స్టాఫ్ నర్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వనం..


Ens Balu
15
Srikakulam
2021-08-06 16:19:50

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయుటకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసినదిగా జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా. బి. సూర్యారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  శ్రీకాకుళం జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలలో స్టాఫ్ నర్స్ లు-8 పోస్టులు (BC-E-3, BC-C-1, EX(G)-2, PH-VH-1, PH-HI-1 కాంట్రాక్టు పద్దతిపై మరియు యం.యన్.ఓ-BC-C-1 ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఎ.పి.వి.వి.పి. ఆసుపత్రులలో పనిచేయుటకు సంబంధించిన ఇతర వివరాల కొరకు శ్రీకాకుళం జిల్లా వెబ్ సైట్ ను www.srikakulam.nic.in  సందర్శించి పొందుపరచిన విదంగా అభ్యర్థులు వారి వారి దరఖాస్తులను జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి, శ్రీకాకుళం వారి కార్యాలయంలో ఆగష్టు 7వ తేది నుండి ఆగష్టు 12వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు సమర్పించవలసినదిగా ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  ఇతర వివరములకు 08942 – 223308 సంప్రదించవలసినదిగా ఆయన కోరారు.