ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC), తిరుపతి జిల్లాలో అప్రెంటిస్ షిప్ కొరకు ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు ఈ నెల 19న సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొరకు ఉదయం 10.00 గంటలకు జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల, ఏ.పి.యస్.ఆర్.టి.సి., కాకుటూరు, నెల్లూరు లో హాజరు కావాలని ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సదవకాశాన్ని అప్రెంటిస్ షిప్ కొరకు ధరఖాస్తు చేసుకొన్న ప్రతి విద్యార్ధి/విద్యార్థినిలు ఉపయోగించుకోవలసినదిగా ప్రభుత్వ ఐ.టి.ఐ తిరుపతి ప్రిన్సిపాల్/కన్వీనర్ వి. శ్రీలక్ష్మి గారు తెలియపరిచారు. మరియు ఏదైనా సమాచారం మరియు వివరాల కొరకు 9949810012, 9154291408, నెంబర్లలో సంప్రదించాలని కోరారు.