టిడిపి కావాలనే చేస్తున్న దుష్పప్రచారాలు తిప్పికొట్టాలి


Ens Balu
55
Eluru
2023-02-27 13:46:42

ప్రతిపక్షాలు జనాలు మాయచేయడానికి చేస్తున్న దుష్పప్రచారాలను పెద్ద ఎత్తున తిప్పికొట్టాలని మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ క్రిష్ణశ్రీని వాస్(నాని) పిలుపునిచ్చారు. సోమవారం ఏలూరు జిల్లా కార్యాలయంలో  వైఎస్సార్సీపీ జిల్లా కమిటీతోపాటు అనుభంధ సంఘాలతో ఆయన సమావేశం అయ్యారు. అధికారం పొందటం కోసం ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. చంద్రబాబు చేతిలో అధోగతి పాలైన ఈ రాష్ట్రానికి రాబోయే 20- 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మేలు జరుగుతుందని ప్రజలం దరూ నిర్ణయించుకున్నారనే విషయం ప్రజల ద్వారా ప్రతిపక్షాలకు తెలియజేయాలన్నారు. ఏలూరు జిల్లాలో పార్టీ క్యాడర్ ని క్షేత్ర స్థాయిలో సమాయత్తం చేసి కార్యకర్తల నుంచి నాయకులు వరకూ అందరూ సైనికుల్లా పనిచేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా, నియోజవకర్గ నాయకులతోపాటు, అనుబంధ సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.