డిజిటల్ లావాదేవీల్లో ఫోన్ పే దే అగ్రస్థానం
Ens Balu
20
Delhi
2023-02-18 11:02:21
భారత్ లో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకి అమాంతంగా పెరిగిపోతున్నాయి. ఇన్‌స్టాంట్ రియల్ టైమ్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు సరికొత్త రికార్డులు నమోదు చేస్తున్నాయి. యూపీఐ పేమెంట్ యాప్స్ ద్వారా దేశవ్యాప్తంగా 2023 జనవరిలో ఏకంగా రూ.12,98,726.62 కోట్లు చేతులు మారాయంటే ఆశ్చర్యం వేయకమానదు. గత నెలలో మొత్తం 803 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. 2023 జనవరిలో రూ.6,51,108 కోట్ల లావాదేవీలను నమోదు చేసింది. గూగుల్ పే రూ.4,43,725 కోట్లు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ యాప్ రూ.1,39,673 కోట్లతో ఆ తర్వాతి స్థానాలను కైవసం చేసుకున్నాయి. క్రెడ్ రూ.19,106 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.17,088 కోట్లు, యస్ బ్యాంక్ రూ.12,116 కోట్లు, భీమ్ రూ.8,164 కోట్లు, అమెజాన్ పే రూ.5,797 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.3,324.8 కోట్లు, కొటక్ మహీంద్రా రూ.2,612 కోట్లు, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ రూ.2,222 కోట్లు లావాదేవీలు నమోదు చేయడం విశేషం.