గొలుగొండ పోలీస్ స్టేషన్ లో పోక్సో కేసు
Ens Balu
4
Golugonda
2022-05-31 15:05:15
గొలుగొండ పంచాయతీ శివారు గ్రామం శ్రీరాంపురం గ్రామానికి చెందిన మైనర్ బాలిక ను అదే గ్రామానికి చెందిన లాలం రమేష్ మాయమాటలు చెప్పి పెల్లిచేసుకుంటానని లొంగదీసుకుని తెలియని ప్రాంతానికి తీసుకు వెళ్లిపోయాడు. దీనితో తల్లిదండ్రులు తమ కూతురు కనిపించలేదని, అనుమానం వ్యక్తం చేస్తూ.. చేసిన ఫిర్యాదు ఆధారంగా యువకుడిపై పోక్సో చట్టం, కిడ్నాప్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్ కు తరలించినట్టు గొలుగొండ ఎస్ఐ ధనుంజయ్ నాయుడు తెలియజేశారు. ఫిర్యాదుమేరకు దర్యాప్తు చేపడుతున్నట్టు మీడియాకి వివరించారు. మండల కేంద్రంలో పోక్సో కేసు నమోదు కావడం చర్చనీయాంశం అవుతుంది.