కరోనా కక్ష..ఆఖరి గడియల్లోనూ ఆ4గురూ దగ్గరకి రాక..


Ens Balu
2
Visakhapatnam
2020-07-28 19:49:36

బతికుండగా చేతనైనంత వరకూ మంచిపనులు చేస్తే.. ఎవరికీ మాట వరుసకైనా కీడుచేయకుండా ఉంటే... చనిపోయిన తరువాత కాష్టం వరకూనైనా ఆనలుగురూ వెంట వచ్చేలా చేసుకోవాలనుకునే నానుడి కరోనా కక్ష కట్టడంతో ఆప్యాయతలన్నీ వైరస్ రూపంలో దూరమైపోతున్నాయి. ఇంట్లోవారు మ్రుతిచెందితేనే కుటుంబ సభ్యులు ఆపీనుగను ముట్టుకునే పరిస్థితి లేకుండా దాపురించింది మాయదారి కరోనా. అలాంటి సమయంలోనూ విశాఖకు చెందిన మనసున్న మనిషి వానపల్లి రవికుమార్, అనాధ శవాలకు దగ్గరుండి దహన సంస్కారాలు చేయించి మరీ తన దాన గునాన్ని చాటుకుంటున్నారు. కానీఈయన చేసేసేవలు కొందరికి నచ్చకపోయినా వేలాది మంది మనసులను కదిలిస్తున్నాయి. కరోనా కోరలు చాచిన సమయంలో మంచి మనసుతో అంతిమ సంస్కారాలు ఉచితంగా చేసే ఇలాంటి సేవకులను మనసున్న మరింత దాతలు ప్రోత్సహించాల్సిన అవసరం వుంది. సేవ చేయడం చేతకానివారిని దూరంచేసుకొనైనా ఇలాంటి మంచి పనులకు  కరోనా సమయంలో చేస్తున్న సేవకు ప్రోత్సాహం సైతం లభిస్తోంది. మంచి మనసుతో చేసే పనులను ఎప్పుడూ మంచి వారు ఆధరిస్తారనడానికి వానపల్లి చేసే అరుదైన సేవే నిదర్శనం...