శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే అగజానన పద్మార్కం గజాననమ్ అహర్నిశం అనేకదమ్ తమ్ భక్తానాం ఏకదంతమ్ ఉపాస్మహే... అనే శ్లోకం ప్రతీరోజూ ఏ పూజ చేసినా.. ఏ కార్యక్రమం చేసినా దీనిని చదుకొని ప్రారంభిస్తే ఎలాంటి ఆటంకాలుు లేకుండా కార్యసిద్ధి జరుగుతుందని చెబుతారు. అంతే కాకుండా ప్రతి నిత్యం గణపతి మూల మంత్రం చదువుకోవడం ద్వారా కూడా సల శుభాలు సిద్ధిస్తాయనేది ప్రతీతి. దానికోసం ప్రతీ ఒక్కరూ ఆ ఉండ్రాళ్ల రాయుడిని ప్రతినిత్యం ఆయన మూల మంత్రంతో స్తుతించడం చాలా మంచిదని కూడా గమనించాలి.. దానికోసం .. ఓ గం గణపతియే నమహా.. ఈ మంత్రం చాలా విశేషమైంది. అంటే దేవతల ప్రభువుకు వందనం చేస్తున్నానని దీని అర్థం. గణపతి మూలాధార చక్రానికి అధిపతి. అందువల్ల ఈ మంత్రంతో మూలధార చక్రానికి శక్తి లభించి ఉత్తేజితమవుతుంది.