సగిలేటికథ కి U/A సర్టిఫికేట్..అక్టోబర్ 6న రీలిజ్ కి సిద్ధం


Ens Balu
27
Hyderabad
2023-09-23 16:08:07

రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘సగిలేటి కథ’. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్‌ సుద్మూన్‌ దర్శకత్వం వహించారు. హీరో నవదీప్‌ సి-స్పేస్ సమర్పణలో, షేడ్‌ ఎంటర్టైన్మెంట్‌, అశోక్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌లో దేవీప్రసాద్‌ బలివాడ, అశోక్‌ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయ్యిన ట్రైలర్ ప్రేక్షకుల నుండి అశేష ఆధరణ పొందడంతోపాటు, విడుదలైన సాంగ్స్ కి కుడా మంచి అప్లాజ్స్ రావడం విశేషం. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు దిగ్వజీయంగా పూర్తి చేసుకొని U/A సర్టిఫికెట్ అందుకుంది. ఈ చిత్రం చాలా న్యాచురల్ గా సగటు ప్రేక్షకుడికి నచ్చేలా ఉందని, ఇలాంటి రూటెడ్ కథలు మునుపెన్నడూ చూడలేదంటూ ఖచ్చితంగా ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రమ్మరథం పడతారని సెన్సార్ బోర్డు ముఖ్య సభ్యులు చిత్ర యూనిట్ పై ప్రశంసల జల్లు కురిపించారు. చిత్రం చూసాక, మా టీం కి కూడా చికెన్ తినాలనిపిస్తుందంటూ నవ్వుతు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సంద్రభంగా చిత్ర యూనిట్ అక్టోబర్ 6న విడుదల తేదీని ప్రకటించారు.నటీనటులు: రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్, నరసింహా ప్రసాద్ పంతగానిరచన, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్: రాజశేఖర్ సుడ్మూన్కో-రైటర్: శశికాంత్ బిల్లపాటి, మని ప్రసాద్ అరకులనిర్మాతలు: అశోక్ మిట్టపల్లి, దేవీప్రసాద్ బలివాడఇన్ అసోసియేషన్ విత్: సి స్పెస్ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరేష్ మాదినేనిఅసోసియేట్ ప్రొడ్యూసర్: పుష్పాభాస్కర్, సునీల్ కుమార్ ఆనందన్, లీలా కృష్ణ కొండేపాటిలైన్ ప్రొడ్యూసర్: చందు కొత్తగుండ్లసంగీతం: జశ్వంత్ పసుపులేటినేపథ్యసంగీతం: సనల్ వాసుదేవ్సింగర్స్: కీర్తన శేష్, కనకవ్వసాహిత్యం: వరికుప్పల యాదగిరి, పవన్ కుందాని, రాజశేఖర్ సుడ్మూన్, శశికాంత్ బిల్లపాటి, జశ్వంత్ పసుపులేటిపి.ఆర్.ఓ: తిరుమలశెట్టి వెంకటేష్ఆర్ట్ డైరెక్టర్స్: హేమంత్ జి, ఐశ్వర్య కులకర్ణికాస్ట్యూమ్ డిజైనర్: హర్షాంజలి శేనికేషిసౌండ్ డిజైనర్: యతి రాజుసౌండ్ మిక్సింగ్: శ్యామల సిక్దర్డి.ఐ: కొందూరు దీపక్ రాజుపబ్లిసిటీ డిజైనర్: యమ్.కే.యస్ మనోజ్ #sagiletikatha  #attaettaga   #shadestudios #ashokarts #rajasekharsudmoon #ravimahadasyam #vishikalaxman