నిరుద్యోగులూ జాబ్ ఫెయిర్ ను సద్వినియోగం చేసుకోండి


Ens Balu
26
Visakhapatnam
2023-11-29 06:43:25

నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాది అవకాశాలు కల్పించేందుకు జెడిఫౌండేషన్, నిపున హ్యూమన్ డెవలప్ మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్టు మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ తెలియజేశారు. బుధవారం డాబాగార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పత్రికా సమావేశంలో జాబ్ ఫెయిర్ వివరాలను తెలియ జేశారు. డిసెంబర్ 2న మధురవాడ క్రికెట్ స్టేడియం వెనుక ఉన్న సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో  సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాల మీద సమాజంలో ఉన్న పెద్ద వాళ్ల మీద ప్రతి ఒక్కరి మీద ఉందన్న ఆయన కష్టపడి పెంచి పోషించిన తల్లిదండ్రులకు ప్రతి యువత ఉద్యోగం చేసి కుటుంబానికి చేయూతనివ్వాలని సూచించారు. యువత తమ కళ్ల మీద తాము నిలబడి  సమాజంలో మంచి విషయాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ కన్వీనర్ ప్రియాంక దండి, కృష్ణ మోహన్, నిశ్చల్, నాగరాజు, సాంకేతిక కాలేజీ ప్రతినిధి కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.