ఉమ్మడి విశాఖజిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గురువారం అర్ధరాత్రి వరకూ బదిలీల ప్రక్రియ కొనసాగింది. చాలా వరకూ చేసుకున్న దరఖాస్తులను అనుసరించి బదిలీలు చేపట్టారు. మొత్తం ఐదు విభాగాల్లోని ఉద్యోగులకు ఈ బదిలీలు జరిగాయి. ప్రత్యేక అవసరాలు(డిసేబిలిటీ)కలిగిన వారు 14 మంది దరఖాస్తుచేసుకుంటే 14మందికీ చేపట్టారు.మెడికల్ గ్రౌండ్స్ క్రింద 48 మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 20మందికే బదిలీలు చేశారు. సింగిల్ ఉమెన్ కేటగిరీలో 21 దరఖాస్తులు రాగా ఐదుగురికి, స్పౌజ్ కోటా క్రింద 61 దరఖాస్తులు రాగా31 మందికి, ఎంఆర్ కేటగిరీ కింద ముగ్గురు దరఖాస్తు చేసుకుంటే ముగ్గురికి మ్యూచ్ వల్ క్రింద42 మంది దరఖాస్తు చేసుకుంటే 42 మందికీ బదిలీలు చేపట్టారు. ఆయావిభాగాలకు చెందిన జిల్లా అధికారులు ఈ కౌన్సిలింగ్ కు హాజరై ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా బదిలీల ప్రక్రియ పూర్తిచేశారు. కాగా ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రింద దరఖాస్తుచేసుకున్నవారికి ప్రభుత్వం త్వరలోనే తేదిని ప్రకటించనుంది.