నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్శన్ రాజీనామా


Ens Balu
68
Narsipatnam
2023-04-04 07:42:38

నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్శన్ పదవికి గుడబండి ఆదిలక్ష్మి రాజీనామా చేశారు. మంగళవారం  మున్సిపల్ కమిషనర్ కనకారావుకు తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ చైర్ పర్శన్ పదవి షెడ్యూల్ కులాలకు రిజర్వు అయింది. 19వ వార్డు కౌన్సిలర్ గెలుపొందిన ఆదిలక్ష్మిని చైర్ పర్శన్ గా ఎన్నుకున్నారు. మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా మూడు వార్డులు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. రెండేళ్ల పాటు ఆదిలక్ష్మి చైర్మన్ గా, నరసింహమూర్తి వైస్ చైర్మన్ గా ఉంటారని, రెండేళ్ల తర్వాత బోడపాటి సుబ్బలక్ష్మి చైర్మన్ గా, కోనేటి రామకృష్ణ వైస్ చైర్మన్ గా బాధ్యతలు చేపడతారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోజే వెల్లడించారు. రెండేళ్ల పదవీ కాలం పూర్తి కావడంతో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు రాజీనామాలు చేయాల్సి వచ్చింది. నాడు చేసిన ప్రకటనకి నేడు కార్యరూపం వచ్చింది.