దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుస నష్టాల నుంచి కాస్త కొద్దిగా కోలుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 59,500 వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయి 17,648 వద్ద స్థిరపడ్డాయి. మధ్యాహ్నం 2.02 సమయంలో నిఫ్టీ 17,450 వద్దకు చేరింది. డేటా పాట్రన్స్, AGI గ్రీన్‌పాక్, ఇండస్ టవర్స్, ఇంటెలెక్ట్ డిజైన్ షేర్ల విలువ అత్యధికంగా పెరిగింది. దీనితో మదుపరులకు కాస్త ఊరట నిచ్చింది. గత కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిస్తున్నాయి. ముఖ్యంగా అదాని కంపెనీ షేర్లు భారీగా పడిపోవడం వంటి సంఘటనలు జరిగాయి. కాగా ఈరోజు స్టాక్ మార్కెట్ కాస్త కోలుకుంది.