1 ENS Live Breaking News

ఇలా చేస్తే.. వారంలోనే మీ అధరాలకు గులాబీ రంగు

చాలా మందికి పెదవులపై నల్లని ట్యాన్ పేరుకుపోయి అందవిహీనంగా తయారవుతాయి. సాధారణ కారణాలు సూర్యరశ్మి, డీహైడ్రేషన్, ధూమపానం, స్పైసీ ఫుడ్ తినడం వంటి అలవాట్ల కారణంగా పెదాలు నల్లబడటానికి దారితీస్తాయి. జీవనశైలిలో కొద్దిపాటి మార్పు చేయడం వల్ల సహజంగా గులాబీ పెదాలను పొందవచ్చు. అదరాలు గులాబీ రంగు పొందాలంటే కొన్ని హో రెమిడీస్ ట్రై చేయడం ద్వారా తిరిగి మళ్లీ అధరాలను గులాబీ రంగులోకీ మార్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. షుగర్ స్క్రబ్‌ తో పెదాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. చక్కెరలో తేనె చుక్కలు కొన్నింటిని వేసి షుగర్ స్క్రబ్ తయారు చేసుకోవాలి. దీనిని పెదాలకు స్క్రబ్‌ని అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు వృత్తాకారంలో మసాజ్ చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. షుగర్ స్క్రబ్‌లోని చక్కెర పెదవులపై మృత కణాలను సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తాయి. తేనె పెదాలను తేమగా ఉంచి, పోషణ అందిస్తుంది. 

లిప్ మాస్క్‌లు పెదాలను హైడ్రేట్‌గా ఉంచి పోషణను అందిస్తాయి. మార్కెట్లో ఎన్నో రకాల లిప్ మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. తేనె, అలోవెరా జెల్, కొబ్బరి నూనెను కలిపి ఇంట్లోనే సహజ సిద్ధంగా తయారు చేసుకోవచ్చు. దీనిని పెదాలపై అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. లిప్ మాస్క్ పెదాలను మృదు వుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఎపిఎఫ్ తో లిప్ బామ్‌ను ఉపయోగిం చడం వల్ల పెదాలను సూర్యుడి హానికరమైన కిరణాల నుంచి రక్షించుకోవచ్చు. ఇది పెదాలను పొడిగా చేసి, రంగు మారడానికి కారణమవుతుంది. ప్రతి రోజూ పెదాలకు ఎస్పీఎఫ్ లిప్ బామ్‌ రాసుకోవడం మర్చిపోకూడదు. పెదాలు మాత్రమే కాకుండా శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలంటే పుష్కలంగా నీరు తాగాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్ల తాగాలి. తగినంత నీళ్లు తాగడం వల్ల పెదాలు ఎండిపోకుండా ఎల్లప్పుడూ తేమగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు అధికంగా తీసుకోవాలి. వీటిల్లోని పోషకాలు పెదాలను తేమగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే ఆహారాలు కూడా తీసుకోవాలి.

తగినంత నిద్ర లేకపోయినా పెదాల పగుళ్లు ఏర్పడి, పొడి బారిపోతుంటాయి. ప్రతి రోజు 7-8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ధూమపానం, సిగరెట్‌ అలవాటు దూరం చేయడం వల్ల పెదాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ధూమపానం చర్మంలో కొల్లాజెన్, ఎలాస్టిన్‌ను తగ్గిస్తుంది. ఫలితంగా పెదవులు పొడిబారతాయి. పెదవులు విపరీతంగా పొడిగా ఉన్నా.. పగిలినట్లు లేదా రంగు మారినట్లు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకండి. అంతర్లీన వైద్య సమస్యల వల్ల కూడా పెదవులు రంగు మారడం మనం గమనించవచ్చు.

Visakhapatnam

2023-09-20 06:21:39

నేరేడు పండు ఎంతో మంచి ఔషధాల గని..

నేరేడు వృక్షం భారతదేశం, పాకిస్థాన్, ఇండోనేషియాల్లో ఎక్కువగా పెరుగుతుంది. ఫిలిపిన్స్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్‌ల్లో కూడా అక్కడక్కడా కనిపిస్తుంది. పోర్చునీస్‌వారు ఇండియాకి వచ్చినప్పుడు ఈ విత్తనాన్ని బ్రెజిల్‌కు తీసుకెళ్లారు. ఈ చెట్టు చాలా వేగంగా పెరిగే గుణం కలిగి ఉంటుంది. సుమారు 30 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. నేరేడు చెట్లు 100 ఏళ్లకు పైగా జీవిస్తాయి. నేరేడు పండ్లలో చాలా రకాలున్నాయి. గుండ్రంగా పెద్దగా ఉండేవి, కోలగా ఉండి పెద్దగా ఉండేవాటిని అల్లనేరేడు అంటారు. గుండ్రంగా ఉండి చిన్నగా ఉన్నవాటిని చిట్టినేరేడు అని పిలుస్తారు. నేరేడు పండు తీపి, వగరు కలగలిపి ఉంటుంది. ఇది తిన్న తర్వాత నోరు వంగపువ్వు రంగులోకి మారుతుంది. నేరేడు పోషకాల గని. సర్వరోగనివారిణి. పండు మాత్రమే కాకుండా ఆకులు, బెరడు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం పుష్కలంగా ఉన్నాయి. రామాయణంలో శ్రీరాముడు పధ్నాలుగేళ్ల వనవాసంలో ఈ పండ్లతోనే కాలం గడిపాడని భారతీయుల విశ్వాసం. అందుకే గుజరాత్‌లో ఈ పండును దేవతాఫలం అని పిలుస్తారు. ఈ చెట్టు కలపను ఫర్నీచర్ చేయడానికి ఉపయోగిస్తారు. నేరేడు గుజ్జుతో పచ్చళ్లు, జామ్‌లు, రసాలు, జెల్లీలు, వైన్, వెనిగర్‌లను తయారు చేస్తారు.

**ఔషధంగా ఉపయోగాలు** 1) ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. 2) నేరేడు రసాన్ని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. 3) జిగట విరేచనాలతో బాధపడేవారు 2 మూడు చెంచాల నేరేడు పండ్ల రసాన్ని తీసుకోవాలి. 4) జ్వరంగా ఉంటే ధనియాల రసంలో నేరేడు 
రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది. 5) మూత్రంలో మంట తగ్గాలంటే నిమ్మరసం, నేరేడురసం కలిపి తీసుకోవాలి. 6) మధుమేహ రోగులు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని నీటిలో కలుపుకుని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. 7) నేరేడు పళ్లు తినేవారిలో పళ్లు చిగుళ్లు బలంగా ఉంటాయి. గాయాలు త్వరగా మానతాయి. రక్తాన్ని శుద్ధిచేసే గుణం కలది. 8) కాలేయం పనితీరును మెరుగుపరచడంతో పాటు బ్లడ్ కేన్సర్ కారకాలను నిరోధిస్తాయని అధ్యయనాల్లో తేలింది. 9) నేరేడు ఆకులు యాంటీ బాక్టీరియల్ గుణాలు కలిగిఉంటాయి. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. 10) నెలసరి సమస్యలకు నేరేడు చెక్క కషాయాన్ని 25 రోజుల పాటు 30 ఎంఎల్ చొప్పున రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. 11) భోజనం అయ్యాక గంట తర్వాత తింటే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. 12)ఈ పండు గింజలను ఆయుర్వేదం, యునానీ, చైనీస్ వైద్యంలో జీర్ణశక్తికి సంబంధించిన వైద్యానికి  ఉపయోగిస్తారు. 13) ఈ పండు అధిక భరువుని తగ్గిస్తుంది అందుకే దీనిని వేసవిలో సీజనల్ వెయిట్ లాస్ ఫ్రూట్ గా తీసుకుంటారు. 14)రక్తహీనత సమస్య ఉన్నవారు ఈపండును తీసుకోవడం ద్వారా శరీరంలో ఇనుముశాతం పెరిగి లోపాన్ని తగ్గించుకోవచ్చు. 15)పూజల్లో శనిదోష నివారణ పండుగా కూడా నేరేడుని వినియోగిస్తారు. శనిపూజల చేయించుకున్నవారు నేరేడు పళ్లను దానంగా ఇస్తారు.

** ముఖ్యమైన జాగ్రత్తలు* నేరేడు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి.  అధికంగా తింటే మలబద్దకంతో పాటు నోట్లో వెగటుగా ఉంటుంది. దీనికి విరుగుడు ఉప్పు, వేన్నీళ్లు తీసుకుంటే సరిపోతుంది.

vizag

2023-06-10 10:06:39

కేన్సర్ వ్యాధిపట్ల అందరూ అవగాహన కలిగిఉండాలి

కేన్సర్ పై అందరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, జిల్లాఇన్ ఛార్జ్ మంత్రి విడదలరజని పిలుపునిచ్చారు. ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా ఆర్.కె. బీచ్ లోని కాళీమాత టెంపుల్ వద్ద మహాత్మాగాంధీ కేన్సర్ ఆసుపత్రి, గీతం, సిఐఐ, మరియు పలు ఎన్.జి.ఓ. సంస్థలు ఏర్పాటు చేసిన వాక్ మారథాన్ కార్యక్రమానికి శనివారం ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేన్సర్ వ్యాధితో ఎంతో మంది  పోరాడుతున్నారన్నారని, కేన్సర్ వ్యాధి మానవులను కబళిస్తోందన్నారు.  ఒక కోటి మంది వరకు కేన్సర్ తో చనిపోయినట్లు చెప్పారు.  భవిష్యత్తులో మరింత మందిని కబళిస్తుందన్నారు.  మనం తీసుకునే ఆహారం కలుషితం కావడం వలన కేన్సర్ వ్యాధి సంక్రమిస్తుందని వివరించారు. 

కెమికల్స్ లేని ఆహారం తీసుకోవడం వలన కేన్సర్ నుండి మనలను మనం రక్షించుకుంటామన్నారు. కేన్సర్ పై అందరూ అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.  ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రసీజర్లలో 400 ప్రొసీజర్లు ఒక్క కేన్సర్ కు సంబంధించినవి ఉన్నాయని, వైద్యానికి ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ప్రతీ మెడికల్ కళాశాలలో కేన్సర్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. వైజాగ్ లో ఉన్న హోమీ బాబా కేన్సర్ తో ప్రభుత్వం ఎంఒయు చేసుకున్నట్లు తెలిపారు. కింగ్ జార్జ్ ఆసుపత్రిలో రూ.50 కోట్లతో అధునాతన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.  ముఖ్యమంత్రి ఆలోచనతో ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సాధిస్తామన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ కేన్సర్ తో ఎంతో మంది బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆహారం కలుషితం అవుతున్నందు వలన ఎంతో మంది కేన్సర్ కు గరౌతున్నారన్నారు. 

 కేన్సర్ వ్యాధి పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు.  కేన్సర్ కు సంబంధించి కెజిహెచ్ లో అధునాతన వైద్య ఎక్విప్ మెంట్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, విఎంఆర్డ్ఎ అధ్యక్షులు అక్కరమాని విజయ నిర్మల, కెజిహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ బుచ్చిరాజు, మహాత్మా గాంధీ కేన్సర్ హాస్పిటల్ ఎండి ఓ. మురళీకృష్ణ, ఎన్జీఓ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. వాక్ మారథన్ కార్యక్రమాన్ని బీచ్ లో కాళీమాత టెంపుల్ నుండి వైయంసిఎ వరకు నిర్వహించారు.

Visakhapatnam

2023-02-04 05:44:53

ఆ అయస్కాంత చికిత్సతో నొప్పులన్నీ మటుమాయం

వైద్యరంగంలో ఎన్ని కొత్త ఆవిష్కరణలు వచ్చినా నేటికీ మకుటంలేని మహారాజులా మాగ్నెటిక్ థెరపీ(ఆయస్కాంత వైద్యం)ని ప్రజలు ఆదరిస్తున్నారు. దాని ద్వారా 
ఎలాంటి దీర్ఘకాలిక మోకాళ్ల నొప్పులైని ఇట్టే మటుమాయం అవుతుండటమే దానికి ప్రధాన కారణం. మందులు, ఇంజక్షన్లకు అలవాటు పడి తాత్కాలిక ప్రయోజనం పొందే కంటే..దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందాలంటే మాత్రం ఆ మాగ్నెటిక్ థెరపీనే చక్కటి మార్గంగా దీనిని ఉపయోగించిన వారంత చెబుతుండటం విశేషం. అయితే ఈ వైద్య విధానం పూర్తిస్థాయిలో తెలియాలంటే  అది బాగా చదువుకున్నవారికి సాంకేతికంగా అర్ధమయితే..దీనిని వినియోగించిన వారు పొందిన స్వాంతన ద్వారా మిగిలిన వారికి తెలియజేస్తున్నారు. కోవిడ్ తరువాత వస్తున్న చాలా మార్పుల్లో కీళ్ల నొప్పులకి కూడా చాలా మంది పెయిన్ కిల్లర్స్ ను వినియోగిస్తున్నారు. అలాకాకుండా ఈ మాగ్నెటిక్ థెరపీని వినియోగించడం వలన ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చునని చెబుతున్నారు దీని సృష్టికర్త కడిమిశెట్టి సత్య శేషు కుమార్. దీని వినియోగం ఎలా పనిచేస్తుందనే విషయాన్ని ఒక్కసారి తెలుసుకుంటే..

అయస్కాంత వైద్యం (మాగ్నెట్ థెరపీ) లో గత 30 ఏళ్లగా ఎన్నో పరిశోధనలు చేసి ఎంతో మందికి ఆరోగ్యాన్ని ప్రసాదించిన అన్మోల్ పల్సర్ ను నిర్మించిన 
కడిమిశెట్టి సత్య శేషు కుమార్ నేడు ఇంకో కొత్త మోడల్ ను రూపొందించి. అన్మోల్ పల్సర్ V1 గా పిలువ బడే ఈకొత్త పరికరంవల్ల దీర్ఘకాలిక మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు, రక్త ప్రసరణ సరిగాలేక  వెరికోస్, గాంగ్రీన్ లాంటి వాటికి కూడా ఎంతోబాగా పనిచేస్తుందని చెబుతున్నారు. షుగర్ వ్యాధి వల్ల వొచ్చే మానని కాళ్ళ పుళ్ళకు కూడా ఎంతో ఉపయోగం అని, వైద్యుని పర్యవేక్షణలో ఇంటిలో కూడా ఈ పరికరాన్ని వాడుకోవచ్చని వివరిస్తున్నారు. దీనిని వినియోగించడం అత్యంత సులభమని, వాడుకోవటానికి పెద్దగా ఎటువంటి  ట్రైనింగ్ అవసరం కూడా లేదంటున్నారు.

 భారతీయ పరిస్థితులకు తగ్గట్టుగా దీనిని తయారు చేశానని, నేడు చాలా మంది వైద్యులు వారి వారి వైద్య పద్దతులలో అన్మోల్ పల్సర్ కూడా చేర్చి వారి పేషెంట్లకు 
ఎంతో త్వరగా ఆరోగ్యాన్ని ప్రాసాదించ గలుగుతున్నారని చెప్పారు. ప్రధానంగా ఈ పరికారినికి ఏడు ప్రధాన పార్టీలు వుంటాయని, ఒక కరెంటు ఆడాప్తర్, ఒక కాన్వార్తార్   ఒక ప్రోబ్, రెండు త్రికోణ మాగ్నెటిక్ పాడ్స్ మరియు రెండు పాడ్స్ పాదాలకి తగిలుంచుకునేవి వుంటాయని, అవి ఒక నిర్ణీత పద్ధతిలో ఏర్పాటు చేసినప్పుడు ఆయుర్వేద పంచ భౌతిక సిద్ధాంత పరంగా ఆకాశ మహా భూతం యొక్క తన్మాత్ర అయినటువంటి విద్యుద్ అయస్కాంత శక్తి ప్రసరించి శరీరం యొక్క భౌతిక అయస్కాంత శక్తి కి తోడయ్యి కావలసిన మెటబోలిక్ కరెక్షన్ జరగటానికి ఎంతో అవకాశం ఉంటుందని వివరించారు.

నేటి వరకు ఎంతో మంది ఆయుర్వేద, అల్లోపతి వైద్యులు వారి వారి పేషెంట్లకు ఇచ్చి / ఇప్పించి సమాజానికి ఎంతో ఆరోగ్యాన్ని ఇవ్వగలుగు తున్నారని.. ఈ 
పరికరాన్ని కొన్ని విదేశాలకు సైతం ఇపుడు పంపిస్తున్నామని చెప్పారు. స్వతహాగా మెడికల్ కుటుంబానికి చెందిన వారవ్వటం వలన దివంగత డాక్టర్ నంబూరి 
హనుమంత రావు సమక్షంలో ఈ పరికరాన్ని ఇంప్రూవ్ చేయగలిగానని, తండ్రి కడిమిశెట్టి సత్యనారాయణ (చిన్న పిల్లల వైద్యులు)  ద్వారా ఇది అభ్యసించానని, 
నంబూరి భాస్కర వేణు గోపాల రావు(ఆయుర్వేద వైద్యులు) తగిన సూచన సలహాలు ఇస్తుంటారని, అంటే గాక పేషెంట్ల యొక్క రెస్సాన్స్, ప్రాక్టికల్ ఇష్యూస్ ని 
ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అభివృద్ధి చూస్తుంటానని చెప్పారు. 

దీని ప్రారంభ ఖరీదు సుమారు రూ.10వేలని ఐతే ఇది వాడుతున్నప్పుడు ఆహార విహారాలు మీద కూడా శ్రద్ధ పెట్టాలని అందువలన ధాతు సంరక్షణ సరిగా జరిగి 
ధాతు పుష్టి పెరిగి, సమతుల్యత పెరిగి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందడానికి వీలుపడుతుందన్నారు.నేడు ఆయుష్ కూడా అయస్కాంత వైద్యాన్ని గుర్తించిందని , ఐతే ఇంకా పూర్తి వివరణ ఇవ్వటానికి ఒక కమీటీ అవరం వున్నదని, తానూ ఇంకొంతమంది వైద్యుల బృందం తో ఆ దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ పరికరం కావాల్సిన వారు 9014110759 లో సంప్రదించి యూనిట్లను కొనుగోలు, వినియోగ వివరాలు తెలుసుకోవచ్చునని అన్నారు.

Vijayawada

2023-01-25 05:02:44

పోర్టుస్టేడియంలో జర్నలిస్టులకు ఉచిత మెడికల్ క్యాంపు

విశాఖ వెబ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏబిగ్రూప్, ఓయస్జి ఫౌండేషన్, విబిహ్యూమానిటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని ఉ.9 నుంచి మ.2 వరకూ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సీఎంఆర్ విస్జా ఇంటర్ మీడియా స్పోర్ట్స్ మీట్ లో భాగంగా ఈ శిబిరాన్ని విశాఖ పోర్ట్ స్టేడియం గ్రౌండ్ వద్దనే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈమెడికల్ క్యాంపు లో బిపి,షుగర్, ఈసిజి, గుండె సంబంధిత వ్యాధులు, కేన్సర్, ఫ్రీ డెంటల్, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగానే పంపిణీ చేయనున్నారు.

Visakhapatnam

2023-01-04 17:20:19

"కిల్కార్" తో గర్భిణీ, శిశు ఆరోగ్యంపై అవగాహన

కిల్కార్ (పిలుపు) వాయిస్ ద్వారా గర్భిణీలు, శిశు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నట్టు పార్వతీపురం మన్యం డిఎంహెచ్ఓ డా.బగాది జగన్నాథరావు తెలిపారు. కేంద్ర ఆరోగ్య,  కుంటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కిల్కార్ వాయిస్ లో 4 విభాగాలలో సాంకేతిక ఆరోగ్య సందేశాలను, కిల్కార్ ఐ.వి.ఆర్.రికార్డింగ్ ద్వారా 72 సందేశాలు అందిస్తుందని పేర్కొన్నారు. అందులో గర్భిణీలు, శిశు ఆరోగ్యం, ఆసుపత్రి ప్రసవాలుపై సందేశాలు మొబైల్ ఫోన్ ద్వారా వినిపిస్తుందని చెప్పారు. కిల్కారీ వాయిస్ తో అన్నయ్య, వదినమ్మ, నమస్కారం! బాగున్నారా! భారత ప్రభుత్వం నుండి ఫోన్ చేస్తాన్నాము అని వస్తుందని, ఇది ఆరు వారాలు పాటు 012 4458800 ఫోన్ నెంబరు నుండి గర్భిణీలకు, బాలింతలకు కాల్ చేసి సాంకేతిక ఆరోగ్య సందేశాలను ఇస్తుందని వివరించారు.  ఫోన్ లిఫ్ట్ చేయకపోతే 14423 ఫోన్ కు కాల్ చేయ వచ్చని చెప్పారు. 

Parvathipuram

2023-01-02 13:39:01

పీసీపీఎన్డీటీ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి

కాకినాడ జిల్లాలో గ‌ర్భ‌స్థ పిండ లింగ నిర్ధార‌ణ నిషేధ (పీసీ, పీఎన్‌డీటీ) చ‌ట్టం ప‌టిష్ట అమ‌లుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని  జిల్లా క‌లెక్ట‌ర్ డా.కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో లింగ నిర్ధార‌ణ నిషేధ చ‌ట్టం-1994 అమ‌లుపై జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ, స‌ల‌హా క‌మిటీ స‌మావేశం క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. జిల్లాలో చ‌ట్టం అమ‌లు తీరుపై స‌మావేశంలో చ‌ర్చించారు. స్కానింగ్ కేంద్రాల రిజిస్ట్రేష‌న్, రెన్యువ‌ల్‌, డెకాయ్ ఆప‌రేష‌న్లు, ఆక‌స్మిక త‌నిఖీలు త‌దిత‌రాలకు సంబంధించిన వివ‌రాల‌ను అధికారులు క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 
ఇప్ప‌టివ‌ర‌కు అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాల్లో 337 ఆక‌స్మిక త‌నిఖీలు, 61 డెకాయ్ ఆప‌రేష‌న్లు నిర్వ‌హించిన‌ట్లు వివ‌రించారు.

 ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ డివిజ‌న్ స్థాయి ప్రోగ్రామ్ అధికారులు, క్షేత్ర‌స్థాయి అధికారులు, సిబ్బందితో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ గ‌ర్భ‌స్థ పిండ లింగ నిర్ధార‌ణ నిషేధ చ‌ట్టం ప‌రిధిలోని ల‌క్ష్యాల సాధ‌న‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. త‌నిఖీలు అధికంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు. లింగ నిష్ప‌త్తి త‌క్కువ‌గా ఉన్న ప్రాంతాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టిసారించాల‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త‌గా స్కానింగ్ సెంటర్ల ఏర్పాటు, రెన్యువ‌ల్‌, చిరునామా/మెషీన్ మార్పులు, క్లోజ‌ర్ అనుమ‌తుల‌కు సంబంధించిన 16 ద‌ర‌ఖాస్తుల‌కు స‌మావేశం ఆమోదం తెలిపింది. పీసీ, పీఎన్‌డీటీ చ‌ట్టంపై అవ‌గాహ‌న పెంపొందించే పోస్ట‌ర్ల‌ను ముఖ్య ప్రాంతాల్లో త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌ద‌ర్శించాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు.

 అదే విధంగా అసిస్టెడ్ రీప్రొడ‌క్టివ్ టెక్నాల‌జీ (ఏఆర్‌టీ-రెగ్యులేష‌న్‌) చ‌ట్టం, 2021 ప‌రిధిలో మూడు లెవెల్‌-2 ఏఆర్‌టీ క్లినిక్‌ల ఏర్పాటుకు సంబంధించి వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌ల‌ను స‌మావేశం ఆమోదించింది. స‌మావేశంలో ఇన్‌ఛార్జ్ డీఎంహెచ్‌వో డా. పీవీ శ్రీనివాస్‌, అద‌న‌పు డీఎంహెచ్‌వో డా. ఆర్‌.ర‌మేష్‌, అడిష‌న‌ల్ ఎస్‌పీ పి.శ్రీనివాస్‌,  డీసీహెచ్ఎస్ డా. పీబీ విష్ణువర్థిని, డీఐవో డా. అంజిబాబు, డెమో సీహెచ్ఎస్‌వీడీవీ ప్ర‌సాద రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-12-26 13:40:47

ఆరోగ్య రక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి

ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని ఇన్ ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. దుర్గా కళ్యాణి పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం హెమోగ్లోబిన్ పరీక్షలను వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హెమోగ్లోబిన్ పరీక్షలను చేయించుకున్నారు. ఈ సందర్భంగా దుర్గా కళ్యాణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ హెమోగ్లోబిన్ పరీక్షలు అవసరమన్నారు. హెమోగ్లోబిన్ వలన ఆరోగ్య పరిస్థితి తెలుస్తుందని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. హెమోగ్లోబిన్ మెరుగు పరుచుటకు గుడ్లు, మాంసాహారం, కేరట్, పచ్చని ఆకుకూరలు, బఠాణీ, చిక్కుడు గింజలు వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని ఆమె సూచించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రణాళిక అధికారి పి.వీర్రాజు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు అధికారి కె. విజయ గౌరి, రక్త నిధి వైద్యులు డా.వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-12-15 09:56:10

బట్టిమొగవలసలో మెగా ఉచిత వైద్య శిబిరం

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం బట్టిమొగవలస గ్రామం లో 16వ తేదీన  మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ బి.ఎన్.బిరావు తెలిపారు. బుధవారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో  జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ  ప్రెసిడెంట్ నిశాంత్ కుమార్  మెగా వైద్య శిబిరం బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ మెగా వైద్య శిబిరం లో  ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ బి రామ్మోహన్రావు, చాతి ఊపిరితిత్తులు షుగర్ స్పెషలిస్ట్ డాక్టర్ నల్ల దుర్గాప్రసాద్, జనరల్ ఫిజీషియన్ డా. చింత స్వరూప్, చిన్న పిల్లల వైద్య నిపుణులు  డాక్టర్ జి వాసుదేవరావు, స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు  డాక్టర్ కె.శ్రీరేఖా, చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్ ఎం సత్యనారాయణమూర్తి, చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్ కె. రాజీవ్,  స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు, సంతాన సాఫల్య డాక్టర్  యాళ్ల ధీరజ్  హాజరై వైద్య సేవలు అందిస్తారన్నారు. ప్రజలందరూ ఈ మెగా ఉచిత వైద్య శిబిరంలో సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పి. సూర్యారావు, మెంబర్లు  పి. ప్రకాష్,  బి. జయబాబు పాల్గొన్నారు.

Parvathipuram

2022-12-14 12:25:43

ఆయుష్మాన్ భారత్ ఈకైవీ త్వరగా పూర్తిచేయాలి

ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ఈ కేవైసీ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.   ఆయుష్మాన్ భారత్ పథకం జాతీయ ఆరోగ్య రక్షణ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని ,  ఈ పథకం పేదలకు లబ్ధి చేకూరేలా జాతీయ బీమా కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉందని కలెక్టర్ అన్నారు. ఈ పథకం ద్వారా ఆరోగ్య భీమా వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకోవడానికి ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ఇప్పటివరకు జిల్లాలో 7,42,629 మంది  లబ్ధిదారలు ఉండగా అందులో ఇప్పటివరకు  2,47,162 మందికి  మాత్రమే ఈ కేవైసీ పూర్తి చేశారని ఇంకా చేయించాల్సిన 4,95,467 మంది ఉన్నారని వీరికి  త్వరితగతిన  ఈ కేవైసీ పూర్తి చేసేందుకు ఎంపీడీవోలు  చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డులు పేదవారికి వైద్యం చేయించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు.

West Godavari

2022-11-14 09:10:08

సచివాలయాల వారీగా సిబ్బంది మ్యాపింగ్ జరగాలి

గ్రామ, వార్డు సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా వైద్య సిబ్బంది మ్యాపింగ్ జరగాలని ఫ్యామిలీ ఫిజీషియన్ స్టేట్ నోడల్ ఆఫీసర్  పి.నాగేశ్వరరావు అన్నారు. ఈ నెల 21 నుండి ఫ్యామిలీ ఫిజీషియన్ విధానం అమలులోకి రానున్న దృష్ట్యా మంగళవారం జిల్లాలో నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా పార్వతీపురం ఎన్ జి ఒ సమావేశ భవనంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు అధ్యక్షతన వైద్యాధికారులకు  నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. 21వ తేదీ నుండి ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభo అవుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో సచివాలయాల వారీగా ఎ.ఎన్.ఎమ్ లు, సి.హెచ్.ఒ (ఎమ్ ఎల్ హెచ్ పి) లు మ్యాపింగ్ పై పి.హెచ్.సిల వారీగా సమీక్షించారు. హెల్త్ వెల్నెస్ క్లినిక్ లలో ఉండాల్సిన మందులు, పరీక్షల పరికరాలు సిద్దంగా ఉండాలని ఆదేశించారు.  

ఇందులో పి.హెచ్.సి వైద్యుడు, ఎమ్.ఎల్.హెచ్.పి (సి.హెచ్.ఒ) , సచివాలయం ఎ.ఎన్.ఎమ్ ఒక బృందంగా వుంటారని,104 వెళ్ళే గ్రామంలో ఉదయం హెల్త్ క్లినిక్ నిర్వహించి ఒ.పి నిర్వహించి తర్వాత కదలలేని స్థితిలో వున్న రోగులను, పాఠశాల, అంగన్వాడి కేంద్రాలను క్షేత్ర స్థాయిలో సందర్శించాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కె జిల్లా సమన్వయ అధికారి డా. ధవళ భాస్కరరావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి టి.జగన్మోహనరావు , పార్వతీపురం, సీతంపేట డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఒ లు  దుర్గా భవాని, విజయ పార్వతి, ఎపిడి మియాలజిస్ట్ అనిల్ పాల్గొన్నారు.

Parvathipuram

2022-10-18 12:39:30

రిజిస్ట్రేషన్ చేయకపో ఆ కేంద్రాలన్నీ సీజ్..

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అక్టోబర్ 1వ తేదీన నేషనల్ రిజిస్టర్ లో నమోదు చేసుకో నటువంటి ఏ.ఆర్.టి/ సరోగసి కేంద్రాలు మూసి వేస్తామని డిఎంహెచ్ఓ డా.ఎ.హేమంత్ తెలియజేశారు. ఈ మేరకు బుధవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. నిర్దేశించిన మొత్తం చెల్లించని దరఖాస్తులు  స్వీకరించరని పేర్కొన్నారు. అంతేకాకుండా వారి సర్వీసులు వెంటనే నిలిపివేయాలని కూడా ఆదేశాలు జారీచేశారు. నిబంధనలు అతిక్రమించిన వాటిని సీజ్ చేస్తామని తెలియజేశారు. నేషనల్ రిజిస్టర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులు తక్షణమే  సమర్పించాలని నిర్వాహకులకు తెలియజేశారు.  గతంలో pcpndt యాక్ట్ కింద రిజిస్టరై ఇప్పుడు దరఖాస్తు చేయని ఏ.ఆర్.టి కేంద్రాలను కూడా సీజ్ చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఇటువంటి సెంటర్లకు నోటీసులు ఇచ్చి pcpndt కింద మరల రిజిస్టర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. ఏఆర్టీ కేంద్రాలను రద్దు చేయాలనుకుంటే జిల్లా అథారిటీ నుండి పర్మిషన్ తీసుకోవాలని,  రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాలని ఆ ప్రకటనలో తెలియజేశారు.

2022-10-12 16:11:56

ఎకో ఇండియాతో ఎపి శాక్స్ ఒప్పందం

రాష్ట్రంలో సామర్ధ్యం పెంపుదల, శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ (ఎపి శాక్స్) ఢిల్లీ కి చెందిన ఎకో ఇండియాతో  ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ఈమేరకు గురువారం తాడేపల్లి లోని ఎపి శాక్స్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ, ఎపి శాక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జిఎస్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఎపి శాక్స్ ఎపిడి డాక్టర్ కామేశ్వరప్రసాద్, ఎకో ఇండియా సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్ సందీప్ భల్లా ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాల్ని పరస్పరం అందజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ సి డి నోడల్ అధికారి డాక్టర్ టివిఎస్ఎన్ శాస్త్రి, క్యాన్సర్ కేర్  నోడల్ ఆఫీసర్ డాక్టర్ నరసింగరావు,  డిఎంఇ కార్యాలయ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుగుణన్, పెప్ఫార్ సమన్వయకర్త డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఎకో ఇండియాసంస్థ జనరల్ మేనేజర్ ఇ ఆర్ శ్రీబాబు తదితరులు పాల్గొన్నారు. 

తాడేపల్లి

2022-09-22 15:22:11

మానవుని శరీరంలో భాగాలెన్నో తెలుసా..?

మనిషిలో శరీర భాగాలు ఎన్నుంటాయో ఎవరికైనా తెలుసా.. అసలు లెక్కపెట్టేవన్ని వుంటాయా అనే అనుమానం అందరికీ వస్తుంది.. కానీ మానవుని శరీరంలో భాగాలు ఏమేమి ఉంటాయో కూడా ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. అంతేకాదు ఆ భాగాలకు ఉండే పేర్లు కూడా తెలుసుకోవడం ద్వారా మనిషిలో ఇన్ని శరీర భాగాలు ఉన్నాయనే విషయం అవగతం అవుతుంది. సాధారణంగా మనిషిలో బయటకు కనిపించేవి రెండు కళ్లు, రెండు చెవులు, ముక్కు, నోరు, రెండు కాళ్లు, రెండు చేతులు..అంతేనా అలా అనుకుంటే మీరు కూడా పప్పులో కాలేసినట్టే మానవుని శరీరంలో మొత్తం శరీర భాగాల సంఖ్య అక్షరాలా 52. అవేంటో మీకూ తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ మీకోసమే..క్రమ సంఖ్య ఆధారంగా తెలుసుకోండి మరి.. 

 1) ఎముకల సంఖ్య: 206,  2)కండరాల సంఖ్య: 639,  3)కిడ్నీల సంఖ్య: 2,  4)పాల దంతాల సంఖ్య: 20,  5)పక్కటెముకల సంఖ్య: 24 (12 జత),  6)గుండె గది సంఖ్య: 4,  7)అతి పెద్ద ధమని: బృహద్ధమని,  8)సాధారణ రక్తపోటు: 120/80 Mmhg,  9) రక్తం Ph: 7.4,  10) వెన్నెముక కాలమ్‌లోని వెన్నుపూసల సంఖ్య: 33,  11) మెడలోని వెన్నుపూసల సంఖ్య: 7,  12) మధ్య చెవిలో ఎముకల సంఖ్య: 6,  13) ముఖంలోని ఎముకల సంఖ్య: 14,  14) పుర్రెలోని ఎముకల సంఖ్య: 22,  15) ఛాతీలోని ఎముకల సంఖ్య: 25,  16) చేతుల్లోని ఎముకల సంఖ్య: 6,  17) మానవ చేతిలోని కండరాల సంఖ్య: 72,  18) గుండెలోని పంపుల సంఖ్య: 2,  19) అతి పెద్ద అవయవం: చర్మం,  20) అతి పెద్ద గ్రంథి: కాలేయం,  21) అతి పెద్ద కణం: స్త్రీ అండం,  22) అతి చిన్న కణం: స్పెర్మ్,  23) అతి చిన్న ఎముక: స్టేప్స్ మధ్య చెవి,  24) మొదటి మార్పిడి చేసిన అవయవం: కిడ్నీ

 25) చిన్న ప్రేగు యొక్క సగటు పొడవు: 7మీ,  26) పెద్ద ప్రేగు యొక్క సగటు పొడవు: 1.5 మీ, 27) నవజాత శిశువు యొక్క సగటు బరువు: 3 కిలోలు,  28) ఒక నిమిషంలో పల్స్ రేటు: 72 సార్లు,  29) సాధారణ శరీర ఉష్ణోగ్రత: 37 C ° (98.4 f °),  30) సగటు రక్త పరిమాణం: 4 నుండి 5 లీటర్లు,  31) జీవితకాలం ఎర్ర రక్త కణాలు: 120 రోజులు,  32) జీవితకాలం తెల్ల రక్త కణాలు: 10 నుండి 15 రోజులు,  33) గర్భధారణ కాలం: 280 రోజులు (40 వారాలు),  34) మానవ పాదంలోని ఎముకల సంఖ్య: 33,  35) ప్రతి మణికట్టులోని ఎముకల సంఖ్య: 8,  36) చేతిలో ఉన్న ఎముకల సంఖ్య: 27, 
 37) అతి పెద్ద ఎండోక్రైన్ గ్రంథి: థైరాయిడ్,  38) అతి పెద్ద శోషరస అవయవం: ప్లీహము,  40) అతిపెద్ద మరియు బలమైన ఎముక: తొడ ఎముక,
 41) అతి చిన్న కండరం: స్టెపిడియస్ (మధ్య చెవి),  41) క్రోమోజోమ్ సంఖ్య: 46 (23 జత),  42) నవజాత శిశువు ఎముకల సంఖ్య: 306,  43) రక్త స్నిగ్ధత: 4.5 నుండి 5.5,  44) యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్: ఓ,  45) యూనివర్సల్ గ్రహీత రక్త సమూహం: AB,  46) అతి పెద్ద తెల్ల రక్త కణం: మోనోసైట్,  47) అతి చిన్న తెల్ల రక్త కణం: లింఫోసైట్,  48) పెరిగిన ఎర్ర రక్త కణాల సంఖ్యను అంటారు: పాలీసైథెమియా,  49) శరీరంలోని బ్లడ్ బ్యాంక్: ప్లీహము,  50) జీవ నది అంటారు: రక్తం,  51) సాధారణ రక్త కొలెస్ట్రాల్ స్థాయి: 100 mg / dl,  52) రక్తంలోని ద్రవ భాగం: ప్లాస్మా.

ఈ విషయాలన్నీ తెలుసుకోవడం ద్వారా ఎప్పుడైనా శరీరంలో బాగాలేనపుడు వైద్యుని దగ్గరకు వెళ్లినపుడు అక్కడ పరీక్షలు చేసిన తరువాత, ఇచ్చిన మందులు, చేసిన పరీక్షలు దేనికి చేస్తున్నారో తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు. మన శరీరంలో ఉండే బాగాలు తెలుసుకోవడం ద్వారా వాటిని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలో కూడా మనకి అర్ధమవుతుంది. తద్వారా శరీరంలోని భాగాలు పరిరక్షించుకునే అవకావం కలుగుతుంది.

Visakhapatnam

2022-09-21 08:03:24

తృణ ధాన్యాలతో ధృడమైన ఆరోగ్యం

తృణధాన్యాలు, చిరు ధాన్యాలు ఎన్నోవేల సంవత్సరాలుగా మానవ ఆహారంలో ఒక భాగంగా ఉన్నాయని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య తేజస్వి కట్టిమణి పేర్కొన్నారు. సిటియు లో ఈరోజు కేంద్ర విద్యా మంత్రిత్వ సఖ ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్ అవగాహనా కార్యక్రమాలలో భాగంగా గురువారం జరిగిన 'తృణ ధాన్యాలు వాటి ప్రయోజనాలు' అనే అంశం పై జరిగిన సదస్సులో వీసీ మాట్లాడారు. ఆధునిక ఆహారవిహారాలు మానజీవితాల్లోకి చేరడంతో ప్రకృతి ప్రసాదితాలను పక్కకు పెట్టి ప్రొసెస్డ్ ఫుడ్, పాలిష్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ని ప్రధాన ఆహారంగా చేసుకొని అనేక అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారన ఆవేదన వ్యక్తం చేశారు. తినే ఆహారంలో తృణధాన్యాలు చిరు ధాన్యాలను ఎక్కువగా తీసుకొంటె అనారోగ్యాల బారిన పడకుండా చేసుకోవచ్చనని సూచించారు. రాబోయే కాలం లో మానవ మనుగడకు తృణధాన్యాలు ఒక ప్రధాన ఆహారపదార్థంగా మారబోతున్నాయన్నారు. భారతదేశములో అధికంగా వినియోగించే తృణధాన్యాలు వరి, గోధుమ, అధికంగా వినియోగించే చిరుధాన్యాలు జొన్నలు, సజ్జలు, రాగులు. జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, అవిసెలు వీటిలోని పిండి పదార్ధాల వల్ల దైనందిన అవసరాలకు సరిపడా శక్తిని 70-80 శాతం ఇస్తాయన్నారు. అంతేకాదు ఇతర పోషకపదార్ధాలైన మాంసకృత్తులు, కాల్షియం, ఐరన్, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, బికాంప్లెక్స్ విటమిన్లను కూడా అందజేస్తాయని తెలిపారు.  

అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ కె ప్రకాష్ మాట్లాడుతూ, భారత దేశం ప్రపంచం లోనే డయాబెటీస్ కి కేంద్రాం గా ఉందని నిపుణులుహెచ్చరిస్తూనే ఉన్నారని దీనికి ప్రత్యామ్నాయం తృణధాన్యాలు ఆహార పదార్థాలుగా చేర్చుకోవాలని సూచించారు తృణధాన్యాల ఉపయోగాలను పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా ప్రదర్శించారు.   సతీష్ గైక్వాడ్ తాడినేటి మాధవ్ లు వైస్-ఛాన్సలర్ లు రీసెర్చ్ పేపర్ కంపిటేషన్ కి సంభందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ విద్యార్థులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2022-08-25 12:08:31