ఆన్‌లైన్‌లో శ్రీ‌వారి ప‌విత్రోత్స‌వాల టికెట్లు


Ens Balu
20
Tirumala
2022-07-30 06:34:29

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఆగ‌స్టు 8 నుండి 10వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న ప‌విత్రోత్స‌ వాల్లో భ‌క్తులు  పాల్గొనేందుకు వీలుగా ఆగ‌స్టు 1న ఉద‌యం 10 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో టికెట్ల‌ను విడుద‌ల చేయ‌నుంది. మొత్తం 600 టికెట్ల‌ను ఆన్‌లైన్ ద్వారా జారీ చేస్తారు. రూ.2500/- చెల్లించి భ‌క్తులు టికెట్ బుక్ చేసుకోవ‌చ్చు. టికెట్లు పొందిన భ‌క్తులు ప‌విత్రోత్స‌వాలు జ‌రిగే మూడు రోజులు స్న‌ప‌న‌తిరుమంజ‌నంలో, చివ‌రిరోజు పూర్ణాహుతిలో పాల్గొన‌వ‌చ్చు. ప‌విత్రోత్స‌వాల్లో పాల్గొనే భ‌క్తులు సంప్ర‌దాయ వ‌స్త్రధార‌ణ‌లో ఉద‌యం 7 గంట‌ల‌కు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1 వ‌ద్దకు చేరుకోవాలి. టికెట్‌తోపాటు ఏదైనా ఒక ఒరిజిన‌ల్ ఫొటో గుర్తింపు కార్డు చూపాలి. మ‌రిన్ని వివ‌రాల‌కు www.tirumala.org లేదా www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ల‌ను సంద‌ర్శించ‌గ‌ల‌రు.