ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళాకు విశేష స్పందన


Ens Balu
81
Rajamahendravaram
2023-02-13 14:13:00

ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళాకు విశేష స్పందన లభించింది.  రాజమహేంద్రవరం ప్రభుత్వ ఐటిఐ లో సోమవారం నిర్వహించిన అప్రెంటిస్ మేళాకు కాకినాడ, డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల నుండి సుమారు 143 మంది విద్యార్ధులు హాజరుకాగా, 118 మంది విద్యార్ధులు ప్రొవిషనల్ గా సెలెక్ట్ అయ్యారని ఐటిఐ ప్రిన్సిపాల్ జివి.రమణారావు తెలియజేశారు. ఈ మేళాకు జిల్లాలో గల 10 కంపెనీలు అనగా హార్లిక్స్ ఫ్యాక్టరీ, టాగూర్ ల్యాబోలేటెరీస్ ప్రైవేట్ లిమిటెడ్, డైరీ ఎక్విప్మెంట్స్, పరమేశ్వరి బయోటెక్స్, మారుతి మోటార్స్,  ఏపిఈపిడిసిఎల్ కంపెనీల నుండి ప్రతినిదులు హాజరు అయ్యి అప్రెంటిస్ శిక్షణ కొరకు అభ్యర్ధులను ఎంపిక చేసుకున్నారని వివరించారు. ఈ మేళా లో  బి. సత్యనారాయణ అప్రెంటిస్ అడ్వసర్, పెంకె. శ్రీనివాస రావు అప్రెంటిస్ అడ్వసర్ మరియు ఐటిఐ సిబ్బంది పాల్గొన్నారు.