1 ENS Live Breaking News

క్రీడలలో మరిన్ని విజయాలు సాధించాలి.. జెసి ఎమ్.జాహ్నవి

జిల్లాకు మరిన్ని బహుమతులను సాధించాలని  ఆఢుదాం ఆంధ్ర క్రీడా పోటీలలో విజయం సాధించిన ఖోఖో, కబడీ జట్లును జాయింట్ కలెక్టర్  ఎమ్.జాహ్నవి అభినం దించారు.  మంగళవారం ఆమె ఛాంబర్ లో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి  ఎల్.వి. రమణ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించిన  తుమ్మపాల-2 ఖొఖొజట్టు, రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానం పొందిన సాలపువానిపాలెం కబడ్డి జట్టు జాయింట్ కలెక్టరు ను కలిశారు.  ఈ సందర్బగా జె.సి. మాట్లాడుతూ మరింత శిక్షణ తీసుకుని జాతీయ జట్టుకు ఎంపికవ్వాలని ప్రోత్సహించారు.  డి.ఎల్.డి.వో. రమణ మాట్లాడుతూ డిశంబరు 26 తేదీ నుండి ప్రారంభమైన ఆడుదాం ఆంధ్ర పోటీలలో రాష్ట్ర స్థాయి ఫైనల్ లో మన జిల్లా జట్టు బాపట్ల జిల్లా జట్టుతో ఓటమి చెంది ద్వితీయ స్థానాన్ని పొంది  రూ.3 లక్షల నగదు, పతకం, ధృవపత్రంతో పాటు ట్రోఫీని కైవసం చేసుకుందన్నారు.  అలాగే జల్లా కబడీ జట్టు సెమీఫైనల్ లో చిత్తూరు జిల్లా పై గెలిచి  రూ.లక్ష నగదు బహుమతి, పతకం, ధృవపత్రాలతో పాటు ట్రోఫీని సాధించిందని చెప్పారు.  ఈ కార్యక్రమంలో కోచ్ పి.వి.నాగేశ్వరరావు, కబాడీ కోచ్, ఫిజికల్ డైరెక్టర్లు డి.ఎస్. శ్యాంప్రసాద్,  సత్యవతి,  ఖోఖో జట్టు కెప్టెన్ నవీన్, కబాడీ జట్టు కెప్టెన్ కె.త్రివేణి ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు.

Anakapalle

2024-02-20 12:45:19

జాతీయ స్థాయిలో ఏపీకి టెన్నీకాయిట్ లో ద్వితీయస్థానం

ఆంధ్రప్రదేశ్ జట్టుకి రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన 40వ జాతీయ జూనియర్ బాలబాలికల టెన్నికాయిట్ పోటీలలో ఆల్రౌండ్ ఛాంపియన్స్ లో ద్వితీయ స్థానం సాధించి. ఈ విజయం, రాష్ట్రానికి గౌరవం తీసుకొచ్చిన సందర్భంగా రాష్ట్ర టెన్నికాయిట్ కార్యదర్శి కేఎన్వీ సత్యనారాయణ క్రీడాకారులను అభినందించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ, జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో రాణించిన క్రీడాకారులు ఇదే ఉత్సాహంతో మరింతగా తర్ఫీదు పొంది ప్రథమ స్థానం సాధించే దిశగా తయారు కావాలన్నారు. క్రీడాకారుల అభివృద్ధి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. క్రీడాకారులు క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవడం ద్వారా ఏ తరహా పోటీల్లోనైనా గెలవడానికి అవకా శం ఏర్పడుతుందన్నారు. అదే విధంగా క్రీడల్లో రాణిస్తూ.. మంచి ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవాలని ఆయన సూచించారు.

Visakhapatnam

2024-02-13 17:05:39

ప్రీమియర్ క్రికెట్ పోటీలను ఉత్సాహంగా ప్రారంబించిన వంశీ

సంక్రాంతి పండుగ సందర్భంగా కొమ్మాధి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలను శనివారం విశాఖ నగర జనసేన అధ్యక్షులు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు.  పాల్గొ న్న టీమ్ లను పరిచయం చేసుకొని,  వంశీ   టాస్ వేసి , కేక్ కట్ చేసి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ, క్రీడల వలన మానసిన ఉల్లాసంతో పాటు, శరీరానికి వ్యాయామం కూడా సిద్దిస్తుందన్నారు. స్థానిక యువత కలిసిమెలసి క్రీడలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. భవి ష్యత్ లో మరిన్ని కార్యక్రమాలు,క్రీడలు నిర్వహించాలని తమ వంతు సహకారం ఎల్లప్పుడూ వుంటుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు స్థానిక గ్రామ పెద్దలు, స్థానిక యువత, క్రీడాకారులు పాల్గొన్నారు.

Kommadi

2024-01-13 15:15:41

బాడీబిల్డర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా సీతంరాజు

విశాఖ ఫిట్ నెస్ బాడీ బిల్డర్ అసోసియేషన్ విశాఖ జిల్లా గౌరవ అధ్యక్షులుగా విశాఖ దక్షిణ నియోజవర్గ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు సీతంరాజు సుధాకర్, లీగల్ సెల్ అడ్వైజర్గా 29 వ వార్డు కార్పొరేటర్,  స్టాండింగ్ కమిటీ మెంబర్ వురికిటి నారాయణరావులు ఎన్నికయ్యారు. ఈ  సందర్భంగా కమిటీ సభ్యులను సుధాకర్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు యర్రబిల్లి ప్రభాకరరావు,  ప్రధాన కార్యదర్శి పొలవరపు దుర్గాప్రసాద్ మెంబర్స్ మురళీమోహన్, పాపారావు. కె.శ్రీనివాసు. సతీష్కుమార్, రమేష్, ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.

Visakhapatnam

2023-08-27 16:06:40

యువ క్రికెటర్లకు ఏపీఎల్ మంచి వేదిక

ఆంధ్ర క్రికెట్ పని తీరు అద్భుతం అని ఏసీఏ అధ్యక్షులు పి. శరత్ చంద్రా రెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి లను ప్రపంచ కప్ హీరో, ఇండియా టెస్ట్ కెప్టెన్, మాజీ బిసిసిఐ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసించారు. ఆదివారం డా. వైయస్సార్ ఏసీఏ విడిసిఎ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి, అంతర్జాతీయ ప్లేయర్ కె. ఎఎస్. భరత్ తో కలిసి ఆయన మాట్లాడారు. ఆంధ్రలో ప్రతిభ ఉన్న క్రికెటర్లు చాలా మంది ఉన్నారని, అలాంటి వారి ప్రోత్సాహం కోసం ఏపీఎల్ ఉపయోగ పడుతుందని అన్నారు. రాబోవు రోజుల్లో ఆంధ్ర నుంచి మరింత మందిని  దేశానికి ప్రాతనిధ్యం వహించే క్రికెటర్లను తయారు చేయాలని ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు పి.శరత్ చంద్రా రెడ్డి, ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి లకు కృష్ణమాచారి శ్రీకాంత్ సూచించారు. ఆంధ్రలో యువ క్రికెటర్ల ప్రతిభకు కొదవ లేదని ఆన్నారు. యువ క్రికెటర్ల ప్రతిభను గుర్తించేందుకు ఏపీఎల్
మంచి వేదిక అని అన్నారు.

 దీని ద్వారా జాతీయ స్థాయిలో ఆడేందుకు ఏంతో మందిని తయారు చేయడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు. 
క్రీడాకారుల్లో నైపణ్యాభివృద్ధి కోసం  వైజాగ్ స్టేడియాన్ని ఏంతో అభివృద్ధి చేశారని అభినం దించారు.  ప్లైట్ లో వచ్చేటప్పుడు కొందరు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించు కావాలని సూచించడంతో అక్కడకు వెళ్లేందుకు తన ప్రోగ్రాంలో లేకపోయినా వెళ్లి స్వామిని దర్శించుకున్నాని వెల్లడించారు. ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది నిర్వహించిన ఏపీఎల్ -1 కు బాగా ఆదరణ పెరిగిందని, ప్రస్తుతం నిర్వహిస్తున్న ఏపీఎల్ -2 కు మరింత ఆదరణ వచ్చిందని అన్నారు. అంతకు ముందు ఆంధ్ర క్రికెట్ సంఘం మాజీ కార్యదర్శి ఎన్.వెంకట్రావ్ పేరుతో విశాఖ స్టేడియంలో ఓ స్టాండ్ ను కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి, ఉపాధ్యక్షులు పి. రోహిత్ రెడ్డి, సిఈఓ ఎం.వి. శివారెడ్డి, ఆపెక్స్ కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-08-27 14:07:03

ఉత్కంఠపోరులో విజయం సాధించిన రాయలసీమ కింగ్స్

ఆంధ్ర క్రికెట్ ఆధ్వర్యంలో వైజాగ్ లోని డా. వైయస్సార్ ఏసీఏ విడిసిఎ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ - 2  మ్యాచ్ శనివారం సాయంత్రం   జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో రాయలసీమ కింగ్స్- గోదావరి టైటాన్స్ జట్లు తలపడ్డాయి. రాయలసీమ జట్టు మూడు పరుగుల తేడాతో సెమీ ఫైనల్స్ లో విజయం సాధించి ఫైనల్స్ లో చోటు దక్కించుకుంది. తొలుత టాస్ గెలుచుకున్న గోదావరి టైటాన్స్ ఫీల్డింగ్ ఎన్నుకొని బరిలోకి దిగారు. దీంతో బ్యాటింగ్ తీసుకున్న రాయలసీమ కింగ్స్ జట్టు బ్యాట్స్ మ్యాన్లు 20  ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేశారు. ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్ గా దిగిన కె. హెచ్. వీరారెడ్డి అధ్బుతమైన బ్యాటింగ్ చేశాడు. కేవలం 47 బంతుల్లో 8 సిక్స్ లు,7 ఫోర్ల తో 92 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు జరిగిన సీరీస్ లో 92 పరుగుల ఎక్కువ స్కోర్ చేసిన తొలి బ్యాట్స్ మ్యాన్ గా  కె. హెచ్. వీరా రెడ్డి రికార్డ్ చేసి 
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అదే విధంగా మిడిల్ ఆర్డర్ లో దిగిన టి. వంశీ కృష్ణ, కెప్టన్ జి.హెచ్. విహారి ఇద్దరు చెరో 43 పరుగులు చొప్పున 86 పరుగులు చేశారు. 

అలాగే బి. ఎస్ వినయ్ కుమార్ 4 బంతుల్లో 19 పరుగులు చేసి స్కోరును ముందుకి తీసుకెళ్ళాడు.దీంతో రాయలసీమ కింగ్స్ జట్టు 218 పరుగుల లక్ష్యాన్ని గోదావరి టైటాన్స్ జట్టు ముందు నిలిపారు.  బ్యాటింగ్ బరిలోకి దిగిన గోదావరి టైటాన్స్  బ్యాట్స్ మ్యాన్ లు 20ఓవర్లు లో 9 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి చివరి ప్రయత్నం వరకు పోరాడి కేవలం 3 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యారు. గోదావరి టైటాన్స్ జట్టు లో కూడా ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్ గా దిగిన బి. మునిష్ రెడ్డి 40 బంతుల్లోనే 5 సిక్స్ లు,12 ఫోర్లు తో 89 పరుగులు చేసి  రెండో హైయెస్ట్ స్కోర్ చేసిన బ్యాట్స్ మ్యాన్ గా రికార్డ్ నిలిపాడు. మిగతా వారంతా సమిష్టిగా రాణించక పోవడంతో విజయాన్ని కైవసం చేసుకోలేక 
పోయింది. సెమీ ఫైనల్స్ లో విజయం సాధించిన రాయలసీమ కింగ్స్ జట్టు ఆదివారం నాడు జరిగే ఫైనల్స్ లో కోస్టల్ రైడర్స్ జట్టు తో తలపడనుంది.

Visakhapatnam

2023-08-26 17:09:54

ఏపీఎల్ - 2లో విజయం సాధించిన గోదావరి టైటాన్స్

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ లోని ఏసిఏ విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ - 2 మ్యాచ్ శుక్రవారం మధ్యాహ్నం  జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ ఉత్తరాంధ్ర లయన్స్,  గోదావరి టైటాన్స్ జట్లు తలపడ్డాయి.  ఎలిమినేటర్ లెవల్ లో  గోదావరి టైటాన్స్ విజయం సాధించి సెమీ ఫైనల్స్ లో చోటు దక్కించుకుంది. తొలత టాస్ గెలుచుకున్న గోదావరి టైటాన్స్ ఫీల్డింగ్ ఎన్నుకొని బరిలోకి దిగారు. దీంతో బ్యాటింగ్ తీసుకున్న ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు బ్యాట్స్ మ్యాన్లు 19.5  ఓవర్లలో గోదావరి టైటాన్స్ బౌలర్ల చేతిలో ఆలౌట్ అయిపోయారు.153 పరుగుల టార్గెట్ ను గోదావరి టైటాన్స్ జట్టు ముందు నిలిపారు. గోదావరి టైటాన్స్ బౌలర్లు అద్భుతమైన బౌలింగ్ తో ఉత్తరాంధ్ర లయన్స్ స్పీడ్ కు బ్రేకులు వేశారు. గోదావరి టైటాన్స్ జట్టు బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో 153 పరుగులకే ఉత్తరాంధ్ర లయన్స్ జట్టుని ఆల్ అవుట్ చేసి మట్టి కరిపించారు. బ్యాటింగ్ బరిలోకి దిగిన గోదావరి టైటాన్స్  బ్యాట్స్ మ్యాన్ లు గడిచిన 18 ఓవర్లు లో  159 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుని సెమీఫైనల్స్ కి స్థానం సాధించుకుంది. ఓపెనర్ బ్యాట్స్మెన్ గా దిగిన కెప్టెన్ సి. ఆర్. జ్ఞానేశ్వర్ 40 బంతులలో మూడు సిక్స్ లు, రెండు ఫోర్లు తో 53 పరుగులు చేసి అర్థ సెంచరీ పూర్తి చేసి నాటౌట్ గా నిలిచాడు. అదే విధంగా మూడో స్థానంలో దిగిన హేమంత్ రెడ్డి 53 బంతులలో మూడు సిక్స్ లు,7 ఫోర్లు తో 71 పరుగులు చేసి అర్థ సెంచరీ పూర్తి చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. వీరిద్ధరి పార్టనర్ షిప్ లో 93 బంతుల్లో 124 పరుగులు చేసి అద్భుతమైన బ్యాటింగ్ చేసి జట్టు విజయం కోసం కృషి చేశారు.

Visakhapatnam

2023-08-25 16:25:35

ఏపీఎల్ - 2 కోస్టల్ రైడర్స్ విజయం

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ లోని డాక్టర్ వైయస్సార్ ఏసీఏ విడిసీఏ క్రికెట్ స్టేడియంలో బుధవారం ఉదయం  జరిగిన  ఏపీఎల్ సీజన్ - 2 లీగ్ మ్యాచ్ లో 
యలసీమ కింగ్స్ , కోస్టల్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా డాక్ వర్త్ లూయిస్ ప్రకారం రెండు వికెట్ల నష్టానికి  కోస్టల్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. తొలత టాస్ గెలుచుకున్న కోస్టల్ రైడర్స్ ఫీల్డింగ్ ఎన్నుకొని బరిలోకి దిగారు. వర్షం కారణంగా మ్యాచ్ ను 18 ఒవర్లకు కుదించారు. దీంతో బ్యాటింగ్ తీసుకున్న రాయలసీమ కింగ్స్ జట్టు బ్యాట్స్ మ్యాన్లు 18  ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 131 మాత్రమే చేయగలిగారు. కె హెచ్. వీరా రెడ్డి మాత్రమే 78 పరుగులు చేసి రాయలసీమ కింగ్స్ జట్టు లో స్కోరును ముందుకి తీసుకెళ్ళాడు. మిగతా వారంతా సమష్టిగా రాణించలేక పోయారు.దీంతో 131 పరుగుల టార్గెట్ ను కోస్టల్ రైడర్స్ జట్టు ముందు నిలిపారు.
 బ్యాటింగ్ బరిలోకి దిగిన కోస్టల్ రైడర్స్ కి 15 ఒవర్లలో 127 పరుగులకు  కుదించడం తో  బ్యాట్స్ మ్యాన్ లు గడిచిన 14 ఓవర్లు లో రెండు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్ ఎం. ప్రణీత్ 40 బంతుల్లో 3సిక్స్ లు, 6ఫోర్లు తో 64 పరుగులు చేసి నాట్ అవుట్ గా చివరివరకు నిలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

Visakhapatnam

2023-08-23 14:04:59

ఉత్కంఠ పోరులో బెజవాడ టైగర్స్ విజయం

 ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ లోని డాక్టర్ వైయస్సార్ ఏ సిఏ విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్ - 2 లీగ్ మ్యాచ్ లో భాగంగా మంగళవారం సాయంత్రం జరిగిన  మ్యాచ్లో వైజాగ్ వారియర్స్, బెజవాడ టైగర్స్ జట్లు తలపడ్డాయి.7వికెట్ల నష్టానికి విజయం సాధించిన బెజవాడ టైగర్స్.తొలత టాస్ గెలుచుకున్న వైజాగ్ వారియర్స్ బ్యాటింగ్  ఎన్నుకొని బరిలోకి దిగారు. బ్యాటింగ్ తీసుకున్న వైజాగ్ వారియర్స్ జట్టు బ్యాట్స్ మ్యాన్లు 20 ఓవర్లలో 4 వికెట్లను కోల్పోయి 193 పరుగులు సాధించారు. ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్లు ముగ్గురు సమష్టిగా రాణించిన మిగతా వారంతా అంతగా కృషి చేయాలేకపో యారు.దీంతో 193 పరుగుల టార్గెట్ ను బెజవాడ టైగర్స్ జట్టు ముందు నిలిపారు. బ్యాటింగ్ బరిలోకి దిగిన బెజవాడ టైగర్స్ బ్యాట్స్ మ్యాన్ లు గడిచిన 20  ఓవర్లలో 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. చివరి బాల్ వరకు ఉత్కంఠ భరితంగా మ్యాచ్ సాగింది.మిడిల్ ఆర్డర్ లో దిగిన షోయబ్ ఎం డి ఖాన్ 33 బంతుల్లో 51 పరుగులు చేసి అర్థ సెంచరీ పూర్తి చేశాడు. పి. అవినాష్ 30 బంతుల్లో 71 పరుగులు చేసి మ్యాచ్ ని టర్నింగ్ పాయింట్ చేసి విజయాన్ని వారి వైపు తిప్పి నాట్ అవుట్ గా చివరి వరకు నిలిచి మ్యన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. దీంతో 7 వికెట్లు నష్టానికి బెజవాడ టైగర్స్  విజయం కైవసం చేసుకుంది.

Visakhapatnam

2023-08-22 16:38:14

ఏపీఎల్ -2 లో కోస్టల్ రైడర్స్ జట్టు విజయం

ఆంధ్ర క్రికెట్ ఆధ్వర్యంలో వైజాగ్ లోని డాక్టర్ వైయస్సార్ ఏసిఏ విడిసిఏ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్ 2 మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం  జరిగిన  మ్యాచ్ లో గోదావరి టైటాన్స్, కోస్టల్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. 35 పరుగుల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం సాధించింది.  తొలుత టాస్ గెలుచుకున్న గోదావరి టైటాన్స్ ఫీల్డింగ్ ఎన్నుకొని బరిలోకి దిగారు. బ్యాటింగ్ తీసుకున్న కోస్టల్ రైడర్స్ జట్టు బ్యాట్స్మ్యాన్లు 20 ఓవర్లలో 9 వికెట్లను కోల్పోయి 173 పరుగులు సాధించారు. ఓపెనర్ బ్యాట్స్ మ్యాన్ గా దిగిన ధరణి కుమార్ 32 బంతుల్లో 3సిక్స్ లు, 8 ఫోర్లు తో 59 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. అనంతరం మిడిల్ ఆర్డర్ లో దిగిన ఎం.హర్షవర్ధన్ 22 బంతుల్లో 35 పరుగులు చేశారు. మిగతా వారంతా సమష్టిగా రాణించలేక పోయారు.దీంతో 173 పరుగుల టార్గెట్ ను గోదావరి టైటాన్స్ జట్టు ముందు నిలిపారు.  బ్యాటింగ్ బరిలోకి దిగిన గోదావరి టైటాన్స్ బ్యాట్స్ మ్యాన్ లు గడిచిన 18.1 ఓవర్లలో 138 పరుగులు మత్రమే చేసి అల్ ఔట్ అయ్యి ఓటమి పాలయ్యా రు. 3వ స్థానంలో దిగిన ఎం. హేమంత్ రెడ్డి మత్రమే 4 సిక్స్ లు, 5 ఫోర్లు తో 49 బంతుల్లో 58 పరుగులు చేశాడు. మిగతా జట్టు సభ్యులు అంతగా రాణించ లేకపోయారు. కోస్టల్ రైడర్స్ జట్టు బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించి గోదావరి టైటాన్స్ జట్టుని 138 పరుగుల వద్ద ఆల్ ఔట్ చేశారు. 35 పరుగుల తేడాతో కోస్టల్ రైడర్స్ విజయం కైవసం చేసుకుంది. 

Visakhapatnam

2023-08-22 16:23:27

కోస్టల్‌ రైడర్స్‌పై ఉత్తరాంధ్ర లయన్స్‌ ఈజీ విక్టరీ

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైజాగ్ లోని డాక్టర్ వైయస్సార్ ఏసీఏ విడిసీఏ  క్రికెట్ స్టేడియంలో శనివారం సాయంత్రం జరిగిన ఏపీఎల్ 2 మ్యాచ్ లో ఉత్తరాంధ్ర లయన్స్, కోస్టల్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. 7 వికెట్ల నష్టానికి ఉత్తరాంధ్ర లయన్స్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తొలత టాస్ గెలుచుకున్న కోస్టల్ రైడర్స్ బ్యాటింగ్ ఎన్నుకొని బరిలోకి దిగారు. బ్యాటింగ్ తీసుకున్న కోస్టల్ రైడర్స్ బ్యాట్స్ మ్యాన్లు 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 160 పరుగులు సాధించారు. ఓపెనర్ గా దిగిన బ్యాట్స్ మ్యాన్ లు నిరుత్సాహ పరిచినా మిడిల్ ఆర్డర్ లో దిగిన ప్లేయర్స్ ఎం. హర్షవర్ధన్ 37 బంతుల్లో 2 సిక్సులు, 3ఫోర్లు తో 44 పరుగులు చేశాడు. జి. చిరంజీవి 23 బంతుల్లో 2 సిక్స్ లు, 3ఫోర్లు తో 38 పరుగులు చేసి నాట్ అవుట్ గా చివరివరకు నిలిచాడు. వీరిద్దరి పార్టనర్షిప్ లో 60బంతుల్లో 82 పరుగులు చేశారు. కెప్టన్ తో సహా మిగతా వారంతా అంతగా రానించలేక పోయారు.దీంతో  160 పరుగులు టార్గెట్ ను  ముందు నిలిపారు. ఉత్తరాంధ్ర లయన్స్  బౌలర్లు సమిష్టిగా రాణించి 7  వికెట్లను తీసి స్కోరును అదుపు చేశారు.

బ్యాటింగ్ బరిలోకి దిగిన ఉత్తరాంధ్ర లయన్స్  క్రీడాకారులు 161 పరుగులు టార్గెట్ ను గడిచిన 17.3 ఓవర్లకే 7 వికెట్లు నష్టపోయి 166 పరుగులు చేసి ఘన విజయా 
న్ని సొంతం చేసుకున్నారు. ఓపెనర్లు గా దిగిన కె. యస్. భరత్ 22 బంతుల్లో 4సిక్స్ లు, 6ఫోర్లు తో 54 పరుగులతో అర్థ సెంచరీ పూర్తి చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే సలేహ్ గుల్ఫామ్ 19 బంతుల్లో 2 సిక్స్ లు, 4ఫోర్లు తో 31 పరుగులతో చెలరేగిపోయా రు. వీరిద్దరి పార్టనర్షిప్ లో కేవలం 41బంతుల్లో 85  పరుగులు చేసి లక్ష్యం లో సగం స్కోరును వీరే చేదించారు. తరువాత దిగిన మిడిల్ ఆర్డర్ ప్లేయర్స్ అందరూ సమిష్టిగా రాణించి కొద్ది పాటి పరుగులు చేస్తూ 17.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టపోయి టార్గెట్ ను పూర్తి చేసి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్తరాంధ్ర లయన్స్ టీమ్ కెప్టెన్ కె.యస్. భరత్ అధ్బుతమైన అర్థ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.


 తమ్ముడిని ఔట్‌ చేసిన అన్న.. 

జి.చిరంజీవి కోస్టల్‌ రైడర్స్‌ తరపున ఆడుతుండగా ఇతని తమ్ముడు జి. శ్యామ్‌ సుందర్‌ ఉత్తరాంధ్ర లయన్స్ తరపున ఆడుతున్నాడు. 15.6వ ఓవర్‌లో శ్యామ్‌కు దీపక్‌ బౌలింగ్‌ వేశాడు. ఆ బాల్‌ను కొట్టి శ్యామ్‌ పరుగు ప్రారంభించగా అతని అన్న చిరంజీవి బాల్‌ను అందుకొని డైరెక్టుగా వికెట్లకు విసిరాడు. దీంతో అన్న చేతిలో తమ్ముడు రన్‌ ఔట్‌ అయ్యాడు.

Visakhapatnam

2023-08-19 15:58:44

ఏపీఎల్ లోగోదావరి టైటాన్స్ విక్టరీ

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ వైయస్సార్ ఏసీఏ విడిసియే క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్ -2 మ్యాచ్ లో భాగంగాలో శుక్రవారం సాయంత్రం బెజవాడ టైగర్స్, గోదావరి టైటాన్స్ జట్లు తలపడ్డాయి.7వికెట్ల ఆధిక్యంతో గోదావరి టైటాన్స్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. తొలత టాస్ గెలుచుకున్న గోదావరి టైటాన్స్ ఫీల్డింగ్ ఎంచుకుని బరిలోకి దిగారు. బ్యాటింగ్ తీసుకున్న బెజవాడ టైగర్స్ బ్యాట్స్ మ్యాన్లు 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 175 పరుగులు సాధించారు. ఓపెనర్ గా దిగిన బ్యాట్స్ మ్యాన్ లు సమిష్టిగా రాణించి 61 బంతుల్లో 96పరుగులు చేసి స్కోరును ముందుకి తీసుకొని వెళ్ళారు. ఓపెనర్లు ఔట్ అయ్యేసరికి మిగతా వారంతా అంతగా రాణించలేక పోయారు. 
దీంతో గడిచిన 20 ఒవర్లకు 8వికెట్ల నష్టానికి 175 పరుగులు టార్గెట్ ను గోదావరి టైటాన్స్ ముందు నిలిపారు. గోదావరి టైటాన్స్ బౌలర్లు సమిష్టిగా రాణించి 8వికెట్లను తీసి స్కోరును అదుపు చేశారు. బ్యాటింగ్ బరిలోకి దిగిన గోదావరి టైటాన్స్ క్రీడాకారులు 175 పరుగులు టార్గెట్ ను గడిచిన 19 ఓవర్లలో 7వికెట్ల ఆధిక్యంతో టార్గెట్ ను పూర్తి చేసి ఘనవిజయాన్ని సొంతం చేసుకున్నారు. ఓపెనేర్ గా దిగిన కెప్టెన్ సి అర్ జ్ఞానేశ్వర్ 36 బంతుల్లో 5సిక్లు,4 ఫోర్లు తో 66పరుగులు చేసి ఈ మ్యాచ్లో కూడా అర్థ సెంచరీ పూర్తి చేసి అవుటయ్యడు.ఓపెనర్లు ఇద్దరు అవుటవ్వడం తో మూడో స్థానంలో దిగిన ఎన్ హేమంత్ రెడ్డి మైదానంలో బాల్ తో విరుచుకు పడ్డాడు. 47 బంతుల్లో 3సిక్స్ లు, 4ఫోర్లు తో 61పరుగులు సాధించి నాట్ అవుట్ గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. గోదావరి టైటాన్స్ జట్టు దీనితో గడిచిన 19 ఓవర్లలో 7వికెట్ల ఆధిక్యంతో టార్గెట్ ను పూర్తి చేసి రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Visakhapatnam

2023-08-18 16:36:41

విశాఖ‌లో ఉత్సాహంగా ప్రారంభ‌మైన ఏపిఎల్ క్రికెట్ ఫీవ‌ర్‌

వైజాగ్‌ లో మళ్లీ క్రికెట్ ఫీవర్ మొదలైంది.. ఇక‌ విశాఖ నగరమంతా డా.వైఎస్సార్ క్రికెట్ స్టేడియంకే పరిమితం కానుంది. విశాఖలో క్రికెట్ అభిమానులకి క్రికెట్ పండుగ‌గా ఏపీఎల్ సీజన్ - 2 బుధ వారం వైభవంగా ప్రారంభమైంది. సినీ హీరోయిన్ శ్రీలీల గౌరవ అతిథిగా హాజరై క్రీడాకారుల్లో ఉత్సా హాన్ని నింపారు. క్రికెట్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ, యువతలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడం కోసం బిసిసిఐ సహకారంతో ఏపీఎల్ సీజన్-  2 నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏపీఎల్ నిర్వహణ వల్ల రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు జాతీయ, అంత ర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం లభిస్తుందన్నారు. 27వ తేదీ వరకు టోర్నీజ‌రుగుతంద‌ని వివ‌రించారు. ఐటిశాఖ‌ మంత్రి గుడివా డ అమర్నాథ్ మాట్లాడుతూ, సీఎం  వైయస్ జగన్ మోహన్ రెడ్డి క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నారని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో అన్ని రకాల క్రీడల్లో గ్రామ స్థాయిలో ప్రతిభ ఉన్న వారిని గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. విడిసీ ఏ అధ్యక్షులు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ఏపీఎల్ ద్వారా  ఏసీఏ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి యువ క్రీడాకారులను ప్రపంచానికి తెలియచేసేందుకు అవకాశం కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో  జివిఎంసి మేయర్ జి. హరి వెంకట కుమారి,  ఏపీఎల్ గవెర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ మాంచు పెర్రర్, ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపీనాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి, ట్రెజరర్ వెంకట చలం, సీఈవో వెంకట శివా రెడ్డి, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్లు మునిష్ సెహగల్, జి.వి.వి. గోపాల్ రాజు, ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ, ఏమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ రావ్, కలెక్టర్ ఎ. మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


Visakhapatnam

2023-08-16 13:46:12

క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం..శ్రీధర్ రెడ్డి

క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం అవుతుందని ఏపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ సలహాదారు జి. శ్రీధర్ రెడ్డి భావించారు. అన్నెపు రామచందర్ వంటి శిక్ష కులు ఈ తరం క్రీడాకారులకు  అదృష్టం అని అన్నారు. బాస్కెట్ బాల్ క్రీడా రాణింపు భవితకు ఉత్తమ మార్గం అని పేర్కొన్న శ్రీధర్ రెడ్డి రామ చందర్ సుశిక్షణలొ ఏపికి, భారతదేశంలో ప్రాతినిద్యం వహించే క్రీడాకారులుగ ఎదగా ఆశించారు. ఏపి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వ సలహాదారు శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథి పాల్గొని శ్రీ పుట్ట మన్మథరావు మెమోరియల్ క్లబ్ ఆధ్వర్యంలో ఏయు ఫిజికల్ ఎడ్యుకేషన్ సౌజన్యంతొ ఏర్పాటైన బాస్కెట్ బాల్ ( వేసవి ) టోర్నమెంట్  చాంపియన్షిప్-2023 లొ ముఖ్య అతిధి పాల్గొన్నారు. ఈ సందర్భంగ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రామచందర్ శిక్షణలో ఇప్పటికే ఎందరో జాతీయ స్థాయి క్రీడాకారులుగ ఎదగడం అభినందనీయం అన్నారు. ఇక్కడ  శిక్షణ పొందిన మంచి స్థాయిల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డ ప్రశంసనీయంమన్నారు.

ప్రధాన శిక్షకులు రామచందర్ మాట్లాడుతూ కమర్షియల్ శిక్షణలో మాత్రమే నడుస్తున్న ప్రస్తుత కాలంలో 3 దశాబ్ధాలుగ ఉచితం బాస్కెట్ బాల్ శిక్షణ ఇస్తున్న తనకు తనకు విద్య నేర్పిన గురువులు స్ఫూర్తి అన్నారు. ఇదే కార్యక్రమంలో విశాఖ బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్ మోషన్ రావు,యూనియన్ బ్యాంకు సీనియర్ మేనేజర్ జి. అప్పారావు, ఇంపీరియల్ డిజైనర్ మహేశ్వరరావు, సిఎస్సి డిస్టర్బ్ కోట్ల మేనేజర్ కె. చంద్రశేఖర బాబు, సీనియర్ బాస్కెట్ బాల్ క్రీడాకారులు జాన్, సోమశేఖరం తదితరులు అతిధులుగ పాల్గొన్నారు. అక్షరసారధి , సీనియర్ జర్నలిస్ట్ బి.ఎస్. చంద్రశేఖర్ సంధాయకుడు వ్యవహరించారు.

Visakhapatnam

2023-06-10 14:48:02

ఫెన్సింగ్ పోటీల్లో విజేతలుగా తిరిగి రావాలి..

జాతీయ స్థాయి ఫెన్సింగ్ పోటీలలో సత్తా చాటి విజేతలుగా తిరిగిరావాలని శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపికైన సీనియర్  క్రీడాకారులకి ఎస్పీ జి.ఆర్ .రాధిక పిలుపునిచ్చారు. పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమన్నారు. ఎస్సీ కార్యాలయంలో సోమవారం జాతీయ స్థాయి పోటీలకి బయలుదేరే ఇద్దరు ఫెన్సింగ్ క్రీడాకారిణిను, కాకినాడలో ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సీనియర్ ఫెన్సింగ్ పోటీలలో మెడల్స్ సాధించిన 4గురు క్రీడాకారిణిలను ఆమె అభినందించారు.  క్రీడాకారిణిలతో ముచ్చటించి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాధిక మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేసేలా జాతీయ ఫెన్సింగ్ పోటీలలో రాణించాలన్నారు. క్రీడాకారులు తమ ప్రతిభ పాఠవాలను నిరూపించుకుని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా ఫెన్సింగ్  కోచ్ వంశీని ఎస్పీ ప్రత్యేకంగా  అభినందించారు.

Srikakulam

2023-03-20 08:31:55