ఎంఎస్ఎంఈలు ప్రారంభిస్తే ప్రోత్సకాలు


Ens Balu
20
2022-10-12 16:09:00

సూక్ష్మ పరిశ్రమల స్థాపనతో పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి తెలిపారు.  బుధవారం అనకాపల్లి కలెక్టర్ కార్యాలయంలో సూక్ష్మ పరిశ్రమల ప్రోత్సాహానికి ఏర్పాటుచేసిన జిల్లా పర్యవేక్షణ, అమలు కమిటీ (Dist. Monitoring and implementation committee) ఆధ్వర్యంలో  "ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్" శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు చేపట్టిన చర్యలలో భాగంగా ఏపీఎం, రిసోర్స్ పర్సన్స్ కు అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. స్వయం ఉపాధి కై చిన్న పరిశ్రమలు స్థాపించాలనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, గ్రామీణ యువత, నిరుద్యోగ యువతీ యువకులు గ్రామీణ హస్తకళాకారులు, మహిళా శక్తి సంఘాలు, రైతు ఉత్పత్తి దారుల సంఘ సభ్యుల లో అర్హులైన వారిని గుర్తించాలన్నారు. 

వారికి ప్రభుత్వ పరంగా అందించే తోడ్పాటును  రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రుణ సౌకర్యం సబ్సిడీలు గురించి తెలియజేయాలన్నారు. కార్యక్రమ కన్వీనరు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు అర్హత కలిగిన అభ్యర్థుల ఎంపిక క్రమపద్ధతిలో సరళీకృతం చేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి.ఆర్.డి. ఎ.  పి.డి. లక్ష్మీపతి, మెప్మా పి.డి. సరోజిని, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ, జిలా ఉద్యానవన శాఖ అధికారి ప్రభాకర్ రావు స్కిల్ డెవలప్మెంట్ అధికారి చాముండేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహక అభివృద్ధి సంస్థ (మెపడా) అధికారులు తదితరులు పాల్గొన్నారు.