బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..
Ens Balu
8
Srikakulam
2021-08-12 15:17:41
శ్రీకాకుళం జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2018-19 లో భాగంగా దరఖాస్తు చేసిన అభ్యర్ధుల యొక్క అర్హత మేరకు వివిధ పొస్ట్ ల వారీగా, వివిధ వికలాంగత్వ కేటగిరీ వారీగా మెరిట్ జాబితాలు , అనర్హత జాబితాలు కలక్టరు కార్యాలయం, సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు శాఖ కార్యాలయం, అన్ని మండల తహశీల్దారు కార్యాలయాల నోటిసు బోర్డులలో, శ్రీకాకుళం జిల్లా వెబ్ సైటు “srikakulam.ap.gov.in” లో పొందు పరిచినట్టు ఆ ప్రకటనలో వివరించారు. సదరు జాబితాలపై ఎటువంటి అభ్యంతరాలున్నా.. రేపటి నుంచి ఏడు (7) దినములలో (తే.19.08.2021 ది లోగా) కలక్టరు కార్యాలయములో దరఖాస్తు చేసుకోవలసినదిగా ఆ ప్రకటనలో తెలిపారు..