1 ENS Live Breaking News

గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం 3రోజులు ఇంటర్వ్యూలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శాశ్వత/ కాంట్రాక్టు ప్రాతిపదికన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు చేసి భర్తీచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏ ఒక్క పోస్టూ ఖాళీగా ఉండకూడదన్న లక్ష్యంతో ప్రభుత్వం వేస్తున్న మరో ముందడుగు పడింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లో 400కు పైగా ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అక్టోబర్ 19, 20, 21వ తేదీల్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీచేస్తారు. కాగా వైద్యశాఖలో ఇప్పటికే 40,676 పోస్టుల్లో వైద్య సిబ్బంది నియామకం చేపట్టిన ప్రభుత్వం ఇపుడు స్పెషాలిటీ వైద్యులను కూడా భర్తీచేపట్టింది.

         ప్రభుత్వం డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ లో శాశ్వత, కాంట్రాక్టు ప్రాతిపదికన 400కు పైగా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల నియామకానికి వాక్-ఇన్ ఇంటర్వ్యూలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడలోని హనుమాన్ పేట పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో అక్టోబర్ 19,20,21వ తేదీల్లో వైద్య సిబ్బంది పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే పోస్టుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్ కు నెలకు జీతం రూ.1,30,000, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్ కు రూ.1,60,000, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కు రూ 1,60,000 నిర్ణయించడం జరిగింది. శాశ్వత ప్రాతిపదికన నియమించే పోస్ట్ లకు అమల్లో ఉన్న ప్రభుత్వ స్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తుందని పేర్కొంది. 

అనుభవం మరియు రిమోట్ ఏరియాను బట్టి అదన ప్రోత్సాహకాలకు అవకాశం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆయా పోస్టులకు అర్హులైన వారికి గరిష్ట వయోపరిమితి 70 ఏళ్లుగా నిర్ణయిస్తూ ప్రకటన జారీ చేసింది. పూర్తి వివరాలకు dme.ap.nic.in వెబ్ సైట్ ను సందర్శించాలని పేర్కొంది. సందేహాలకు డీఎంఈ  రిక్రూట్ మెంట్ హెల్ప్ లైన్ 07995055087, ఏపీవీవీపీ రిక్రూట్ మెంట్ హెల్ప్ లైన్ 06301138782 ను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొంది..

Vijayawada

2022-10-18 12:01:08

90 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేసింది. రాష్ట్రంలో అత్యున్నత ఉద్యోగాల కోసం నిర్వహించే గ్రూప్-1 నోటిఫికేషన్(Notification) ను ఏపీపీఎస్సీ(APPSC) విడుదల చేసింది.  ఈ నోటిఫికేషన్ ద్వారా 92 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. అక్టోబర్ 13 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని కమిషన్ తెలియజేసింది. నవంబర్ 2 వరకు దరఖాస్తు ప్రక్రియకు అవకాశం కల్పించారు. వీటితోపాటు.. రవాణా శాఖలో 17 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇనెస్పెక్టర్ (AMV) ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022న నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మర్చి 15, 2023 తర్వాత నిర్వహిస్తారు.

వయోపరిమితి ఈ విధంగా ఉంది..
డిప్యూటీ రిజిస్ట్రార్ - 01,  అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ -01..  ఈ రెండు పోస్టులు బ్యాక్ లాగ్ పోస్టులుగా నోటిఫికేషన్ లో చూపించారు. ఈ రెండు పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల యొక్క వయో పరిమితి  అనేది 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి 

ప్రభుత్వశాఖల వారీగా పోస్టులు చూసుకుంటే... డిప్యూటీ కలెక్టర్ - 10, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ - 12, డిప్యూటీ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - 13,  డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ - 02, డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ -02, అసిస్టెంట్ ట్రెసరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 08,  రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ - 02, ఎంపీడీఓలు-07,  జిల్లా రిజిస్ట్రార్స్ - 03,  జిల్లా ట్రైబల్ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 01,  జిల్లా బీసీ వెల్ ఫేర్ ఆఫీసర్స్ - 02,  గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్స్ - 06,  అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా లే సెక్రటరీ అండ్ గ్రేడ్ 2 ట్రెజరీ -04 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హతులు చూసుకుంటే..
అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ పోస్టులకు మాత్రం ఇంజనీరింగ్  ఫైర్ అండ్ సేఫ్టీ విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఒక వేళ అభ్యర్థులకు ఇలాంటి అర్హత లేకుంటే.. బ్యాచిలర్ డిగ్రీని అర్హతగా పరిగణిస్తారు.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: 13.10.2022 కాగా దరఖాస్తుల సమర్పించడానికి ఆఖరి తేదీ: 02.11.2022

Website(వెబ్ సైట్ యూఆర్ ఎల్) : https://psc.ap.gov.in/(S(euqovmxviepccksruekrrmzc))/Default.aspx

2022-10-15 08:08:14

జాబ్ మేళా ను యువత వినియోగించుకోవాలి

విద్యావంతులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జాబ్ మేళా లను యువత వినియోగించుకొని మంచి కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలని జిల్లా కలెక్టర్ ఏ శ్రీమతి సూర్యకుమారి కోరారు. విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ జాబ్ మేళా శుక్రవారం స్థానిక కస్పా మునిసిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న నేపధ్యంలో దీనికి సంబంధించిన పోస్టర్ ను జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. రిలయన్స్, ఫ్లిప్ కార్ట్, వరుణ్ మోటార్స్, జయభేరి ఆటోమోటివ్, అరబిందో ఫార్మా, హెటేరో లాబ్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ఆదిత్య బిర్లా ఇన్సూరెన్స్, అపోలో ఫార్మసీ, డిక్సన్ టెక్నాలజీస్ వంటి 22 సంస్థలు ఇందులో పాల్గొంటున్నాయనీ నియోజక వర్గంలోనీ యువత వినియోగించుకొని ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు.

 పదో తరగతి నుంచి పి.జి. వరకు విద్యార్హతలు గల యువత ఈ జాబ్ మేలాలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివద్ధి అధికారి గోవింద రావు, జిల్లా ఉపాధి కల్పన అధికారి అరుణ కుమారి, సి డాప్ అధికారి మార్టిన్ తదితరులు పాల్గొన్నారు.

2022-10-13 15:27:58

19న ఆర్టీసీ అప్రెంటిస్ కు సర్టిఫికేట్ల పరిశీలన

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC), తిరుపతి జిల్లాలో అప్రెంటిస్ షిప్ కొరకు ధరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులు ఈ నెల 19న సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొరకు ఉదయం 10.00 గంటలకు జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాల, ఏ.పి.యస్.ఆర్.టి.సి., కాకుటూరు, నెల్లూరు లో హాజరు కావాలని ఆర్టీసీ అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు.  ఈ సదవకాశాన్ని అప్రెంటిస్ షిప్ కొరకు ధరఖాస్తు చేసుకొన్న ప్రతి విద్యార్ధి/విద్యార్థినిలు ఉపయోగించుకోవలసినదిగా ప్రభుత్వ ఐ.టి.ఐ తిరుపతి ప్రిన్సిపాల్/కన్వీనర్ వి. శ్రీలక్ష్మి గారు తెలియపరిచారు. మరియు ఏదైనా సమాచారం మరియు వివరాల కొరకు 9949810012, 9154291408, నెంబర్లలో సంప్రదించాలని కోరారు.

2022-10-13 09:12:06

FCI లో 113 ఉద్యోగాలకు నోటిఫికేషన్

భారత ప్రభుత్వ సంస్థ Food Corporation of India(FCI) ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎఫ్‌సీఐ డిపోలు, కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం మేనేజ్‌మెంట్ ట్రైనీ, మేనేజర్ ఖాళీలు సంఖ్య 113 కాగా, జనరల్, డిపో, మూవ్‌మెంట్, అకౌంట్స్, టెక్నికల్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్, హిందీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నట్టుగా ప్రకటనలో పేర్కొన్నారు. ఇక జోన్ వారీగా ఖాళీల వివరాలు తెలుసుకుంటే.. 
నార్త్ జోన్- 38 పోస్టులు, సౌత్ జోన్-16, వెస్ట్ జోన్- 20, ఈస్ట్ జోన్-21, నార్త్-ఈస్ట్ జోన్లో 18 పోస్టులు ఉన్నాయి. 

ఈ పోస్టులన్నింటికీ అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్, బీకాం, బీఎస్సీ, బీటెక్‌, బీఈ, సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా, ఐసీఏఐలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. జీతం విషయానికొస్తే.. రూ.40,000 నుంచి రూ.1,40,000 వరకూ ఉంది. అభ్యర్ధులు దానికోసం ఆన్‌లైన్ టెస్ట్ (ఫేజ్-1, ఫేజ్-2 పరీక్షలు) రాసి ఆపై  ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక కావాల్సి వుంది. ఆ తరువాత ట్రెయినింగ్‌ వుంటుంది. ఈ పోటీ పరీక్షకు దరఖాస్తు ఫీజు: రూ.800 కాగా, దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి వుంది. దరఖాస్తు చేయడానికి  ప్రారంభతేది  27.08.2022 కాగా చివరి తేదీ 26.09.2022గా ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్ పరీక్ష డిసెంబర్, 2022లో నిర్వహించనున్నారు. దానికి ప్రత్యేకంగా అభ్యర్ధులకు తేదీని ముందుగా సెల్ ఫోన్ లేదా ఈమెయిల్ కి సమాచారం అందజేస్తారు.

ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు(ఫేజ్-1): నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలను ప్రభుత్వం కేటాయించింది. మరిన్ని  వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌:https://www.recruitmentfci.in ను అభ్యర్ధులు సందర్శించాల్సి వుంటుంది.

New Delhi

2022-09-07 15:28:57

ఇంటర్ తో స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2022 ప్రకటనను విడుదల చేసింది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లోని విభాగాల్లో స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేస్తారు.  ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్నఅభ్యర్ధులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్‌లైన్ https://ssc.nic.in ద్వారా దరఖాస్తు చేయాలి. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారికి టైపింగ్, స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి.  ఉద్యోగాలను రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా భర్తీచేస్తారు. ఇక  వయోపరిమితి విషయానికొస్తే.. 01.01.2022 నాటికి (గ్రేడ్-సి) పోస్టులకు 18 - 30 సంవత్సరాలు ఉండాలి. స్టెనోగ్రాఫర్ (గ్రేడ్-డి) పోస్టులకు 18-27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తింప జేస్తారు. ఎస్సీ, ఎస్టీల అభ్యర్ధులకు 5 సంవవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10-15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిఫెన్స్ పర్సనల్ అభ్యర్థులకు 3 సంత్సరాలు, డిఫెన్స్ (డిసెబుల్డ్) పర్సనల్ అభ్యర్థులకు 3 సంత్సరాల సడలింపు వర్తిస్తుంది.

అంతేకాకుండా ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అభ్యర్ధులకు 40 సంవత్సరాల వరకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (ఎస్సీ, ఎస్టీ) 45 సంవత్సరాల వరకు వయోసడలింపు ఇచ్చారు.  కాగా వితంతు-విడాకులు-ఒంటరి మహిళలకు 35 సంవత్సరాల వరకు, ఎస్సీ, ఎస్టీలకు 40 సంవత్సరాల వరకు వయోపరిమితి వర్తించుందని ఉద్యోగ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక  దరఖాస్తు ఫీజు: రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.. ఆన్‌లైన్ (యూపీఐ, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డు) లేదా SBI చలానా ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చునని పేర్కొన్నారు. దరఖాస్తులను  ఆన్‌లైన్‌ ద్వారా చేయాల్సి వుంది. ఆన్‌లైన్ రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేపడతారు.

పరీక్ష జరిగే విధానమిదే..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫర్ ఎగ్జామినేషన్ - 2022 ఉద్యోగాలకు సంబంధించి పెట్టే రాత పరీక్షలో మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 200 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు వుంటుంది. పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ 100 ప్రశ్నలు-100 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలలో పూర్తి చేయాల్సి వుంటుంది. అదేవిధంగా పరీక్షలో నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున మార్కుల్లో కోత విధిస్తారు. దీనిని అభ్యర్ధులు జాగ్రత్తగా చూసుకొని పరీక్షా రాయాల్సి వుంటుంది.

సదరన్ రీజియన్‌లో పరీక్ష కేంద్రాలివే..
స్టెనో గ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించి  గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, చెన్నై, కోయంబత్తూరు, మధురై, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, పుదుచ్చేరి, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు ఇచ్చారు. అభ్యర్ధుల అవకాశాన్ని బట్టి ఆయా ప్రదేశాల్లో పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసుకోవచ్చు..

Visakhapatnam

2022-09-02 08:18:00

అంగ‌న్‌వాడీల్లో100 ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో వ‌ర్క‌ర్లు, హెల్ప‌ర్ ఖాళీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్లు జిల్లా మ‌హిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారిణి బి.శాంత‌కుమారి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 10 అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లు, 88 హెల్ప‌ర్ పోస్టుల ఖాళీలు వున్నాయ‌ని, మినీ అంగ‌న్‌వాడీల్లో రెండు వ‌ర్క‌ర్ల పోస్టులు ఖాళీగా వున్నాయ‌ని పేర్కొన్నారు.  జిల్లాలో వ‌ర్క‌ర్లు, హెల్ప‌ర్ పోస్టులు వంద ఖాళీలు వున్న‌ట్టు వెల్ల‌డించారు. వంగ‌ర‌లో 3, రాజాం, భోగాపురంలో 2 చొప్పున‌, విజ‌య‌న‌గ‌రం, గంట్యాడ‌, చీపురుప‌ల్లిలో ఒక్కొక్క‌టి చొప్పున అంగ‌న్ వాడీ వ‌ర్క‌ర్ ఖాళీలు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్టు తెలిపారు. హెల్ప‌ర్ పోస్టులు బాడంగిలో 5, బొబ్బిలిలో 1, బొబ్బిలి 1, చీపురుప‌ల్లి 10, ఎస్‌.కోట 2, వియ్యంపేట 4, గ‌జ‌ప‌తిన‌గ‌రం 10, బొబ్బిలి రూర‌ల్ 3, గంట్యాడ 15, భోగాపురం 2, నెల్లిమ‌ర్ల 5, విజ‌య‌న‌గ‌రం అర్బ‌న్ 15, రాజాం 6, వంగ‌ర 7, రామ‌భ‌ద్ర‌పురం 3 ఖాళీల‌ను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ ఇచ్చామ‌న్నారు. అర్హులైన ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్ధులు సెప్టెంబ‌రు 7వ తేదీలోగా త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను సంబంధిత ప్రాజెక్టు అధికారిణి, మ‌హిళా శిశు సంక్షేమ సంస్థ వారికి అంద‌జేయాల‌ని కోరారు. ద‌ర‌ఖాస్తుతోపాటు అభ్య‌ర్ధులు త‌మ కుల‌, ఆదాయ నివాస త‌దిత‌ర ధృవ‌ప‌త్రాల న‌క‌ళ్ల‌ను గెజిటెడ్ అధికారితో సంత‌కం చేయించి అంద‌జేయాల‌న్నారు.

Vizianagaram

2022-08-30 10:12:37

ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సీకి లైన్ క్లియర్..

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్..రాష్ట్రంలో మెగా డిఎస్సీ ద్వారా భారీ సంఖ్య లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీచేసేందుకు ప్రభుత్వం లైన్ క్లియర్ చేస్తోంది. దీనితో చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న టీచర్ ఉద్యోగాల భర్తీ పెద్ద సంఖ్యలో జరగనున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ఒక్కసారి కూడా డిఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయలేదు. ఇటీవల 1998 డిఎస్సీ అభ్యర్ధులకు తీపి కబురు చెప్పిన ప్రభుత్వం మరిన్ని ఖాళీ ఉద్యోగాలను కూడా మెగా డిఎస్సీ ద్వారా భర్తీచేయాలని యోచిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టిన ప్రభుత్వం దానికి అనుగుణంగానే ఇంగ్లీషు మీడియం టీచర్లతోపాటు, భాషా పండితులను కూడా భర్తీచేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు చేసిన 13 కొత్త జిల్లాల్లో విద్యాశాఖ అధికారులను నియమించిన రాష్ట్రప్రభుత్వం పాఠశాల విద్యపైనా, ఖాళీల భర్తీపైనా, మౌళిక వసతులపైనా ద్రుష్టిసారించింది.

పదివేల మందికి పైగా పదోన్నతులు
రాష్ట్రంలోని 10వేల మందికి పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా ఏర్పడే ఖాళీలను తొలుత 98 డిఎస్సీ అభ్యర్ధుల ద్వారా ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆతరువాత ఎన్ని ఖాళీలు మిగిలాయో చూసుకొని..జిల్లాల వారీగా పాఠశాలల సమాచారంతోపాటు, ఉపాధ్యాయుల ఖాళీలను కూడా గుర్తించి ఒకేసారి మెగా డిఎస్సీ ప్రకటించాలనేది ప్రభుత్వ ఆలోచన. దీనికి తగ్గట్టుగానే సెస్టెంబరు నెలాఖరునాటికి పదోన్నతుల ప్రక్రియ, 98 డిఎస్సీ ఉపాధ్యాయుల భర్తీపూర్తిచేయాలని అధికారులను విద్యాశాఖ ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ 98 డిఎస్సీ అభ్యర్ధుల నుంచి అంగీకార పత్రాలను కూడా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా ప్రభుత్వం స్వకరించింది కూడా. వీరి భర్తీ, పదోతన్నతుల ప్రక్రియ పూర్తయిన రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో ఒక లెక్క వస్తుందని అధికారులు కూడా వెయిట్ చేస్తున్నారు. దానికితోడు చాలా మంది ఉపాధ్యాయుల పదవీ విరమణలు కూడా ఉండటంతో ఈ సారి డిఎస్సీలో చాలా ఎక్కు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంగ్లీషు మీడియం అభ్యర్ధులకే పెద్దపీట..
రాష్ట్రంలోని ఇంగ్లీషు మీడియం విద్యను ప్రవేశపెట్టిన తరువాత ప్రభుత్వపాఠశాలల్లోని ఉపాధ్యాయులందరికీ ఇంగ్లీషు బోధనపై శిక్షణలు ఇస్తోంది ప్రభుత్వం. అలా కాకుండా ఈ సారి తీయబోయే డిఎస్సీ ద్వారా ఇంగ్లీషు మీడియం అభ్యర్ధులను ఎంపిక చేయడం ద్వారా వారితో నేరుగా విద్యార్ధులకు ఇంగ్లీషు మీడియం విద్యను బోధింప చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్సీ సిలబస్ ప్రవేశపెట్టిన ద్రుష్ట్ట్యా ఆ పాఠ్యాంశాలు చెప్పే ఇంగ్లీషుమీడియం సబ్జెక్టు అభ్యర్దులను నియమించడం ద్వారా ప్రభుత్వానికి ప్రత్యేకంగా మరోసారి ఇంగ్లీషు మాద్యమ విద్యపై ఎంపికైన ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే అవసరం ఉండదనేది ప్రభుత్వ ఆలోచన. అయితే డిఎస్సీ కోసం చాలా మంది అభ్యర్ధులు చాలా సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నందున ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషు మీడియం రెండిటికీ కలిపి నోటిఫికేషన్ ఇస్తుందా..లేదంటే ఇంగ్లీషు మీడియం అభ్యర్ధులకే నోటిఫికేషన్ ఇస్తుందా అనేది ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది.

2024నాటికి భారీ సంఖ్యలో విద్యాశాఖలో ఖాళీలు
2024నాటికి విద్యాశాఖలో ఉపాధ్యాయులతో పాటు మినిస్టీరియల్ స్టాఫ్ లాంటి ఖాళీలు కూడా భారీగా ఏర్పడనున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రెండేళ్లు ఉద్యోగ విరమణ వయస్సు పెంచడంతో చాలా మంది ఉద్యోగ విరమణ పొందాల్సిన ఉపాధ్యాయులు, సిబ్బందికి రెండేళ్లు అదనంగా పనిచేసే అవకాశం వచ్చింది. లేదంటే ఇప్పటికే చాలా ఖాళీలు ఏర్పడేవి. ప్రభుత్వం కూడా డిఎస్సీ ప్రకటించే ముందు ఎంతమంది రిటైర్ అవుతున్నారు..ఎన్ని పోస్టులతో డిఎస్సీ ప్రకటించాలి..ఎంతమందికి పదోన్నతులు కల్పించాలి అనే అంశాలను బేరీజు వేసుకొని ముందుగా పదోన్నతుల లైన్ క్లియర్ చేసింది. పదోన్నతుల ప్రక్రియ పూర్తయితే ప్రస్తుతం ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుస్తుంది. ఆతరువాత 2024 నాటికి ఇంకెన్ని ఖాళీలు ఉపాద్యాయుల ఉద్యోగ విరమణ ద్వారా క్లియర్ అవుతాయో తెలుస్తుంది. ఈ రెండిటి సంఖ్యలో నుంచి ఒక భారీ సంఖ్యను ఎంచుకొని దానికి తగ్గట్టుగా డిఎస్సీ తీయాలని ప్రభుత్వ నిర్ణయమని చెబుతున్నారు. అయితే  ఈ డిఎస్సీ ఎన్నికలకు ముందు ప్రకటిస్తారా.. 2023లో ప్రకటించి 2024 ఎన్నికల తరువాత భర్తీ చేస్తారా అనేవిషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. చూడాలి ఎన్నో ఆశలతో డిఎస్సీ కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్న అభ్యర్ధుల కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేస్తుందనేది..!

Guntur

2022-08-30 04:49:32

35 అంగన్వాడీ పోస్టుల భర్తీకి చర్యలు

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్ లో గల 11 మండలాలకు గాను 10 మండలాల పరిధిలో ఖాళీగా ఉన్న 27 అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.  అదేవిధంగా రంపచోడవరం డివిజన్ పరిధిలోని 11 మండలాలకు గాను ఐదు మండలాల ఫరిది లో ఉన్న ఎనిమిది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టుల భర్తీకి కూడా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వెల్లడించారు. అర్హత కలిగిన మహిళ అభ్యర్థులు 2022 ఆగస్టు నెల 29వ తేదీ నుండి సెప్టెంబరు నెల 12 వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోగా సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారికి నేరుగా గాని పోస్ట్ ద్వారా గాని దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ కార్యకర్త, ఆయా, మినీ కార్యకర్తల పోస్టులకు దరఖాస్తు చేయదలచిన మహిళలు తప్పనిసరిగా పదోతరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని, ప్రధానంగా స్థానికంగా నివాసం కలిగి ఉండాలని వివాహిత స్త్రీ అయి ఉండాలని కలెక్టర్ సూచించారు.   2022 జూలై 1 నాటికి అభ్యర్థులు 21 సంవత్సరములు పూర్తి చేసి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని తెలిపారు.  21 సంవత్సరాల లోపు అభ్యర్థులు లభించని పక్షంలో 18 సంవత్సరాలు పూర్తయిన వారి దరఖాస్తులు పరిశీలించ బడతాయని అయితే కేవలం ఎస్సి, ఎస్టి అభ్యర్థులకు కేటాయించిన కేంద్రాలకే వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు.  

ఎంపికలో పదవ తరగతి ఉత్తీర్ణత 50 మార్కులు, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులకు ఐదు మార్కులు, వితంతువులకు ఐదు మార్కులు, మైనర్ పిల్లలు కలిగి ఉన్న వితంతువులకు ఐదు మార్కులు,  పూర్తి అనాధ, క్రెచ్, హోమ్, ప్రభుత్వ సంస్థలలో నివశించు సత్ప్రవర్తన సర్టిఫికెట్ కలిగిన వారికి 10 మార్కులు, అర్హత కలిగిన వికలాంగ వ్యక్తులకు ఐదు మార్కులు మౌఖిక పరీక్షకు  20 మార్కులు మొత్తం 100 మార్కులకు లెక్కించబడుతుంది అని తెలిపారు. మార్కుల ఆధారంగా పూర్తి పారదర్శకతతో నియామకాలు జరుగుతాయని ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు  మధ్యవర్తులను, దళారులను నమ్మి మోసపోవద్దని, వారి అర్హతలను, మార్కులను పరిశీలించి ఎంపిక చేయటం  జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

Paderu

2022-08-28 14:38:03

నిరుద్యోగులకు APPSC శుభవార్త..!

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఆగస్టు 2వ వారం లేదా 3వ వారంలో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈమేరకు ఏపీపీఎస్సీ చైర్మన్  గౌతమ్ సవాంగ్ ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించిన ఏర్పాటు చేస్తున్నారు.  ఆగస్టు నెలలో 110 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్‌, 182 గ్రూప్-2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. వీటితో పాటు మరో  13 జాబ్ నోటిఫికేషన్లను కూడా విడుదల చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఫలితంగా మరో 2000 ఉద్యోగాలను  భర్తీకానున్నాయి. ప్రభుత్వం జాబ్ కేలండర్ ప్రకటించడానికి వీలుగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలలను గుర్తించే పనిలో పడింది ఏపీపీఎస్సీ. ఉద్యోగాలు, ప్రభుత్వశాఖల జాబితా ఆధారంగా నోటిఫికేషన్లు వెలువడే అశకాశాలున్నాయి.. దీనితో ఎప్పటి నుంచో గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగ ప్రకటనల కోసం చూస్తున్నవారికి ఏపీపీఎస్సీ ముందుగానే పండుగను తీసుకువచ్చింది. అంతేకాకుండా ప్రకటన విడుదల, ఆపై పరీక్ష, ఉద్యోగాల భర్తీ కూడా వెంట వెంటనే చేయడం ద్వారా తరువాత నోటిఫికేషన్లకు లైన్ క్లియర్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది.

కొత్త జిల్లాల్లో అధికారులు, సిబ్బంది కొరత..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాలను 26జిల్లాలుగా మార్చిన తరువాత జిల్లాశాఖల అధికారులు, సిబ్బంది కొరత చాలా తీవ్రంగా ఏర్పడింది. దీనితో చాలా చోట్ల ఇన్చార్జిలుగా డివిజనల్ కేడర్ అధికారులను డిస్ట్రిక్ట్ క్యాడర్ అధికారులుగా కొత్త జిల్లాలకు బదిలీ చేసి పరిపాలన కొనసాగిస్తున్నది ప్రభుత్వం. త్వరలో భర్తీచేయబోయే గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల ద్వారా ఖాళీలు ఉన్న కొత్త జిల్లాల్లో జిల్లా అధికారులుగా గ్రూప్-1 అధికారులను, డివిజనల్ స్థాయిలో గ్రూప్-2 అధికారులను నియమించాలని యోచిస్తున్నది. దానికి అనుగుణంగా ప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల జాబితాను సిద్దం చేస్తున్నది. కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయిలో జిల్లా అధికారులు, డివిజనల్ అధికారులు, కార్యాలయాల్లోని జూనియర్ అసిస్టెంట్లను భర్తీ చేయడం ద్వారా ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని చూస్తున్నది ప్రభుత్వం. 

కొన్ని ఉద్యోగాలను ప్రమోషన్ ద్వారా భర్తీ..
ప్రస్తుతం డివిజనల్ అధికారులుగా ఉన్న చాలా మంది అధికారులను పదోన్నతులు కల్పించి జిల్లా అధికారులుగా భర్తీచేసిన తరువాత మిగులు ఉద్యోగాలను గ్రూప్-1 లో ఉద్యోగాలు సాధించిన వారిని నియమించడం ద్వారా పరిపాలన సక్రమంగా సాగుతుందనేది ప్రభుత్వ ఆలోచన. గ్రామ,వార్డుసచివాలయాల్లో ఏ విధంగా అయితే అన్ని శాఖల సిబ్బందిని నియమించిందో..అదేవిధంగా జిల్లా శాఖల్లో కూడా అధికారులను, సిబ్బందిని నియమించడం ద్వారా నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల భర్తీ హామీ పూర్తిచేసినట్టు అవుతుందని చెబుతున్నారు. అలా చేయడం ద్వారా చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా వుంటుంది.

వయస్సుపై మరో కీలక నిర్ణయం
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారిలో చాలా మందికి వయస్సు మీదన పడుతుంది. అయినా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎక్కడో చిన్న ఆశ. అలాంటి వారికోసం ప్రభుత్వం వయస్సు విషయంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా వయస్సు మీద పడిన వారికి కూడా ఉద్యోగ అవవకాశాలు వచ్చే అవకాశం వుంటుంది. అయితే ఇప్పటికే ఈ విషయమై పలు నిరుద్యోగ సంఘాలు ఏపీపీపీఎస్సీకి, ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించారు. దీనితో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారి విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నవారంతా ఇక పూర్తిస్థాయి ప్రిపరేషన్ లో పడిపోతే కొత్తగా తీయబోయే ఉద్యోగాలను మీ సొంతం చేసుకోవచ్చు.

Guntur

2022-08-02 10:09:28

Visakhapatnam

2022-07-13 07:04:21

14 నుంచి విశాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

అగ్ని వీర్ క్రింద ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ (పురుషులు) విశాఖపట్నంలో ఆగస్టు 14 నుండి 31 వరకు జరుగుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joinindianarmy.nic.in వెబ్ సైట్ లో ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించాలని చెప్పారు.  విశాఖపట్నంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొంటకు ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా జూలై 30వ తేదీ లోగా నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. అగ్ని వీర్ జనరల్ డ్యూటీ,  అగ్ని వీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, అగ్ని వీరు స్టోర్ కీపర్ టెక్నికల్ పోస్టులకు  పదవ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలని చెప్పారు. అగ్ని వీర్ ట్రేడ్స్ మెన్ పోస్టులకు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు విశాఖపట్నం ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. 

ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పార్వతీపురం మన్యం జిల్లాతోపాటు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్.టి.ఆర్, యానాం జిల్లాల అభ్యర్థులు పాల్గొన వచ్చని చెప్పారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆగస్టు 7వ తేదీ తరువాత అడ్మిట్ కార్డు జారీ చేయటం జరుగుతుందని, వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అగ్ని పథ్ పథకం క్రింద దరఖాస్తు చేసుకుని ఎంపికైన వారు నాలుగు సంవత్సరాలకు నియామకం పొందుతారని, ఎటువంటి పింఛను, గ్రాట్యుటీ సౌకర్యాలు ఉండవని నోటిఫికేషన్ లో పేర్కొనడం జరిగిందని చెప్పారు. ప్రతి బ్యాచ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 శాతం మంది అభ్యర్థులను రెగ్యులర్ నియామకంలో తీసుకునే అవకాశం కల్పించిందని అన్నారు. నియామకం పొందిన అభ్యర్థులకు మొదటి సంవత్సరం రూ.30 వేలు, రెండవ సంవత్సరం రూ.33 వేలు, మూడవ సంవత్సరం రూ.36,500, నాలుగవ సంవత్సరం రూ.40 వేలుతో పాటు అర్హత మేరకు ఇతర అలవెన్స్ లు లభిస్తాయని చెప్పారు. నాలుగు సంవత్సరాల అనంతరం సేవా నిధి క్రింద రూ.10.04 లక్షలతో పాటు దానిపై వడ్డీ కలిపి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జీవిత బీమా రూ.48 లక్షల వరకు ఉంటుందని ఆయన చెప్పారు. ఆగ్నివీర్ లకు నాలుగు సంవత్సరాల అనంతరం నైపుణ్య ధృవీకరణ పత్రం, 12వ తరగతితో సమానమైన సర్టిఫికెట్ ను అందజేయటం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. 

ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ధృవ పత్రాల పరిశీలన, ఫిజికల్ ఫిటనెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటాయని, అభ్యర్థులు వారికి తెలియజేసిన తేదీల్లో ఉదయం 3 గంటల నాటికి ర్యాలీ ప్రదేశానికి హాజరు కావాలని ఆయన చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు అగ్నివీర్ కు విశాఖ ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం విడుదల చేసిన విపులమైన నోటిఫికేషన్ ను చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.

పార్వీపురం

2022-07-12 13:04:36

విమ్స్ లో వైద్యుల భర్తీకి నోటిఫికేషన్

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సూచనలతో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో 32 వైద్యుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ డాక్టర్ కె రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు.  సూపర్ స్పెషాలిటీ విభాగలు  న్యూరో సర్జరీ -03, న్యూరాలజీ -02, పల్మనాలజీ 02, ఆర్థోపెడిక్స్-02 , జనరల్ మెడిసిన్-04, ప్లాస్టిక్ సర్జరీ-02, సర్జికల్ గ్యాస్ట్రాలజీ-01, మెడికల్ గ్యాస్ట్రాలజీ-02, సర్జికల్ ఆంకాలజీ-02, మెడికల్ ఆంకాలజీ-02, ఎండోక్రినాలజీ-02 కార్డియాలజీ-03, అనస్తీసియా-03, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ మెడికల్-02  విభాగాలలో పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ 32 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పోస్టులు భర్తీ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు కి సంబంధం లేకుండా అన్ని పోస్టులు ఓపెన్ కేటగిరీలో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల నుంచి ఈ నెల 30 వ తేదీ వరకు విమ్స్ ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొన్నారు.  దరఖాస్తులను పరిశీలించి జూలై 2వ తేదీ న మెరిట్ లిస్టు, 3వ తేదీన ఫిర్యాదుల స్వీకరణ, 4వ తేదీన ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు.మరిన్ని వివరాల కోసం www.vimsvskp.com వెబ్ సైట్ నందు సందర్శించాలని కోరారు.

Visakhapatnam

2022-06-27 14:29:55

30న విజయనగరం జిల్లాలో జాబ్ బేళా

విజయనగరం జిల్లాలో నిరుద్యోగ యువత కోసం ఈనెల 30న  జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి అధికారి డి.అరుణ తెలిపారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి ఎస్.పి. బంగ్లా సమీపంలోని చైతన్య డిగ్రీ కళాశాల లో జరుగుతుందని పేర్కొన్నారు. బిగ్ బాస్కెట్ సంస్థ, విశాఖలో ఉద్యోగ అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. వాన్ డెలివరీ ఎక్జిక్యూటివ్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని, అభ్యర్థుల వయస్సు 18-38 సంవత్సరాల మధ్య వుండాలని పేర్కొన్నారు. రూ.12 వేల జీతంతో పాటు, పి. ఎఫ్., ఈ.ఎస్.ఐ. వంటి ప్రయోజనాలు కల్పిస్తారని పేర్కొన్నారు. పికర్స్/స్టాకర్స్ పోస్టుల కోసం అభ్యర్థుల వయస్సు 18-38 సంవత్సరాల మధ్య వుండాలని, రూ.12 వేల జీతంతో పాటు పి.ఎఫ్., ఇ.ఎస్.ఐ. వంటి ప్రయోజనాలు కల్పిస్తారని పేర్కొన్నారు. బైక్ డెలివరీ ఎక్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-40 మధ్య వుండాలని, రూ.12 వేల జీతంతో పాటు పి.ఎఫ్., ఇ.ఎస్.ఐ. తదితర ప్రయోజనాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు విశాఖలో పనిచేయాల్సి వుంటుందని తెలిపారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు తమ పేర్లను నేషనల్ కెరీర్ సర్వీస్ లాగిన్ (NCS.GOV.IN) లో జాబ్ సీకర్ లాగిన్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఇంటర్వ్యూ కోసం 30వ తేదీ ఉదయం 10 గంటలకు తమ బయో డేటా, సర్టిఫికేట్ లతో హాజరు కావాలని జిల్లా ఉపాధి అధికారి ఒక ప్రకటనలో కోరారు. 

Vizianagaram

2022-04-28 14:52:24

శ్రీకాకుళంలో రేపు జాబ్ మేళా..

శ్రీకాకుళం జిల్లాలోని నిరుద్యోగ యువతకు డాక్టర్స్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కంపెనీలో  ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె గురువారం ఒక ప్రకటన జారీచేసారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ మరియు సోసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. డిప్లమో ఇన్ ఎలక్ట్రికల్, డిప్లమో ఇన్ మెకానికల్, డిప్లమో  ఇనుస్ట్రమెంటేషన్ ఇంజనీరింగ్ తదితర విద్యార్హత కలిగి, 2021 సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్ధులు ఈ పోస్టులకు అర్హులని ఆమె స్పష్టం చేసారు. ఎంపిక కాబడిన అభ్యర్ధులకు ఏడాది శిక్షణ కాలం నందు రూ.2,00,000/-లు ఉపకార వేతనంతో పాటు భోజన, వసతి సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు తమ విద్యార్హత ధృవపత్రాలు, బయోడేటా, ఆధార్ కార్డుతో సహా ఏప్రిల్ 25న ఇచ్చాపురం ప్రభుత్వ హైస్కూల్ నందు ఉదయం 9.00 గం.ల నుండి సాయంత్రం 4.00 గం.ల వరకు నిర్వహించు ఉద్యోగాల ఎంపిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె ఆ ప్రకటనలో కోరారు.

Srikakulam

2022-04-21 13:52:50