491 వాలంటీర్ పోస్టుల నియాకం..
Ens Balu
2
శ్రీకాకుళం
2021-06-22 15:26:04
శ్రీకాకుళంజిల్లాలో 491 వాలంటీర్ పోస్టుల నియామకానికి చర్యలు చేపట్టినట్లు జిల్లా పంచాయతీ అధికారి వి. రవికుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఈనెల 23వ తేదీ నుండి 27 వ తేదీ వరకు ఎం.పి డి. ఓ కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి 27వ తేదీన దరఖాస్తులు పరిశీలిస్తారని, 28 నుంచి 30వ తేదీ వరకు ఎంపిక కమిటీ మౌఖిక పరీక్షలు (ఇంటర్వ్యూ) నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వాలంటీర్లకు వెంటనే నియామకపు ఉత్తర్వులు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు జూలై ఒకటో తేదీ నుండి తమ విధులు నిర్వహించాలని రవికుమార్ తెలిపారు. గ్రామ పంచాయతీల్లో ఖాళీల వివరాలను సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో తెలుసుకోవచ్చని సూచించారు.