వాట్సప్ లో ఇకపై పదుల సంఖ్యలో గ్రూపులు ఏర్పాటు చేసుకోవాల్సిన పనిలేదు. వాట్సప్ కొత్తగా గ్రూపు సభ్యుల సంఖ్యను 512 నుంచి ఏకంగా 1024 మందికి పెంచుతూ అప్డేట్ చేసింది. ఇప్పటి వరకూ వివిధ వర్గాలు వారికి కావాల్సిన వారికోసం కొత్తకొత్త గ్రూపులను ఏర్పాటు చేసుకునేవారు. వాట్సప్ కొత్తగా ఏర్పాటు చేసిన గ్రూపుతో ఒకే గ్రూపులో అత్యధిక మందిని చేర్చుకొని వారి కార్యకలాపాలను చక్కబెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ గ్రూపులు ప్రభుత్వశాఖల అధికారులు, మీడియాకి, యూనివర్శిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు కళాలల యాజమాన్యాలకు చక్కగా ఉపయోగపడనున్నాయి. కాగా టెలీగ్రామ్ లో మాత్రం అత్యధికం లక్షల్లోనే నెంబర్లు యాడ్ చేసుకునే అవకాశం ఉంది. 5జీబీ హెచ్డీ వీడియోలను కూడా షేర్ చేసుకునే వీలుంది. టెలీగ్రామ్ తో పోటీపడుతూ, ఇపుడు వాట్సప్ కూడా అతి తక్కువ సమయంలోనే కొత్త కొత్త అప్డేట్స్ ఇవ్వడం విశేషం.