శేషాచల లింగేశ్వర స్వామి ఆలయ బాలాలయ సంప్రోక్షణ


Ens Balu
82
Chandragiri
2023-04-21 09:41:30

చంద్రగిరి మండలం కందులవారి పల్లిలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయంలో ఏప్రిల్ 26, 27వ తేదీల్లో బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు.  గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ''బాలాలయం'' చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని ముఖ మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్ర‌ప‌టాలను ఏర్పాటు చేస్తారు. తదుపరి మహా సంప్రోక్షణ జరిగే వరకు స్వామి, అమ్మవార్లకు నిత్యకైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 26 వ తేదీ సాయంత్రం 4 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవచనం, వాస్తు హోమం, మేదిని పూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహించనున్నారు.  ఏప్రిల్  27వ తేదీ ఉద‌యం 7.30 గంట‌లకు గణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల పూజచేపడతారు. ఉదయం 10.55 గంట‌లకు పూర్ణాహుతి, సంప్రోక్ష‌ణ‌ నిర్వహిస్తారు.