విజయనగరం జిల్లాలో మత్స్యకార కుటుంబాలకు సాగర మిత్రాలు విశేషంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ సూచించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సాగర మిత్రాలుగా ఎంపికైన 14 మందికి మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్. నిర్మలకుమారి తో కలిసి నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మత్స్యకారులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను వారికి తెలియజేయడంతోపాటు, శాఖపరమైన సమస్యల పరిష్కారంలోనూ సాగరమిత్రాలు కీలకంగా వ్యవహరించాలన్నారు. మత్స్యాకారులకు సేవలందించేందుకు శక్తివంచన లేకుండా కష్టపడాలన్నారు. డిప్యూటీ డైరెక్టర్ నిర్మలకుమారి మాట్లాడుతూ, జిల్లాకు ప్రభుత్వం 16 పోస్టులు కేటాయించిందన్నారు. ఇంటర్వ్యూలలో కేవలం 14 మంది మాత్రమే ఎంపికయ్యారని చెప్పారు. మిగిలిన రెండు సాగర మిత్రాలను జిల్లాకలెక్టర్ ఆదేశాల మేరకు తరువాత భర్తీచేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఫన్నీ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రంపచోడవరం పీఓ ప్రవీణ్ ఆదిత్య తెలియజేశారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 2018-19 సంవత్సరంలో బీటెక్ ఈ సి ఈ త్రిబుల్ ఈ మెకానికల్ కోర్సుల్లో 60 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులకు జీతం నెలకు 14000 మరియు ఉచిత భోజనం ఉచిత రవాణా బెనిఫిట్స్ తో పాటు సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. శిక్షణా కార్యక్రమం లో నమోదు కొరకు ఆఖరి తేదీ అక్టోబర్ 30 శిక్షణ కాలం 15 రోజులు ఉంటుందన్నారు. అలాగే ఇసుజి కంపెనీలో 2018 19 సంవత్సరంలో డిప్లమా మెకానికల్ ఎం ఏ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ కెమికల్ మెట్రో మిక్స్ పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అర్హు లు జీతం నెలకు 14 వేల వరకు ఉంటుందన్నారు. నమోదు కొరకు ఆఖరి తేదీ అక్టోబర్ 30 నుంచి పదిహేను రోజులు ఉంటుందన్నారు. అదేవిధంగా అపర్ణ ఎంటర్ప్రైజెస్ సామర్లకోట వారు ఐటిఐ ఫిట్టర్ 2016 19 మధ్యకాలంలో పూర్తి చేసిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారని ఇందులో జీతం నెలకు 9200 రూపాయలు వుంటుదన్నారు. ఆశక్తిగల నమోదు కొరకు ఆఖరి తేదీ నవంబర్ 2 శిక్షణ 15 రోజుల పాటు ఉంటుందని చెప్పారు. మరిన్ని వివరాల కొరకు 8 24 7 7 8 8 24 7 నెంబర్లో సంప్రదించాలని ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు.