90 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్


Ens Balu
19
2022-10-15 08:08:14

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేసింది. రాష్ట్రంలో అత్యున్నత ఉద్యోగాల కోసం నిర్వహించే గ్రూప్-1 నోటిఫికేషన్(Notification) ను ఏపీపీఎస్సీ(APPSC) విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. అక్టోబర్ 13 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని కమిషన్ తెలియజేసింది. నవంబర్ 2 వరకు దరఖాస్తు ప్రక్రియకు అవకాశం కల్పించారు. వీటితోపాటు.. రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇనెస్పెక్టర్ (AMV) ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మర్చి 15, 2023 తర్వాత నిర్వహిస్తారు.

వయోపరిమితి ఈ విధంగా ఉంది..
డిప్యూటీ రిజిస్ట్రార్ - 01,  అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ -01..  ఈ రెండు పోస్టులు బ్యాక్ లాగ్ పోస్టులుగా నోటిఫికేషన్ లో చూపించారు. ఈ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల యొక్క వయో పరిమితి  అనేది 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి 

ప్రభుత్వశాఖల వారీగా పోస్టులు చూసుకుంటే... డిప్యూటీ కలెక్టర్ - 10, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ - 12, డిప్యూటీ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - 13,  డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ - 02, డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ -02, అసిస్టెంట్ ట్రెసరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 08,  రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ - 02, ఎంపీడీఓలు-07,  జిల్లా రిజిస్ట్రార్స్ - 03,  జిల్లా ట్రైబల్ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 01,  జిల్లా బీసీ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 02,  గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్స్ - 06,  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా లే సెక్రటరీ అండ్ గ్రేడ్ 2 ట్రెజరీ -04 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతులు చూసుకుంటే..
అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ పోస్టులకు మాత్రం ఇంజనీరింగ్  ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఒక వేళ అభ్యర్థులకు ఇలాంటి అర్హత లేకుంటే.. బ్యాచిలర్ డిగ్రీని అర్హతగా పరిగణిస్తారు.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: 13.10.2022 కాగా దరఖాస్తుల సమర్పించడానికి ఆఖరి తేదీ: 02.11.2022

Website(వెబ్ సైట్ యూఆర్ ఎల్) : https://psc.ap.gov.in/(S(euqovmxviepccksruekrrmzc))/Default.aspx