బులియన్ మార్కెట్ బంగారం ధరలు మరోసారి పెరిగిన విషయాన్ని ప్రకటించింది. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.380, ఆర్నమెంట్ బంగారం రూ.350 పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,700గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,490గా ఉంది. మరోవైపు వెండి ధర కిలోకి రూ.700 తగ్గి రూ.74,000కు చేరింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఇవే ధరలు అందుబాటులో ఉండనున్నాయి. కాగా గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు ప్రతీ మూడు రోజులకు ఒకసారి పెరుగుతూ వస్తుండటం మదుపరులపై ప్రభావం చూపిస్తున్నది.