ఇంటర్ తో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్


Ens Balu
12
Visakhapatnam
2022-09-02 08:18:00

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2022 ప్రకటనను విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లోని విభాగాల్లో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేస్తారు.  ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్నఅభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్ https://ssc.nic.in ద్వారా దరఖాస్తు చేయాలి. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారికి టైపింగ్, స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి.  ఉద్యోగాలను రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా భర్తీచేస్తారు. ఇక  వయోపరిమితి విషయానికొస్తే.. 01.01.2022 నాటికి (గ్రేడ్-సి) పోస్టులకు 18 - 30 సంవత్సరాలు ఉండాలి. స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-డి) పోస్టులకు 18-27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తింప జేస్తారు. ఎస్సీ, ఎస్టీల అభ్యర్ధులకు 5 సంవవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిఫెన్స్ పర్సనల్ అభ్యర్థులకు 3 సంత్సరాలు, డిఫెన్స్ (డిసెబుల్డ్) పర్సనల్ అభ్యర్థులకు 3 సంత్సరాల సడలింపు వర్తిస్తుంది.

అంతేకాకుండా ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అభ్యర్ధులకు 40 సంవత్సరాల వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (ఎస్సీ, ఎస్టీ) 45 సంవత్సరాల వరకు వయోసడలింపు ఇచ్చారు.  కాగా వితంతు-విడాకులు-ఒంటరి మహిళలకు 35 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీలకు 40 సంవత్సరాల వరకు వయోపరిమితి వర్తించుందని ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక  దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.. ఆన్‌లైన్ (యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు) లేదా SBI చలానా ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చునని పేర్కొన్నారు. దరఖాస్తులను  ఆన్‌లైన్‌ ద్వారా చేయాల్సి వుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేపడతారు.

పరీక్ష జరిగే విధానమిదే..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2022 ఉద్యోగాలకు సంబంధించి పెట్టే రాత పరీక్షలో మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు వుంటుంది. పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలలో పూర్తి చేయాల్సి వుంటుంది. అదేవిధంగా పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. దీనిని అభ్యర్ధులు జాగ్రత్తగా చూసుకొని పరీక్షా రాయాల్సి వుంటుంది.

సదరన్ రీజియన్‌లో పరీక్ష కేంద్రాలివే..
స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించి  గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, పుదుచ్చేరి, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఇచ్చారు. అభ్యర్ధుల అవకాశాన్ని బట్టి ఆయా ప్రదేశాల్లో పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు..