గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 3రోజులు ఇంటర్వ్యూలు


Ens Balu
22
Vijayawada
2022-10-18 12:01:08

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శాశ్వత/ కాంట్రాక్టు ప్రాతిపదికన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు చేసి భర్తీచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ ఒక్క పోస్టూ ఖాళీగా ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం వేస్తున్న మరో ముందడుగు పడింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లో 400కు పైగా ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అక్టోబర్ 19, 20, 21వ తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీచేస్తారు. కాగా వైద్యశాఖలో ఇప్పటికే 40,676 పోస్టుల్లో వైద్య సిబ్బంది నియామకం చేపట్టిన ప్రభుత్వం ఇపుడు స్పెషాలిటీ వైద్యులను కూడా భర్తీచేపట్టింది.

         ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లో శాశ్వత, కాంట్రాక్టు ప్రాతిపదికన 400కు పైగా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడలోని హనుమాన్ పేట పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో అక్టోబర్ 19,20,21వ తేదీల్లో వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే పోస్టుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్ కు నెలకు జీతం రూ.1,30,000, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్ కు రూ.1,60,000, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కు రూ 1,60,000 నిర్ణయించడం జరిగింది. శాశ్వత ప్రాతిపదికన నియమించే పోస్ట్ లకు అమల్లో ఉన్న ప్రభుత్వ స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తుందని పేర్కొంది. 

అనుభవం మరియు రిమోట్ ఏరియాను బట్టి అదన ప్రోత్సాహకాలకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆయా పోస్టులకు అర్హులైన వారికి గరిష్ట వయోపరిమితి 70 ఏళ్లుగా నిర్ణయిస్తూ ప్రకటన జారీ చేసింది. పూర్తి వివరాలకు dme.ap.nic.in వెబ్ సైట్ ను సందర్శించాలని పేర్కొంది. సందేహాలకు డీఎంఈ  రిక్రూట్ మెంట్ హెల్ప్ లైన్ 07995055087, ఏపీవీవీపీ రిక్రూట్ మెంట్ హెల్ప్ లైన్ 06301138782 ను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది..