విజెఎఫ్ కాలంచెల్లిన కమిటీపై ఆ సెక్షన్లే ఎందుకు వేశారంటే..!


Ens Balu
255
Visakhapatnam
2023-07-24 17:26:01

వైజాగ్ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) కాలంచెల్లిన కమిటీపై విశాఖలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో పోలీసులు వేసిన సెక్షన్లు భారతీయ శిక్షాస్మృతి(IPC 420, 406 r/w, 34 ) జిల్లా కలెక్టర్ డా.మల్లిఖార్జున ఆధ్వర్యంలో జరిగిన ప్రాధమిక ఆడిట్ రిపోర్ట్ ఆధారంగా వేసినట్టు చాలా స్పష్టంగా కనపిస్తుంది. జిల్లా అధికారులు  చేపట్టిన విచారణలోనే చాలా అంశాలు వెలుగు చూడటం, కొన్ని విరాళాలు, చెల్లింపులకు సంబంధించి రిసిప్ట్ లు కనిపించకుండా చేయడం, ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టుకి, విజెఎఫ్ బైలాకి వ్యతిరేకంగా వ్యవహరించడం తదితర అంశాలన్నీ విచారణలో అధికారికంగా బయటపడ్డాయి. అంతేకాకుండా నార్లవెంకటేశ్వర భవన్ లోని గతంలో ఇండస్ ఇండ్ బ్యాంక్ ద్వారా వచ్చిన అద్దెలు, ప్రెస్ మీట్ల ద్వారా వచ్చిన ఆదాయాలు, అప్పటి అగ్రిమెంట్లు, ప్రస్తుతం వున్న బ్యాకరీకి గ్రౌండ్ ఫ్లోర్, మరియు ఫస్ట్ ఫ్లోర్ అద్దెకి ఇచ్చిన సమయంలోనూ, భవనంపై ప్రకటనల ప్రదర్శన కోసం వేసిన డిస్ప్లే బోర్డుల విషయంలో కుదుర్చుకున్న అగ్రిమెంట్లు దాచిపెట్టడం.. ఆదాయానికి మంచి ఖర్చులు అత్యధికంగా చూపించడం ఫైవ్ మెన్ కమిటీలో ఒకరైన జిల్లా ఆడిటర్ లెక్కలు వేసి ఆధారాలతో సహా నిరూపించారు దానిని జిల్లా కలెక్టర్ కి సైతం నివేధించారు. ఇంకా బయటకు తేలని లెక్కలు చాలానే ఉన్నాయని కూడా ప్రకటించారు.

అన్నింటి కంటే ముఖ్యంగా విజెఎఫ్ పై కోర్టుకేసులు వేసిన విషయం కావాలనే సర్వసభ్య సమావేశం పెట్టి సభ్యులకు తెలియజేయకుండానే.. అదే సభ్యుల ఆమోదం లేకుండా నేరుగా కాలం చెల్లిన కమిటీ సంతకాలతో విజెఎఫ్ కి వచ్చిన ఆదాయంలో సుమారు రూ.90వేలకు పైగా మొత్తాన్ని ఫీజు రూపంలో చెల్లించింది. దానిని ఆడిట్ రూపంలో లెక్కలు వేయించడాన్ని జిల్లా రిజిస్ట్రార్ నివేదిక ద్వారా ఆడిటర్ గుర్తించారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ సొసైటీ యాక్టులోని చాప్టర్ 4 ప్రకారం ఏదైనా సొసైటీపైగానీ, అప్పటికి నడుస్తున్న కార్యవర్గంపై గానీ ఏదైనా పోలీసు కేసు, కోర్టు కేసులు నమోదు అయితే ఆ విషయాన్ని సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి సభ్యుల ఆమోదంతో కేసును న్యాయస్థానంలో ఎదుర్కోవడానికి ప్రత్యేక సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి సభ్యుల అనుమతి పొందాలి. లేదంటే సదరు కోర్టు కేసులను సొంత ఖర్చులు భరించి ఎదుర్కోవాల్సి వుంటుంది. కానీ కాలం చెల్లిన కార్యవర్గం తనకు నచ్చినట్టుగా విజెఎఫ్ ఆదాయాన్ని..సభ్యులకు తెలియజేయకుండానే కోర్టుకేసు వాధించినందుకు పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుచేసింది. విశేషం ఏంటంటే సదరు 2 కోర్టు కేసుల్లోనూ విజెఎఫ్ నుంచిగానీ, కేసు వేసిన వారుగానీ కోర్టుకి హాజరు కానందున డిఫాల్ట్ డిస్మిస్ కింద కేసును న్యాయమూర్తి కొట్టేశారు. కనీసం ఆ విషయాన్ని కూడా అనధికార కార్యవర్గం సభ్యులకు తెలియజేయలేదు. పైగా కోర్టు తీర్పుని వక్రీకరించి..కేసు విజెఎఫ్ కి అనుకూలాంగా వచ్చిందని ప్రచారం చేశారు. దానిని కూడా జిల్లా కలెక్టర్ నియమించిన త్రీమెన్ కమిటీ, ఆరువాత వేసిన ఫైవ్ మెన్ కమిటీని సేవ్ విజెఎఫ్ సభ్యులు కోర్టు తీర్పు లిఖితపూర్వక ఆధారాలతో సహా సమర్పించారు.

2012 కార్యవర్గమే 2015వరకూ పరిపాలించింది. ఆఖరు సమయంలో సర్వసభ్య సమావేశం పెట్టి లెక్కలు కోశాధికారి చెప్పే సమయంలో సభ్యులందరూ కాలం చెల్లిన కమిటీ చెప్పిన బూటకపు లెక్కలను తిప్పికొట్టారు. అదేవిధంగా కోర్టులో సభ్యత్వాల విషయంలో కేసు నమోదుకాగా..అప్పటి నుంచి 2023 వరకూ అనధికారికంగానే కమిటీగా కొనసాగుతూ వచ్చేసింది. అంతేకాకుండా 2015 నుంచి 2020 వరకూ ప్రతీ ఏడాది సర్వసభ్య సమావేశం పెట్టినట్టుగా తప్పుడు నివేదికలు చూపి విజెఎఫ్ సొసైటీని ఆన్ లైన్ లో రెవిన్యువల్ చేస్తూ వచ్చేసింది. అయితే ఈమధ్యకాలంలో విజెఎఫ్ ఆదాయ వ్యయాలపై ఇన్కకం టాక్స్ రిటర్న్స్ వేసి, ఈఫైలింగ్ చేసిన తరువాత ఆడిట్ రిపోర్టు వేయించాల్సి వుంది. కానీ ఈకాలంలో ఒక్క 2018-19 కాలానికి మాత్రమే ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి మిగిలిన ఏళ్లకు మాత్రం కేవలం ఆడిట్ రిపోర్టులు మాత్రమే చూపించింది ఆదాయ వ్యవయాలకు ఎక్కడా పొంతనలేకుండా. ఆధారాలన్నీ నేరుగా జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళితే సొసైటీ రిజిస్ట్రేషన్ రెవిన్యువల్ కాదని గమనించిన ఈ కాలంచెల్లిన కమిటీ ఆన్ లైన్ లోనే 2020వరకూ రెవిన్యువల్ చేసుకుంటూ వచ్చింది. అయితే ఈ విషయాన్ని గమనించిన జిల్లా రిజిస్ట్రార్ 2020 తరువాత విజెఎఫ్ సొసైటీని రెవెన్యువల్ చేయడానికి నిరాకరించారు. నాటి నుంచి నేటి వరకూ విజెఎఫ్ సొసైటీ రెవిన్యువల్ కాకుండా అలాగే ఉండిపోయింది. ఈ విషయాన్ని ఫైవ్ మెన్ కమిటీ విచారణలో జిల్లా రిజిస్ట్రార్ కూడా కమిటీని విజెఎఫ్ సొసైటీ సర్వసభ్య సమావేశం పెట్టినట్టు చూపించిన కాలంచెల్లిన కార్యవర్గం మాత్రమే సంతకాలు చేసి ఇచ్చిన వాటిని ఆధారాలుగా చూపించారు. 

వీటన్నింటినీ పరిశీలించిన ఫైవ్ మెన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు కోర్టుకి నివేదించిన పాత విజెఎఫ్ సభ్యుల కంటే అధనంగా..అనధికార కార్యవర్గం సభ్యులను చేర్చిన విషయం, ప్రతీఏడాది జిల్లారిజిస్ట్రార్ కి సమర్పించిన ఆడిట్ రిపోర్ట్ లన్నీ తప్పుల తడకలుగా ఉండటాన్ని సాంకేతికంగా నిరూపించడానికే గుర్తించారు. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా కొన్నింటిని మాత్రమే విజెఎఫ్ కాలం చెల్లిన కమిటీపై ఫిర్యాదు చేసిన జర్నలిస్టులకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమావేశం పెట్టి మరీచెప్పారు. ఆసమయంలో జర్నలిస్టుల విజెఎఫ్ అనధికార కార్యవర్గం చేసిన తప్పులను, అక్రమాలను, మోసాలను నేరుగా కలెక్టర్ ఆధారాలతో సహా జిల్లాఆడిటర్ ద్వారా బయటపెట్టారు. ఆ రిపోర్టును నేరుగా విజెఎఫ్  నోటిసు బోర్డులో కూడా ప్రదర్శనకు ఉంచారు. ఇంకా లక్షలాది రూపాయిలకు సంబంధించిన ఆదాయాలు, ఖర్చులు, రిసిప్ట్ లు మాయం కావడాన్ని కూడా జిల్లా అధికారులు గుర్తించిన విషయాలతో మళ్లీ జర్నలిస్టులు విశాఖ నగర పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేయడంతో గట్టి సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనితో ఖర్చులు చూపించిన కోశాధికారి, కార్యక్రమాలు నిర్వహణ చూసి చేయించిన కార్యదర్శి, యావత్ కమిటీకే అధ్యక్షుడిగా ఉన్నవారంతా ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పత్తాలేకుండా పోయారు. ఇక పోలీసులు విజెఎఫ్ కాలం చెల్లిన కమిటీపై వేసిన సెక్షన్లు రుజువైతే కనీసం ఏడేళ్లు జైలు శిక్ష, జరిమానా కూడా విధించే అవకాశాలున్న కేసులను ఫైల్ చేశారు.

ఐపిసీ సెక్షన్ 34 ప్రకారం, కమిటీ అందరూ కలిసి ఉమ్మడిగా(విజెఎఫ్ కాలం చెల్లిన అనధికార కమిటీ)ఉద్దేశపూర్వకంగా నేరం చేయడం, ఖర్చులను, లెక్కలను, ఆధారాలు లేకుండా ఆమోదం చేయడం. అంటే ఎన్నికలు లేకుండా, సర్వసభ్య సమావేశాలు జరగకుండా, సభ్యుల ఆమోదం లేకుండా కేవలం సదరు సభ్యులే అన్నీ సొంతంగా నిర్ణయాలు చేసేసి అమలు చేయడం. సెక్షన్ 406 r/w ప్రకారం కాలం చెల్లిన కమిటీ విజెఎఫ్ సభ్యులను నమ్మించి మోసం చేయడం (కిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్) అంటే పెట్టని సర్వసభ్య సమావేశాలు పెట్టినట్టు చూపించడం, సభ్యులకు తెలియని లెక్కలు చూపించడం.. సభ్యుల ఆదమోదం లేకుండా కార్యక్రమాలు, వాటి ఖర్చులను సొంతంగా విజెఎఫ్ నిధుల నుంచే చెల్లించడం, అదాయం కంటే ఖర్చులు అత్యధికంగా చూపించడం తదితరాలు ఉన్నాయి. ఇక సెక్షన్ 420 ప్రకారం మోసం చేయడం, విలువైన సెక్యూరిటీలో మొత్తం లేదా ఏదైనా భాగాన్ని తయారు చేయడం(ఉదా హరణకు నార్ల వెంకటేశ్వర భవన్ లోని ఆదాయంరాని అనధికా కార్యక్రమాలకు విజెఎఫ్ నిధుల నుంచే కరెంటు బిల్లులు చెల్లించడం), మార్చడం లేదా నాశనం చేయడం వంటి విషయాలు గుర్తించడం.  ఈసెక్షన్ లతో కేసు ఆధారాలతో రుజువైతే నిందితులకు ఏడేళ్లుకు పైగా  జైలుశిక్ష పడే అవకాశాలున్నాయి. మాట్లాడితే భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రెస్ క్లబ్ అంటూ ప్రచారం చేసిన ఈ అనధికార కార్యవర్గం ఆదాయాలను, విరాళాలను ఇష్టరీతిన ఖర్చుచేయడం, వాటిని సభ్యులకు తెలియజేయకపోవడం, సభ్యుల ఆదమోదం లేకుండా చేయడమే ఈ సెక్షన్ల నమోదుకు కారణం అవుతోంది. విజెఎఫ్ కాలం చెల్లిన కమిటీపై ఎఫ్ఐఆర్ అయితే నమోదు అయ్యిందిగానీ ఇప్పటి వరకూ విశాఖ నగర పోలీసులు మాత్రం అరెస్టులు చూపించలేదు..!