవంతి శ్రీనివాస్ తన్నుకుపోయారు..అక్కడ నుంచి విశాఖ ఈస్ట్ వచ్చిన తరువాత మళ్లీ ఇక్కడ నుంచి పోటీ చేసి టిడిపి అభ్యర్ధి వెలగపూడి రామక్రిష్ణం బాబుపై ఓడిపోయారు. అయినా ఎక్కడా తగ్గకుండా పార్టీ ఆదేశాలను శిరసా వహిస్తూ..పనిచేస్తూ వచ్చారు. ఆమె సేవలను గుర్తించిన వైఎస్సార్సీపి  సింపతీ చూపిస్తూ విఎంఆర్డీఏ చైర్మన్ గానూ, విశాఖ తూర్పు నియోజకవర్గం ఇన్చాచార్జిగానూ హోదా కల్పించి దాదాపుగా సీటు ఖరారు చేసింది. ఆ ధీమాతోనే విశాఖ ఈస్ట్ లో ఇల్లు తీసుకొని మరీ నాలుగేళ్లపాటు స్థానికంగా పార్టీని బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తూ వచ్చారు. సరిగ్గా నియోజకవర్గంలో బలం పుంజుకుంటూ దూసుకుపోతున్నారని ప్రచారం ఉదృతంగా సాగుతున్న వేళ షడన్ గా మళ్లీ విశాఖ ఎంపీ ఎంవివి సత్యన్నారాయణను అధిష్టానం తూర్పునియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది. అంతేకాకుండా ఆయనతో కలిసి పార్టీ పరిశీలకు గడప గడపకూ తిరుగుతూ ప్రచారం కూడా మొదలు పెట్టారు.

ఇలా పార్టీకార్యక్రమాలు చేపడుతున్న సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు వైవి సుబ్బారెడ్డి చెప్పిన సమాధానం అక్కరమాని అనుచరులకు తీవ్ర బాధను మిగిల్చి నట్టు అయ్యింది. పార్టీని బలోపేతం చేస్తున్న అక్కరమాని కంటే బలమైన నాయకుడిగా ఎంవివి ఉన్నందున ఆయనకు పగ్గాలు చేపట్టామని..ఈ తరహా మార్పు రాష్ట్రంలో ఎక్కడైనా జరుగవచ్చునని పరోక్షంగా మరికొందరు సమన్వయకర్తలకు హెచ్చరికలు జారీచేశారు. గెలిచే వ్యక్తులకే పార్టీ పదవులు కట్టబెడుతుందని చెప్పుకొచ్చారు. ఇంతకాలం పార్టీకోసం పడిన కష్టం.. చేసిన ఖర్చు..పోయిన కాలం వృధాయేనా అనే ప్రశ్నలకు మాత్రం వైవీ తెలివిగా సమాధానం చెప్పారు. తమపార్టీ మిగిలిన పార్టీల మాదిరిగా మీడియాలోనూ, టీవీల్లోనూ బలంగా కాకుండా జనంలో బలంగా ఉందన్నారు. అధికారపార్టీ నేతలు బలంగా ఉన్నచోట గ్రూపు రాజకీయాలు జరుగుతాయని అన్నారు. అక్కరమాని విజయనిర్మల కంటే ప్రజల మన్ననలు ఎంపీగా ఉన్న ఎంవివి లాంటి వ్యక్తి అసెంబ్లీ  అభ్యర్ధిగా వస్తున్నారనే విషయం తెలుసుకుని కార్యకర్తల్లో మరింత ఉత్సాహం, ఎంతగానో ఆయనను స్వాగతిస్తున్నారని చెప్పుకు రావడం విశేషం.

విశాఖ తూర్పు నియోజకవర్గంలో యాదవులు బలం చాలా గట్టిగా వుంటుంది. అలాంటి ప్రాంతంలో అక్కరమాని వారికి వెన్నుదన్నుగా ఉంటూ పార్టీని  నియోజకవర్గంలో చాలా బలంగా తీసుకెళ్లి..తన బలగాన్ని ప్రదర్శించుకునే సమయం వచ్చిన తరుణంతో ఆ సీటుని ఎంపీ ఎంవివికి అధిష్టానం కట్టబెట్టి..అక్కరమానిని పక్కన బెట్టడం చర్చనీయాంశం అవుతోంది. అయితే మళ్లీ అక్కరమానిని భీమిలీ నియోజకవర్గానికైనా పంపిస్తారా అనే ప్రశ్నకు కూడా పార్టీ అధిష్టానం వద్ద సమాధానం లేదనేది వైవి చెబుతున్న గ్రూపు రాజకీయాలు అన్న మాటలను బట్టి స్పష్టమవుతోంది. ఇంతలా పార్టీకోసం శ్రమించిన అక్కరమానికి మిగిలింది ప్రస్తుతం నిరాశ మాత్రమే. అయితే ఎంవీవీని ఎమ్మెల్యేగా బరిలోకి దించిన అధిష్టానం కనీసం ఎంపీ స్థానానికైనా అక్కరమానిని పంపిస్తుందా ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. ఈసారి విశాఖ ఎంపీ అభ్యర్ధిగా మరో వ్యక్తిని పార్టీ రంగంలోకి దించబోతుందనే సంకేతాలు తూర్పు నియోజకవర్గం సమన్వకర్త మార్పుతో తేలిపోయింది. ఇంతగా శ్రమించిన అక్కరమాని దారి ఇపుడు ఎటు అనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఈ అవమానంతో ఆమె పార్టీలో ఉంటారా..? లేదంటే మారిపోతారా..? కాదూ అంటే తరువాత ఎమ్మెల్సీ ఇచ్చే కార్యక్రమం చేపడతారా..? చూడాలి గ్రూపు రాజకీయాల్లో అక్కరమానిని ఏ విధంగా పార్టీలో స్థానం కల్పిస్తారనేది. 

Visakhapatnam

2023-08-27 16:48:15

మీరు కట్టడమూ అయ్యింది..కూలడమూ జరిగింది..గంటా

విశాఖ నగరంలో దాదాపు రూ.40 లక్షలు వ్యయంతో మీరు నిర్మించిన మోడల్‌ బస్‌షెల్టర్ నాలుగు రోజులకే కుప్పకూలింది. ఒక చిన్న బస్ షెల్టర్ నే సక్రమంగా కట్టలేని వాళ్ళు, రాజధాని, పోలవరం కట్టేస్తామంటూ ప్రగల్బాలు పలుకుతున్నారు. ప్రచారాలకు తప్ప అభివృద్ధికి, నిర్మాణాలకు పనికిరాని ప్రభుత్వమని మరోసారి నిరూపితం అయ్యిందంటూ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కూలిన బష్ షెల్టర్, కట్టిన తరువాత దాని ముందు దిగిన ఫోటోను జతచేస్తూ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. తుమ్మితే వూడే ముక్కు చందంగా మారిన బస్‌షెల్టర్లు కోసం ఆరోజు గ్రీన్‌బెల్ట్‌లోని దశాబ్దాల వయస్సు కలిగిన భారీ వృక్షాలను విచక్షణారహితంగా నరికేసుకుంటూ పోయారంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు, మీ ప్రచారాల ప్రభుత్వం కూడా కూలిపోయే రోజు కూడా దగ్గరలోనే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అంటూ #ByeJagan అంటూ ట్యాగ్ చేశారు.

Visakhapatnam

2023-08-27 12:16:34

వైఎస్సార్సీపీకి మద్యపాన నిషేదంచేసే దమ్ముందా.?

మద్యపానం నిషేదంచేసి 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా నామినేషన్ వేసే దమ్ము ఉందా అని రాష్ట్ర మహిళా అధ్యక్షరాలు వంగలపూడి అనిత సవాల్ విసిరారు.  మంగళవారం విశాఖలోని టిడిపి కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దశలవారిగా మద్యపా నం నిషేదం అని.. మద్యాపానం నిషేదంపై అధికారులతో ఒక్కసారైనా సమీక్ష పెట్టారా? అని ప్రశ్నించారు. కల్తీ మద్యంతో మహిళల తాళిబొట్ల తో వైఎస్సార్సీపీ సర్కారు ఆడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం తయారీలో రూ.18 వేలకోట్ల  జగన్ జోబుకు వేసుకుంటున్నార న్నారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ మోహన్ రెడ్డి మద్యాన్ని తరమికొడతామని చెప్పి మద్య నిషేధం చేయకపోగా విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తూ మహిళల ఉసురు పోసుకోకుంటున్నారని అన్నారు. జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, దక్షిణ నియోజకవర్గ మ హిళా అధ్యక్షురాలు కె.లక్ష్మి, గణగల్లా సత్య, ఈతలపాక సుజాత, ప్రమీల, రత్నం తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-04-04 08:18:43

TDPకి బాగా కలిసివస్తున్న న్యూమరాలజీ సంఖ్య 5

న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం..ఎవరు నమ్మినా నమ్మకపోయినా దీనిని రాజకీయపార్టీలు చాలాబాగా నమ్ముతాయి. అందులోని రైజింగ్ నెంబర్లు ఆధారంగా లక్ కలిసివస్తుందని బలంగా విశ్వశిస్తారు. ఈన్యూమరాలజీలో 5 నెంబరుకి ప్రత్యేక స్థానంఉంది. చాలా పేర్లకు, వ్యక్తులకు, సంస్థలకు, పార్టీలకు టోటల్ 5వస్తే దానిని లక్ ఎంటర్ అయినట్టుగా నమ్ముతారు. ఇపుడు టిడిపికూడా అదే నెంబరు వచ్చింది. పార్టీ ఆవిర్భ వించి 2023 మార్చినాటికి 41ఏళ్లు పూర్తయ్యింది. దానికి సూచికగానే వైఎస్సార్సీపీ గెలుస్తామనుకున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ టిడిపి గెలిచింద ని, అసెంబ్లీలో గెలుస్తామనుకున్న మరో ఎమ్మెల్సీకూడా టిడిపీయే గెలిచిందని అంటున్నారు న్యూమరాలజిస్టులు. వైఎస్సార్సీపీ ప్రచారం చే స్తున్నట్టుగా 23 సంఖ్యలో కూడా 5 వస్తుంది. అంటే ఆసంఖ్య వీరికి మళ్లీ లక్ ను తెచ్చిపెట్టిందనడానికి 4ఎమ్మెల్సీ స్థానాలు గెలవడమే కారణ మంటున్నారు. 2024 ఎన్నికలు కలిసివస్తాయని నమ్ముతున్నారు.. మీరూ కామెంట్ చేయండి.. !

Amaravati

2023-03-29 13:19:23

విశాఖలో ఎవరా అధికారపార్టీ అసంత్రుప్తి ఎమ్మెల్యే?!

తాడికొండ ఎమ్మెల్యే డా.ఉండవల్లి శ్రీదేవి హైదరాబాద్ ప్రెస్ మీట్ లో పేల్చిన బాంబు విశాఖలో విస్పోటనం రేపుతోంది. వైఎస్సార్సీపీ పార్టీలో విశాఖ నుంచి ఒక ఎమ్మెల్యే అసంత్రుప్తితో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు ఉమ్మడివిశాఖజిల్లాలో దావాలనంలా వ్యాపించాయి. నిజంగానే విశాఖలో అసంత్రుప్తి అధికారపార్టీ ఎమ్మెల్యేల ఉన్నారా..? అనేవి ధంగా ఉండవల్లి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు ఇపుడు విశాఖలో దుమారం రేపుతున్నాయి. అధిష్టానం నలుగు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన మూడు రోజులకే తిరుగుబా టు జెండా ఎగురవేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల తీరు ఇపుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. అసెంబ్లీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోలా గురువులు ఓడిపోయి నపుడు విశాఖ నుంచే ఒక ఎమ్మెల్యే తేడా ఓటు వేశారనే ప్రచారం జరిగింది. ఆ గాలి కాస్తా ఆ నలుగురు ఎమ్మెల్యేలపైకి వెళ్లినా..నేడు మళ్లీ నలుగురిలో ఒకరైన ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు విశాఖలో అధికారపార్టీ నేతల్లో అనుమానపు బీజాన్ని నాటినట్టు అయ్యింది. దానిపై ఎవరూ స్పందించలేదు..?!

Hyderabad

2023-03-26 09:43:45

గ్రామ సచివాలయ ఉద్యోగులు ఓట్లు ఎవరికి పడ్డాయి..?!

ఉత్తరాంధ్రలోని ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలు పూర్తయిపోయాయి, ఫలితాలు వచ్చేశాయి, టిడిపి ఎమ్మెల్సీ సంబురాల్లో కూడా పాల్గొంటు న్నారు. కధ ఇక్కడితో అయిపోయిందని అంతా ఊహించుకుంటున్నా.. అసలు ట్విస్టు మాత్రం ఇపుడే మొదలైంది. ఉమ్మడి 3 జిల్లాలు, కొత్త 6జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగుల్లో అత్యధిక భాగం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఈశాఖలో 90% ఉద్యోగులు పట్టభద్రులు. వీరం తా అధికారపార్టీ అభ్యర్ధికి ఓటు వేసినా అత్యధిక మెజార్టీ వస్తుంది. అంతేకాకుండా వారి కుటుంబాలతోనూ, స్నేహితులతోనూ ఓట్లు వేయించి నా ఖచ్చితంగా అధికారపార్టీ అభ్యర్ధి గెలిచితీరాలి..కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వపార్టీ అభ్యర్ధి పరాజయం చెందాడు దీనితో ఇపుడు ఉద్యోగులు టిడిపి అభ్యర్ధికి ఓటువేశారా, లేదంటే వైఎస్సార్సీపీ అభ్యర్ధికి ఓటువేశారా అనే కోణంలో కూపీ లాగే ప్రయత్నాలు చేస్తున్నాయి నిఘా వర్గాలు. నిజంగా వీరంతా టిడిపికే ఓటు వేస్తే 2024లో ఇదే సీన్ రిపీట్ అవుతుందంటున్నారు విశ్లేషకులు..?!

Visakhapatnam

2023-03-20 08:25:01

మొదటి 3 రౌండ్లలోనే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ భవిత

ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తీరును బట్టీ మొదటి మూడు రౌండ్లలో అభ్యర్ధి గెలుపు ఎవరనేది ఒక అంచనా వస్తుందని చెబుతు న్నారు పరిశీలికులు. గత ఎమ్మెల్సీ ఎన్నికలకు.. ఈసారి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకూ చాలా వ్యత్సాసం ఉండటంతో అభ్యర్ధి గెలుపుపై విశ్లేష కులు సైతం తలలు పట్టుకుంటున్నారు. వాస్తవానికి అధికారపార్టీ అభ్యర్ధులు ఎన్నికల్లో సునాయాసంగా గెలుస్తారు. కానీ కానీ ఎమ్మెల్సీ ఎన్ని కలు గట్టి పోటీ మధ్య జరగడంతో నలుగురు అభ్యర్ధుల్లో విజయం ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ పెరిగిపోతున్నది.  పోలింగ్ ప్రారంభం అయ్యే నాటికి నలుగురుకి మధ్య పోటీ వుంటుందనుకున్నా.. అది ముగ్గురు మధ్యే కొనసాగడం విశేషం. మొత్తం పోలైన ఓట్లలో ఎవరికి 50% ఓట్లు వస్తే ఆఅభ్యర్ధికి గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయనే విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఎన్నిక జరిగడానకి 2 రోజుల ముందే ప్రకటించింది. అనుకున్నట్టుగానే ఇపుడు విశ్లేషకులు కూడా అదే విషయాన్ని నొక్కచెబుతుండటం విశేషం..!

Visakhapatnam

2023-03-16 06:48:15

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యరైటీ సిత్రాలు

ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నడూలేని యరైటీ సిత్రాలు కనిపిస్తున్నాయి. ఎక్కడైనా పట్టభద్రులు ఉన్నచోట అభ్యర్ధులు ఓట్లకోసం ప్రచారం చేస్తారు. కానీ విచిత్రంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతీ ఇంటికీ వెళ్లి మళ్లీ రాజకీయపార్టీలు మీ ఓటు మాకే(అక్కడ పట్టభద్రులు లేకపోయినా) అంటూ సోషల్ మీడియా ప్రచారాలు ఊదరగొడతున్నారు. ఈ తరహా ప్రచారంతో మిగిలిన పార్టీల్లో ఒక రకమైన అనుమానం రేకెత్తుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాస్తతెలివిగాప్రచారంతోనే అక్కడక్కడా ఉన్నపట్టభద్రులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని కూడా ఎన్నికల బరిలో నిలుచుకున్న ప్రధాన పార్టీల అభ్యర్ధులు జిల్లా ఎన్నికల కమిషన్ కు ఇప్పటికే ఫిర్యాదులు చేశారు. గెలుపేలక్ష్యంగా ఓటుకి రూ.2వేల నుంచి రూ.5వేల వరకూ ఇచ్చి కొంటున్నారనే విషయం గుప్పుమంటోంది. అయినప్పటికీ కొన్ని పార్టీల అభ్యర్ధులు ఎక్కడా ‘తగ్గేదెలే’ అన్నట్టుగా ప్రచార ప్రలోభాలను కొనసాగిస్తున్న విషయం సోషల్ మీడియా ద్వారానే వైరల్ అవుతుంది. .! 

Visakhapatnam

2023-03-11 03:46:37

కౌన్ బనేగా ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ..!

కౌన్ బనేగా ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ..? ఇంతకీ ఎవరు పీఠం కైవసం చేసుకుంటారు..? ఎవరు పట్టభద్రుల మనస్సు గెలుస్తారు..? ఈసారి ఎమ్మెల్సీ ఓట్లు ఎవరి వలన చీలిపోతాయ్..? నోటాకి పడేఓట్లెన్ని..? ఇపుడు సర్వత్రా ఇదే మాట.. ఇదే టాపిక్..! గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల ను తలపిస్తున్నాయి. ఒక్క ఉత్తరాంధ్రాలోనే 37 మంది ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుచున్నారంటే పరిస్థితి ఏవిధంగాఉందో అర్ధం చేసుకోవచ్చు. అధికార పార్టీ అభ్యర్ధికి ప్రభుత్వ ఉద్యోగులు(సచివాలయ ఉద్యోగులు మినహా), ఉపాధ్యాయులు ఓట్లు పడవని, ఆఓట్లన్నీ పీడిఎఫ్ అభ్యర్ధికి 40%, టిడిపి అభ్యర్ధికి 40% మిగిలిన 20% స్వతంత్ర అభ్యర్ధులకు వెళ్లిపోతాయని చెబుతున్నారు. ఇక బీజేపి అభ్యర్ధికి సదరుపార్టీ ఓట్లు మాత్రమే పడతాయని అంటున్నారు. అధికారపార్టీ అభ్యర్ధి గెలవకూడదు అనుకుంటే ఆ ఓట్లు పీడిఎఫ్ అభ్యర్ధి, బీజేపి అభ్యర్ధికి పడిపోతాయనే ప్రచారాన్ని పార్టీల ఫాలోవర్లు తీసుకెళుతుండటం గమనార్హం..!

Visakhapatnam

2023-03-10 10:31:07

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ

ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార ప్రతిపక్ష పార్టీలతోపాటు పీడిఎఫ్ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ పట్నంజిల్లాల్లో 37మంది అభ్యర్దులు బరిలోఉంటే.. పోటీమాత్రం ఆనలుగురు అభ్యర్ధులు మధ్యనే నెలకొన్నది. పీడిఎఫ్ అభ్యర్ధి డా.రమాప్రభ, వైఎస్సార్సీపీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్, టిడిపి అభ్యర్ధి వేపాడ చిరంజీవి, బీజేపీ అభ్యర్ధి మాధవ్ ల మధ్యే కనిపిస్తున్నది. మిగిలిన అభ్యర్ధుల పోటీ ద్వారా కొన్ని 20%  ఓట్లు చెల్లాచెదు రైపో యినా.. మిగి లిన 80% ఓట్లను ప్రధాన పోటీగా భావించేవారు పంచుకోవాల్సి వుంది. ఇందులో కూడా కేవలం ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ ఉందని కూడా నిరుద్యోగ పట్టభ ద్రులు, ఉపా ధ్యాయులు చెప్పుకొస్తున్నారు. కొందరు మార్పుకోసం ఓట్లు వేయాలని చూస్తే.. మరికొందరు పోటీలో తమ అభ్యర్ధిని ఎలాగైనా గెలిపించాలనే పంతంతో ఉన్నారు. ఇంకొం దరు ప్రభుత్వానికి ఓటుబలం తెలియజేయాలనే తలంపుతో ఉన్నట్టు కనిపిస్తున్నది. !

Visakhapatnam

2023-03-09 12:45:25

పట్టభద్రులు తెలివి మీరారా నమ్మించి దెబ్బకొడతారా..?

ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లు తెలివి మీరినట్టే కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నది. పట్టభ ద్రులు, ఉపాధ్యాయుల  ఓట్లు సదరు ఇంట్లో ఉన్నా లేకపోయినా అన్ని పార్టీల వాళ్లు వెళ్లి ఓట్లను అభ్యర్ధిస్తున్నారు. దీనితో ఈసారి మాఓటు మీకే అంటున్నారు ఓటర్లు. ప్రస్తుత రాజకీయాలు నేపథ్యంలో నేతలను నమ్మించి దెబ్బకొట్టాలని చూస్తున్నట్టుగానే ఓటర్ల నాడి అవగతం అవు తున్నదని పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు. కొన్ని చోట్ల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా స్వతంత్ర అభ్యర్ధులు పోటీ పడుతు న్నారు. ప్రధాన పార్టీల నేతలతోపాటు ఈసారి స్వతంత్ర్య అభ్యర్ధులే అధికంగా ఎన్నికల బరిలో నిలబడ్డారు. దీనితో ఓట్లు బాగా చీలిపోతా యనే ఆందోళన కూడా వెంటాడుతోంది. మరోప్రక్క ఓటుకి ఎంతైనా ఇచ్చి కొనాలనే ఆలోచనలో గ్రూపు సమావేశాలు కూడా పెట్టి ఓటర్ల నోట్లతో కొనాలనే ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ప్రచారం కూడా గట్టిగా సాగుతోంది.  

Visakhapatnam

2023-03-02 06:45:00

పట్టభద్రుల ఆలోచనలకు అగుణంగానే నాతొలిఅడుగు

ఉత్తరాంధ్రా జిల్లాల్లోని పట్టభద్రుల ఆలోచనలకు అనుగుణంగానే నా తొలి అడుగు వేస్తానని స్వతంత్య్ర ఎమ్మెల్సీ అభ్యర్ధి ఇల్లిపిల్లి అప్పలరాజు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా పట్టభద్రుల అభివ్రుద్ధి, వారికి ప్రయోజనాలు చేకూరలేదన్నారు. కేవలం పట్టభద్రుల అభివ్రుద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలనే ఉద్దేశ్యంతో ఈసారి ఉత్తరాంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్ధిగా తాను బరిలో నిలుచున్నట్టు చెప్పారు. ప్రతీఏటా జాబ్ కేలండర్, డిగ్రీతోపాటే సాఫ్ట్ వేర్ శిక్షణ, మూడు జిల్లాల్లో నిరుద్యోగల కోసం ప్రభుత్వ స్లడీ సెంటర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానాల రద్దుకే నా తొలి ప్రాధాన్యత అన్నారు. మార్పుకోకుంటున్న పట్టభధ్రులందరూ తొలి ప్రాధాన్యతా ఓటును తనకు వేయాలని కోరారు. ఖచ్చితంగా పట్టభద్రుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి యువ నాయకత్వం యొక్క విలువల పెంచుతానని అప్పలరాజు చెప్పుకొచ్చారు.


Visakhapatnam

2023-02-27 17:27:23

కోలా గురువులు అనే నేను మీ ఎమ్మెల్సీగా...

విశాఖలో మత్సకార సామాజిక వర్గానికి సీఎం.వైఎస్ జగన్మోహనరెడ్డి అత్యంత పెద్ద పీట వేశారు. ఇదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ వైఎస్సార్సీపీ నాయకులు, మత్స్యకార కార్పోరేషన్ చైర్మన్  కోలా గురువులను ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేస్తున్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం ఎమ్మెల్సీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అతి స్వల్ప ఓట్ల తేడాతో కోలాగురువులు ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీని అంటిపెట్టుకొని ఉంటూ ఉన్న ఈయన సేవలను పార్టీ గుర్తించి నేడు రాష్ట్రంలో పెద్దల సభ చెప్పుకునే శాసన మండలికి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా పంపిస్తున్నది. దీనితో మత్స్యకార కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ఈయనకు విశాఖలోపాటు ఉత్తరాంధ్రా మత్స్యకారుల్లో మంచి గుర్తింపు వుంది. పట్టువదలి విక్రమార్కుడనే మరో పేరు కూడా ఉంది. నేడు చట్టసభలకు వెళ్లాలనే గురువుల కోరిక వైఎస్సార్సీపీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నిజం చేసి చూపించారు..

Tadepalli

2023-02-20 09:33:01

ఇక మహాసేన రాజేష్ అధికారికంగా టిడిపి

మహాసేన రాజేష్ ఇక అధికారికంగా టిడిపి నాయకుడయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో టిడిపి అధినేత చంద్రబాబు సామర్లకోటలో దళిత సామాజికవర్గంతో నిర్వహించిన సమావేశంలో వరుపుల రాజా తదితరుల ఆధ్వర్యంలో ఆయనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజేశ్‌ మాట్లాడుతూ, 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును దళిత ద్రోహిగా సీఎం జగన్‌ చిత్రీకరించారు. జగన్‌ మాటలు విని చంద్రబాబును అపార్థం చేసుకున్నాం. అయితే నిజమైన దళిత ద్రోహి ఎవరో త్వరగానే గ్రహించామని.. ఎస్సీలకు చంద్రబాబు 27 సంక్షేమ పథకాలను అమలు చేస్తే.. వైఎస్సార్సీపీ రాగానే జగన్‌ వాటిని రద్దు చేసిందన్నారు. 2019లో తప్పు చేయకుండా ఉండుంటే అమరావతి నిర్మాణం పూర్తయ్యేదన్న ఆయన దళితులు ఎవరి కాళ్లమీద వారు నిలబడేలా చంద్రబాబు చేశారని అన్నారు. జగన్‌ తుగ్లక్‌ పాలన చూశాక చంద్రబాబు పాలన రామరాజ్యం అని అర్థమవుతోందని రాజేష్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశం అవుతోంది.

Samarlakota

2023-02-17 16:02:16