FCI లో 113 ఉద్యోగాలకు నోటిఫికేషన్


Ens Balu
25
New Delhi
2022-09-07 15:28:57

భారత ప్రభుత్వ సంస్థ Food Corporation of India(FCI) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ ఖాళీలు సంఖ్య 113 కాగా, జనరల్, డిపో, మూవ్‌మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్, హిందీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నట్టుగా ప్రకటనలో పేర్కొన్నారు. ఇక జోన్ వారీగా ఖాళీల వివరాలు తెలుసుకుంటే.. 
నార్త్ జోన్- 38 పోస్టులు, సౌత్ జోన్-16, వెస్ట్ జోన్- 20, ఈస్ట్ జోన్-21, నార్త్-ఈస్ట్ జోన్లో 18 పోస్టులు ఉన్నాయి. 

ఈ పోస్టులన్నింటికీ అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్, బీకాం, బీఎస్సీ, బీటెక్‌, బీఈ, సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, ఐసీఏఐలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. జీతం విషయానికొస్తే.. రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకూ ఉంది. అభ్యర్ధులు దానికోసం ఆన్‌లైన్ టెస్ట్ (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు) రాసి ఆపై  ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక కావాల్సి వుంది. ఆ తరువాత ట్రెయినింగ్‌ వుంటుంది. ఈ పోటీ పరీక్షకు దరఖాస్తు ఫీజు: రూ.800 కాగా, దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి వుంది. దరఖాస్తు చేయడానికి  ప్రారంభతేది  27.08.2022 కాగా చివరి తేదీ 26.09.2022గా ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్ పరీక్ష డిసెంబర్, 2022లో నిర్వహించనున్నారు. దానికి ప్రత్యేకంగా అభ్యర్ధులకు తేదీని ముందుగా సెల్ ఫోన్ లేదా ఈమెయిల్ కి సమాచారం అందజేస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు(ఫేజ్-1): నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలను ప్రభుత్వం కేటాయించింది. మరిన్ని  వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌:https://www.recruitmentfci.in ను అభ్యర్ధులు సందర్శించాల్సి వుంటుంది.