శ్రీకాకుళం పట్టణంలో ఆప్కో కేంద్రాలలో చేనేత వస్త్రాల డిస్కౌంట్ సేల్ నిర్వహిస్తున్నట్లు ఆప్కో డివిజనల్ మేనేజర్ బీవీ రమణ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేస్తూ శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న చేనేత భవన్ లో ఆప్కో మెగా షోరూం, జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఎగ్జిబిషన్ కౌంటర్లో వస్త్రాలను డిస్కౌంట్ పై విక్రయిస్తున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన పేర్కొంటూ డిస్కౌంట్ సేల్ ఆగస్టు 18వ తేదీ వరకు రెండు కౌంటర్లలో కొనసాగుతుందని చెప్పారు. ప్రస్తుతం 30 శాతం డిస్కౌంట్ కు అదనంగా 5 శాతం కలిపి 35 శాతం డిస్కౌంట్ తో విక్రయాలను చేస్తున్నట్లు ఆయన వివరించారు. చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి చేనేతకారులను ప్రోత్సహించాలని ఆయన కోరారు.