ఆ వినాయకుడు చెవిలో ఏది చెబితే అది జరుగుతుంది..భక్తులు కోరిన కోర్కెలన్నీ తీరుస్తాడు..ఈ మాట ఒకరు ఇద్దరు కాదు వందల, వేల మంది భక్తులు చెప్పేమాట. ఇంతకీ ఎక్కడవుంటాడు ఆ వినాయమకుడు అంటే తూర్పుగోదావరి జిల్లా, బిక్కవోలుని శ్రీ లక్ష్మీగణపతిగా భక్తులకు వరాలు ఇస్తూ విరాజిల్లుతున్నాడు ఈ స్వామి.. వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విజ్ఞం కురుమేదేవా, సర్వ కార్యేషు సర్వదా అంటూ వేడుకుంటే ఈవినాయక స్వామి కోరిన కోరికలు తీరుస్తాడు. విజ్ఞానలన్నిటికీ అధిపతి అగ్రజుడుగా అగ్ర పూజలందుకున్న గణేశుడిని నిత్యం దేవతలందరూ ఆరాదిస్తారంటే ఆయన ఎంతటి శక్తి వంతమైన దేవుడనేది వేరేగా చెప్పాల్సిన పనిలేదు.. అలాంటి వినాయకుడు అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటాడు. స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటైన బిక్కవోలు శ్రీ లక్ష్మి గణపతి దేవాలయం తూర్పుగోదావరి జిల్లాకు ఆధ్యాత్మికంగా విశేషంగా కీర్తిని తీసుకొచ్చింది. ఇక్కడి వినాయకుడు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మిక.
క్రీ శ 840 సంవత్సరంలో చాళుక్యులు ఈ ఆలయం నిర్మించినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉండే శాసనాల ద్వారా ఇది ఎంతటి పురాతన ఆలయమో అర్ధమవుతుంది. నిజానికి ఇక్కడున్న ఆలయం భూమిలోనే ఉండేదట. 19 వ శతాబ్దంలో ఒక భక్తుడికి వినాయకుడు కలలో కనిపించి తన ఉనికిని చాతినట్టుగా ప్రచారంలో ఒక కధ వినిపిస్తుంది. అప్పుడా భక్తుడు గ్రామస్తులకు ఆ విషయం చెప్పిఅ ఆలయాన్ని తవ్వించాడట. ఆ తరువాత వినాయకుడు బయటపడ్డాడని అప్పటి నుంచి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినదనీ చెబుతున్నారు. భూమిలో నుండి బయటపడిన తరువాత వినాయక విగ్రహం పెద్దదయిందని భక్తులే చెబుతుంటారు. ఈ వినాయకుడి ఆలయానికి ఎక్కడెక్కడి నుంచే భక్తులు వచ్చి తమ కోరికలను విన్నవించుకుంటున్నారు. విఘ్నేశ్వరుడి చెవిలో తమ కోరికలను చెప్పుకొని ముడుపు కడితే తమ కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతే కాకుండా నందీశ్వరుడిని, భూలింగేస్వరుడిని దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాజరాజేశ్వర ఆలయం కూడా ఉంది. స్వామి దర్శనం కోసం వచ్చిన వారంతా అమ్మవారికి కూడా పూజలు చేస్తారు. ఈ ఆలయం లోకి వెళ్ళగానే దివ్యానుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు. వీరభద్రుడు, సుబ్రమణ్య స్వామి కొలువై ఉన్నారు. ప్రతీ సంవత్సరం గణపతి నవరాత్రులతో పాటు సుబ్రమనయేశ్వర ఉత్సవాలు కూడా జరుగుతాయి. పూజలు, పారాయణాలు,దీపోత్సవాలను ఇలా అన్ని కార్యక్రమాలను కన్నుల పండువగా తిలకించవచ్చు. ఇక్కడ గణపతి హోమమ చేయిస్తే సాక్షాత్తూ ఆ కుటుంబానికి గణపతి అండగా ఉంటాడని భావిస్తారు. రాజమండ్రి నుంచి గాని, అనపర్తి నుంచి గాని బిక్కవోలుకు చేరుకోవచ్చు. ప్రత్యేకంగా వెళ్లేవారు కార్లు, ఆటోలు, జీపుల ద్వారా స్వామి దగ్గరకు వెళ్లి వారి కోర్కెలు చెప్పి వస్తుంటారు. అవితీరిన తరువాత మొక్కులు కూడా చెల్లించుకుంటారు. అంతటి మహిమ కలిగిన బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాన్ని ప్రతీ ఒక్కరూ దర్శించుకుంటారని ఆశిద్దాం..!
అనంతపురం జిల్లా పంపనూరులో రాతియుగానికి చెందిన చిత్రాలు శుక్రవారం వెలుగుచూశాయి. దీంతో అనంతపురం ఆర్కిలాజికల్ అసిస్టెంట్ డైరెక్టర్ రజిత, విశ్రాంత డిప్యూటి కలెక్టర్ జి.బి.విశ్వనాథ, బళ్ళారికి చెందిన చరిత్ర అభిమాని లింగన్నస్వామి, గుత్తికోట టూరిస్ట్ గైడ్ రమేష్ లతో కూడిన బృందం అత్మకూరు మండలంలోని పంపనూరు నరసింహ దేవాలయం వద్దగల గుట్టలలో, విడపనకల్లు మండలంలోని వేలుపుమడుగు కొండలలో వీటి ఆచూకి ని కనుగొన్నారు. మధ్య నవీన శిలాయుగానికి (మెసోలితిక్ కాలానికి) చెందిన చిత్రాలలో బాణంతో ఎద్దును వేటాడుతున్న దృశ్యం, సామూహిక వేట, నెమళ్ళు,సామూహిక నృత్యం మొదలైన రాక్ ఆర్ట్ డ్రాయింగ్స్ ఇందులో ప్రధానమైనవిగా ఉన్నాయి. దాదాపు 10 వేల సంవత్సరాల పూర్వానికి చెందిన ఈ చిత్రాలను కొసిగా వున్న రాయితో మలచడం జరిగింది. పరిణామ క్రమంలో మానవుడు సాధించిన ప్రగతి ఈ చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చును.
వేటలో విల్లంబుల ఉపయోగం, సామూహిక వేట, సామూహిక నృత్యం వారి పరిణామ దశకు తార్కాణం. నెమళ్ళు, మొదలైన చిత్రాలు చెక్కడం వలన ప్రకృతిపట్ల వారికి గల అవాగాహన పరిశీలన తెలియచేస్తోంది. గుహలలో పెయింటింగ్స్ వేయటాన్ని ఆంగ్లంలో పెట్రోగ్లోఫి అంటారు. ఇలాంటి చిత్రాలు ఉరవకొండ సమీపంలోని బూదగవి కొండగుహలో ఉన్నాయి. చిత్రీకరణకు తేనేపట్టు, జంతుకొవ్వు, రంగుశిలలను వాడి వుంటారని విశ్రాంత డిప్యూటి కలెక్టర్ విశ్వనాథ అభిప్రాయపడ్డారు. వీరు ఎద్దులు, దున్నపోతులు, జింకల, దుప్పులు,నెమళ్ళు, కొండగొర్రెలు, ఏనుగులు మొదలైనవి వేటాడేవారని ఆయన అభిప్రాయపడ్డారు.
పదునైన రాయితో చెక్కిన చిత్రాలను ఫిక్టోగ్రాఫ్స్ అంటారు. ఈ చిత్రాలు పంపనూరు, వేలుపుమడుగులలో వున్నాయి. వేలుపుమడుగులో లింగన్న స్వామి సాయంతో ఆర్కియాలాజికల్ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రాచీన మానవుడు ఉపయోగించిన రాతిగొడ్డలి, వడిసెలరాల్లు, మాంసం కోసేందుకు గీకేందుకు ఉపయోగించిన బ్లేడ్లు సేకరించారు.ఇక్కడ పడుకొన్న మనిషికి సాయం చేస్తున్న మరో మనిషిచిత్రం ఉండటం విశేషం.రాతిపనిముట్లను పదునుపెట్టె గ్రూ లేదా రాతిచీలిక వేలుపుమడుగు పర్వతపాదంలో కనుగొనడం విశేషమని చెప్పాలి. వేలుపుమడుగు కొండల్లో స్టోన్ మైనింగ్ జరిగి రాతిచిత్రాలు పాడైపోయాయి. ఇందులో వున్న చిత్రాలను గ్రామస్థులే కాపాడుకోవాలి. పంపనూరు ఆధ్యాత్మిక కేంద్రం. భక్తులు ఇక్కడి గుట్టలలోని రాతి చిత్రాల ప్రాముఖ్యం తెలుసుకోలేక, వాటిపై రంగులతో ( paintings) పేర్లు వ్రాసి చాలా వరకు రాతి చిత్రాలను పాడుచేశారు. వీటిని కూడా గ్రామస్తులే కాపాడుకోవాలని సూచించారు.
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనం అధిరోహించి మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడని నమ్మకం. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ఈ రోజునే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయని చెబుతారు.
సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గళి’ మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు. వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.ఏకాదశి అంటేనే, మనకు ఉపవాస దీక్ష జ్ఞప్తికి వస్తుంది. ఇహ సంసారపు ఆలోచనల్లో మునిగితేలుతున్న మనం, పక్షంలో ఒక్క రోజైనా భగవంతుని వైపుగా దృష్టి సారించేందుకు ఏర్పరిచిన నియమమే ఏకాదశి. దీని వలన మనసు పరిశుద్ధం కావడం అటుంచితే, శరీరం కూడా స్వస్థత పొందుతుందనేది శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది.
ఒకవేళ ప్రతి ఏకాదశికీ ఉపవాసం ఉండటం కుదరకపోతే తొలి ఏకాదశి, నిర్జల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి వంటి రోజులలో అయినా ఉపవాసాన్ని ఆచరించమని సూచిస్తున్నారు. అందుకే వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులలోనూ ఉపవాసం ఉన్నట్లు లెక్క అని కూడా పెద్దలు చెబుతారు. వైకుంఠంలోని విష్ణుమూర్తి ముక్కోటి దేవతలకూ ఈ రోజున దర్శనమిస్తారు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అనీ, వైకుంఠ ఏకాదశి అనీ పిలవడం కద్దు. వైకుంఠ ఏకాదశినాడు భక్తులు కూడా విష్ణుమూర్తిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుని తరిస్తారు.
వైకుంఠ ఏకాదశి, స్వర్గపురి ఏకాదశి అంటారు. ఈ రోజున ముప్పై మూడుకోట్ల దేవతలతో కలిసి శ్రీమహావిష్ణువు భూలోకి వస్తారని ప్రతీతి. ఏకాదశి పేరు చెప్పగానే ఉపవాసం అందరికీ గుర్తుకు వస్తుంది. ప్రతి ఏకాదశికీ ఉపవాసం కుదరకపోతే తొలి ఏకాదశి, నిర్జల ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులలోనూ ఉపవాసం ఆచరించినట్టు ఫలితం దక్కుతుందని విశ్వాసం. విష్ణుమూర్తి ముక్కోటి దేవతలతో కలిసి ఈ రోజున దర్శనమిస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అనీ, వైకుంఠ ఏకాదశి అనే పేర్లతో పిలుస్తారు. అందుకే వైకుంఠ ఏకాదశినాడు ఉత్తర ద్వారం నుంచి భక్తులు విష్ణుమూర్తిని దర్శించుకుని తరిస్తారు.
ఉపవాసం ఎలా చేయాలంటే?
ముక్కోటి ఏకాదశి నాడు ఉపవాసం చేయాలనుకునే భక్తులు ముందు రోజు అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశి రోజున తులసి తీర్థం మాత్రమే సేవించి, రాత్రి జాగరణ ఉండాలి. మర్నాడు ద్వాదశి రోజు ఉదయం ఆహారాన్ని స్వీకరించడంతో ఉపవాస దీక్షను ముగిస్తారు. ఉపవాస దీక్ష వెనుక పరమార్థం దాగి ఉంది. దేహాన్ని శాసించే ఆకలి, నిద్రల మీద అదుపు సాధించవాడి స్థైర్యానికి తిరుగుండదని, భగవన్నామస్మరణతో ఏకాదశినాటి రాత్రిని గడపమని సూచిస్తారు. అదే ఏకాదశి ఉపవాసానికి వెనుకనున్న అర్థం. ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు.
అలాంటి వారు పాలు, పండ్లు లాంటి తేలికపాటి ఆహారాన్ని తీసుకోవచ్చు. మురాసురుడు అనే రాక్షసుడు ఈ రోజున బియ్యంలో ఉంటాడు కాబట్టి దీనితో చేసిన పదార్థాలను భుజించకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకాదశి వ్రతం" ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి.
ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు తిని ఉండవచ్చు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతము చేసే వారికి మరో జన్మంటూ ఉండదని అంటారు. శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలివెళ్లే సందర్భం- వైకుంఠ ఏకాదశి. భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున ఆస్తికులు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు ఈ విధంగా చెబుతున్నారు. ఉత్తర ద్వార దర్శనం'లో ప్రత్యేకత :- రాక్షసుల బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు. ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను దివి నుండి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరి వాసరమని, హరి దినమని, వైకుంఠ దినమని అంటారు.
ఈ ఒక్క ఏకాదశి 'మూడు కోట్ల ఏకాదశుల'తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకాదశి వ్రతం" ఆచరించిన వారికి శుభ ఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకుంటారు. దీంతో స్వామి మురాసురుడి మీదికి దండెత్తి అతన్ని వధించాలని చూస్తాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బయటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకుంటాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు 'ఏకాదశి' అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని అంటారు.
సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు తిని ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతము చేసే వారికి మరో జన్మంటూ ఉండదని అంటారు.
ఇందులోని తాత్త్విక సందేశం ఇలా ఉంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకొని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు. ఇదీ వైకుంఠ ఏకాదశికి ఉన్న విశిష్టత