అయ్యన్నపాత్రుడిని కలిసిన ఎమ్మెల్సీ వేపాడ


Ens Balu
77
Narsipatnam
2023-04-04 08:24:15

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు నర్సీపట్నంలో మాజీ మంత్రి, పోలెట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలిపించేందుకు అయ్యన్న కుటుంబం ఎంత కృషి చేసిందని.. దీనివల్లే తన గెలుపు సాధ్యమైందని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ.. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని అన్నారు.