కాంట్రాక్టు పద్దతిలో స్పెషలిస్టు పోస్టులు..
Ens Balu
3
శ్రీకాకుళం
2021-08-13 18:02:01
జాతీయ ఆరోగ్య మిషన్ ప్రోగ్రాంలో కాంట్రాక్టు పద్దతిలో పోస్టులు భర్తీ చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. కె.సి. చంద్రనాయక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. కమిషనర్, ఆఫ్ హెల్త్ ఎండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్ మరియు జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం వారి ఆదేశాల మేరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, శ్రీకాకుళం పరిధిలో నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాంలో స్పెషలిస్టు ఎం.డి(జనరల్ మెడిసిస్)-03, ఆఫీసర్ స్పెషలిస్టు మెడికల్ (ఒ.బి.జి)-01, కార్డియలజిస్ట్-01, సైకాలజిస్ట్-01, ఒ.టి. టెక్నీషియస్-03, మరియు సైకాలజిస్ట్-01 పోస్టులకు సంబంధించి ధరఖాస్తులు కోరుతున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఒక సంవత్సర కాలం పాటు కాంట్రాక్టు పద్దతిలో, రోస్టర్ ప్రాతిపదికపై నియామకం జరుగుతుందని పేర్కొన్నారు. ఇతర వివరములకు www.srikakulam.ap.gov.in వెబ్ సైట్ లో లబించునని, దరఖాస్తు చేయుటకు ఈ నెల 20వ తేదితో ఆఖరు అని ఆ ప్రకటనలో తెలిపారు.