800 లీటర్ల బెల్లం పులుపు ధ్వంసం..ఎస్ఐ రమేష్


Ens Balu
31
Payakaraopeta
2024-01-08 14:19:17

నాటు సారా తయారీ అమ్మకాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని పాయకరావుపేట ఎస్ఐ రమేష్ హెచ్చరించారు. సోమవారం దుర్గానగర్ కాలనీ, దారకొండవద్ద నాటుసారా బట్టీలపై దాడులు చేసి 800 లీటర్ల బెల్లం పులుపుని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ, ప్రభుత్వం నిషేధించిన నాటుసా రాను ఎవరు తయారు చేసినా చర్యతప్పవన్నారు. సదరు బట్టీలకు సంబంధించిన వారెవరూ లేకపోవడంతో కొందరు సమాచారం అందించిన వారి సమక్షంలో బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ దాడులకు సంబంధించి అందిన సమాచారం ఆధారంగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. మండలంలో ఎవరైనా అక్రమంగా నాటు సారా అమ్మకాలు,తయారీకి పాల్పడితే గ్రామస్తులు గానీ,మహిళలు గానీ పోలీసులకు సమాచారం అందించవచ్చునన్నారు.