1 ENS Live Breaking News

జర్నలిస్టుల రక్షణకు చట్టం నివేదికపై ప్రెస్ కౌన్సిల్ ఆమోదం

న్యూఢిల్లీ దేశంలో జర్నలిస్టుల భద్రత  రక్షణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ) కోరింది. దేశంలో మీడియా సిబ్బంది అరెస్టులు తప్పుడు నిర్బంధాలు  బెదిరింపు లపై ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యులు గుర్బీర్‌సింగ్‌ రూపొందించిన నివేదికను పీసీఐ ఆమోదించింది. అయితే కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజన్‌ ప్రకాశ్‌ దేశారు నుంచి ఈ విషయంలో భిన్నా భిప్రాయం వ్యక్తమైనప్పటికీ నివేదికకు సమర్ధన లభించటం గమనార్హం. ఈ నివేదిక కేంద్రానికి ప్రధానంగా మూడు ప్రతిపాదనలను చేసిం ది.అందులో మొదటిది.. దేశంలో జర్నలిస్టుల రక్షణ భద్రత కోసం జాతీయ చట్టాన్ని ప్రకటించటం. అలాగే, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండి యా యాక్ట్‌కు మరిన్ని అధికారాలు కలిగించాలనీ, ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలవబడే మీడియాతో వ్యవహరించే విధానంపై పోలీసులకు అవగాహన కల్పిం చటం చట్టాన్ని అమలు పరిచే సంస్థల ప్రవర్తన నిబంధనలను క్రోడీకరించాలని నివేదిక పేర్కొన్నది. దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న వ ర్కిం గ్ జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

new delhi

2024-10-27 06:37:07

సింహాచలంలో అప్పన్న నిత్య కళ్యాణం ఈ విధంగా..!

సింహగిరిపై కొలువున్న శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి నిత్య కల్యాణం జరుగుతోంది. భక్తులు స్వామివారి కల్యాణం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన పద్దతులు అనుసరించడం ద్వారా స్వామివారికి చేయించే కల్యాణోత్సవం మది నిండా కొండంత ఆనందాన్ని పంచుతుంది. అప్పన్న కల్యాణం కోసం దేవస్థానం రూ.1000 టిక్కెట్టు ఛార్జి చేస్తున్నది. ఈ టిక్కెట్టుతో దంపతులిద్దరు కల్యాణంలో కూర్చోవచ్చు. టిక్కెట్టుతోపాటు తలంబ్రాల బియ్యం, కండువా, జాకిట్టుముక్క ఇస్తారు. స్వామివారి దగ్గరకు వెళ్లే సమయంలో భక్తులు తులసిమాల లేదా విడిపువ్వులు, కొబ్బరికాయ, అరటి పళ్లు, తీసుకెళ్లవచ్చు. స్వామివారి నిత్య కల్యాణం ప్రతీరోజూ ఉదయం 9.30గంటలకు ఆల యంలోని ఎడమచేతి వైపు ఉన్న మండపంలో ప్రారంభం అవుతుంది. భక్తులు 9గంటలకే టిక్కెట్టు తీసుకొని కల్యాణ మండపంలో కూర్చోవచ్చు. అప్పన్న కల్యాణం పూర్త యిన తరువాత సదరు జంటను స్వామివారి అంతరాలయ దర్శనానికి అనుమతిస్తారు. కల్యాణ టిక్కెట్టుపై ఒక లడ్డూ, ఐదు పులిహోర ప్యాకెట్లు ప్రసాదం కూడా ఇస్తారు. ఆపై స్వామివారి అన్నప్రసాదం స్వీకరించాలనుకునేవారు క్యూలైన్లోకి వెళ్లి అన్నప్రసాదం కూడా స్వీకరించవచ్చు. కల్యాణానికి వెళ్లే జంటలు సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్లాలి. సింహాద్రి అప్నన్న కళ్యాణం జన్మ జన్మల పుణ్యఫలం. ఏడాదిలో ఒక్కసారైనా శ్రీ శ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామివారి కల్యాణం జరిపించుకుంటే స్వామివారి కరుణ, కృప దక్కుతాయని భక్తుల విశ్వాసం. మరిన్ని వివరాలకు దేవస్థనంలోని ఈ 0891-2764949, 297966 నెంబర్లలో సంప్రదిస్తే మరిన్ని వివరాలు ఆలయ సిబ్బంది తెలియ జేస్తారు..

simhachalam

2024-03-11 06:13:25

భ‌క్తుల‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు భేష్‌.. పార్ల‌మెంట‌రీ క‌మిటీ

శ్రీ‌వారి ద‌ర్శ‌నార్థం దేశం న‌లుమూల‌ల నుండి విచ్చేస్తున్న భ‌క్తుల‌కు టీటీడీ ద‌ర్శ‌నం, అన్న‌ప్ర‌సాదాలు, గ‌దులు త‌దిత‌ర సౌక‌ర్యాలను చ‌క్క‌గా క‌ల్పిస్తోంద‌ని  బ్రిజ్‌లాల్ అధ్య‌క్ష‌ త‌న గ‌ల భార‌త హోం వ్య‌వ‌హారాల పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ అభినందించింది. క‌మిటీ స‌భ్యులు మంగ‌ళ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో టీటీడీ అధికా రుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.   ఈ సంద‌ర్భంగా ఈవో ఎవి.ధర్మారెడ్డి టీటీడీ ఆవిర్భావం నుండి చేప‌డుతున్న వివిధ సామాజిక, ధార్మిక, సంక్షేమ‌ కార్యకలా పాలను 40 నిమి షాల ఆడియో విజువ‌ల్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివరించారు.   అనంత‌రం క‌మిటీ ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం గొప్ప అనుభూతిని మిగిల్చింద‌న్నారు. శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్న యాత్రికుల‌ను, తిరుమ‌ల ప‌ర్యావ‌ర‌ణాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీ చేప‌డుతున్న చ‌ర్య‌లు బాగున్నాయ‌ని చెప్పారు. భ‌క్తుల ర‌ద్దీ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌ పద్ధతులు, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలు, విపత్తుల‌ నిర్వహణ ప్రణాళికల‌ను  ప్రశంసించారు.  కమిటీ సభ్యులు  బిప్లవ్ కుమార్ దేవ్,  నీరజ్ శేఖర్,  దిలీప్ ఘోష్,  దులాల్ చంద్ర గోస్వామి, రాజా అమరేశ్వర నాయక్, డాక్టర్ సత్యపాల్ సింగ్, డాక్టర్ నిషికాంత్ దూబే, హోం వ్యవహారాల శాఖకు చెందిన ఇతర అధి కారులతో పాటు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, సీవీఎస్‌వో నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎస్పీ  మలికా గార్గ్, టీటీడీ, జిల్లా, పోలీసు శాఖల ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.

Tirumala

2024-02-20 11:54:08

సూర్య‌ప్ర‌భ‌వాహ‌నంపై కోదండరామస్వామి క‌టాక్షం

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాని పురస్కరించుకొని శుక్రవారం ఉద‌యం సూర్యప్ర భవాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఇందు లో భాగంగా ఉద‌యం స్వామివారిని సుప్ర‌భాతంలో మేల్కొలిపి, తోమాల‌, కొలువు, పంచాంగ శ్ర‌వ‌ణం, స‌హ‌స్ర‌నామార్చ‌న నిర్వ‌ హించారు. అనంత‌రం ఉదయం 10 నుండి 11 గంటల వరకు సూర్యప్రభవాహనంపై శ్రీ కోదండ‌రామ‌స్వామివారు ఆలయ నాలు గు మాడ వీధుల్లో విహరించి భ‌క్తుల‌ను క‌టాక్షించారు.   అదేవిధంగా రాత్రి 7 నుండి 9 గంటల వ‌ర‌కు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.   ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో  నాగరత్న, సూప‌రింటెండెంట్ ర‌మేష్‌, టెంపుల్ ఇన్స్పెక్టర్లు చలపతి, సురేష్,తర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్త‌లు పాల్గొన్నారు.

Tirupati

2024-02-16 13:22:50

మీకోసమే యూట్యూబ్ లో క్వార్క్ ఎక్స్ ప్రెస్ సూపర్ సిరీస్

ఇపుడు న్యూస్ పేపర్ డిజైనింగ్ చేయడం చాలా తేలిక. క్వార్క్ ఎక్స్ ప్రెస్ లో న్యూస్ పేపర్ డిజైనింగ్ అందరూ పూర్తిస్థాయిలో నేర్చుకోవాలనే సంకల్పంతో డిజైనర్ టెక్ గురూ అనే యూట్యూబ్ ఛానల్ లో సూపర్ సిరీస్ క్లాసులను అందుబాటులో ఉంచా రు. ఈ వీడియోలు చూడటం ద్వారా ఎలాంటి వారైనా క్వార్క్ ఎక్స్ ప్రెస్ లో సొంతంగా పేజిలు పెట్టే నేర్పు సంపాదించుకుం టారు. అంతేకాదు ఇంటి దగ్గరే ఉండి నాలుగైదే పేపర్లు డిజైనింగ్ చేసి డబ్బు సంపాంచుకోవాలనుకునేవారికి ఈ క్వార్క్ ఎక్స్ ప్రెస్ సూపర్ సిరీస్ పేపర్ డిజైనింగ్ మాస్టర్ క్లాస్ లు ఒకవరమనే చెప్పాలి. ఈఎన్ఎస్ లైవ్ పాఠకుల కోసం కూడా ఆ ఛానల్ ను మీకు అందించనున్నాం. ఆ వీడియోలతోపాటు తాజా వార్తలు కూడా మీరు చూడాలనుకుంటే వెంటనే ప్లేస్టోర్ నుంచి Ens Live App ఇనిస్టాల్ చేసుకుంటే చాలు మీకు డిజైనింగ్ క్లాస్ లకు సంబంధించిన నోటిఫికేషన్లన్నీ మీ అరచేతిలోనే ఉంటాయి.

hyderabad

2024-02-16 05:49:22

తిరుమలలో అర్ధ‌ బ్రహ్మోత్సవానికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు..

 సూర్య జయంతి సందర్భంగా ఫిబ్ర‌వ‌రి 16న రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టింది. ఒకేరోజు స్వామివారు ఏడు వాహ‌నాల‌పై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌డంతో దీనిని అర్ధ బ్ర‌హ్మోత్స‌వ‌మ‌ని, ఒక‌రోజు బ్ర‌హ్మోత్స‌వమ‌ని కూడా పిలుస్తారు.  భ‌క్తులు ఎండ‌కు ఇబ్బందులు ప‌డ‌కుండా అఖిలాండం వ‌ద్ద‌, మాడ వీధుల్లో అవ‌స‌ర‌మైన ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు.  మాడ  వీధుల్లో కూల్ పెయింట్ వేశారు. ఆక‌ట్టుకునేలా రంగ‌వ‌ల్లులు తీర్చిదిద్దారు. గ్యాలరీల్లో వేచి ఉన్న భ‌క్తుల‌కు నిరంత‌రాయంగా సాంబార‌న్న‌, పెరుగ‌న్నం, పులిహోర‌, పొంగ‌ళి త‌దిత‌ర అన్నప్రసాదాలు, తాగునీరు, మ‌జ్జిగ‌, టి, కాఫీ, పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రత్యేక దర్శనాలు రద్దు

   ఫిబ్ర‌వ‌రి 16న ప్రోటోకాల్ ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే బ్రేక్ ద‌ర్శ‌నం ఉంటుంది. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్ల‌ల త‌ల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడమైనది. సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫిబ్ర‌వ‌రి 15 నుండి 17వ తేదీ వ‌ర‌కు తిరుప‌తిలోని కౌంట‌ర్ల‌లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్ల జారీ ఉండ‌దు. భ‌క్తులు నేరుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 ద్వారా శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు. కాగా, రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం భ‌క్తులు నిర్దేశించిన టైంస్లాట్ల‌ను పాటించ‌ని ప‌క్షంలో టోకెన్ లేని భక్తులతో కలిపి వైకుఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా దర్శనానికి పంపుతారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరడమైనది.  ఫిబ్ర‌వ‌రి 14 నుండి 16వ తేదీ వ‌ర‌కు గ‌దుల‌ కేటాయింపు కోసం సిఆర్వో జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి. ఈ రోజుల్లో ఎంబిసి, టిబి కౌంటర్ల‌ను మూసివేస్తారు. కౌంట‌ర్ల‌లో 4 లక్షలతో పాటు అద‌నంగా మ‌రో 4 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

వాహ‌న‌సేవ‌లు

 శ్రీ మలయప్పస్వామివారు ఉద‌యం 5.30 నుండి 8 గంట‌ల వ‌ర‌కు సూర్యప్రభ, ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు చిన్నశేష, ఉద‌యం 11 నుండి 12 గంట‌ల వ‌ర‌కు గరుడ వాహ‌నంపై, మ‌ధ్యాహ్నం 1 నుండి 2 గంట‌ల వ‌ర‌కు హనుమంత వాహ‌నాల‌పై భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంట‌ల వ‌ర‌కు పుష్క‌రిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు.  అనంత‌రం సాయంత్రం 4 నుండి 5 గంట‌ల వ‌ర‌కు క‌ల్పవృక్ష, సాయంత్రం 6 నుండి 7 గంట‌ల వ‌ర‌కు సర్వభూపాల, రాత్రి 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు చంద్రప్రభ వాహనాలపై భ‌క్తుల‌ను క‌టాక్షిస్తారు. వాహ‌న‌సేవ‌ల‌ను ఎస్వీబీసీలో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తారు. ర‌థ‌స‌ప్త‌మి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శ్రీ‌వారి ఆల‌యంలో క‌ల్యాణోత్స‌వం, ఊంజ‌ల్‌సేవ‌, బ్ర‌హ్మోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. సుప్ర‌భాతం, తోమాల‌, అర్చ‌న సేవ‌ల‌ను ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

Tirumala

2024-02-13 14:18:04

ఢిల్లీలో విశాఖ ఉక్కు కోసం ఆడారి కిషోర్ కుమార్ దృడ సంకల్పం

విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేయనీయకుండా కాపాడుకున్న తరువాతే ఢిల్లీ నుంచి వెనక్కి వెళ్లాలని తెలుగుదేశం పార్గీ యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ పిలుపు నిచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న ఆందోళనకు కిషోర్ కుమార్ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రు హక్కు..మన విశాఖ హక్కు గా మనలో భాగం అయిన స్టీల్ ప్లాంట్ కోసం వెయ్యిరోజుల పాటు ఉద్యమం చేసిన ఉక్కుకార్మికుల సంకల్పం చాలా గొప్పదన్నారు. నాటి ప్రధాని ఇందిగారా గాంధీతో పోరాడి సాధించుకున్న ఉత్తరాంధ్రాకి చెందిన స్టీల్ ప్లాంట్ నేడు ప్రైవేటు పరం అయితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కేంద్రప్రభు ప్రత్వంపై ఒత్తిడి పెరిగేలా ఢిల్లీలోనే ఉక్కకోసం గొప్ప సంకల్పంతో ఆందోళన చేపడుతున్న కార్మికుల కష్టానికి ఫలితం దక్కితీరుతుందన్నారు. ప్రజల మెప్పుకోసం మాట్లాడే ఎంపీలంతా పార్లమెంటు వేదికగా విశాఖ స్టీలు ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా గట్టిడా అడగాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ తెలుగువాడిపైనా ఉందన్నారు. చాలా మంది ఎంపీ కేంద్రానికి వ్యతిరేకంగా విశాఖ స్టీలు ప్లాంట్ కోసం మట్లాడి తే వారిపై ఈడి రైడ్లు జరుగుతాయని భయపడుతుంటడం సిగ్గుచేటన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనైనా స్టీల్ ప్లాంట్ ను రక్షించుకొని ప్రైవేటు పరం కాకుండా అడ్డుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్టీయూసి విల్లా రామ్మోహనరావు, పోరాట జేఏసి అధ్యక్షులు ఆయోధ్య రామ్, సిఐటియు ఆదినారాయణ, ఐఎన్టీయూసి మంత్రిరాజశేఖర్, ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు, సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ, సిపిఐ రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Jantar Mantar

2024-02-09 08:52:51

అనకాపల్లి ఎంపీగా అవకాశం కల్పించండి.. చంద్రబాబుని కోరిన కిషోర్

అనకాపల్లి ఎంపీగా ఒక్క అవకాశం ఇస్తే తానేంటో నిరూపించుకుంటానని టిడిపి యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ తెలుగుదేశం పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడుని కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీ లో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు ను ఎంపి గల్లా జయదేవ్ ఇంట్లో కలిశారు.  సామాజికపరంగా, యువత పరంగా తన గెలుపునకు గల అవకాశాలు ఎంతమేర ఉన్నాయో కూడా చంద్రబాబుకి వివరించారు. బిజెపీతో పొత్తుపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుని కలిసి అనకాపల్లి ఎంసీ సీటు అభ్యర్ధించడం, దానికి చంద్రబాబు తప్పకుండా పేరు పరిశీలనలోకి తీసుకుంటామని చెప్పడం కూడా చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబు అరెస్టు అయిన తదగ్గర నుంచి ఆడారి కిషోర్ కుమార్ అనేక రూపాల్లో యువతను కూడగట్టుకొని మరి ఢిల్లీ వేదికగా తీవ్రస్థాయిలో గళాన్ని వినిపించారు. అంతేకాకుండా ఉమ్మడి విశాఖజిల్లాలో కూడా డెమెక్రసీ ఇన్ డేంజర్, సేవ్ డెమెక్రసీ పేరిట అన్ని పార్టీలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాలు, నిసనలు, ఆందోళనలు చేపట్టారు. సుమారు రెండు నెలలు పాటు అలుపెరగకుండా చేసిన కార్యక్రమాలు సైతం టిడిపిలో చర్చనీయాంశం అయ్యాయి. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూ చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పనిచేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్న కిషో ఆ దిశగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకి సాగుతున్నారు. అదేవిధంగా పార్టీలోని అన్ని విభాగాల నయకుల మద్దతు కూడా కూడగట్టుకుని తన పనితాను చేస్తున్నారు. 

Delhi

2024-02-08 09:07:50

25న‌ శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి - పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌

తిరుమ‌ల‌లో జ‌న‌వ‌రి 25న గురువారం శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వైభవంగా జరుగనుంది. పురాణాల ప్ర‌కారం తిరుమలలో 3 కోట్ల 50 లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఈ పుణ్యతీర్థాలలో, సప్తగిరులలో వెలసి ఉన్న సప్తతీర్థాలు ప్రముఖమైనవి. వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థం, కూమారధార తీర్థం, తుంబురు తీర్థం, శ్రీరామకృష్ణ తీర్థం, ఆకాశ గంగ తీర్థం, పాపవినాశన తీర్థం, పాండవ తీర్థం అత్యంత ప్రసిద్ధమైనవి. ఈ తీర్థాలలో స్నానమాచరిస్తే భక్తులు పరమపావనులై ముక్తిమార్గం పొందుతార‌ని న‌మ్మ‌ కం. శ్రీరా మకృష్ణ తీర్థం తిరుమ‌ల శ్రీ‌వారి ఆలయానికి 6 మైళ్ళ దూరంలో వెలసి ఉంది. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమినాడు ఈ తీర్థముక్కోటిని ఆలయ ఆర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. స్కంద పురాణం ప్ర‌కారం పూర్వకాలంలో శ్రీరామకృష్ణుడు అనే మహర్షి వేంకటాద్రిపై తపస్సు చేసి, తాను స్నానమాచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందిం చుకున్నారు. ఈ తీర్థ తీరంలో నివ‌సిస్తూ స్నానపానాదులు చేస్తూ, శ్రీమహావిష్ణువు కోసం కఠోర తపస్సు చేశారు. విష్ణువు సాక్షాత్కారంతో ముక్తి పొందారు.  ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించ‌డం వ‌ల్ల అజ్ఞానంతో తల్లిదండ్రులను, గురువులను దూషించడం వ‌ల్ల క‌లిగే దోషాల నుండి విముక్తి ల‌భించి, సుఖంగా జీవించగలరని ప్రాశస్త్యం.

 ఈ పర్వదినంనాడు ఉద‌యం 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆలయ అర్చకులు మంగళవాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు త‌దిత‌ర‌ పూజా సామగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకెళ‌తారు. అక్క‌డున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భ‌క్తుల‌కు ప్ర‌సాద విత‌ర‌ణ చేస్తారు. ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు పాల్గొంటారు. పుష్య‌మాస పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో జ‌న‌వ‌రి 25న గురువారం రాత్రి గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

Tirumala

2024-01-22 07:42:00

అప్పన్నను దర్శించుకున్న స్టాండింగ్ కమిటీ సభ్యులు

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మినరసింహ స్వామి(సింహాద్రి అప్పన్న)ని మంగళవారం స్టాండింగ్ కమిటీ చైర్మన్ లోక్ సభ సెక్రటేరియట్ ఎనర్జీ బ్రాంచ్ స్టాండింగ్ కమిటీ సభ్యులు జగదాంబిక పాల్, చైర్ పర్సన్ కిసాన్ కపూర్, ఎంపీలు సునీల్ కుమార్ మోండల్, కె ఆర్ ఎన్ రాజేష్ కుమార్  దర్శించుకున్నారు.వీరికి ఆలయ సహాయ కార్య నిర్వహణాధికారి డి భ్రమరాంబ, పర్యవేక్షణ  అధికారి పిల్ల శ్రీనివాస్, ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి నాదస్వర వేదమంత్రాల  నడుమ  ముందుగా కప్పస్తంభం అలింగనం తదుపరి బేడా ప్రదక్షణ చేయించారు.అనంతరము స్వామివారి దర్శనము, అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు జరిపించి వేద పండితులచే వేద ఆశీర్వచనము ఇచ్చి ఆలయ కార్య నిర్వహణ అధికారి స్వామి వారి పటము ప్రసాదాలను అందజేశారు.

Simhachalam

2024-01-09 15:30:52

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న వైఎస్.షర్మిల..వైఎస్సార్టీపి విలీనం

కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ అధినేత్రి, దివంగత వైఎస్సార్ కూతరు షర్మిల చేరిపోయారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అదే సమయంలో తన పార్టీ వైఎస్సార్టీపీని కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు షర్మిల ప్రకటించారు. రా హుల్, ఖర్గేసహా కాంగ్రెస్ నేతలు ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షర్మిల కాంగ్రెస్ లో తాను చేరడంపై స్పందించారు. వైఎస్సార్ బిడ్డగా వైఎస్సార్టీ పీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నందుకు సంతోషంగా ఉందని వైఎస్ షర్మిల తెలిపారు. వైఎస్సార్టీపీ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ లో విలీనం అవుతున్నారని ఆమె పేర్కొ న్నారు. తన తండ్రి వైఎస్ బతికుండగా కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని, అందులోనే ఆయన అసువులుబాశారని షర్మిల గుర్తుచేశారు. వైఎస్సార్ బిడ్డగా తిరిగి కాంగ్రెస్ లో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దేశ సెక్యులర్ పునాదుల్లో భాగమైన కాంగ్రెస్ పార్టీలో తాను భాగమవుతున్నందుకు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్సేనని, అన్ని వర్గాలను కలుపుకుంటూ, అన్ని వర్గాలను కలుపుతూ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని వైఎస్ షర్మిల తెలిపారు. తాను వైఎస్సార్ అడుగు జాడల్లో నడుస్తున్నట్లు షర్మిల తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్నది తన తండ్రి వైఎస్సార్ కల అని, దాన్ని నెరవేర్చే యత్నంలో తాను భాగస్వామిని అవుతున్నందుకు షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ప్రతీ ఒక్కరి ఆకాంక్షలు నెరవేరుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.క్రిస్టియన్ గా మణిపూర్ లో చర్చిల కూల్చివేత తనను తీవ్రంగా బాధించిందని వైఎస్ షర్మిల తెలిపారు. సెక్యులర్ పార్టీ అధికారంలో లేకపోతే ఏం జరుగుతుంది అనడానికి ఇదొక నిదర్శనమన్నారు. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీపై నమ్మకాన్ని తనతో పాటు ప్రజలందరిలో పెంచిందని షర్మిల తెలిపారు. మరోవైపు కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ కి మద్దతు ప్రకటించి తెలంగాణలో పోటీ చేయలేదన్నారు.

Delhi

2024-01-04 07:22:43

సైబర్ దాడి.. రూ.10వేల కోట్లకు పైగానే సైలెంట్ గా కొట్టేశారు

భారత్ లో సైబర్ నేరగాళ్లు చాలా దారుణంగా రెచ్చిపోతున్నారు. 2021 ఏప్రిల్ 1 నుంచి 2023 డిసెంబర్ 31వ తేదీ వరకు రూ. 10319 కోట్ల మొత్తాన్నికేటుగాళ్లు కొట్టేశారు. ఈ విషయాన్ని భారతీయ సైబర్ నేరాల సమన్వయ కేంద్రం (ఐ4సీ) తెలియజేసింది. బాధితులు కోల్పోయిన మొత్తంలో 1,127 కోట్ల రూపాయలను సక్సెస్ ఫుల్ గా నిలిపివేసినట్లు ఐ4సీ డైరెక్టర్‌ రాజేశ్‌ కుమార్‌ వెల్లడించారు. దీంతో 9 నుంచి 10 శాతం సొమ్మును బాధితుల ఖాతాల్లోకి తిరిగి జమ చేసినట్లు పేర్కొన్నారు. నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ (ఎన్‌సీఆర్‌పీ)లో 2021లో 4.52 లక్షలకు పైగా నేరాలు రికార్డ్ అయ్యాయని.. 2022లో కేసుల సంఖ్యలో 113.7 శాతం పెరుగుదలతో 9. 66 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. దానికి రెండుతలుగా 2023లో ఏకంగా 15. 56 లక్షలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు 129 సైబర్‌ కేసులు నమోదు కావడం ఆందోలనకు గురిచేస్తున్నది. దాదాపు 50 శాతం సైబర్‌ దాడులు కంబోడియా, వియత్నాం, చైనా తదితర దేశాల నుంచే జరిగినట్లు ఐ4సీ వెల్లడించింది. ఢిల్లీ పరిసర ప్రాంతాల నుంచి పని చేసే వారు ఆన్‌లైన్‌ బుకింగ్‌, ఓఎల్‌ఎక్స్‌ లాంటి మార్గాల ద్వారా ఎక్కువగా ఈ మోసాలకు పాల్పడుతున్నట్టు గుర్తించినట్టు తెలియజేశారు.  అలాగే, ఈ-కేవైసీ గడువు ముగింపు, మాల్‌వేర్‌ వాడడం ద్వారా ఝార్ఖండ్‌ ముఠాలు ఎక్కువ మందిని బురిడీ కొట్టిస్తున్నాయని పేర్కొన్నారు. సైబర్‌ బాధితులు తమ డబ్బును ఈజీగా క్లెయిమ్‌ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం కొత్త విధానాలను రూపొందిస్తోందిని.. వాటిని త్వరలోనే అమల్లోకి తీసుకు వస్తామని ఐ4సీ డైరెక్టర్ రాజేశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం బాధితులు తమ డబ్బును తిరిగి పొందాలంటే కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకురావాల్సి ఉందన్నారు. కాగా చాలా మంది ఆన్ లైన్ సెక్స్ రాకెట్స్, న్యూడ్ వీడియోకాల్, ఈకేవైసీ తదితర మోసాలకు గురవుతున్నారు. అందులో చదువుకున్నవారికి దగ్గర నుంచి చదువులేని వారు, కొంత మంది మహిళలు కూడా ఈ సైబర్ దాడులకు గురవడం ఇపుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.

Delhi

2024-01-04 06:39:35

కాల్సినేడ్ అల్యూమినా హ్యాండ్లింగ్ లో నూతన రికార్డు

విశాఖపట్నం పోర్టు అధారిటీ మరో నూతన రికార్డును నెలకొల్పింది. ఒకే నెలలో 7630 మెట్రిక్ టన్నుల కాల్సినెడ్ అల్యూమినా ను హ్యాండిల్ చేయడం ద్వారా నూతన  రికార్డ్ నమోదు చేసిందని పోర్టు కార్యదర్శి  టి. వేణుగోపాల్ తెలియజేశారు. ఈ మేరకు మీడియాకి ప్రకటన విడుద లచేశారు. ఈస్ట్ క్యూ 3 బెర్త్ లో నవంబర్ నెలలో సాధించిన రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డు సృష్టించిందని పేర్కొన్నారు. ఉత్కల్ అల్యూమినా ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్ధ ఎంవి హెచ్ పిసి నౌక లో సరుకును హ్యాండిల్ చేయడం ద్వారా ఈ రికార్డును సుసాధ్యంచేసిందన్నారు. అదే సంస్ధ నవంబర్ 2023లో 7549 మెట్రిక్ టన్నుల కాల్సినేడ్ అల్యూమినాను హ్యాండిల్ చేసిందని.. ఉత్కల్ అల్యుమినా ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్ధ నవంబర్ లో తాను నెలకొల్పిన రికార్డును తానే బ్రేక్ చేసి నూతన రికార్డును నెలకొల్పిందని తెలియజేశారు. తద్వారా వరుసగా మూడు నెలల పాటు తమ రికార్డును తామే తిరగరాయగలిగామన్నారు. ఎంవిహెచ్పిసి నౌకకు శ్రావణ్ షిప్పింగ్ సర్వీస్, ఈశ్వర్ షిప్పింగ్ సర్వీసులు స్టీమర్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని..ఈ రికార్డును సాధించడంలో కృషి చేసిన  స్టీమర్ ఏజెంట్లను, స్టివెడోర్స్ ను పోర్టు చైర్ పర్సన్ డా ఎం.అంగముత్తు అభినందనలు తెలియజేశారు. పోర్టు ట్రాఫిక్ మేనేజర్ బి.రత్న శేఖర్ రావును పోర్టు చైర్ పర్సన్ ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో పోర్టు మరింత ప్రగతిని కనబరచాలని చైర్ పర్సన్ ఆకాంక్షించారు. పోర్టు సిబ్బంది మరింత కృషి చేయడం ద్వారా మంత్రిత్వ శాఖ విధించిన టార్గెట్ ను అధిగమించాలని సూచించారు. రికార్డును సాధించడంలో కృషి చేసిన ట్రాఫిక్ విభాగం సిబ్బందిని పోర్టు డిప్యూటీ చైర్ పర్సన్  దుర్గేష్ కుమార్ దూబె, కార్యదర్శి వేణుగాపాల్ అభినందించారు. 

Visakhapatnam

2023-12-05 17:30:53

నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆడారి కిషోర్

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు సతీమణి, మహిళానేత నారాభువనేశ్వరిని మిషన్ కర్షక దేవోభవ జాతీయ అధ్యక్షలు, టిడిపి యువనాయకులు ఆడారి కిషోర్ కుమార్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం ఢిల్లీలోని ఓబెరాయ్ హోటల్ లో ఆమెను కలిసి డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని, కక్షసాధింపులకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని మండి పడ్డారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమం అన్ని వర్గాలనూ ఆలోచించేలా చేస్తుందని అన్నారు. అదేవిధంగా మిషన్ కర్షకదేవోభవ కార్యక్రమం కోసం కూడా ఆడారి కిషోర్ కుమార్ తో చర్చించారు. యువత చైతన్యం కోసం, రైతుల అభివృద్ధి కోసం చేపడుతున్న మంచి పనులను భువనేశ్వరి అభినందించారు. టిడిపి ఎంతో చరిత్రకలిగిన పార్టీ అని..అలాంటి పార్టీలో యువచైతన్యానికే పెద్ద పీట ఉంటుందనే విషయాన్న ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు. మంచి పనులు చేసే మీకు పార్టీ సహకారం, తమవంతు సహకారం ఎల్లప్పడుతూ వుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆడారి కిషోర్ కుమార్ మాట్లాడుతూ, గత మూడు రోజులుగా టిడిపి అధినేతతోపాటు తాను ఢిల్లీలోనే ఉన్నానని చెప్పారు. తాను చేపడుతున్న కార్యక్రమాలు ఢిల్లీ వేధికగా చేపడుతున్న విషషయాన్నిఅధినేత సతీమణి  దృష్టికి తీసుకొచ్చామని, తమ పార్టీ అధ్యక్షులు,  సతీమణి ఇచ్చిన ప్రోత్సాహం మరువలేదని అన్నారు. వారి సహకారంతో గ్రామ, గ్రామన డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని వర్గాల్లోనూ చైతన్యం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని చెప్పారు. అనంతరం ఢిల్లీ ఎయిర్ పోర్టులో చంద్రబాబుకి సాదర వీడ్కోలు పలికారు. అంతకు ముందు మాజీ మంత్రి నారాయణను కూడా ఆడారి కిషోర్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు.

New Delhi

2023-11-28 13:30:29

డెమెక్రసీ ఇన్ డేంజర్ ఉద్యమంపై ఆడారికి చంద్రబాబు ప్రశంస

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను డెమెక్రసీ ఇన్ డేంజర్ ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యం చేస్తున్న టిడిపి యువ నాయకులు ఆడారి కిషోర్ కుమార్ ను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షలు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రశంసించారు. సోమవారం చంద్రబాబునాయుడుని  ఢిల్లీ ఓబె రాయ్ హోటల్ లో కిషోర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, డెమెక్రసీ ఇన్ డేంజర్ పేరిట యువతను ఉత్తేజ పరచడంలో చేస్తున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని కొనియాడారు. రాష్ట్రంలో యువత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన నష్టం కోసం తెలుసుకో గలిగితే మీరు చేస్తున్న ఉద్యమం మరింతగా అన్ని వర్గాల ప్రజల్లోకి వెళుతుందన్నారు. అదేవిధంగా సామాజిక దృక్పదంతో రైతుల కోసం చేస్తున్న మిషన్ కర్షక దోవోభవ చక్కని కార్యక్రమమని అన్నారు. ఇప్పటి వరకూ ఢిల్లీ నుంచి అనకాపల్లి వరకూ డేంజర్ ఇన్ డెమెక్రసీ, సేవ్ డెమెక్రసీ కార్యక్రమాల విశేషాలను కిషోర్ కుమార్ చంద్రబాబుకి తెలియజేశారు. టిడిపిలో కష్టపడి పనిచేసేవారికి ఎల్లప్పుడూ గుర్తింపు వుంటుందని, దైర్యంగా మీ కార్యక్రమాలను కొనసాగించాలని బుజం తట్టి ప్రోత్సహించారు. ఆంధ్రప్రేదేశ్ లో యువతకు జరిగిన అన్యాయం, యువ నాయకత్వం ద్వారా ప్రజలకు తెలియాలన్నారు. ఈ అరాకచక పాలనకు ప్రజలు చరమగీతం పాడే సమయం దగ్గర పడిందని అన్నారు.  ఆయనను కలిసిన అనంతరం కిషోర్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత తాను చేపట్టే కార్యక్రమాలను చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లానని చెప్పారు. విమానం లోనూ, విశాఖ క్రికెట్ స్టేడియంలోనూ, డెమెక్రసీ ఇన్ డేంజర్ కార్యక్రమాలను ఆయనకు వివరించానని అన్నారు. దానికి ఆయన ఇచ్చిన స్పూర్తి, ప్రోత్సాహం మాటల్లో చెప్పలేనని అన్నారు. వైఎస్సార్సీపీ చేపడుతున్న అన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, కక్షసాధింపు చర్యలను అన్ని వర్గాల ప్రజల వద్దకూ తీసుకెళ్లడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.

Delhi

2023-11-27 13:34:23