1 ENS Live Breaking News

తెలుగు సినీపరిశ్రమ రాష్ట్రానికి తరలిరావాలనే ప్రకటనపై డా.కంచర్ల హర్షం

తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలి రావాలని రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడ రేషన్ ఎంప్లాయిస్ అసోసియేషన్ చైర్మన్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్టు అధినేత, నిర్మాత డా. కంచర్ల అచ్యుతరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి సినీ పరిశ్రమ రావడం, ఇక్కడి ప్రముఖ పర్యాటక కేంద్రాల్లోని సినిమాల నిర్మాణాలు జరగడం వలన రాష్ట్రంలోని కళాకారులకు, సినీ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులకు ఉపాది అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు. ఇటీవ లే కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా సినీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని తన కి హామీ ఇచ్చిన అంశాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతేకాకుండా పర్యటక శాఖ మంత్రి రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతా ల పేర్లను యధావిధిగా సినిమాల్లో చూపించడం ద్వారా మంచి ప్రచారం జరుగుతుందనే విషయాన్ని ప్రస్తావించడం కూడా శుభపరిణామం అన్నారు.

రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలను ప్రమోషన్ చేయడానికి తమ సినిమాల్లో ప్రత్యేక స్థానం కల్పిస్తామని కూడా కంచర్ల ఈ సం దర్భంగా మీడియా ద్వారా స్పష్టం చేశారు. రాష్ట్రానికి సినీ పరిశ్రమ రావడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఏర్పాటు అయ్యే అవకాశం వుంటుం దన్నారు. తద్వారా రాష్ట్రంలోని సినీ నిర్మాతలు సినిమాలు నిర్మించుకోవడానికి మరో రాష్ట్రానికి వెళ్లే ఇబ్బందులు కూడా తప్పుతా యని ఆయ న ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖజిల్లాలోని చాలా పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని.. అన్నింటిని ప్రత్యేక కోణంలో తమ సినిమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేపడతామని స్పష్టం చేశారు. మంచి వాతారణంలో రాష్ట్రానికి సినీ పరిశ్రమ తరలిరావాలని ఆయన ప్రకటన చేయడం తోపాటు, దానికి సంబంధించిన ఇతరత్రా కార్యాలయ తరలింపు విషయంలో కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. కూటమి ప్రభుత్వంలో సినీ పరిశ్రమకి మంచిరోజులు వస్తాయనే నమ్మకం మంత్రి ప్రకటనతో మరింత బలం చేకూరిందని కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు.

visakhapatnam

2024-10-25 15:00:46

విశాఖ జర్నలిస్టుకి హాస్యంలో ఉత్తమ రాష్ట్రప్రభుత్వ నంది అవార్డు

విశాఖలో జర్నలిస్టులిస్టు, ప్రముఖ కళాకారుడు, హాస్యనటుడైన డేవిడ్ రాజ్ కు ఉత్తమ హాస్యనటునిగా "నంది" పురస్కారం లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా అందజేసే ఈ అవార్డు ఈయనకు రావడం పట్ల జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  గుంటూరులో నిర్వహించిన నంది నాటకోత్సవం -2023లో  రాష్ట్ర చలనచిత్ర టీవీ,నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రముఖ సినీ నటులు పోసాని కృష్ణ మురళి ఈ అవార్డు ను అందజేశారు. అలాగే "శ్రీకాంత కృష్ణమాచార్య"  పద్య నాటకానికి ద్వితీ య ఉత్తమ ప్రదర్శనగా వెండి నంది, అలాగే ఇదే నాటికకు సంగీత బాధ్యతలు చేపట్టిన మురళికి ఉత్తమ సంగీత దర్శకుడు నంది అవార్డు వచ్చింది. నగరానికి చెందిన జయ కళానికేతన్ ఆధ్వర్యంలో  కె.వెంకటేశ్వర రావు దర్శకత్వంలో ఈ ప్రదర్శన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ ప్రతి సంవ త్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కారాలను అందజేస్తుంది. వివిధ విభాగాల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమ తులు అందజేస్తారు. మొత్తం 5 విభాగాల్లో  73 నంది అవార్డులు కళాకారులకు అందజేశారు. నంది నాటకోత్సవాలు  డిసెంబరు 23 (శనివారం) నుండి  29 (శుక్రవారం) వరకు గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగాయి. 73 అవార్డుల కోసం 38 నాటక సమాజాలు 1200 మంది నటీనటులు పోటీపడ్డారు. నాటక ప్రదర్శనలు పరిశీలించి వాటికి స్వర్ణ, రజత, కాంస్య నందుల విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేశారు. ఈ బహుమతులు ప్రధానోత్సవం రాష్ట్ర సెలవలు శాఖ మాత్యులు అంబటి రాంబాబు , ఎఫ్ డి సి మేనేజర్ శేషా సాయి, ఎం.డి టీవీ కే రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డేవిడ్ రాజు నంది అవార్డు రావడం పట్ల ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ చీఫ్ రిపోర్టర్, అల్లూరి చరిత్ర పరిశోధకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) డేవిడ్ రాజుకి ఫోన్ చేసి ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ఈ నంది అవార్డుతో స్పూర్తితో సినీ, నాట రంగంలో మరింత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

Visakhapatnam

2023-12-30 05:16:14

సగిలేటికథ కి U/A సర్టిఫికేట్..అక్టోబర్ 6న రీలిజ్ కి సిద్ధం

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్ ప్రేక్షకుల నుండి అశేష ఆధరణ పొందడంతోపాటు, విడుదలైన సాంగ్స్ కి కుడా మంచి అప్లాజ్స్ రావడం విశేషం. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు దిగ్వజీయంగా పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ అందుకుంది. ఈ చిత్రం చాలా న్యాచురల్ గా సగటు ప్రేక్షకుడికి నచ్చేలా ఉందని, ఇలాంటి రూటెడ్ కథలు మునుపెన్నడూ చూడలేదంటూ ఖచ్చితంగా ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రమ్మరథం పడతారని సెన్సార్ బోర్డు ముఖ్య సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. చిత్రం చూసాక, మా టీం కి కూడా చికెన్ తినాలనిపిస్తుందంటూ నవ్వుతు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సంద్రభంగా చిత్ర యూనిట్ అక్టోబర్ 6న విడుదల తేదీని ప్రకటించారు.నటీనటులు: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగానిరచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: రాజశేఖర్ సుడ్మూన్కో-రైటర్: శశికాంత్ బిల్లపాటి, మని ప్రసాద్ అరకులనిర్మాతలు: అశోక్ మిట్టపల్లి, దేవీప్రసాద్ బలివాడఇన్ అసోసియేషన్ విత్: సి స్పెస్ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరేష్ మాదినేనిఅసోసియేట్ ప్రొడ్యూసర్: పుష్పాభాస్కర్, సునీల్ కుమార్ ఆనందన్, లీలా కృష్ణ కొండేపాటిలైన్ ప్రొడ్యూసర్: చందు కొత్తగుండ్లసంగీతం: జశ్వంత్ పసుపులేటినేపథ్యసంగీతం: సనల్ వాసుదేవ్సింగర్స్: కీర్తన శేష్, కనకవ్వసాహిత్యం: వరికుప్పల యాదగిరి, పవన్ కుందాని, రాజశేఖర్ సుడ్మూన్, శశికాంత్ బిల్లపాటి, జశ్వంత్ పసుపులేటిపి.ఆర్.ఓ: తిరుమలశెట్టి వెంకటేష్ఆర్ట్ డైరెక్టర్స్: హేమంత్ జి, ఐశ్వర్య కులకర్ణికాస్ట్యూమ్ డిజైనర్: హర్షాంజలి శేనికేషిసౌండ్ డిజైనర్: యతి రాజుసౌండ్ మిక్సింగ్: శ్యామల సిక్దర్డి.ఐ: కొందూరు దీపక్ రాజుపబ్లిసిటీ డిజైనర్: యమ్.కే.యస్ మనోజ్ #sagiletikatha  #attaettaga   #shadestudios #ashokarts #rajasekharsudmoon #ravimahadasyam #vishikalaxman

Hyderabad

2023-09-23 16:08:07

24న ‘చంద్రముఖి 2’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌

స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’. అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన ఈ చిత్రాన్ని సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు తెర‌కెక్కించారు. తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్ 28న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యాన‌ర్‌పై రిలీజ్ చేస్తున్నారు. వేట్ట‌య రాజాగా రాఘవ లారెన్స్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై మెప్పించ‌నున్నారు. వేట్ట‌య రాజాపై ప్ర‌తీకారం తీర్చుకోవ‌టానికి చంద్ర‌ముఖిగా కంగ‌నా ర‌నౌత్‌ సిద్ధ‌మైంది. అస‌లు వీరి మ‌ధ్య జ‌రిగిన అస‌లైన క‌థేంటి.. వేట్ట‌య రాజాపై చంద్ర‌ముఖి ప్ర‌తీకారం తీర్చుకుందా? ఆమె ప‌గ చ‌ల్లారిందా? అనే విష‌యాలు తెలియాంటే సెప్టెంబ‌ర్ 28 వ‌ర‌కు ఆగాల్సిందంటున్నారు సినీ విశ్లేషకులు. హార‌ర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు వ‌డివేలు త‌న‌దైన కామెడీతో మెప్పించ‌టానికి సిద్ధ‌మ‌య్యారు. సెప్టెంబర్ 24న ‘చంద్రముఖి 2’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌ జె.ఆర్.సి.కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించబోతున్నారు. లారెన్స్‌, కంగ‌నా ర‌నౌత్ స‌హా ఎంటైర్ యూనిట్ ఈవెంట్‌లో పాల్గొన‌బోతున్నారు. ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్స్ యువీ మీడియా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్ లెవల్లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.

 న‌టీన‌టులు: రాఘ‌వ లారెన్స్‌, కంగ‌నా ర‌నౌత్‌, వ‌డివేలు, ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, విఘ్నేష్‌, ర‌విమారియ, శృష్టి డాంగే, శుభిక్ష‌, వై.జి.మ‌హేంద్ర‌న్ రావు ర‌మేష్‌, సాయి అయ్య‌ప్ప‌న్, సురేష్ మీన‌న్‌, శత్రు, టి.ఎం.కార్తీక్‌సాంకేతిక వ‌ర్గం:ద‌ర్శ‌క‌త్వం: పి.వాసు, బ్యాన‌ర్‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్‌, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: తోట త‌ర‌ణి, మ్యూజిక్‌: ఎం.ఎం.కీర‌వాణి, ఎడిట‌ర్‌: ఆంథోని, స్టంట్స్‌: క‌మల్ క‌న్న‌న్‌, ర‌వివ‌ర్మ‌, స్టంట్ శివ‌, ఓం ప్ర‌కాష్‌, లిరిక్స్‌: యుగ భార‌తి, మ‌ద‌న్ క‌ర్కి, వివేక్, చైత‌న్య‌ప్ర‌సాద్‌, కాస్ట్యూమ్స్‌: పెరుమాల్ సెల్వం, కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: నీతా లుల్లా, దొర‌తి, మేక‌ప్‌: శ‌బ‌రి గిరి, స్టిల్స్‌: జ‌య‌రామ‌న్‌, ఎఫెక్ట్స్‌: సేతు, ఆడియోగ్ర‌ఫీ: ఉద‌య్ కుమార్‌, నాక్ స్టూడియోస్‌, ప‌బ్లిసిటీ డిజైన్‌: ముత్తు, పాయింట‌ర్ స్టూడియో, పి.ఆర్‌.ఒ: యువ‌రాజ్(త‌మిళ్‌), సురేంద్ర నాయుడు - ఫ‌ణి కందుకూరి (తెలుగు), మార్కెటింగ్ - ఫస్ట్ షో, ఈవెంట్స్ - యూవీ మీడియా (తెలుగు) తారాగణంగా వుంది.

Hyderabad

2023-09-21 16:57:22

స్టాలిన్ సినిమా అవకాశాలనిచెప్పి వాడుకొని వదిలేశాడు

తమిళనాడు సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్‌పై టాలీవుడ్ నటి, కాస్టింగ్ కౌచ్ శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘మూడేళ్ల క్రితమే ఉదయనిధితో నాకు పరిచయం ఏర్పడింది. నాతో గడిపిన ప్రతి మూమెంట్‌ తనకు నచ్చుతాయని ఎంతో చక్కగా చెప్పేవాడు. సినిమాల్లో నాకు ఛాన్స్ ఇప్పిస్తానని ఎన్నో మాయమాటలు చెప్పాడు. నన్ను లొంగదీసుకున్నాడు.. నచ్చినట్టుగా వాడుకున్నాడు.. నాతో అవసరం తీరాక నన్ను వదిలేశాడు.’ అని ఆరోపించింది. ప్రస్తతుం స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతున్న తరుణంలో శ్రీరెడ్డి ఇంటర్యూ వ్యవహారం కూడా హాట్ టాపిక్ అవుతోంది. నేరుగా సీఎం కొడుకుపైనే ఈ విధంగా ఆరోపణలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. అటు తమిళనాట కూడా శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. గుగూల్ లోనూ, శ్రీరెడ్డి, స్టాలిన్ చిత్రాలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి.

Chennai

2023-09-05 15:58:36

అల్లు అర్జున్ ని అభినందించిన మాజీమంత్రి గంటా

అల్లు అర్జున్ కి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు రావడం తనకెంతో ఆనందం కలిగించిందని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈమేరకు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా తండ్రి అల్లు అరవింద్ కి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ, మొట్టమొదటి సారిగా తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక హీరోకి ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు రావడం ఎంతో ఆనందదాయకమన్నారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి అనేక అవార్డు లు రావడం.. ఇటీవల అందుకున్నత్రిపుల్ సినిమా కు అలాగే నేడు అల్లు అర్జున్ కి అవార్డులు రావడం వలన తెలుగు చిత్ర పరిశ్రమకు జాతీయస్థాయింలో గుర్తింపు లభిం చినట్టు అయ్యిందన్నారు. అందులోనూ పాన్ ఇండియా హీరోగా ఉన్నబన్నీ ఈ అవార్డు అందుకోవడం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు.  తెలుగు చిత్ర పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని, స్థాయి ప్రపంచకీర్తిని ఆర్జించాలని   కోరుకుంటున్నట్టు చెప్పారు.

Hyderabad

2023-08-24 14:51:47

బోళా శంకర్ సినిమా టిక్కెట్లు పెంపుపై ప్రభుత్వం కొర్రీ

మెగాస్టార్ చిరంజీవి నటించిన బోళాశంకర్ మూవీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈనెల 11న రిలీజ్ కానున్న భోళాశంకర్ సినిమాకు టికెట్ రేట్లు పెంచుకు నేందు కు ఏపీ ప్రభుత్వం అనుమతి తిరస్కరించింది. చిత్ర యూనిట్ ప్రభుత్వానికి చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, పలు డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు తిరస్కరించాయి. కాగా ఇటీవల ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి విమర్శల నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తుందంటూ చిరు అభిమానులు ఆరోపిస్తున్నారు. మరోప్రక్క టిక్కెట్లు ధరలు పెంచే అవకాశం లేకపోయినా..చిరు సినిమాను చూసేందుకు అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ సినిమాకి టిక్కెట్లు రేట్లు పెంచితే, ఎంత పెంచకపోతే ఎంత అంటూ అభిమానులు నెటిజన్లు సోషల్ మీడియాని షేక్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చిరు సినిమా విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Tadepalli

2023-08-09 15:43:14

"రామకృష్ణులు" 'సినిమాకు కు 45 ఏళ్లు

అన్నపూర్ణ స్టూడియోస్, జగపతి సమస్త సంయుక్తంగా నిర్మించిన చిత్రం "రామకృష్ణులు" "చాణుక్యచంద్రగుప్త "చిత్రం తర్వాత ఎన్టీఆర్,ఏఎన్నార్ కాంబినేషన్లో వచ్చిన సినిమాఇది. ఈ సినిమా విడుదల తేదీ 08-06-1978. కమర్షియల్ గా మ్యూజికల్ గా ఈ చిత్రం మంచి విజయమే సాధించింది. అగ్రనట ధ్వయం అయినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్లకు ఒక విధంగా నటులుగా ఈ చిత్రం చెడ్డ పేరునే తీసుకువచ్చింది అని చెప్పాలి. అలనాటి పాత చిత్రల విశేషాలను, ప్రత్యేకంగా ఈఎన్ఎస్ లైవ్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

Visakhapatnam

2023-06-08 04:55:33

"గుండమ్మ అల్లుళ్లకు" నేటితో 61 సంవత్సరాలు

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళు. విభిన్న పాత్ర పోషణలో వీరికి వీరే సాటి సమాన స్థాయిలో ఉన్న ఇద్దరు హీరోలు ఎవరు ప్రపంచ చలనచిత్ర స్థాయిలో వీరు కలిసి నటించినన్ని చిత్రాలు ఎవరు నటించలేదు. 61 సంవత్సరాల క్రితం వీరిద్దరూ కలిసి నటించిన "గుండమ్మ కథ" చిత్రం ఈరోజే విడుదల అయింది. విజయవాడ దుర్గా కళామందిర్ థియేటర్లో డైరెక్టుగా జూబ్లీ ప్రదర్శింపబడింది. మొదటి విడతలో 15 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. చిలకలూరిపేట, నరసరావుపేట వంటి కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. లేట్ రిలీజ్ కేంద్రాలతో కలిపి 20 కేంద్రాలకు పైగా శత దినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం పేరు పేరుకే "గుండమ్మ కథ". గాని వీరిద్దరి కాంబినేషన్లో రావడం మూలంగా "గుండమ్మ అల్లుళ్ళు" గానే భావించేవారు అప్పటి ప్రేక్షకులు, ప్రజానీకం, సినీ అభిమానులు.

Visakhapatnam

2023-06-07 04:50:01

రొమాంటిక్ నటన వెనుక సీక్రెట్ అదేనట

తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటి సన అందరికీ తెలిసిన వ్యక్తి.. ఇపుడు మరోసారి సన మెట్రో కథలు వెబ్ సిరీస్ ద్వారా వార్తల్లో నిలిచింది. ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. హీరోలకు అమ్మ..అక్క పాత్రల్లోనూ కనిపించారు. వెండి తెరపై ఎన్నెన్నో డీసెంట్ పాత్రలు పోషించారు.  వెబ్ సిరీస్ లో సహ నటుడు అలీ రెజ్జా తో వాస్తవికంగానే రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించి అందరికీ గట్టి షాక్ ఇచ్చింది. దీంతో సన ఇలాంటి పాత్ర పోషించేదేంటని పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే ఆ విషయంపైనే సన ప్రత్యేకంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. `నేను ఆ పాత్ర చేయడానికి కారణం దర్శకుడు కరుణ కుమార్ - రైటర్ ఖాదీర్ బాబు. మధ్య తరగతి మహిళ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కుం టుంది? అన్నది నా పాత్రలో చూపించారు. దానితో తాగుబోతు భర్త.. భార్యని పట్టించుకోకపోతే.. ఆమె ఎలా ఫీలవుతుంది? సమాజం  ఎలాఆలో చిస్తుంది? అన్నది ఓవైపు చూపించే సమయంలో బాధ్యతలు ఎలా ఉంటాయో నాచుట్టూనే తిరుగుతాయని వివరణ ఇచ్చింది.

Hyderabad

2023-03-28 14:49:10

విశాఖలో మల్లికా మాధుర్య స్వరాలు సినీసంగీత విభావరి

మల్లికా మాధుర్య స్వరాలు కల్చరల్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు సాయంత్రం 5-45కు విశాఖ పౌర గ్రంథాలయంలో సినీ సంగీత విభావరి నిర్వహి స్తున్నట్టు ప్రముఖ సింగర్, సేవామూర్తి, సంస్థ నిర్వాహకులు నన్నపనేటి మల్లికా చౌదరి తెలియజేశారు. విశాఖలో ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న ప్రముఖులకు అభినందన సత్కారం చేయనున్నామని, అదేవిధంగా నగరంలోని పలువురు సంగీత కళాకారులతో సినీ సంగీత ఆలపన కూ డా వుంటుందన్నారు. కళాకారులును, సేవకులను ప్రోత్సహించాలనే మహోన్నత లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్టు ఆమె వివిరంచారు. వి శాఖ కళలకు, సినిమా రంగానికి కూడా డెస్టినీ కావాలని, ప్రముఖ సినీ సంస్థలు వారి కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు.విశా ఖ మహానగరమే కాకుండా కళలకు, కళాకారులకు ప్రధాన వేదిక అని మల్లిక స్పష్టం చేశారు.

Visakhapatnam

2023-03-25 09:33:37

ఉగాదికి ప్రైమ్ వీడియో ఓటిటి లో కలుద్దాం..పఠాన్

ఉగాదికి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కలుద్దాం అంటోంది పఠాన్. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపినా పదుకొనే నటించిన ఈ సినిమా అతిపెద్ద హిట్ గా నిలిచింది. అంతేకాకుండా 1000 కోట్ల పైగా వసూ లు చేసింది. ఇపుడు ఆ సినిమా ఓటిటిలో ప్రేక్షకుల ముందుకి రానుంది.  తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు అన్నివర్గాల ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. 22న ఉగాది కావడంతో ఓటిటిలో పఠాన్ ను చూసే అవకాశం రానుంది.

Maharashtra

2023-03-21 06:38:31

నేను బ్రతికే ఉన్నాను అపుడే చంపేయకండి..కోటా

హైప్ కోసం సోషల్ మీడియా వేసే వేషాలు ఇన్నీ అన్నీకాదు..సుబ్బరంగా ఉన్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు  మృతిచెందారంటూ కొన్ని సోషల్ మీడియా న్యూస్ యాప్స్ ఉదయం నుంచి ఊదరగొట్టాయి. దీనితో బాబోయ్ నేను బ్రతికే ఉన్నానని నేరుగా కోటశ్రీనివాసరావే ఒక వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. విశేషం ఏంటంటే ఆ వీడియోని కూడా మళ్లీ అదే సోషల్ మీడియాలో ప్లే చేశారు..పైగా ఆయన బ్రతికే ఉన్నారంట అని తేడా హెడ్డింగులు సైతం పెట్టడం విశేషం. దీనిపై స్పందించిన కోట శ్రీనివాసరావు. మంచి విషయాలు, ప్రజలకు పనికొచ్చే విషయాల కోసం హైప్ క్రియేట్ చేయండి తప్పా ఇలాంటి వార్తలొద్దని సున్నితంగా మందలించారు. పైగా తాను చనిపోయానని తెలిసి మా ఇంటికి ఓ పదిమంది పోలీసులు కూడా సెక్యూరిటీ కోసం వచ్చారని, ఆ తప్పుడు వార్తతో నేను వచ్చిన అన్ని ఫోన్ కాల్స్ కి సమాధానం చెప్పలేక నిజంగా చచ్చానని తప్పుడు వార్తలు ప్రచారం చేసిన సోషల్ మీడియాపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు..

Hyderabad

2023-03-21 06:21:02

కుటుంబ సమేతంగా చూసే సినిమా దసరా..నాని

దసరా సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని ప్రముఖ హీరో నాని పేర్కొన్నారు. చిత్ర ప్రమో షన్ లో భాగంగా ఆయన ఆదివారం సాయంత్రం ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హీరోయిన్ కీర్తి సురేష్ తో తాను నేను లోకల్ సినిమా తరువాత చేసిన రెండో చిత్రం అన్నారు. ఈ సినిమా ఈనెల 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని తెలిపారు. ప్రేక్షకులు ఈ నెల 30 నుంచి ఒక పుష్ప, ఒక కేజీ ఎఫ్ -2 మాదిరిగానే దసరా సినిమా గురించి మాట్లాడు తారు అన్నారు. సినిమా లో అంత బలమైన, నమ్మకమైన కంటెంట్ వుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దర్శకుడు శ్రీకాంత్ సినిమా బాగా తీశారు అన్నారు. పాటలుకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది అన్నారు. సంతోష్ నారాయణ మంచి  సంగీతం అందించారు అన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు. మీడియా సమావేశంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Visakhapatnam

2023-03-19 14:10:58

అనగనగా కథలా సినిమా పోస్టర్ ఆవిష్కరణ

వర్థమాన నటుడు, విశాఖ వాసి కంచర్ల ఉపేంద్ర నటించిన ' అనగనగా కథలా ' పోస్టర్ ఆవిష్కరణ విశాఖలోని డాబా గార్డెన్స్, అల్లూరి విజ్ఞాన్ కేంద్రం లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో చిత్ర కధానాయకుడు కంచర్ల ఉపేంద్ర, సీనియర్ పాత్రకేయులు నగబోయిన నాగేశ్వర రావు, పాత్రుడు, స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షలు బంగారు అశోక్ కుమార్ తదితరులు పాల్గొని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నటుడు ఉపేంద్ర మాట్లాడుతూ తన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఎస్ ఎస్ ఎల్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై, కంచర్ల ఉపేంద్ర, సుబ్బలక్ష్మి, సునీత నిర్మాతలు గా వ్యవహరిస్తున్న చిత్రానికి ఎస్. వి. పసలపూడి డైరెక్షన్ వహించరన్నరు. ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతో ఆకట్టుకుంటుందని అన్నారు. ప్రేక్షకులు తనని ఆదరించాలని కోరారు.

Visakhapatnam

2023-03-19 08:45:04