ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లోనూ ఎయిర్ సేవలను ప్రారంభించింది. తమ వినియోగదారుల కోసం వస్తువులను త్వరగా డెలివరీ చేయడానికి
గానూ కార్గో విమానాలను వినియోగించుకోనుంది. సత్వరమే సరుకును చేరవేయడం ద్వారా వినియోగదారుడికి కావాల్సిన వస్తువు సత్వరమే చేరుతుందని
యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో అమెజాన్ ఈ సేవలను ప్రారంభించింది. డెలివరీ కోసం
క్విక్‌జెట్ సంస్థతో అమెజాన్ జట్టుకట్టింది. భారత్‌లో ఓ ఇ-కామర్స్ సంస్థ థర్డ్ పార్టీ విమానసేవలను వినియోగించుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ-కామర్స్
మార్కెటింగ్ అధికంగా జరుగుతుండటంతో వినియోగదారులకు మెరుగైన ఫలితాలను, వస్తువులను చేరవేయడానికి అమెజాన్ మరో అడుగు ముందుకి వేసింది..