కొత్త బ్రాండ్ల ఆటో ఎక్స్ పోను వినియోగించుకోండి


Ens Balu
19
Visakhapatnam
2022-12-17 12:42:16

విశాఖ సాగర తీరాన ఆటో ఎక్స్ పో ఘనంగా ప్రారంభమైంది. శనివారం విశాఖ పోర్టు అథారిటీ చైర్మన్ కె.రామ్మోహన రావు, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి లు సంయుక్తంగా ఈ ఎక్స్ పో ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పోర్ట్ చైర్మన్ రామ్మోహనరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది సంవత్సరాంతపు సేల్స్ లో భాగంగా ప్రత్యేక ఆఫర్లతో కొనుగోలుదారులకు డిస్కౌంట్ ఆఫర్ లు ఇస్తూ ఆటోమొబైల్ రంగంలో అన్ని బ్రాండ్ల కార్లు బైకులు కంపెనీలు ముందుకు రావడం కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. సుమారు 20 కంపెనీలు తమ తమ కొత్త ఉత్పత్తులను ఈ ప్రదర్శనలో ఉంచి అమ్మకాలు జరుపుతుండడం వాహన కొనుగోలుదారులకు మంచి అవకాశం అని అన్నారు. అనంతరం నగర మేయర్  గొలగాని హరి వెంకట కుమారి మాట్లాడుతూ ముంబై, ఢిల్లీ, బెంగళూరు ,చెన్నై ,కలకత్తా వంటి మహానగరాల్లో జరిగే ఈ ఆటో ఎక్స్ పో లు విశాఖలో కూడా జరగడం అభినందనీయం అన్నారు.

 రేస్ ఎంటర్టైన్మెంట్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ గడిచిన 10 ఏళ్లుగా ఈ తరహా ఈవెంట్లను నిర్వహిస్తున్నారని చెప్పారు. శని, ఆదివారాల్లో సాగర్ తీరానికి వచ్చే వేలాదిమంది ప్రజలు ఈ ఎక్స్ పో సందర్శించడం ద్వారా మంచి మంచి ఆఫర్లను సొంతం చేసుకోవచ్చన్నారు. తమ సొంత కారు కలను నెరవేర్చుకునేందుకు వీలుగా ఒకే చోట బ్రాండ్లు కార్లను లేటెస్ట్ మోడల్స్ ఇందులో ఉంచడం ఎంతో ఉపకరిస్తుందన్నారు. కార్యక్రమంలో నెరెడ్ కో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ నగేష్ ,ఎపి టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కే. విజయ్ మోహన్,సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు,వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు ,రేస్ ఎంటర్టైన్మెంట్స్ ఈవెంట్ మేనేజర్ దాడి రవికుమార్ ఆయా ఆటోమొబైల్ కంపెనీల డీలర్లు, సీఈవోలు, జిఎంలు తదితరులు పాల్గొన్నారు.