1 ENS Live Breaking News

విశాఖలో విజ్ఞాన పర్యాటకం..విద్యార్ధులకు విద్యా విహారం..!

 విజ్ఞానంతో పాటు విహారం చేయాలని ఉందా.. పర్యాక ప్రదేశాలను తిలకించడంతోపాటు విద్యా సంబంధిత అంశాలను తెలుసుకోవాలని ఉందా..? విహారంతో పాటు సరికొత్త అంశాలను తెలుసుకునే అవకాశం ప్రభుత్వమే కల్పిస్తే..సరదాగా పిక్నిక్ లు చేసుకునే ప్రదేశాలను సంద ర్శించినపుడే విద్యాపరమైన అంశాలను తెలుసుకుంటే.. విద్యార్ధులకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది.. సరిగ్గా ఇలాగే ఆలోచిం చింది జిల్లా పర్యాటకశాఖ. విశాఖలో విహారానికి వచ్చే విద్యార్ధులకు విజ్ఞానాన్ని కూడా అందించాలనే ఉద్దేశ్యంతో చక్కటి కార్యక్రమా నికి శ్రీకాకం చు ట్టింది. విహార ప్రాంతాలను, పర్యాటక ప్రదేశాలను చూపిస్తూ.. విద్యార్ధులకు అవసరమయ్యే విద్యాసంబంధిత ప్రదేశాలను కూడా పర్యాటక ఎడ్యూకేషనల్ టూరిజం ను రూపొదించింది. ఆ వివరాలు ఏమిటో ఒక్కసారి తెలుసుకుంటే..

సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖలో పర్యాటక ప్రదేశాలతోపాటు, విద్యార్ధులకు అవసరమయ్యే ప్రదేశాలను కూడా చూపించి వారి విద్యా, ఆలోచనలను పెంపొదింప చేయడానికి ఏర్పాటు చేసినదే ఈ ఎడ్యుకేషనల్ టూరిజం. పర్యాటక ప్రదేశాలతోపాటు మ్యూజియంలు, జూపార్క్, ఆంధ్రా యూనివర్శిటీలోని జీవశాస్త్ర ప్రయోగశాల వంటి ప్రదేశాలను కూడా విద్యార్ధులు తిలకించడానికి అవకాశం వుంటుంది. ఇక్కడ కొన్ని మ్యూజియంలలో ప్రభుత్వ కాలేజీ విద్యార్ధులకు ఉచితంగానూ.. ప్రైవేటు విద్యాసంస్థలకు నామ మాత్రపు రుసుముతోనూ పలు మ్యూజియం లలో ఎంట్రీ వుంటుంది. తద్వారా విద్యాసంస్థలకు తమ విద్యార్ధులకు ఏదైనా టూర్ లు ప్లాన్ చేసినపుడు పర్యాటకశాఖను సంప్రదిస్తే.. ఈ ఎడ్యుకేషనల్ టూరిజం ద్వారా అన్ని ప్రాంతాలను తిప్పి చూపించే ప్యాకేజీలను వివరిస్తారు. తద్వారా విద్యార్ధులకు చాలా విషయాలు తెలియడంతోపాటు వివిధ అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడానికి విద్యాసంస్థలు దోహదం చేసినట్టు అవుతుంది. ఇంటర్ చదివే విద్యార్ధులు తమ ఉన్నత చదువుల్లో సరికొత్తగా ఆలోచించడానికి, మంచి కోర్సులు చేపట్టడానికి ఒక అవగాహన లా కూడా ఈ ఎడ్యుకేషనల్ టూరిజం ఎంతగానో ఉపయోగపడే అవకాశాలున్నాయి. 

-మూడు రకాల ఎడ్యుకేషనల్ టూర్ ప్యాకేజీలు
1)మెరైన్ మ్యూజియం ఎడ్యుకేషనల్ టూర్ : ఇందులో సీ హరియర్,  టి యు-142 ,  సబ్ మెరిన్ & మ్యారిటన్ మ్యూజియం అనుసంధానం చేస్తూ ప్యాకేజీ వుంటుంది. ఇంటర్ తరువాత ఇంజనీరింగ్ చదివే విద్యార్ధులు ఈ టూర్ చేస్తే.. వారిలో మెరైన్ సిస్టమ్, ఎయిర్ ఫోర్స్ వంటి అంశాలపై మంచి అవగాహన వస్తుంది. సాధారణంగా చాలా మందికి ఇవి ఎక్కడున్నాయో తెలియదు. అందునా తెలుసుకోవడానికి చాలా వ్యయ ప్రయాసలు పడాల్సి వుంటుంది. అదే ఈ ప్యాకేజీ ద్వారా పర్యాటకశాఖ నేరుగా విద్యాసంస్థలకు చెందిన విద్యార్ధులకు ప్రత్యేక వాహనాల ద్వారా వీటిని తిప్పి చూపిస్తుంది.

2)  బయో డైవర్సిటీ ఎడ్యుకేషనల్ టూర్ ప్యాకేజీ: ఇది జీవవైవిధ్య విద్యా పర్యటన ఇందులో ఇందిరా గాంధీ జూలాజికల్ పార్క్ ,బయోడైవర్సిటీ పార్క్ అనుసంధానం చేస్తూ పర్యటన సాగుతుంది. ఈ టూర్ బైపీసీ, సీబీజెడ్ చదివే విద్యార్ధులకు విద్యా పరంగా ఎంతో ఉపయోగంగా వుంటుంది. ఈ టూర్ లో ఈ రెండు ప్రదేశాలను చూసిన వారికి విద్యార్ధులకు ప్రాజెక్టు వర్కులు, ఇంటర్ తరువాత, డిగ్రీ తరువాత చేయాలనుకునే కోర్సులకు సంబంధించి కూడా మంచి అవగాహన కలుగుతుంది. ముఖ్యంగా చాలా ప్రైవేటు కళాశాలలు తమ విద్యార్దులను బొటానికల్ టూర్స్ కి తీసుకెళుతుంటాయి. వారికి ఈ టూర్ ఎంతో అవగాహనక కల్పిస్తుంది.

3)కోస్టల్ ఇన్విరాన్ మెంటల్ టూర్: తీర పర్యావరణ వ్యవస్థ పర్యటన.. ఈ పర్యటనలో విద్యార్ధులు  ఆంధ్రా యూనివర్శిటీలోని  జీవశాస్త్ర ప్రయోగశాల,
ఎఫ్ఆర్ సిసిఈ, మడ అటవీ పరిశోధన కేంద్రం, ఎఫ్ఎస్ఐ మ్యూజియం,  తీరప్రాంత పరిశోధనలు, మెరైన్ లైవ్ వాక్ తో కలిగివుంటుంది. ఈ టూర్ లో విద్యార్ధులు పర్యావరణానికి సంబంధించిన అంశాలను తెలుసుకోవడానికి వీలుపడుతుంది. అంతేకాకుండా జువాలజీకి సంబంధించిన అంశాలను కూడా తెలుసుకోవడానికి వీలుపడుతుంది.

-విద్యార్ధులకు ఎడ్యుకేషనల్ టూరిజం ఒక విద్యానిధి.. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్
ఇంటర్, డిగ్రీ విద్యార్ధులకు పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే ఎడ్యుకేషనల్ టూరిజం ఒక విద్యానిధిగా ఉపయోపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ పర్యటనలో విద్యార్ధులు అన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలతోపాటు, పరిశోధన కేంద్రాలు, మ్యూజియంలు చూస్తారు. ఇంటర్ చదివే విద్యార్ధులు ఈ తరహా ఎడ్యుకేషనల్ టూర్స్ చేయడం ద్వారా వారికి ఉన్నత విద్య అభ్యసించే సమయంలో మంచి కోర్సలు ఎంచుకొని వారి ఆశలకు అనుగుణంగా విద్యను అభ్యసించడానికి మంచి ఆలోచనలను కలుగేజేసే విధంగా వుంటుంది.

-పర్యాటకం తోపాటు విద్యా సంబంధిత అంశాలు చేరవు అవుతాయి.. జిల్లా పర్యాటకశాఖ అధికారిణి జ్ఞానవేణి
విద్యార్ధులు విశాఖలోని పర్యాటక ప్రదేశాలను ఒక్కటే తిలకిస్తే.. వారికి కలిగేది ఆనందం మాత్రమే అదే. ఎడ్యుకేషనల్ టూర్ లో విద్యా, విజ్ఞానానికి సంబంధించిన ప్రదేశాలను తిలకించడం ద్వారా విద్యార్ధులకు సరికొత్త అనుభూతి కలుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడూ తెలియని అంశాలు కూడా తెలుసుకోవడానికి వీలుంటుంది. విద్యార్ధులను, విద్యాసంస్థలను దృష్టిలో ఉంచుకొని, వారికి ఎడ్యుకేషనల్ టూరిజం ద్వారా మ్యూజియంలు, పరిశోధనా కేంద్రాలను చూపించి వారికి మంచి ఆలోచనలు కలిగించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ ఏర్పాటు చేస్తున్నది.

విద్యార్దులు, విద్యా సంస్థలు ఈ ఎడ్యుకేషనల్ టూర్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యార్దులకు మంచి విజ్ఞానం అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది. విశాఖపట్నంలోని పర్యాటక ప్రదేశాలతోపాటు, ఈ విధమైన ఎడ్యుకేషనల్ టూర్స్ చేయడం ద్వారా విద్యార్ధులకు తమ కాలేజీ సమయంలో చేసిన పర్యటనలు కలకాలం గుర్తుండిపోతాయి. పర్యాటకశాఖ ఏర్పాటు చేసి ఈ ప్యాకేజీల్లో మూడు రకాల టూరిజంలను కలిపి చూడగలిగితే ఇక విద్యార్ధులకు ఒక విద్యానిధిగా ఈ పర్యటనలు గుర్తుండిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విద్యాసంస్థలు, యూనివర్శిటీలు, ప్రభుత్వ కాలేజీలు, ప్రైవేటు కాలేజీలు పర్యాటకశాఖ అందిస్తున్న ఈ ప్యాకేజీలను అందిపుచ్చుకోగలిగితే విద్యార్ధులకు పర్యాటక ప్రదేశాలతోపాటు గుర్తిండిపోయే విజ్ఞానాన్ని కూడా అందించన వారవుతారు. సో విద్యార్ధులూ మీదే ఆలస్యం.. ఎడ్యూ టూర్ పై ఓ లుక్ వేయండి..!

visakhapatnam

2024-10-17 19:14:45

తిరుపతి-తిరుమల రోప్ వేపై అధ్యయనం

కలియుగ వైకుంఠ దైవం తిరుమల శీ వేంకటేశ్వరస్వామివారిని చేరుకోవడానికి భక్తులకు ఇప్పటి వరకూ రోడ్డు మార్గమే వుంది. కాగా ఇపుడు రోప్ వే ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై త్వరలో అధ్యయనం జరగనుంది. ఈ మేరకు నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సంస్థను ఆదేశించినట్టు ఎంపీ గురుమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. సంస్థ అధ్యయనం చేసి డీపీఆర్ ఇస్తే తొలుత నాలుగు కిలోమీటర్లు మేర రోప్ వే వేయాలని తరువాత.. మిగిలిన ప్రాంతాన్ని రెండవ భాగంలో నిర్మించాలని భావిస్తున్నారట. ఈ రోప్ వే నిర్మాణం కార్యరూపం దాలిస్తే శ్రీవారి దర్శించడానికి వెళ్లే సమయంలో ఏడు కొండలను స్వయంగా భక్తులు తిలకించడానికి, ప్రకృతి అందాలను ఆశ్వాదించడానికి ఆస్కారం వుంటుంది.

Tirumala

2023-01-05 15:29:00

కశ్మీర్ ను మైరపించే లంబసింగి అందాలు

ఆ గ్రామం సముద్ర మట్టానికి సుమారు 4వేల అడుగుల ఎత్తులో ఉంది.. అక్కడ ఉష్ణోగ్రతలు చలికాలంలో 1-3కి పడిపోతాయ్ ..మంచు అయితే వర్షంలా కురుస్తుంది...ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఆంధ్రాలో ఉన్నామా..కాశ్మీర్ లో ఉన్నామా అనే భావన కలుగుతుంది..అతి తక్కువ సమయంలో జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించింది ఆ గ్రామం.. అదే ఆంధ్రా ఊటీ లంబసింది..అదేంటి ఆంధ్రా ఊటి అరకు కదా అనుకుంటున్నారు కదా.. ఆ పేటెంట్ నేమ్ ఇపుడు లంబసింగి సొంతమైంది. అవునండీ మీరు చదువుతున్నది నిజమే..లంబసింగి టూరిజం స్పాట్ గా తయారైన తరువాత 70శాతం పర్యాటకులు కేవలం లంబసింగిలోని అత్యల్పంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..ఆ మంచులో లేలేత భానుడి అందాలు...అకాశంలో తేలియాడేటట్టు కనిపించే మబ్బు తెరలను చూడటానికి వెళుతున్నారంటే అతిశయోక్తి కాదు. విశాఖ మన్యంలోని ఇపుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది ఈ లంబసింగి ప్రాంతం..  ఇక్కడ విశేషం ఏంటంటే ఏడాది పొడవునా ఈ ప్రాంతం శీతలంగానే ఉంటుంది. అక్టోబరు మొదలుకుని ఫిబ్రవరి వరకు మంచు వర్షంలా కురుస్తూనే వుంటుంది. 

ఉదయం 10 గంటలకైనా మంచు నీడ వీడ కుండా ఎదుటి వ్యక్తి కూడా కనబడనంగా వాతావరణం మారిపోతుంది. శీతల గాలులు వీస్తూ పర్యాటకులకు ఎంతో ఆహ్లాదం పంచుతూ రారమ్మని ఆహ్వానిస్తుంది. ఒకప్పుడు ఈ గ్రామంలో ఉండే 250మంది ఇపుడు 2500గా మారారంటే దానికి కారణం ఈ గ్రామం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారడమే. అయితే ఇక్కడ రాత్రి బస చేయడానికి ప్రత్యేక వసతులు ఉంటే మాత్రం మరింత మంది పర్యాటకులు వచ్చే పరిస్థితి వుండేది. ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో 1-5 నుంచి 1- 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైన సంఘటనలు అధికంగా వుంటాయి. అలాంటి ఉష్ణోగ్రతలు అతిశీతల వాతావరణం కాశ్మీర్ లోనూ, కొడైకెనాల్ లోనూ, ఊటీలో మాత్రమే కనిపిస్తాయి.. కానీ ఇపుడు విశాఖజిల్లా, చింతపల్లి మండలం, లంబసింగిలో అదే స్థాయిలో నేచర్ బ్యూటీ ఉండటంతో పర్యాటకులు అధిక సంఖ్యలో క్యూ కడుతుండటం విశేషం.  ఇక్కడికి వచ్చిన వారంతా ఈ వాతావరణానికి మంత్రముగ్ధులు అవుతుంటారు. వచ్చిన వారు కేవలం ఇద్దరికే ఈ ప్రాంతం అందం కోసం చెబుతారు(అడిగిన వారికి, అడగని వారికి) అంతలా ప్రాముఖ్యతను సంపాదించింది ఈ పర్యాటక ప్రాంతం. 

ముఖ్యంగా వ్యూపాయింట్, హిల్ పాయింట్, హిల్ వాక్, స్నో ఫారెస్ట్, స్నో క్లౌడ్ పాయింట్ లు ఈ పర్యాటక ప్రాంతంలో చెప్పుకోదగ్గర ప్రాంతాలు. ఇక్కడకు వచ్చేవారంతా రాత్రి 12 నుంచి 1 గంట మధ్య కార్లు, బైకుల్లో వచ్చి. తెల్లవారు జాము నుంచి ఉదయం 9 లేదా పది గంటల వరకూ ఉండి ఈ ప్రాంతంలో అందాలను ఆశ్వాదించి వెళతారు. పర్యాటకులు  ఈ ప్రదేశాలకు వచ్చిన గుర్తుగా తమ కెమెరాల్లో ఇక్కడి అందాలను బంధించుకుంటారు. అలా బందీ అయిన ఫోటోలు గుగూల్ సెర్చ్ లో తొలి స్థానాన్ని దక్కించుకున్నాయంటే ఇక్కడి ప్రక్రుతి అందాలు ఏస్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. వీటితోపాటు లంబసింగి, చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి.  ఈ ప్రాంతంలో పర్యటించే  ప్రతీఒక్కరినీ మైమరపిస్తాయి. ఈ ప్రాంతాలనికి వెళ్లే సమయంలో ఘాట్‌రోడ్డులో కాఫీ తోటలు విస్తారంగా ఉండటంతో అక్కడ కురుస్తున్న మంచు చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది.. లంబసింగి చేరుకోగానే ముందు బోడకొండమ్మ గుడి కనిపిస్తుంది..ఇక్కడకి వచ్చిన వారంతా ముందుగా ఆ వన దేవతకు పూజలు చేసి తమ ప్రయాణం అంతా సరదాగా సాగాలని పూజలు చేసి అడవి ప్రాంతంలోకి అందాలను చూడ్డానికి వెళతారు. ఈ ప్రాంతానికి అర కిలోమీటరు దిగువన జలపాతం ఉంది.

 ఇక్కడ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది. చూడటానికి ఈ ప్రాంతం చాలా అందంగా ఉండటంతో చాలా మంది ఇక్కడే జలకాలు కూడా అడుతుంటారు. అక్కడికి కొద్ది దూరంలో లంబసింగి గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో కొందరు యువకులు ఈ ప్రాంతాన్ని చూపించే గైడ్లుగా కూడా మారిపోయారు. సముద్ర మట్టానికి 1,210 మీటర్ల ఎత్తులోనున్న ఈ ప్రాంతంలో వేసవిలో కూడా అత్యంత చల్లగా వుంటుంది. ఎందుకంటే ఈ లంబసింగి ప్రాంతం మొత్ం కొండ ప్రాంతం కావడం వలన అధిక చల్లదనం ఉంటుంది. ఈ ప్రాంతంలో కొద్దిమేర మాత్రమే తినుబండారాలు దొరకడంతో నర్సీపట్నం నుంచే పర్యాటకులు అన్నీ కొనుగోలు చేసుకొని పట్టుకెళుతుంటారు. ఎక్కువ సంఖ్యలో పిక్నిక్ లు కూడా ఇక్కడే జరుగుతుండటం గుర్తించాల్సిన అంశం.  అన్నట్టు చెప్పడం మరిచిపోయా ఈ ప్రాంతానికి వెళ్లడానికి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకూ ఆర్టీసీ బస్సులు ఉంటాయి. 

నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లడానికి కూడా ఆర్టీసీ బస్సుల ఉంటాయి. కాకపోతే రాత్రి 12 దాటిన తరువాత వెళ్లలాంటే మాత్రం మనమే సొంతంగా వాహనాలు బుక్ చేసుకొని వెళ్లాలి...దానికోసం అటు నర్సీపట్నం నుంచి ప్రత్యేక ట్రావెల్ కార్లు, జీపులు, మినీ బస్సులు అందుబాటులో ఉంటాయి. కొత్త వారు ఈ ప్రాంతానికి చేరుకోవడానికి గుగూల్ కూడా రూట్ మ్యాప్ ను ప్రత్యేకంగా తయారు చేసింది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా గుగూల్ మ్యాప్ ను పట్టుకొని ఈ ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి చేరుకోవచ్చు.. ఇన్ని విషయాలు తెలుసుకున్న తరువాత వెంటనే చూడాలని పిస్తుంది కదూ..ఇంకెందుకాలస్యం ఈ చలికాలంలో మీరూ ఒ ట్రిప్ లంబసింగి వెళ్లి వచ్చేయండి.. అక్కడి అందాలను తనివితీరా ఆశ్వాదించేయండి..!

Lambasingi

2022-07-28 05:50:27

తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రచారం

EnsLive Appలో మీ వ్యాపార ప్రకటనలు ఇవ్వడం ద్వారా లక్షలాది పాఠకులకు, ప్రజలకు చేరువ అవ్వొచ్చు.. EnsLive Appతో పాటు www.enslive.net న్యూస్ వెబ్ సైట్ లో ఏక కాలంలో మీ ప్రకటన ప్రజలకు క్షణాల్లో చేరిపోతుంది. Whole salers, retailers, education, coaching centers, textiles, automobiles, interior developers ,real estate వ్యాపారం ఏదైనా మీరు ఆశించిన ఫలితాలు వచ్చేవరకు మీ ప్రకటనలను పాఠకుల దగ్గరకుతీసుకెళ్లడంతో మేము మీకు తోడుగా ఉంటాము. ప్రకటనలకు తక్కువ మొత్తం చెల్లించి అత్యంత ఎక్కువ ఫలితాలను పొంది. మీ వ్యాపారాలను మరింతగా వ్రుద్ధి చేసుకోండి.. ఇపుడే ఈఎన్ఎస్ లైవ్ యాప్ లో ప్రకటనల కోసం సంప్రదించండి..  మరిన్ని వివరాలకు: 9390280270లో సంప్రదించండి.

Visakhapatnam

2022-06-07 04:15:23

2021-09-12 12:09:47

అబ్బో..అబ్బబ్బో ఆ రైల్ బస్ ప్రయాణం..

చుట్టూ మనస్సుని హత్తుకునే పచ్చిక బైర్లు.. నింగీనేలా కలిసివున్నట్టుగా కనిపించే ఆహ్లాదకర ఆకాశం.. అటూ ఇటూ పల్లెటూరి అందాలు.. ఆ మధ్య పట్టాలపై నెమ్మదిగా కదిలే రైల్ బస్ అలా వెళుతుంటే అబ్బో అబ్బబ్బో ఆ రైల్ బస్ ప్రయాణమే వేరండీ ..వినడానికే ఏదో సినిమా ఇంట్రోలా ఉంది కదా.. అవును నిజంగానే ఆ రైల్ బస్ జర్నీ అంతటి మంచి అనుభూతిని కలిగిస్తుంది.. ఏంటీ రైల్ బస్.. ఎక్కడుందీ ఈ రైల్ బస్  అనుకుంటున్నారా..అవునండీ మీరు చదువుతున్నది నిజమే.. మంచి పర్యాటక అందాలను పరిచియం చేసే  రైల్ బస్ నిజంగానే వుంది.. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కోటి పల్లిలో ఉంది ఈ రైల్ బస్.. ఒకే బోగితో కాకినాడ నుంచి కోటి పల్లికి రోజూ తిరుగుతూ వుంటుంది. ఈ ప్రాంతానికి వచ్చేవారంతా ఇక్కడి అందాలను తనివితీరా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా కోటి పల్లి నుంచి కాకినాడ గానీ, కాకినాడ నుంచి కోటి పల్లి గానీ అయితే ఉదయం కుదరక పోతే సాయంత్రం ఖచ్చితంగా ప్రయాణం చేస్తారు. అలా ఈ రైలు బస్ లో ప్రయాణం చేస్తేనే పైన పేర్కొన్న వర్ణన చదివిన అనుభూతి కలుగుతుంది. ఈ రైల బస్ కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్లు అవసరం లేదు.. ప్రయాణ సమయంలోనే ఈ రైలుబస్సులోనే టిక్కెట్లు ఇస్తారు..నీట్ గా బస్సులో మాదిరిగానే సీట్లు కూడా ఉంటాయి. కాకినాడ నుంచి ఉదయం 9.30 బయలు దేరే ఈ రైలు మార్గం మధ్యలో మీకు  కొవ్వాడ, అర్తలకట్ట, కరప, వాకాడ, వేలంగి, నరసరావుపేట, రామచంద్రాపురం, ద్రాక్షారామం, కుండూరు, గంగవరం గ్రామాలు తగులుతాయ్..చివరిగా 11 గంటలకు కోటి పల్లి చేరుకుంటాం. ఈ మార్గ మధ్యలో చాలా గ్రామాల్లో కనిపించే అందాలు నిజంగానే మాటలకు అందవు. అప్పట్లో ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యం పల్లెటూర్లను కలుపుతూ సరిగా లేకపోవడంతో 2004లో ఈ రైలు బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది ప్రభుత్వం. అనాటి నుంచి ఈ నాటి వరకూ ఈ రైల్ బస్ సేవలు నిరాటంకం ప్రయాణీకులకు అందుతూ వస్తున్నాయి. చాలా మంది ఈ రైల్ బస్ కోసం ప్రసార మాద్యాలు, మీడియాలో ప్రత్యేక కధనాలుగా చదివిన వారు.. తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి వచ్చిన సమయంలో ఖచ్చితంగా ఈ రైలు బస్ ఎక్కి ఆ అనుభూతి పొందుతారంటే అతిశయోక్తి కాదు.. ఇంతటి అందాలను మీరు తనివితీరా ఆస్వాదించాలనుకుంటే ఒక్కసారి కోటిపల్లి-కాకినాడ రైల్ బస్ లో ఒక్క ట్రిప్పు వేస్తే సరి..ఇంకెందుకు ఆలస్యం తూర్పుగోదావరి జిల్లా పర్యాటకాన్ని చూసే సందర్భంలో ఈ ప్రాంతాన్ని కూడా యాడ్ చేసుకోండి...ఆ పల్లె వాతావరణపు ప్రక్రుతి అందాలను తిలకించండి అబ్బో..అబ్బబ్బో ఆ రైల్ బస్ ప్రయాణం అంటూ ఆల్ ది బెస్ట్..!

Kotipalli

2021-06-17 11:11:17

కరోనా వేక్సిన్ వేయించుకున్న సబ్ కలెక్టర్..

నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ తోపాటు అందరూ కోవిడ్ టీకా వేయించుకోవాలని నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య అన్నారు. గురువారం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో  సూపరింటెండెంట్ డా. నీలవేణి పర్యవేక్షణ లో స్టాఫ్ నర్సు సి హెచ్ రామలక్ష్మి కోవిడ్ టీకాను సబ్ కలెక్టర్ కు వేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ టీకా ను అర్హులైన ప్రతీ ఒక్కరూ ఎటువంటి సందేహం లేకుండా  వేయించుకోవ డానికి ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. మూడవ దశ వాక్సినేషన్ లో భాగంగా కోవిషీల్డ్ టీకా ను వేయించుకోవడం జరిగిందని,ఎటువంటి అసౌకర్యం లేదని సబ్ కలెక్టర్ తెలిపారు. ఏరియా ఆసుపత్రి జనరల్ ఫిజీషియన్ డా నళిని,సబ్ స్టాఫ్ రత్నం తదితరులు పాల్గొన్నారు.

Narsipatnam

2021-03-04 22:26:24

కశ్మీర్ ను తలదన్నే లంబసింగి అందాలు..

ఆ గ్రామం సముద్ర మట్టానికి సుమారు 4వేల అడుగుల ఎత్తులో ఉంది.. అక్కడ ఉష్ణోగ్రతలు చలికాలంలో 1-3కి పడిపోతాయ్ ..మంచు అయితే వర్షంలా కురుస్తుంది...ఒక్క మాటలో చెప్పాలంటే మనం ఆంధ్రాలో ఉన్నామా..కాశ్మీర్ లో ఉన్నామా అనే భావన కలుగుతుంది..అతి తక్కువ సమయంలో జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించింది ఆ గ్రామం.. అదే ఆంధ్రా ఊటీ లంబసింది..అదేంటి ఆంధ్రా ఊటి అరకు కదా అనుకుంటున్నారు కదా.. ఆ పేటెంట్ నేమ్ ఇపుడు లంబసింగి సొంతమైంది. అవునండీ మీరు చదువుతున్నది నిజమే..లంబసింగి టూరిజం స్పాట్ గా తయారైన తరువాత 70శాతం పర్యాటకులు కేవలం లంబసింగిలోని అత్యల్పంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..ఆ మంచులో లేలేత భానుడి అందాలు...అకాశంలో తేలియాడేటట్టు కనిపించే మబ్బు తెరలను చూడటానికి వెళుతున్నారంటే అతిశయోక్తి కాదు. విశాఖ మన్యంలోని ఇపుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది ఈ లంబసింగి ప్రాంతం..  ఇక్కడ విశేషం ఏంటంటే ఏడాది పొడవునా ఈ ప్రాంతం శీతలంగానే ఉంటుంది. అక్టోబరు మొదలుకుని ఫిబ్రవరి వరకు మంచు వర్షంలా కురుస్తూనే వుంటుంది. ఉదయం 10 గంటలకైనా మంచు నీడ వీడ కుండా ఎదుటి వ్యక్తి కూడా కనబడనంగా వాతావరణం మారిపోతుంది. శీతల గాలులు వీస్తూ పర్యాటకులకు ఎంతో ఆహ్లాదం పంచుతూ రారమ్మని ఆహ్వానిస్తుంది. ఒకప్పుడు ఈ గ్రామంలో ఉండే 250మంది ఇపుడు 2500గా మారారంటే దానికి కారణం ఈ గ్రామం ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మారడమే. అయితే ఇక్కడ రాత్రి బస చేయడానికి ప్రత్యేక వసతులు ఉంటే మాత్రం మరింత మంది పర్యాటకులు వచ్చే పరిస్థితి వుండేది. ప్రతి ఏడాది ఏదో ఒక సమయంలో 1-5 నుంచి 1- 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైన సంఘటనలు అధికంగా వుంటాయి. అలాంటి ఉష్ణోగ్రతలు అతిశీతల వాతావరణం కాశ్మీర్ లోనూ, కొడైకెనాల్ లోనూ, ఊటీలో మాత్రమే కనిపిస్తాయి.. కానీ ఇపుడు విశాఖజిల్లా, చింతపల్లి మండలం, లంబసింగిలో అదే స్థాయిలో నేచర్ బ్యూటీ ఉండటంతో పర్యాటకులు అధిక సంఖ్యలో క్యూ కడుతుండటం విశేషం.  ఇక్కడికి వచ్చిన వారంతా ఈ వాతావరణానికి మంత్రముగ్ధులు అవుతుంటారు. వచ్చిన వారు కేవలం ఇద్దరికే ఈ ప్రాంతం అందం కోసం చెబుతారు(అడిగిన వారికి, అడగని వారికి) అంతలా ప్రాముఖ్యతను సంపాదించింది ఈ పర్యాటక ప్రాంతం. ముఖ్యంగా వ్యూపాయింట్, హిల్ పాయింట్, హిల్ వాక్, స్నో ఫారెస్ట్, స్నో క్లౌడ్ పాయింట్ లు ఈ పర్యాటక ప్రాంతంలో చెప్పుకోదగ్గర ప్రాంతాలు. ఇక్కడకు వచ్చేవారంతా రాత్రి 12 నుంచి 1 గంట మధ్య కార్లు, బైకుల్లో వచ్చి. తెల్లవారు జాము నుంచి ఉదయం 9 లేదా పది గంటల వరకూ ఉండి ఈ ప్రాంతంలో అందాలను ఆశ్వాదించి వెళతారు. పర్యాటకులు  ఈ ప్రదేశాలకు వచ్చిన గుర్తుగా తమ కెమెరాల్లో ఇక్కడి అందాలను బంధించుకుంటారు. అలా బందీ అయిన ఫోటోలు గుగూల్ సెర్చ్ లో తొలి స్థానాన్ని దక్కించుకున్నాయంటే ఇక్కడి ప్రక్రుతి అందాలు ఏస్థాయిలో ఉంటాయో అర్ధం చేసుకోవచ్చు. వీటితోపాటు లంబసింగి, చింతపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి.  ఈ ప్రాంతంలో పర్యటించే  ప్రతీఒక్కరినీ మైమరపిస్తాయి. ఈ ప్రాంతాలనికి వెళ్లే సమయంలో ఘాట్‌రోడ్డులో కాఫీ తోటలు విస్తారంగా ఉండటంతో అక్కడ కురుస్తున్న మంచు చూడటానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది.. లంబసింగి చేరుకోగానే ముందు బోడకొండమ్మ గుడి కనిపిస్తుంది..ఇక్కడకి వచ్చిన వారంతా ముందుగా ఆ వన దేవతకు పూజలు చేసి తమ ప్రయాణం అంతా సరదాగా సాగాలని పూజలు చేసి అడవి ప్రాంతంలోకి అందాలను చూడ్డానికి వెళతారు. ఈ ప్రాంతానికి అర కిలోమీటరు దిగువన జలపాతం ఉంది. ఇక్కడ సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి నీరు పడుతుంటుంది. చూడటానికి ఈ ప్రాంతం చాలా అందంగా ఉండటంతో చాలా మంది ఇక్కడే జలకాలు కూడా అడుతుంటారు. అక్కడికి కొద్ది దూరంలో లంబసింగి గ్రామం ఉంటుంది. ఈ గ్రామంలో కొందరు యువకులు ఈ ప్రాంతాన్ని చూపించే గైడ్లుగా కూడా మారిపోయారు. సముద్ర మట్టానికి 1,210 మీటర్ల ఎత్తులోనున్న ఈ ప్రాంతంలో వేసవిలో కూడా అత్యంత చల్లగా వుంటుంది. ఎందుకంటే ఈ లంబసింగి ప్రాంతం మొత్ం కొండ ప్రాంతం కావడం వలన అధిక చల్లదనం ఉంటుంది. ఈ ప్రాంతంలో కొద్దిమేర మాత్రమే తినుబండారాలు దొరకడంతో నర్సీపట్నం నుంచే పర్యాటకులు అన్నీ కొనుగోలు చేసుకొని పట్టుకెళుతుంటారు. ఎక్కువ సంఖ్యలో పిక్నిక్ లు కూడా ఇక్కడే జరుగుతుండటం గుర్తించాల్సిన అంశం.  అన్నట్టు చెప్పడం మరిచిపోయా ఈ ప్రాంతానికి వెళ్లడానికి విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకూ ఆర్టీసీ బస్సులు ఉంటాయి. నర్సీపట్నం నుంచి చింతపల్లి వెళ్లడానికి కూడా ఆర్టీసీ బస్సుల ఉంటాయి. కాకపోతే రాత్రి 12 దాటిన తరువాత వెళ్లలాంటే మాత్రం మనమే సొంతంగా వాహనాలు బుక్ చేసుకొని వెళ్లాలి...దానికోసం అటు నర్సీపట్నం నుంచి ప్రత్యేక ట్రావెల్ కార్లు, జీపులు, మినీ బస్సులు అందుబాటులో ఉంటాయి. కొత్త వారు ఈ ప్రాంతానికి చేరుకోవడానికి గుగూల్ కూడా రూట్ మ్యాప్ ను ప్రత్యేకంగా తయారు చేసింది. ప్రపంచంలో ఏ మూల ఉన్నా గుగూల్ మ్యాప్ ను పట్టుకొని ఈ ఆంధ్రా కాశ్మీర్ లంబసింగి చేరుకోవచ్చు.. ఇన్ని విషయాలు తెలుసుకున్న తరువాత వెంటనే చూడాలని పిస్తుంది కదూ..ఇంకెందుకాలస్యం ఈ చలికాలంలో మీరూ ఒ ట్రిప్ లంబసింగి వెళ్లి వచ్చేయండి.. అక్కడి అందాలను తనివితీరా ఆశ్వాదించేయండి..!

Lambasingi

2021-01-03 12:08:26